2025 లో జరగనున్న కుంభమేళకు ( Kumbh Mela 2025) వెళ్లాలని భావిస్తున్న తెలుగు వారికి ఐఆర్‌సీటీసీ ఒక గుడ్ న్యూస్ తెలిపింది. మహా కుంభ పుణ్య క్షేత్ర యాత్ర పేరుతో ప్రత్యేక రైలు ప్రకటించింది. ఈ ట్రైన్ రాకతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి యాత్రికులకు అందుబాటులో ఉండనున్న భారత్ గౌరవ్ పర్యాటక రైళ్ల ( Bharat Gaurav Trains) సంఖ్య కూడా పెరిగింది.
ఐఆర్‌సీటిసి రూపొందించిన ఈ ప్యాకేజీలో ప్రయాగ్‌రాజ్‌లోని ( Prayag Raj ) త్రివేణి సంగమంతో పాటు, కాశీలోని విశ్వనాథుడి ఆలయం, అయోధ్య శ్రీరామ మందిరం, కాశీ విశాలాక్షి. అయోధ్య హనుమాన్ దేవాలయం, కాశీ అన్నపూర్ణాదేవి దేవాలయాలను కవర్ చేయనున్నారు.
ఇది కూడా చదవండి : 51 Shakti Peethas List : 51 శక్తి పీఠాలు ఎక్కడ ఉన్నాయి ? ఏ శరీర భాగం ఎక్కడ పడింది ?
ఈ ట్రైన్ బోర్డింగ్ స్టేషన్లు | Boading Stations of Maha Kumbh Punya Kshetra Yatra Train
మహా కుంభ్ పుణ్య క్షేత్ర యాత్ర చేయాలనుకునే భక్తులు సికింద్రబాద్‌లోనే కాకుండా ఈ కింది స్టేషన్లలో కూడా బోర్డింగ్ చేయవచ్చు.
ఆ స్టేన్లు ఇవే. భువణగిరి, విజయవాడ, దోర్నకల్, దువ్వాడ, ఏలూరు , ఖమ్మం , కాజీపేట్, మహబూబా బాద్, మధిర, పెందుర్తి, రాజమండ్రి, సమాల్కోట్, విజయనగరం, వరంగల్, జన్‌గావ్.
యాత్ర వివరాలు | Kumbh Mela 2025
Maha Kumbh Punya Kshetra Yatra Train Details : మహా కుంభ పుణ్య క్షేత్ర యాత్రా టికెట్‌ను తెలుగు వారు జనవరి 19 వ తేదీకి బుక్ చేసుకునే వెసులుబాటు ఉంది. అంటే ఈ యాత్ర జనవరి 19 తేదీ నుంచి ప్రారంభం అవుతుంది. మీరు టికెట్ ఇప్పుడు కూడా బుక్ చేసుకోవచ్చు.ఈ యాత్ర వ్యవధి వచ్చేసి 7 రాత్రులు, 8 పగలు ఉంటుంది .ఈ యాత్రలో మీకు 8 రోజల సమయంలో మూడు తీర్థ క్షేత్రాలను చూపిస్తారు.
ఇది కూడా చదవండి : ఈ రాష్ట్రంలో ఒక్క రైల్వే స్టేషన్ కూడా లేదు..ఏ రాష్ట్రమో తెలుసా?
ఈ ప్యాకేజీలో ( IRCTC) మీకు ట్రైన్, బస్సు, హోటల్, ఫుడ్, గైడ్, ఇన్సరెన్స్ అన్ని టికెట్ ధరలోనే కలిపి చార్జ్ చేస్తారు. మీరు ప్రత్యేక ఏర్పాట్ల గురించి ఆలోచిచాల్సిన అవసరం లేదు. అయితే కేవలం 576 సీట్లు మాత్రమే ఉన్నాయి కాబట్టి మీరు ప్లాన్ చేస్తే కొంచెం ఫాస్ట్‌గాబుక్ చేసుకోవాల్సి ఉంటుంది అనేది నా సలహా.
టికెట్ ధర | Maha Kumbh Punya Kshetra Yatra Ticket Cost
- ఎకానమీ స్లీప్ క్లాన్ వచ్చేసి పెద్దలకు రూ.22635, పిల్లలకు (5-11 ఏళ్లవారికి ) రూ.21740
- స్టాండర్డ్ -3ఏసి లో పెద్దలకు రూ.31145, పిల్లలకు రూ.30095
- కంఫర్ట్- 2ఏసీలో పెద్దలకు రూ.38195, పిల్లలకు రూ.36935
ఈ Travel కంటెంట్ నచ్చితే, ఎవరికైనా ఉపయోగపడుతుంది. అనుకుంటే షేర్ చేయగలరు. ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. యూట్యూబ్ ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి.