సమంతా వివాహం జరిగిన ఇషా యోగా సెంటర్ ప్రత్యేకత ఏంటి ? అక్కడికి ఎలా వెళ్లాలి ? భూత శుద్ది వివాహం అంటే ఏంటి ? | Inside Isha Yoga Center Travel Guide 2025
Inside Isha Yoga Center Travel Guide 2025 : జెస్సీగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సమంత ఇటీవలే దర్శకుడు రాజ్ నిడిమోరును వివాహం చేసుకుంది. ఈ వివాహం ఎంత ట్రెండ్ అవుతుందో వారు పెళ్లి చేసుకున్న భూత శుద్ధి వివాహ విధానం, వివాహం జరిగిన ఇషా యోగా సెంటర్ కూడా అంతే ట్రెండ్ అవుతోంది. ఈ సందర్భంగా ఈ వివాహ విధానంతో పాటు ఇషా యోగా కేంద్రం గురించి ఆసక్తికరమైన విషయాలు, ట్రావెల్ గైడ్ మీ కోసం.
Topics Covered : Samantha Ruth Prabhu , Raj Nidimoru , Isha Yoga Centre, Coimbatore, Bhuta Shuddhi Vivaha
ముఖ్యాంశాలు
సమంతా, రాజ్‌ల వివాహం ఇషా యోగా కేంద్రంలోని లింగ భైరవి ఆలయంలో (Linga Bhairavi Temple) లో సంప్రదాయబద్దంగా జరిగింది.

ఆధ్యాత్మిక అనుభూతి , చైతన్యం కోసం వెతికే వారికి ఈ ప్రాంతం ఒక నిధిలాంటిది. వెల్లింగిరి పర్వత పాదాల (Velliangiri Mountains) వద్ద కొలువై ఉన్న ఈ ప్రాంతం ఒక ఆధ్యాత్మిక ప్రపంచం లాంటిదే.
మీరు కూడా ఈ ఆధ్యాత్మిక ప్రపంచంలోకి అడుగు పెట్టాలి అనుకుంటే ఈ Prayanikudu Travel Guide మీకు కోయంబత్తూరులోని ఇషా యోగం కేంద్రంలో ఉన్న లింగ భైరవ ఆలయం, భూత శుద్ది వివాహం గురించి పూర్తి సమాచారం అందిస్తుంది.
భూత సిద్ది వివాహం అంటే ఏంటి ? | What is Bhuta Shudhhi Vivaha ?
మన ప్రయాణాన్ని మొదలు పెట్టడానికి ముందు మనం భూత సిద్ధి వివాహం గురించి తెలుసుకుందాం. ఈ వివాహం అనేది పంచ భూతాల శుద్ది ఆధారంగా జరిగింది. ఒక సత్కార్యం కోసం లింగ భైరవీ మాతా సన్నిధిలో దేవీ శక్తిని మేల్కొలిపి ఇద్దరు వ్యక్తుల శక్తులను ఏకీకృతం చేయడం జరిగింది.
సాధారణ సంప్రదాయ వివాహంతో పోల్చితే ఈ విధానంలో అంతర్గత సమతూల్యత, భావోద్వేదికంగా ఒరు జంటల మధ్య సమతూల్యత సాధించి ఆధ్యాత్మిక బంధంగా పెనువేయడం జరుగుతుంది. ఇది చాలా అరుదైన వివాహ విధానం కావడంతో రాజ్ అండ్ సమంత ఈ పద్ధతిలో పెళ్లి చేసుకున్నారు. ఇద్దరూ సెలబ్రిటీలు కావడంతో రాత్రికి రాత్రే ఈ ప్రదేశం, ఆలయం ట్రెండింగ్ టాపిక్‌గా మారింది.
లింగ భైరవి ఆలయం ఎక్కడ విశిష్టత | Significance of Linga Bhairava Temple
తమిళనాడులోని (Tamilnadu) కోయంబత్తూరులో ఉన్న ఇషా యోగా కేంద్రంలో లింగ భైరవి ఆలయం ఉంది. ఈ ఆలయంలో అమ్మవారి ఉనికి ఉందని, అందుకే ఇది అత్యంత శక్తివంతమైన ప్రదేశంగా విశ్వసిస్తారు.
