తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు మోస్ట్ పాపులర్ ట్రావెల్ డెస్టినేషన్ ఏంటంటే అందరూ లంబసింగి అనే అంటారు. తూర్పుకనుమల్లో కొలువైన అందమైన హిల్ స్టేషన్ గ్రామం ఇది. చలి కాలంలో పర్యటకులు వేల సంఖ్యల్లో ఇక్కడికి వస్తుంటారు. ఈ అందమైన ప్రాంతానికి ఎలా వెళ్లాలి ? ఎక్కడ ఉండాలి ? దగ్గర్లో చూడాల్సిన ప్రదేశాలు ఏంటి ? నిజంగా లంబసింగిలో ( Lambasingi ) స్నో పడుతుందా అనే సందేహాలకు ఈ పోస్టులో మీకు సమాధానం దొరుకుతుంది.
లంబసింగిని లమ్మసింగి అని కూడా పిలుస్తుంటారు. ఇది ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామ రాజు జిల్లా, చింతపల్లి ( Chintapalli ) మండలంలో ఉన్న గ్రామం. లంబసింగికి కొర్రబయలు అని కూడా పిలుస్తుంటారు. ఈ పేరు అర్థం తెలిస్తే మీకు ఈ ఊరు స్పెషాలిటీ ఒక్క క్షణంలో అర్థం అవుతుంది.
ముఖ్యాంశాలు
కొర్రబయలు అనే పదానికి అర్థం
లంబసింగిని కొర్ర బయలు అని కూడా పిలుస్తుంటారు. ఇందులో కొర్ర అంటే కర్ర అని అర్థం వస్తుంది. బయలు అంటే బయట అని అర్థం. తెలిసో తెలియకో లంబసింగిలో ఎవరైనా ఇంటి బయట పడుకుంటే చలికి కొయ్యలా బిగుసుకుపోతారట. అందుకే దీనిని కొర్రబయలు ( korra bayalu ) అని పిలుస్తుంటారు. దీన్ని బట్టి మీకు అర్థం అయ్యే ఉంటుంది లంబసింగి ఎంత చల్లగా ఉంటుందో అని.
Read Also : చలికాలం తప్పకుండా వెళ్లాల్సిన 8 హిల్ స్టేషన్స్ ఇవే
లంబసింగి గ్రామం గురించి
Facts about lambasingi village : లంబసింగి గ్రామం ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలంలో ఉంది. ఒక గిరిజన ప్రాంతం అయిన ఈ గ్రామ విస్తీర్ణం సుమారు 4 కిమీ ఉంటుంది.మొత్తం 418 ఇళ్లలో సుమారు 2000 మంది ఈ గ్రామంలో నివసిస్తుంటారు. సముద్ర మట్టానికి ఈ గ్రామం 3600 మీటర్ల ఎత్తులో ఉంటుంది.
లంబసింగిలో ఏడాది పొడవునా వాతావరణం చల్లగా ఉంటుంది. చలికాలం వస్తే మాత్రం ఈ గ్రామం స్వర్గంలా ఉంటుంది.
నేషనల్ క్రష్ అయింది
లంబసింగి గురించి తెలుగువారికే కాదు మొత్తం దేశానికి తెలుసు. ఈ గ్రామం అందం గురించి తెలుగు బ్లాగర్లు, తెలుగు వ్లాగర్లు ( Telugu Vloggers ), హిందీ బ్లాగర్లు, వ్లాగర్లు కూడా ఎన్నో స్టోరీస్ చేశారు. దీంతో చలికాలం వస్తే చాలు కొన్ని వెబ్‌సైట్లు లంబసింగి గురించి పోస్టులు పెడుతూ ఉంటాయి.
దక్షిణాదిలో మంచు కురిసే ఒకే ఒక చోటు ఇదే…సౌత్ ఇండియాలో వింటర్ వండర్లాండ్ , ఆంధ్రా కాశ్మీరం అంటూ వరుసగా ఆర్టికల్స్ రాస్తుంటారు. అయితే….లంబసింగిలో నిజంగా మంచు కురుస్తుందా ? అనేది మీరు తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయం.
