IRCTC : కొత్త ప్రదేశాలు చూడాలనుకుంటున్నారా? ఐఆర్సీటీసీ అందిస్తున్న ఈ ప్యాకేజీలు మిస్ అవ్వకండి!
IRCTC : దసరా సెలవుల సందర్భంగా భారతీయ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్ (IRCTC) ఉత్తరాంధ్ర ప్రజలకు శుభవార్త అందించింది. విశాఖపట్నం నుండి కేరళ, రాజస్థాన్, చార్ధామ్, అండమాన్ నికోబార్ దీవులకు ప్రత్యేక ఎయిర్ ప్యాకేజీ టూర్లను ప్రకటించింది. ఐఆర్సీటీసీ/బీబీఎస్ జాయింట్ జనరల్ మేనేజర్ క్రాంతి పి.సావర్కర్ మాట్లాడుతూ.. ఈ టూర్ ప్యాకేజీల గురించి వివరంగా తెలియజేశారు. ఈ ప్యాకేజీలలో ఇండిగో ఎయిర్‌లైన్స్‌లో ఎకానమీ-క్లాస్ విమాన టిక్కెట్లు, 3-స్టార్ హోటళ్లలో బస, అల్పాహారం, రాత్రి భోజనం, ఏసీ వాహనాల్లో ప్రయాణం, పర్యాటక ప్రదేశాల సందర్శన, టూర్ షెడ్యూల్ ప్రకారం షేరింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్ వంటి అన్ని సౌకర్యాలు ఉంటాయని వివరించారు.
కేరళ టూర్ వివరాలు
సందర్శించే ప్రదేశాలు: కొచ్చి, మున్నార్, తేకడి, కుమరకోమ్, శ్రీ పద్మనాభ స్వామి దేవాలయం.
వ్యవధి: 6 రాత్రులు / 7 రోజులు.
తేదీలు: సెప్టెంబర్ 12 నుండి 18 వరకు.
టిక్కెట్ ధరలు:
సింగిల్ ఆక్యుపెన్సీ: రూ.52,590
డబుల్ ఆక్యుపెన్సీ: రూ.38,030
ట్రిపుల్ ఆక్యుపెన్సీ: రూ.36,380
రాజస్థాన్ టూర్ వివరాలు
సందర్శించే ప్రదేశాలు: జైపూర్, బికనీర్, జైసల్మేర్, జోధ్‌పూర్, ఉదయ్‌పూర్, మౌంట్ అబూ, పుష్కర్, అజ్మీర్.
వ్యవధి: 9 రాత్రులు / 10 రోజులు.
తేదీలు: అక్టోబర్ 9 నుండి 18 వరకు.
టిక్కెట్ ధరలు:
సింగిల్ ఆక్యుపెన్సీ: రూ.77,375
డబుల్ ఆక్యుపెన్సీ: రూ.60,155
ట్రిపుల్ ఆక్యుపెన్సీ: రూ.56,100

చార్ధామ్ యాత్ర వివరాలు
సందర్శించే పుణ్యక్షేత్రాలు: బద్రీనాథ్, బర్కోట్, గంగోత్రి, గుప్తకాశి, హరిద్వార్, కేదార్నాథ్, సోన్ ప్రయాగ్, యమునోత్రి.
వ్యవధి: 11 రాత్రులు / 12 రోజులు.
టిక్కెట్ ధరలు:
ఒక వ్యక్తి: రూ.81,545
డబుల్ ఆక్యుపెన్సీ: రూ.71,760
ట్రిపుల్ ఆక్యుపెన్సీ: రూ.67,845
అండమాన్ నికోబార్ టూర్ వివరాలు
సందర్శించే ప్రదేశాలు: పోర్ట్ బ్లెయిర్, రాస్ ఐలాండ్, నార్త్ బే ఐలాండ్, హావ్లాక్ ఐలాండ్, నీల్ ఐలాండ్.
టిక్కెట్ ధరలు:
సింగిల్ ఆక్యుపెన్సీ: రూ.67,165
డబుల్ ఆక్యుపెన్సీ: రూ.50,570
ట్రిపుల్ ఆక్యుపెన్సీ: రూ.48,990
ఆసక్తి గలవారు ఐఆర్సీటీసీ కార్యాలయం, మెయిన్ ఎంట్రన్స్, గేట్ నెం. 1, విశాఖపట్నం రైల్వే స్టేషన్లో తమ టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. మరింత సమాచారం కోసం సాయి ప్రసాద్ (మొబైల్: 9281495847), కె. వెంకటేశ్వర రావు (మొబైల్: 9550166168), లేదా చందన్ కుమార్ (మొబైల్: 9281030748)ను సంప్రదించవచ్చు. లేదా, www.irctctourism.com వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.
ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.