ఆలయ ప్రాంగణంలో వివాహంతో పాటు ఇతర శుద్ధి, సత్కార్యాలను చేపడితే సరైన ఫలితం ఉంటుందని భావిస్తారు. ఈ ఆలయం ఎంత పవిత్రమైనదో ఎంత శక్తివంతమైనదో ఆలయ ప్రాంగణం అనేది అంతే అందంగా ఉంటుంది. ప్రశాంతంగా ఆధ్యాత్మిక సాధన చేయడానికి చాలా మంది ఇక్కడి వస్తుంటారు.
చాలా మంది భక్తులు ఇక్కడికి అమ్మవారి దర్శనంతో పాటు కుంకుమ అర్చన, అభిషేకం, శక్తికి సంబంధించిన విధులు నిర్వర్తించడానికి, వివాహం అనంతరం అమ్మవారి ఆశీర్వాదం కోసం వస్తుంటారు. అలాగే జీవితంలో ఒక బలమైన సానుకూల మార్పు కోరుకునే భక్తులు కూడా ఈ కేంద్రానికి వస్తుంటారు.
ఇషా యోగా కేంద్రం ఎలా చేరుకోవాలి ? | How To Reach Isha Yoga Centre

ఇషా యోగా కేంద్రం చేరుకోవడం ఎలా అని చాలా మంది సెర్చ్ చేస్తున్నారు అలాంటివారి కోసం ఈ కింది టిప్స్ బాగా ఉపయోగపడతాయి. మీరు ఎలా ప్రయాణిస్తున్నారో అనే దాన్ని బట్టి కింద ఇచ్చిన డైరక్షన్స్ ఉపయోగించుకోగలరు.
విమానంలో | By Air
మీరు ఇషా యోగా కేంద్రానికి విమానంలో (Isha Yoga Centre by Air) వెళ్లాలి అనుకుంటే ముందు కోయంబత్తూరు చేరుకోవాలి. అక్కడి నుంచి 40 నిమిషాల్లో టాక్సీలు, బస్సుల్లో ఇషాకు చేరుకోవచ్చు. తక్కువ ధరలో ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకునేందుకు మీరు స్కైస్కానర్ (Skyscanner) అనే యాప్ ట్రై చేయండి ( ప్రమోట్ చేయడం లేదు.)
ట్రైనులో | Isha Yoga Centre by Train
కొంచెం టైమ్ తీసుకుని ముందస్తు టికెట్ బుక్ చేసుకుని మీరు రైలులో కోయంబత్తూరు చేరుకోవచ్చు.
బస్సు లేదా కారు | Reaching Isha Yoga Centre by Bus / By Road on Car
దక్షిణ భారతదేశంలోనే అన్ని ప్రముఖ నగరాల నుంచి తమిళనాడులోని కోయంబత్తూరుకు బస్సులు ఉన్నాయి. ఒకవేళ లేకపోతే మీరు తమిళనాడులోని మరో నగరానికి చేరుకుని అక్కడి నుంచి కోయబత్తూరు చేరుకోవచ్చు.
ఇక బై రోడ్ అయితే (hyderabad To coimbatore by road) హైదరాబాద్ నుంచి కర్నూలు లేదా అనంతపురం మార్గంలో బెంగుళూరు లేదా బైపాస్‌లో సేలం, ఇరోడ్ మార్గంలో కోయంబత్తూరు చేరుకోవచ్చు.
- సుమారు 920 నుంచి 940 కిమీ వరకు ప్రయాణం చేయాల్సి ఉంటుంది.
- నాన్ స్టాప్‌గా డ్రైవ్ చేస్తే 11 నుంచి 14 గంటల సమయం పడుతుంది.
- ప్రయాణికుడును ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవ్వండి.