లంబసింగిలో చలికాలం…
Lambasingi Temperature In Winter : లంబసింగి చలికాలంలో అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ ఎంత చలిగా ఉంటుంది అంటే ఆ సమయంలో ఉష్ణోగ్రతలు 5 డిగ్రీల సెల్సియస్ వరకు పడిపోతాయి. ముఖ్యంగా డిసెంబర్ నుంచి ఫిబ్రవరీ మధ్య కాలంలో అతి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయి.
అయితే ఇక్కడ అప్పుడప్పుడు మంచు ఏర్పడుతుంది. ముఖ్యంగా జనవరీ ఫిబ్రవరి నెలల్లో మంచు నేలపై కొద్దిగా కనిపిస్తూ ఉంటుంది. అందుకే దీనిని సౌత్ ఇండియాలో ( Coldest place in south india ) అత్యంత చల్లని ప్రాంతాల్లో ఒకటిగా చెబుతుంటారు. మీరు వెళ్లే ముందు లంబసింగి ఉష్ణోగ్రత తప్పకుండా చెక్ చేయండి.
లంబసింగిలో నిజంగా స్నో పడుతుందా ?
Does it really snow at lambasingi ? : ఒక్క మాటలో చెప్పాలి అంటే నో, లంబసింగిలో స్నో పడదు. పడినా చాలా అరుదుగా పడుతుంది. లంబసింగిలో పొగమంచు ఏర్పడుతుంది. నేలపై మంచు కూడా కనిపిస్తుంది కానీ స్నో పడదు. ఎందుకంటే స్నో పడాలి అంటే ఉష్ణోగ్రత కనీసం సున్నా డిగ్రీలు ఉండాలి. లంబసింగిలో టెంపరేచర్ 5 డిగ్రీల వరకు వెళ్తుంది. కొన్నిసార్లు మైసన్ 2 వరకు కూడా వెళ్తుంది.
కొన్ని సందర్భాల్లో ఉష్ణోగ్రత మరీ పడిపోయినప్పుడు ( మైనస్ 2 డిగ్రీల వరకు ) నేలపై పొగమంచు ( Fog ) పరుచుకుంటుంది. లేదా మంచు పేరుకుంటుంది. కానీ టెక్నికల్లీ అది స్నో ఫాల్ అవదు.
స్నో పడినా పడకపోయినా ( snowfall at lambasingi ) లంబసింగి వెళ్తే మాత్రం మనం మంచు ప్రపంచంలో ఉన్నామా అన్నంత చలిగా ఉంటుంది. పొగమంచులో నడుస్తూ ఉంటే కలిగే అనుభవం ఉంది చూడండి అది స్నో ఫాల్ కన్నా తక్కువేం కాదు.
Read Also: Honeymoon : వీసా అవసరం లేకుండా ఈ ఏడు దేశాల్లో హనీమూన్‌కు వెళ్లొచ్చు.
ఆంధ్రాకాశ్మీరం
Andhra Kashmir : లంబసింగి అనేది తెలుగువారికే కాదు చాలా మంది ఫేవరిట్ డెస్టినేషన్ అయింది. కాంక్రీట్ అడవి నుంచి దూరంగా ఉండే ఈ ప్రాంతం…రియల్ లైఫ్‌కు దగ్గరిగా ఉంటుంది. లైఫ్ అంటే లాగిన్ లాగౌట్‌ను మించినవి కూడా ఉంటాయి అని చూపిస్తుంది ఈ గ్రామం. ఇది ఉన్న ప్రాంతాన్ని బట్టి లంబసింగికి ఆంధ్రా కాశ్మీర్ అనే టైటిల్ కరెక్టుగా సరిపోతుంది.
