IRCTC : చలికాలంలో ప్రకృతి అందాలను చూడాలనుకుంటున్నారా? ఐఆర్సీటీసీ అందిస్తున్న అల్టిమేట్ ఊటీ ప్యాకేజీ
IRCTC : చలికాలం వచ్చేసింది! ఈ సీజన్లో ఎక్కడికైనా టూర్ ప్లాన్ చేస్తున్నారా? ప్రకృతి అందాల మధ్య ప్రశాంతంగా కొన్ని రోజులు గడపాలని ఉందా? ఐఆర్సీటీసీ హైదరాబాద్ నుంచి ఊటీకి ప్రత్యేక ప్యాకేజీని అందిస్తోంది. ఈ ఆరు రోజుల పర్యటనలో మీరు ఊటీ, కూనూర్ వంటి అందమైన కొండ ప్రాంతాలను చూడవచ్చు. పచ్చని అడవులు, చల్లని వాతావరణం, తేయాకు తోటల మధ్య ఎంజాయ్ చేయవచ్చు. ఐఆర్సీటీసీ అందిస్తున్న ఈ ప్యాకేజీ పేరు అల్టిమేట్ ఊటీ. ప్రతి మంగళవారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఈ ప్యాకేజీ ప్రారంభమవుతుంది.
ఐఆర్సీటీసీ అందిస్తున్న అల్టిమేట్ ఊటీ ప్యాకేజీ మొత్తం 6 రోజులు, 5 రాత్రులు ఉంటుంది. ఈ టూర్లో ప్రయాణం రైలుతో మొదలై, ఊటీ, కూనూర్ ప్రాంతాలలో కారు ద్వారా పర్యటించాల్సి ఉంటుంది. మొదటి రోజు సికింద్రాబాద్ నుంచి మధ్యాహ్నం 2:25 గంటలకు శబరి ఎక్స్ప్రెస్ ఎక్కాలి. రెండవ రోజు ఉదయం 9:10 గంటలకు కోయంబత్తూర్ చేరుకున్న తర్వాత, అక్కడి నుంచి బస్సులో 90 కి.మీ. దూరంలో ఉన్న ఊటీకి బయలుదేరతారు. ఊటీ చేరిన తర్వాత మూడు రోజులు హోటల్లో బస చేస్తారు. మొదటి రోజున బొటానికల్ గార్డెన్, ఊటీ లేక్ చూడవచ్చు.

ఊటీ, కూనూర్ సందర్శన వివరాలు
మూడవ రోజు దొడబెట్టా పీక్, టీ మ్యూజియం, పైకారా ఫాల్స్ వంటి పర్యాటక ప్రదేశాలను సందర్శిస్తారు. నాలుగవ రోజు ఊటీకి సమీపంలో ఉన్న కూనూర్ వెళ్లి, అక్కడి అందాలను తిలకించి తిరిగి ఊటీకి చేరుకుంటారు. ఐదవ రోజు మధ్యాహ్నం హోటల్ నుంచి చెక్ అవుట్ చేసి, తిరిగి కోయంబత్తూర్ చేరుకుంటారు. అక్కడి నుంచి రాత్రి శబరి ఎక్స్ప్రెస్ ద్వారా హైదరాబాద్కు తిరుగు ప్రయాణం మొదలవుతుంది. ఆరవ రోజు ఉదయం 11:00 గంటలకు సికింద్రాబాద్ చేరుకోవడంతో టూర్ ప్రశాంతంగా ముగుస్తుంది.
ఇది కూడా చదవండి : Egypt Travel Guide: ఈజిప్ట్..ఇక్కడ డబ్బు కట్టి సమాధులను చూస్తారు.. 15 Facts
ప్యాకేజీ ధరలు, కేటగిరీలు
ఈ టూర్ ప్యాకేజీలో ప్రయాణ తేదీలను బట్టి ధరలు మారుతాయి. సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్ 31 వరకు ప్రయాణానికి స్టాండర్డ్ కేటగిరీ (స్లీపర్) ధర రూ.14,790 నుంచి, కంఫర్ట్ కేటగిరీ (3AC) ధర రూ.17,340 నుంచి ప్రారంభమవుతుంది. అయితే, చలికాలం కాబట్టి నవంబర్ 4 నుంచి డిసెంబర్ 19 వరకు ప్రయాణానికి ధరలు కాస్త తగ్గుతాయి. స్టాండర్డ్ కేటగిరీ ప్రారంభ ధర రూ.13,300 కాగా, కంఫర్ట్ కేటగిరీ ధర రూ.15,850గా నిర్ణయించారు.
న్యూ ఇయర్ స్పెషల్ ప్యాకేజీ
డిసెంబర్ 30న నూతన సంవత్సర వేడుకల కోసం ప్రత్యేక పర్యటనను కూడా ఐఆర్సీటీసీ ప్రకటించింది. ఈ స్పెషల్ టూర్లో గాలా డిన్నర్, డీజే మ్యూజిక్ వంటి ప్రత్యేక ఏర్పాట్లు ఉంటాయి. ఈ ప్యాకేజీలో కంఫర్ట్ కేటగిరీ ప్రారంభ ధర రూ.19,810 కాగా, స్టాండర్డ్ కేటగిరీ ప్రారంభ ధర రూ.17,260గా ఉంది.
ఇది కూడా చదవండి : Dangerous Countries : 2025 లో వెళ్లకూడని అత్యంత ప్రమాదకరమైన 10 దేశాలు
ప్యాకేజీలో లభించే సౌకర్యాలు
ఐఆర్సీటీసీ అందిస్తున్న ఈ ప్యాకేజీలో రైలు ప్రయాణం (స్లీపర్ లేదా 3AC), మూడు రోజుల హోటల్ వసతి, ప్రతిరోజూ ఉదయం బ్రేక్ఫాస్ట్, ట్రావెల్ ఇన్సూరెన్స్, టోల్ ఫీజులు, పర్మిట్లు వంటి సౌకర్యాలు కలిపి ఉంటాయి. అయితే, ప్రయాణికులు ఇతర భోజనాలు, రైలులో ఆహారం, పర్యాటక ప్రదేశాల ఎంట్రీ టికెట్లు, బోటింగ్, హార్స్ రైడింగ్ వంటి ఖర్చులను స్వయంగా భరించాల్సి ఉంటుంది. మరింత సమాచారం కోసం ఐఆర్సీటీసీ టూరిజం వెబ్సైట్ (https://www.irctctourism.com) ను సందర్శించవచ్చు.
ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.