Kashmir Tour : రూ. 9999 కశ్మీర్ ట్రిప్…5 రోజుల్లో స్వర్గపు అంచులను ఎంజాయ్ చేయండి
Kashmir Tour : చలికాలం (Winter Season) మొదలవగానే భారతదేశంలో అద్భుతమైన మాయా ప్రపంచంగా మారిపోయే ఏకైక ప్రాంతం కశ్మీర్. మంచుతో నిండిన లోయలు, దాల్ సరస్సుపై మెరిసే హౌస్బోట్లు (Houseboats), చుట్టూ తెల్లటి పర్వతాల దృశ్యం… అందుకే కశ్మీర్‌ను భూతల స్వర్గం(Heaven on Earth) అని పిలుస్తారు. ఒక మరపురాని, ప్రశాంతంగా హాలిడేస్ గడపాలనుకునే ప్రయాణికులు ఉత్తరాన ఉన్న ఈ ప్రాంతానికి తరలివెళ్తారు.
సౌకర్యం, సాహసం, అద్భుతమైన దృశ్యాల కలయికతో కూడిన అత్యంత ప్రాచుర్యం పొందిన 4 రాత్రులు/5 రోజుల కశ్మీర్ టూర్ ప్లాన్ (Kashmir budget tour in winter) వివరాలు, ముఖ్యమైన ప్రదేశాలు, ప్రయాణ చిట్కాలతో పాటు తెలుసుకుందాం.
కశ్మీర్ స్పెషల్ టూర్ | Special Kashmir Tour
మీరు ఈ చలికాలంలో ప్రశాంతమైన టూర్ ప్లాన్ చేస్తుంటే కశ్మీర్ 4 రాత్రులు / 5 రోజులు పర్యటనకు వెళ్లొచ్చు. ఈ టూర్లో ముఖ్యంగా శ్రీనగర్, గుల్మార్గ్, సోన్మార్గ, పహల్గామ్ వంటి అత్యంత అద్భుతమైన ప్రదేశాలను కవర్ చేయవచ్చు. ఇది కుటుంబాలు, ఫ్రెండ్స్ గ్రూప్, ఆఫీస్ గ్రూపులకు బెస్ట్ ఆప్షన్.
శ్రీనగర్ (Srinagar): కశ్మీర్ వేసవి రాజధాని. ఇక్కడ ప్రధాన ఆకర్షణ దాల్ సరస్సు (Dal Lake). పొగమంచుతో కూడిన ఉదయాల్లో శిఖారా రైడ్లు చేయడం, దాల్ సరస్సులోని స్థానిక మార్కెట్లను సందర్శించడం, సంప్రదాయ కశ్మీరీ వంటకాలను (Kashmiri Food) రుచి చూడటం ఇక్కడ మరపురాని అనుభవం. హాయిగా ఉండే హౌస్‌బోట్‌లో (Kashmir House Boat) రాత్రి బస చేయడం ఇక్కడి ప్రత్యేకత.

గుల్మార్గ్ (Gulmarg): పూల మైదానం అని పిలువబడే గుల్మార్గ్, ముఖ్యంగా శీతాకాలంలో మంచు ప్రియులకు స్వర్గం. ఇక్కడ మీరు ప్రపంచంలోనే ఎత్తైన, పొడవైన గొండోలా రైడ్ చేయవచ్చు, ఇది మిమ్మల్ని అంతం లేని తెల్లని వాలుల పైకి తీసుకెళ్తుంది. ఇక్కడ స్కీయింగ్, స్నోబోర్డింగ్ వంటి సాహస క్రీడలు కూడా అందుబాటులో ఉంటాయి.
పహల్గామ్ (Pahalgam): ఇది పర్వతాల మధ్య ప్రశాంతంగా ఉండే ఒక పట్టణం. ఇక్కడ దట్టమైన పైన్ అడవులు, పారే నదీ తీరాలు, ప్రశాంతమైన పర్వత వాతావరణం ఉంటాయి. ఇక్కడ గుర్రపు స్వారీ చేస్తూ అద్భుతమైన లోయ దృశ్యాలను చూడవచ్చు. ఈ ప్రాంతం ట్రెక్కింగ్‌కు చాలా ప్రసిద్ధి చెందింది.
సోన్మార్గ (Sonmarg): బంగారు మైదానం అని పిలువబడే సోన్మార్గ, అద్భుతమైన పర్వత రహదారులను, కళ్ళకు ఇంపుగా ఉండే మంచు దృశ్యాలను అందిస్తుంది. ఈ ప్రాంతం అత్యంత ఎత్తులో ఉండి, చుట్టూ హిమనీనదాలతో (Glaciers) ఆవరించి ఉంటుంది.