లంబసింగిలోకి ఎంటర్ అవ్వగానే అక్కడి వాతావరణానికి మనసు పులకరించిపోతుంది. నిజమేనా ఇదంతా కలకాదుగా… ఇంత అందమైన ప్లేస్‌లో ఉన్నామా అని మనను మనం ప్రశ్నించుకుంటాం. సరదాగా గ్రామంలో నడిచినా సరే మీరు ఆకాశంలో తేలుగున్నట్టుగా ఉంటుంది
నార్త్ ఇండియా వెళ్లకుండానే
Winter Wonderland : నవంబర్ నుంచి జనవరి వరకు లంబసింగి వింటర్ వండర్లాండ్‌గా మారిపోతుంది. ఉష్ణోగ్రత మైనస్ 2 వరకూ వెళ్తుంది. నార్త్ ఇండియాలోని మనాలి, హిమాలయాలు వెళ్లకుండానే చల్లని వాతావరణంలో స్పెండ్ చేసే అవకాశం దొరకుతుంది. ఇందుకే చాలా మంది లంబసింగికి చలికాలంలో వెళ్తుంటారు.
గుండె జారేలా చేసే లంబసింగి ల్యాండ్‌స్కేప్
Landscape in Lambasingi : లంబసింగి అంటే కేవలం అక్కడి పొగమంచు మాత్రమే కాదు అక్కడి చెట్లు, కొండలు, గుట్టలు, పుట్టలు, తేనె పుట్టలు, పొలం గట్టులు అన్నీ కలిపిన ఒక కంప్లీట్ ప్యాకేజీ ఇది. ఇక్కడ పరిసర ప్రాంతాలు మొత్తం ఒక వింటర్ పెయింటర్ వేసిన ఆర్ట్‌లా కనిపిస్తుంది.
దట్టమైన అడవులు, వంకర్లు తిరుగే దారులు, మెలికలు తిరిగే కొండలు, దూరదూరం వరకు విస్తరించిన ఉన్న కాఫీ తోటలు ఇవన్నీ కూడా లంబసింగిని హైకింగ్ స్పాట్స్‌గా ( Hiking in Lambasingi ) మార్చాయి. చాలా మంది ఇక్కడికి ఫోటోగ్రఫీ కోసం వస్తుంటారు. కొత్తగా ట్రావెల్ వ్లాగ్స్ ( Travel Vlogs ) స్టార్ట్ చేసే వారు లంబసింగితో పాటు వంజంగి ( Vanjangi ) రెండూ కవర్ చేస్తుంటారు.
ఇక్కడ ఉదయం కనిపించే అద్భుతాలు అన్నీ ఇన్నీ కావు. అందుకే లంబసింగికి ఎవరు వచ్చినా వారు ఉదయం 3 గంటలకే బయటికి వచ్చి సూర్యోదయం కోసం ఎదురు చూస్తుంటారు.
Read Also: Valley Of Flowers : వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ ఎలా వెళ్లాలి? ఎప్పుడు వెళ్లాలి ?
ప్రకృతిలో మమేకం…
నేచర్ అంటే ఇష్టపడే వారికి, ఇకో ఫ్రెండ్లీ ట్రావెలర్స్‌కు లంబసింగి ఒక స్వర్గం లాంటిది. ఇక్కడ అనేక రకాల అరుదైనా మొక్కలు, చెట్లు, ఇతర అంశాలను వారు కవర్ చేయొచ్చు. చాలా మంది ఇక్కడి అరుదైన పక్షలను చూడటానికి ( Birdwatching ) వస్తుంటారు. దీంతో పాటు వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ ( Wild Life Photography ) చేసే వాళ్లు కూడా లంబసింగికి వస్తుంటారు.
సూర్యుడితో సెల్ఫీ తీసుకోండి…
Sunrise Point At Lambasingi: లంబసింగి వెళ్లే 90 శాతం ప్రయాణికులు ఇక్కడి సూర్యోదయాన్ని చూడాలనే కోరుకుంటారు. మీరు కూడా అందుకే వెళ్తోంటే మాత్రం ఉదయం 3 గంటలకే లేచి రెడీ అయ్యి బయల్దేరాల్సి ఉంటుంది. లంబసింగి నుంచి చెరువుల వేనం ( Cheruvula Venam ) అనే చోటికి మీరు వెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడికి ఉదయం 4.30 కే చాలా మంది చేరుకుంటారు. వారితో పోటీ అని భావించకుండా కొద్దిగా ముందు వెళ్తే బెటర్.