ఎక్కడ ఉండాలి ? | Where to Stay in Isha
ఇషా యోగా కేంద్రం చేరుకోవడం అంత కష్టమేమీ కాదు…కానీ మంచి స్టే గురించి తెలుసుకోవడం కష్టం…అని చాలా మంది అనుకుంటారు. కానీ ఇది చాలా సింపుల్ విధానం. మీరు ఇషా కేంద్రంలో ఉన్న ఆశ్రమంలో స్టే చేయొచ్చు. రూమ్స్ చాలా క్లీన్‌గా, సింపుల్‌గా ఉండటంతో పాటు అందుబాటు ధరలో ఉంటాయి.ఇక్కడ యోగా, మెడిటేషన్ చేసే వాళ్లను చూస్తే మీ నిర్ణయం సరైనదే అని మీరు ఫీల్ అవుతారు. మీరు కూడా కాసేపు మెడిటేషన్ చేస్తారు.
కానీ అడ్వాన్స్‌గా బుక్ చేసుకుంటే బెటర్. ఒకవేళ అక్కడ మీకు రూమ్స్ దొరక్కపోతే కొయంబత్తూరులో ప్రయత్నించండి. లేదంటే నరసీపురం, పెరూర్లో…మీకు రూమ్స్ తప్పకుండా దొరుకుతాయి.
ఇషా యోగా కేంద్రంలో చేయాల్సిన పనులు | Things To Do In Isha Yoga Centre
ఇషా యోగా కేంద్రం అనేది మిమ్మల్ని తప్పకుండా మరో ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. అక్కడికి వెళ్తే తప్పకుండా ఈ పనులు చేసేలా ప్లాన్ చేయండి…అవి
- ధ్యాన లింగం ఆలయం | Dhyana Linga Temple Darshan : ధ్యానం చేయడానికి అత్యంత అనువైన ప్రదేశం ఈ ఆలయం. చాలా మంది కోరుకునే ప్రశాంత ఇక్కడ లభిస్తుంది. భయటి ప్రపంచం ఎంత నిశ్శబ్దంగా ఉంటే లోపలి ప్రపంచం అంత ప్రశాంతంగా ఉంటుంది. లోపలి ప్రపంచంత ఎంత నిశ్శబ్దంగా ఉంటే బయటి ప్రపంచం అంత ప్రశాంతంగా కనిపిస్తుంది. రెండూ కూడా ఒకదానితో ఒకటి పెనువేసుకున్న విషయాలే.
- లింగ భైరవీ దర్శనం : ఈ కేంద్రంలో ఆధ్యాత్మికతకు మూలం అయిన లింగ భైరవీ ఆలయాన్ని తప్పకుండా సందర్శించండి. చాలా పవర్ఫుల్ కాబట్టి కొంచెం భక్తి శ్రద్ధలతో వెళ్లండి.
- ఆదియోగి విగ్రహం | Adi Yogi Statue in Isha : ఇషా యోగా కేంద్రానికి ఐకానిక్ విగ్రహం ఆది యోగి విగ్రహం. 112 అడుగుల ఎత్తైన ఈ విగ్రహం వద్ద సాయంత్రం సమయం వెచ్చించడాన్ని మించిన అనుభవం మరొకటి లేదు.
- ఇన్నర్ ఇంజినీరింగ్ కార్యక్రమం | Isha Inner Engineering Programs : ఈ కార్యక్రమంలో పాల్గొనడం వల్ల కలిగే మార్పులు జీవితాన్ని మార్చేశాయని చాలా మంది తమ అనుభవాన్ని షేర్ చేసుకున్నారు.
- వాలంటీరింగ్ : ఇషా కేంద్రంలో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొని సేవ వల్ల కలిగే ప్రశాంతతను పొందవచ్చు.
ప్రయాణికుడు ట్రావెల్ టిప్స్ | Prayanikudu Travel Tips
ఇషా యోగా కేంద్రం జాతీయ స్థాయిలో మంచి పాపులారిటీని సంపాదించుకుంది. సమంత వివాహం తరువాత చాలా మంది ఇప్పుడు ఇక్కడికి వెళ్లాలని ప్లాన్ చేస్తుంటారు. మీరు కూడా వెళ్లాలి అనుకుంటే ఈ టిప్స్ పాటించండి.
