Dangerous Cities In USA : అమెరికాలో అత్యంత ప్రమాదకరమైన 18 నగరాలు

షేర్ చేయండి

అమెరికా అంటే ప్రపంచంలోనే సేఫెస్ట్ దేశం అనుకుంటారు. కానీ అమెరికాలో గన్ కల్చర్ చాలా ఎక్కువ. తెలుగు వారు ఎక్కువగా వెళ్లే అమెరికాలో అత్యంత ప్రమాదకరమైన 18 నగరాలు ( Dangerous Cities In USA ) ఇవే. ఈ ప్రాంతాలకు వెళ్లే ముందు కొంచెం జాగ్రత్త.

అమ్మ తరువాత ప్రపంచంలో ఎక్కువ మంది ఇష్టపడేది అమెరికానే ( ఎక్కువ ఆలోచించకండి. ప్రాస కోసం వాడాను ). ఎలాంటి వ్యక్తి జీవితం అయినా అమెరికాకు వెళ్తే మారిపోతుంది అని అంటారు. దీనినే అమెరికన్ డ్రీమ్ ( American Dream ) అంటారు. 

అమెరికన్ డ్రీమ్

Prayanikudu
| Gif By : Tenor

విషయంలోకి వెళ్లే ముందు ప్రపంచ క్రైమ్ మూవీస్‌ను ఎక్కువగా ప్రభావితం చేసిన స్కార్‌ఫేస్ అనే మూవీ గురించి మాట్లాడుదాం. ఒక క్యూబన్ రెఫ్యూజీగా అమెరికాలోకి ఎంటర్ అయ్యే టోనీ మాంటానా ( Al Pacino ) అమెరికాను ఏలుదాం అని కలగంటాడు. దాని కోసం హింసా, డ్రగ్స్ వంటి దారులు వెతుక్కుంటాడు. దీనిని తన అమెరికన్ డ్రీమ్ అనుకుంటాడు. స్కార్‌ఫేస్ ( Scarface Movie ) మూవీలో టోనీ మోంటానా లాంటి వారు కనే అమెరికన్ డ్రీమ్ అమెరికాలో క్రైమ్‌ రేటును పెంచేస్తోంది.

అమెరికా వెళ్లే ముందు తెలుసుకోవాల్సిన విషయం…

say Hello to My Little Friend tony Montana
| Gif By: Tenor

ఎన్నో ఆశలతో యూఎస్‌లోకి అడుగుపెట్టే తెలుగువారు టోనీ మోంటానా ( Tony Montana ) లాంటి వారి నుంచి దూరంగా ఉండాలి. మనపని మనం చేసుకుంటూ వెళ్తున్నప్పుడు చేతిలో గన్నుతో ఎదురొచ్చి మరి “ Say Hello To My Little Friend “ అనే కల్చర్ అమెరికాలో నేటికీ ఉంది. ఇదే గన్ కల్చర్. చిన్నా పెద్దా అని తేడాల్లేకుండా స్కూలు పార్కు అని తేడాల్లేకుండా అక్కడ నిత్యం కాల్పులు జరుపుతుంటారు.

మరీ ముఖ్యంగా అమెరికాలోని ఈ 18 నగరాల్లో టోనీ మోంటానాలు, ఫ్రాంకెన్‌స్టీన్,  యాంటోన్ చిగుర్న్ ( No Country For Old Men ) ఇలా ఎన్నో సినిమాటిక్ క్యారెక్టర్స్ నిజరూపంలో కనిపిస్తారు. సో అమెరికాకు వెళ్తే ఈ సిటీలకు వెళ్లకండి. వెళ్లాల్సి వస్తే మాత్రం ఒకటికి పదిసార్లు ఆలోచించండి. ఎందుకంటే డారల్ కన్నా ప్రాణం ముఖ్యం

Crime Rate అండ్ Statistics ప్రకారం నెంబర్.1 పొజిషన్‌లో ఉన్న సిటీ వచ్చేసి…
  1. మెంఫిస్, టెన్నెస్సీ | Memphis, Tennessee : 

క్రైమ్ రేట్ : ప్రతీ లక్ష మందిలో 1406.6 క్రైమ్స్ జరుగుంతుంటాయి.