బడ్జెట్, బెస్ట్ టైం | Kashmir Tour Budget
కశ్మీర్ పర్యటనను మీ బడ్జెట్లో ప్లాన్ చేసుకోవచ్చు.
బడ్జెట్ అంచనా: చాలా 4 రాత్రులు / 5 రోజుల కశ్మీర్ పర్యటనల ప్యాకేజీలు ఒక వ్యక్తికి రూ.9,999 నుండి ప్రారంభమవుతాయి (మేము వెరిఫై చేసిన ట్రావెల్ పార్ట్నర్ అందించే ధర ఇది) . ఈ ధర సాధారణంగా 20 మందికి పైగా ఉన్న పెద్ద గ్రూపులకు వర్తిస్తుంది. చిన్న గ్రూపులు లేదా జంటలకు, సౌకర్యాల ఆధారంగా ప్రైవేట్ టూర్ ఆప్షన్లు కాస్త ఎక్కువ ధరలో అందుబాటులో ఉంటాయి.
చూసేందుకు బెస్ట్ టైం | Best Time To Visit Kashmir)
శీతాకాలం : డిసెంబర్ నుండి ఫిబ్రవరి వరకు సందర్శిస్తే, మీరు దట్టమైన మంచును, గడ్డకట్టిన సరస్సులను చూడవచ్చు.
పూలు, చల్లని వాతావరణం : ఏప్రిల్ నుండి జూన్ వరకు సందర్శించడం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ సమయంలో ట్యులిప్ తోటలు (Kashmir Tulip Gardens) వికసించి, వాతావరణం చాలా చల్లగా, సుందరంగా ఉంటుంది.
ట్రావెట్ టిప్స్ | Kashmir Travel Tips
మీ కశ్మీర్ యాత్రను మరింత సౌకర్యవంతంగా, ఆనందదాయకంగా మార్చుకోవడానికి కొన్ని ముఖ్యమైన చిట్కాలు ఇక్కడ ఉన్నాయి:
- శీతాకాలంలో వెచ్చని దుస్తులు, గ్లౌజులు (Glove), టోపీ, అత్యవసరంగా వాటర్‌ప్రూఫ్ బూట్లు (Waterproof Boots) తీసుకెళ్లడం తప్పనిసరి.
- గుల్మార్గ్లో ప్రపంచ ప్రసిద్ధి చెందిన గొండోలా రైడ్‌ను అస్సలు మిస్ అవ్వకండి.
- మంచు వాలుల అద్భుత దృశ్యాలను చూడటానికి ఇది ఉత్తమ మార్గం.
- ముఖ్యంగా శీతాకాల రద్దీ ఉన్నప్పుడు ఇబ్బందులు లేకుండా ఉండటానికి మీ హోటళ్లను, హౌస్బోట్లను ముందుగానే బుక్ చేసుకోండి.
కశ్మీరీ వంటకాలైన రుచికరమైన రోగన్ జోష్ (Rogan Josh) , సాంప్రదాయ కశ్మీరీ టీ అయిన కావా (Kahwa) ను తప్పకుండా రుచి చూడండి. టూర్ ప్యాకేజీ బుక్ చేసుకునే ముందు, మీ ప్రయాణానికి అందించే వాహనం రకాన్ని (సెడాన్/SUV/టెంపో ట్రావెలర్) ఎంచుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే మంచులో కొన్ని రకాల వాహనాలకే అనుమతి ఉంటుంది. ఇక మీరు రూ.9999 ప్యాకేజీని బుక్ చేసుకోవాలి అనుకుంటే సదరు సంస్థతో కనెక్ట్ చేయగలను. వాట్సాప్‌లో మెసేజ్ చేయగలరు.
💬 Chat on WhatsApp సంప్రదించడండి
✈️ తెలుగు రాష్ట్రాల్లో ట్రావెల్ ప్యాకేజీలు తక్కువ ధరల్లో అందుబాటులో ఉన్నాయి.
ఏదైనా ప్యాకేజీ బుక్ చేసుకోవాలనుకుంటే లేదా వివరాలు తెలుసుకోవాలనుకుంటే, వాట్సాప్‌లో సంప్రదించండి 👇
💬 Chat on WhatsApp సంప్రదించడండి
🗣️ తెలుగు పాఠకుల కోసం గమనిక: ఈ బ్లాగ్ కేవలం కోసం మాత్రమే. ట్రావెల్ ప్యాకేజీలు , వివరాలు భాగస్వామి సంస్థల ద్వారా అందించబడతాయి.
⚠️ Disclaimer: This article is for informational purposes only. Prayanikudu.com shares verified travel updates and trip ideas collected from trusted sources and travel partners. We do not operate or sell any packages directly, nor are we responsible for bookings, prices, or any changes made by travel operators. All bookings, payments, and communication happen directly between travelers and the respective tour companies or agents. Readers are advised to verify all details before confirming any trip.
ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.