- దర్శనాలు చేసుకోవాలి అనుకుంటే ఉదయం 6 నుంచి 8 మధ్యలో వెళ్లడం ఉత్తమం.
- ఆలయ సంప్రదాయాన్ని, స్థానికులు మనో భావాలను గౌరవిస్తూ హుందాగా కనిపించే దుస్తువులు ధరించండి.
- ఆలయం లోపల ఫోటోలు తీయరాదని చాలా మందికి తెలిసినా ఫాలో చేయరు. కానీ మీరు మాత్రం తప్పకుండా ఫాలో చేయండి.
- వీకెండ్‌లా రద్దీ చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే ఆది శని వారాల్లో కాకుండా మిగితా రోజుల్లో ప్లాన్ చేయండి.
- చలికాలంలో వెళ్తే మీతో పాటు తప్పకుండా ఒక లైట్ జాకెట్ తీసుకెళ్లండి. రాత్రి సమయాల్లో బాగా చలిగా ఉంటుంది.
- ఇషా ప్రాంగణంలో కొన్ని సైలెన్స్ జోన్స్ ఉంటాయి. అక్కడ ఖచ్చితంగా మౌనంగా ఉండేలా చూసుకోండి.
దగ్గర్లో చూడాల్సిన ప్రదేశాలు | Nearby Places To Isha Yoga Centre
ఇషా యోగా కేంద్రానికి వెళ్లినప్పుడు కాస్త సమయం దొరికితే మీరు ఈ ప్రదేశాలను కూడా కవర్ చేసేలా ప్లాన్ చేసుకోండి. పైసా వసూల్ చేసుకొవచ్చు
- మరుడమలై ఆలయం | Marudamalai Temple: భక్తితో పాటు నేచురల్ బ్యూటిని ఎంజాయ్ చేయాలి అనుకునేవారు తప్పుకుండా వెళ్లాల్సిన ఆలయం ఇది.
- వెళ్లియాంగిరి పర్వతాలు | Velliangiri Mountains: భగవంతుడిని తలచుకుంటూ ట్రెక్కింగ్ చేయాలి అనుకునేవారికి ఇది ఒక మంచి ఛాయిస్ అవుతుంది.
- శిరువాని జలపాతం | Siruvani waterfalls : అందమైన అడవిలో సంచరిస్తూ సేదతీరాలి అనుకుంటే ఇంతకు మించిన స్పాట్ మరొకటి ఉండవు.
- పెరూర్ పాతీస్వరర్ ఆలయం | Perur Pateeswarar Temple : ఇషాకు దగ్గర్లో ఉన్న అతి పురాతనమైన మహా శివుడి (Lord Shiva) ఆలయం ఇది.
ఇషా ఎందుకు ట్రెండ్ అవుతోంది ? | Why Isha Yoga Centre Is Trending
ఇషా ప్రస్తుతం బాగా ట్రెండ్ అవుతోంది. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. ఒకటి చలికాలం ట్రావెల్ (Winter Travel ) సీజన్ అవడం, రెండవది ఆధ్యాత్మిక ప్రాధాన్యత, సమంత రాజ్ లాంటి సెలబ్రిటీల వివాహం దీంతో పాటు భూత శుద్ధి వివహాం గురించి చాలా మంది తెలుసుకోవాలి అనుకోవడం.
దీంతో పాటు సమంతా రెండో వివహం తరువాత ఈ కింది విషయాల గురించి చాలా మంది తెలుసుకోవాలి అనుకుంటున్నారు…
- లింగ భైరవి ఆలయం
- భూత శుద్ది వివాహం అంటే ఏంటి అని..
- ఇషా యోగా కేంద్రం ట్రావెల్ గైడ్ గురించి (Isha Yoga Centre Travel Guide 2025)
మీరు ఎప్పుడైనా ఇషా వెళ్లారా ? అనుభవాలను షేర్ చేయండి.
📣 ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.