లంబసింగి నుంచి చెరువుల వేనం వరకు జీప్‌లో వెళ్లొచ్చు. దీని కోసం మీరు రూ.100 ఇవ్వాల్సి ఉంటుంది. సన్ రైజ్ పాయింట్‌కు వెళ్లడానికి ఈ జీప్‌లోనే మీరు 2.5 కిమీ దూరం ప్రయాణం చేయాలి. ఒక వేళ నడిచి వెళ్లాలి అనుకుంటే ఈ దూరం తగ్గి 1.5 కిమీ అవుతుంది.
చెరువుల వేనం వద్ద ఎంట్రీ ఫీజు రూ.20 పే చేయాల్సి ఉంటుంది. అక్కడి నుంచి 100-200 మీటర్లు ముందుకు వెళ్లాల్సి ఉంటుంది వ్యూ పాయింట్ కోసం. కావాలంటే మీరు చెరువుల వేనం వద్ద నైట్ క్యాంపింగ్ ( Camping ) చేయవచ్చు. ఇక్కడ మీకు టీ, మ్యాగీ లాంటివి దొరుకుతాయి. మీరే ముందు వచ్చారు అనుకోకండి. చాలా మంది మీ కన్నా ముందే వచ్చేస్తారు.
లంబసింగిలో చూడాల్సినవి
Top Attractions In Lambasingi Trip : లంబసింగిలో కాసేపు స్పెండ్ చేసినా జీవితాంతం గుర్తుంచుకునే మెమోరీస్ సొంతం అవుతాయి.ఇక్కడ మీరు మాట్లాడితే ప్రకృతి వింటుంది. మీరు మౌనంగా ఉంటే ప్రకృతి మీతో మాట్లాడుతుంది. దటీస్ లంబసింగి.
స్థానికంగా చూడాల్సిన ప్రదేశాలు చాలా ఉన్నాయి. అందులో కొన్ని మీ కోసం
1. తంజంగి రిజర్వాయర్ | Thanjangi Reservoir: లంబసింగికి అతిసమీపంలో ఉంటుంది తంజంగి రిజర్వాయర్. దట్టమైన అందమైన అడవిలో ఉన్న ఈ రిజర్వాయర్ పిక్‌నిక్ కోసం పర్ఫెక్ట్ స్పాట్ అవుతుంది. ప్రకృతి మధ్యలో కాసేపు స్పెండ్ చేయాలి అనుకునేవారికి ఇది మంచి ఛాయిస్ అవుతుంది.
2. కొత్తపల్లి జలపాతం | Kothapalli Waterfalls: ఇక్కడికి చాలా తక్కువ మంది వెళ్తుంటారు. కారణం ఏంటంటే చాలా మందికి దీని గురించి తెలియదు. మీకు తెలిసింది కాబట్టి ప్లాన్ చేయండి. ఈ జలపాతం మిగితా వాటిలా ఆకాశాన్నుంచి జారిపడుతున్నట్టు ఉండదు.
చిన్న చిన్న గుట్టలపైనుంచి జారుతున్నట్టు సింపుల్‌గా అందంగా ఉంటుంది. లంబసింగి నుంచి 40 కిమీ దూరంలో ఉంటుంది. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు ఇక్కడికి వెళ్లవచ్చు. ఎంట్రీ టికెట్ రూ.50 ఉంటుంది.
3. కాఫీ తోటలు : లంబసింగి కాఫీతోటలు చాలా ఫేమస్. ఇక్కడ సువాసన భరితమైన కాఫీని మీరు ఎంజాయ్ చేయండి. వీలు దొరికతే కాఫీ తోటలు చూసేయండి. స్థానికులు వ్యవసాయం ఎలా చేస్తున్నారో గమనించండి. కాఫీ లవర్స్ అయితే మీరు లంబసింగి వెళ్లిన రోజు వ్యాలెంటైన్స్ డేతో సమానమే.
4. అరకు వ్యాలీ | Araku Valley : నేను నార్త్ ఇండియాలో ట్రెక్కింగ్ చేస్తున్నప్పుడు తెలుగు స్టేట్స్‌లో ఉన్న పర్యాటక ప్రాంతాలను ప్రమోట్ చేస్తుంటారు. ( డబ్బులు తీసుకోను. నచ్చింది కాబట్టి వారికి రిఫర్ చేస్తాను ) . నేను రిఫర్ చేసే డెస్టినేషన్‌లో అరకు కూడా ఉంటుంది. అరకు వ్యాలీ అనేది ఒక పర్ఫెక్ట్స్ వింటర్ డెస్టినేషన్. కాఫీ తోటల నుంచి బొర్రా గుహల ( Borra Caves ) వరకు, కటికా జలపాతం నుంచి గాలికొండ వ్యూ పాయింట్ వరకు అరకులో అన్నీ ఉన్నాయి.