కారణాలు : ఎక్కువగా గన్ వైలెన్స్ జరుగుతుంది. క్షణికావేశాలు చాలా ఎక్కువ. అనేక సంస్థలు ఇక్కడ క్రైమ్ రేటు తగ్గించే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోతోంది. ఒక రకంగా ఇది యానిమల్ మూవీకి సీక్వెల్‌ యానిమల్ పార్క్‌లా తయారవుతోంది.

  1. సెయింట్ లూయిస్, మిజోరి | St. Louis, Missouri

క్రైమ్ రేట్ : లక్షకు 1,113.3  క్రైమ్స్

కారణాలు :  ఇక్కడ అత్యధిక సంఖ్యలో భౌతిక దాడులు, హత్యలు జరుగుతుంటాయి. అందుకే పేరులో సెయింట్ ఉన్నా, ఈ ప్రాంతానిది మాత్రం రక్త చరిత్రే.

  1. బర్మింగ్‌హామ్, అలబామ | Birmingham, Alabama
18 Dangerous Cities in USA 2025 -4
| Image for representation purposes only. They are not criminals; they are models. | Pexels | ప్రతీకాత్మక చిత్రం. ఇందులోని వ్యక్తి లేదా వ్యక్తులు మోడల్స్ మాత్రమే.

అలబామ అనగానే Sweet Home Alabama గుర్తుకువచ్చింది. కానీ ఇది క్రైమ్ రిలేటెడ్ కంటెంట్ కాబట్టి అక్కడికే వద్దాం.

ఇక్కడ క్రైమ్ రేట్ : లక్ష మందిలో 1485.0  క్రైమ్స్ జరగుతుంటాయి.

కారణాలు :  ఈ ప్రాంతంలో ఆర్థిక అసమానతలు చాలా ఎక్కువ. అమెరికాలో ఉన్నవాళ్లకు తెలిసే ఉండొచ్చు, మిగితా వారికి తెలియని విషయం ఏంటంటే అమెరికాలో కూడా పేదవారు ఉంటారు. అడుక్కునే వారు ఉంటారు. క్విక్ మనీ కోసం నలుగురు గ్యాంగులతో వచ్చి క్షణాల్లో డబ్బు తీసుకెళ్లిపోతారు. మీరు హీరోయిజం చూపించాలి అనుకుంటే మాత్రం విక్టిమ్ అవ్వాల్సి వస్తుంది. హీరోయిజం అంటే విలన్లను ఉతకడం కాదు. తెలివిగా బతకడం.

  1. డెట్రాయిట్ , మిషిగన్ | Detroit, Michigan

క్రైమ్ రేట్ : లక్షకు 1500.0  క్రైమ్స్

కారణాలు ( Dangerous Cities In USA ) :  చాలా కాలంగా కొనసాగుతున్న పేదరికంతో పాటు నిరుద్యోగ సమస్య కారణంగా ఇక్కడ నేరాల సంఖ్య పెరుగుతూ ఉంది. గుర్తుంచుకోండి మిషిగన్…పేరులోనే గన్ ఉంది. 

  1. బాల్టిమోర్ , మేరీల్యాండ్ | Baltimore, Maryland

క్రైమ్ రేట్ : లక్షకు 1200.0  క్రైమ్స్

కారణాలు :  ఇక్కడ డ్రగ్స్ సంబంధిత నేరాలు ఎక్కువ. దారిదోపిడులు, హత్యలు చాలా ఎక్కువ. 2023 లో నల్గొండకు చెందిన ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ను దొంగతనానికి వచ్చిన కొంత మంది సాయుధులు కాల్చి చంపారు. బాధితుల్లో తెలుగువారు కూడా ఉంటున్నారు. అందుకే ఈ సమాచారం మీరు నలుగురిత షేర్ చేసుకోండి.

  1. కాన్సాస్, మిజోరి | Kansas City, Missouri 

క్రైమ్ రేట్ : లక్షకు 1200.0 క్రైమ్స్

కారణాలు : ఇక్కడ ప్రాపర్టీ క్రైమ్స్‌తో పాటు హింసాత్మక నేరాలు ఎక్కువగా జరుగుతాయి.