Read Also: Manali : మనాలి ఎలా ప్లాన్ చేసుకోవాలి ? ఎక్కడ ఉండాలి ? ఏం చూడాలి?
లంబసింగిలో చేయాల్సినవి
Things To do In Lambasingi : లంబసింగి అనేది ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అండ్ నచ్చినవారితో కలిసి వెళ్లగలిగిన కంప్లీట్ ట్రావెల్ డెస్టినేషన్. ఈ ట్రిప్ మిమ్మల్ని ఎంగేజ్ చేయడమే కాదు మోటివేట్ కూడా చేస్తుంది. పూర్తిగా రీచార్జ్ అయ్యే ఛాన్స్ కూడా ఇస్తుంది.
- ట్రెక్కింగ్ | Trekking in Lambasingi: లంబసింగిలో మీరు ఎన్నో స్పాట్స్‌కు ట్రెక్కింగ్ వెళ్లొచ్చు. తూర్పుకనుమల్లో కనిపించే వ్యూస్ మిమ్మల్ని ఇంకా మోటివేట్ చేస్తాయి. టాప్‌కు వెళ్లాలి అంటే కష్టపడాలి…కానీ ఫలితం కూడా అలాగే ఉంటుంది అనే పాఠం మీరు నేర్చుకోవచ్చు.
- సూర్యుడిని ఫాలో అవ్వండి: లంబసింగికి చాలా మంది సూర్యోదయాన్ని చూడటానికి వెళ్తుంటారు. అయితే ఇక్కడ సూర్యస్తమం ( Sunset in Lambasingi ) వీక్షించే స్పాట్స్ కూడా చాలా ఉంటాయి. అవి ట్రై చేయండి. మంచి ఫోటోగ్రఫీ స్పాట్స్ కూడా అవుతాయి.
- సానిక కల్చర్ : మెటీరియల్ ప్రపంచానికి దూరంగా రియల్ వరల్డ్‌లో బతుకుతున్న వారు మీకు అక్కడ కనిపిస్తారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేయండి. వారి లైఫ్ స్టైల్ తెలుసుకోండి. ఆచారాలు, వ్యవహారాలు, భోజన పద్ధతులు, వివాహాది కార్యాలు ఎలా జరుగుతాయో అడిగి తెలుసుకోవచ్చు.
- బర్డ్ వాచింగ్ : లంబసింగి అనేది ఫోటోగ్రఫీ కోసమే కాదు బర్డ్ వాచింగ్‌కు కూడా మంచి స్పాట్. చాలా మంది బర్డ్ వాచింగ్ కోసం వెళ్తుంటారు. వారు ఎప్పుడూ చూడని కొత్తరకం పక్షులను చూసి మురిసిపోతుంటారు.
లంబసింగి బెస్ట్ టైమ్
Best time to visit lambasingi : లంబసింగి వెళ్లడానికి చలికాలం ఉత్తమమైన సమయం. మరీ ముఖ్యంగా నవంబర్ నెల నుంచి జవవరి చివరి వారం వరకు ఈ ప్రాంతం ఒక స్వర్గంలా కనిపిస్తుంది. తెలిమంచు నుంచి పొగమంచు వరకు లంబసింగి ఇంచు ఇంచులో మీకు అందమే కనిపిస్తుంది.
మీరు వింటర్‌లో కాకుండా మరో సీజన్లో ఇక్కడికి రావాలి అనుకుంటే వర్షాకాలం కూడా రావచ్చు. ఆ సమయంలో ఇక్కడ ఎక్కడ చూసినా పచ్చదనం పరుచుకున్నట్టుగా ఉంటుంది. దీని కోసం మీరు జూన్ నుంచి సెప్టెంబర్ మధ్యలో రావాల్సి ఉంటుంది. అయితే వచ్చే ముందు స్థానిక వాతావరణం గురించి తెలుసుకుని వస్తే బెటర్. దాంతో పాటు మీ ట్రిప్‌లో వంజంగిని కూడా ఇంక్లూడ్ చేస్తే బోనస్ అవుతుంది.
లంబసింగికి ఎలా వెళ్లాలి ?
How To Reach lambasingi ? : లంబసింగి అనేది ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామ రాజు జిల్లాలో ( Alluri Sitarama Raju District ) ఉంది. ఇక్కడికి రావాలి అంటే మీకు విశాఖపట్నం బేస్ పాయింట్ అవుతుంది. వైజాగ్ నుంచి అరకు మధ్య దూరం 115 కిమీ ఉంటుంది. అరకు నుంచి లంబసింగి సుమారు 90 కిమీ దూరంలో ఉంటుంది.
వాయుమార్గంలో | Lambasingi By Air : లంబసింగికి చేరువలో 100 కి.మి దూరంలో విశాఖపట్నం ఎయిర్‌పోర్టు ఉంది. అక్కడి నుంచి మీరు ట్యాక్సీలో లంబసింగి చేరుకోవచ్చ.
ట్రైన్‌లో | Lambasingi By Train : లంబసింగికి అతిసమీపంలో ఉన్న రైల్వే స్టేషన్ చింతపల్లి రైల్వే స్టేషన్. ఇక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాలకు రైలు సేవలు అందుబాటులో ఉంటాయి.
రోడ్డు మార్గంలో | Lambasingi By Road : లంబసింగికి చేరుకోవాలి అంటే రోడ్డు మార్గానే ఎక్కువ ప్రయాణించాలి. మీరు వైజాగ్ ( Vizag ) నుంచి అయినా లేదా చింతపల్లి నుంచి అయినా రోడ్డు మార్గానే ఇక్కడికి చేరుకోవచ్చు. అయితే ఈ జర్నీ మాత్రం అద్భుతం అని చెప్పొచ్చు.
లంబసింగిలో ఎక్కడ ఉండాలి ?
Where to stay in Lambasingi : లంబసింగిలో మీకు పలు ఎకామడేషన్ ఆప్షన్స్ ఉంటాయి. అయితే మీరు ముందుగా బుక్ చేసుకుంటే బెటర్. పీక్ సీజన్లో బుకింగ్ లేకుండా ఇక్కడికి వస్తే ఇబ్బంది పడతారు. ఇక్కడ బడ్జెట్ ఫ్రెండ్లీ గెస్ట్ హౌజ్‌లు చాలా ఉంటాయి. ఇక్కడ మీకు క్యాంప్ ఫైర్ ( Campfire in Lambasingi ) అవకాశం కూడా కల్పిస్తారేమో కనుక్కోండి.
సో మీరు లంబసింగి వచ్చే ముందు ఈ పోస్ట్ మరోసారి రిఫర్ చేయండి. దాన్ని బట్టి ప్లాన్ చేసుకోండి. వచ్చేది చలికాలంలో అయితే దాన్ని బట్టి ప్యాక్ చేసుకోండి. హైకింగ్ చేయాలనుకుంటే హైకింగ్ షూస్ ( hiking shoes ) , ట్రెక్కింగ్ పోల్స్ ( Trekking Poles ), ఎనర్జీ బార్స్ , 50 లేదా 60 లీటర్స్ బ్యాక్ ప్యాక్ ( Back Pack ) రెడీ చేసుకోండి. ఈ ట్రిప్ ( Trip ) ఎంజాయ్ చేయాలి అంటే మీరు కొంచెం మెరుగ్గా రీసెర్చ్ చేయాల్సి ఉంటుంది. ఆల్ ది బెస్ట్
ఈ కంటెంట్ నచ్చితే, ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయగలరు. ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. యూట్యూబ్ ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి.
Photos by: Shiva Reddy ( Instagram@shivareddy_774)
లంబసింగి గురించి చాలా చక్కగా రాశారు. ఈ సమాచారం ఎంతో ఉపయోగపడింది…
Thank You for your kind words Ravi garu. Have. A great day