  1. క్లీవ్‌ల్యాండ్, ఓహైయో | Cleveland, Ohio 

క్రైమ్ రేట్ : లక్షకు 1200.0 క్రైమ్స్

కారణాలు :  ఆర్థిక ఇబ్బందుల వల్ల నేరాలు చేసే వారు ఎక్కువ. దీంతో పాటు గ్యాంగ్ వార్స్ జరుగుతాయి.

  1. లిటిల్ రాక్ , అర్కాన్సాస్| Little Rock, Arkansas

క్రైమ్ రేట్ : లక్షకు 828.2  క్రైమ్స్

కారణాలు :  ఇక్కడ మంచు పడుతుంది. తుపాకీ పేలుతుంది. గన్ కల్చర్ ఎక్కువ. ఇక్కడి పేదరికం, గ్యాంగ్ యాక్టివిటీ వల్ల క్రైమ్ రేటు తగ్గడం లేదు.

  1. అల్బు‌క్యూర్క్, న్యూ మెక్సికో | Albuquerque, New Mexico

న్యూ మెక్సికోలో అతిపెద్ద నగరమైన అల్బుక్యూర్క్‌‌లో ఎక్కువ ఆస్తి తగాదాలు, డ్రగ్స్ సంబంధించిన నేరాలు జరుగుతుంటాయి.

క్రైమ్ రేట్ : ప్రతీ లక్ష మందికి 1200 క్రైమ్స్

  1. మిల్వౌకి, విస్‌కౌన్సిన్ | Milwaukee, Wisconsin
18 Dangerous Cities in USA 2025 3
| Image for representation purposes only. They are not criminals; they are models. | Pexels | ప్రతీకాత్మక చిత్రం. ఇందులోని వ్యక్తి లేదా వ్యక్తులు మోడల్స్ మాత్రమే.

క్రైమ్ రేట్ : లక్ష మందికి 1200 నేరాలు

కారణాలు :  ఇక్కడ గన్ కల్చర్ చాలా ఎక్కువ. అందుకే ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి. 

  1. ఇండియానా పోలిస్, ఇండియానా | Indianapolis, Indiana

క్రైమ్ రేట్ : లక్షకు 900  క్రైమ్స్

కారణాలు ( Dangerous Cities In USA ) :  పేరులో ఇండియా ఉంది, పోలిస్ ఉంది అనే ఫీలింగ్‌తో ఇది చాలా  సేఫ్ సిటీ అనుకోకండి. సైఫ్ కూడా ఇంట్లో సేఫ్‌గా లేడు. ఇక ఇండియానా పోలిస్ విషయానికి వస్తే  ఇక్కడ హత్యలు, ఆకస్మిక దాడులు చాలా ఎక్కువ. 

  1. స్టాక్‌టాన్,  కాలిఫోర్నియా | Stockton, California

క్రైమ్ రేట్ : లక్షకు 723 క్రైమ్స్

కారణాలు :  కాలిఫోర్నియాలో ఇటీవలే హత్యల సంఖ్య బాగా పెరిగింది. ఇక్కడి లాంగ్ బీచ్ అంటే కైట్ ఫెస్టివల్ గుర్తుకు రావాలి. కానీ అదే బీచులో 2023 లో కాల్పులు జరిగాయి. అంతేనా  2023 జనవరిలో మాంటెరీ పార్కులో చైనా కొత్త సంవత్సరం సందర్భంగా జరిగిన కాల్పుల్లో 10 మంది మరణించారు. ఆసియాకు చెందిన ప్రజలు ఎక్కువగా ఉండే ప్రాంతం ఇది. ఇక స్టాక్‌టన్ విషయానికి వస్తే ఇటీవల కాలంలో హఠాత్తుగా హోమిసైడ్స్ సంఖ్య పెరిగింది.

13 అట్లాంటా, జార్జియా | Atlanta, Georgia

క్రైమ్ రేట్ : లక్షకు 723 క్రైమ్స్

కారణాలు :  ఆర్థిక అసమానతలు చాలా ఎక్కువ. దీంతో కొన్ని ప్రాంతాల్లో నేరాల సంఖ్య బాగా ఎక్కువగా ఉంటంది. తక్కువ టైమ్‌లో ఎక్కువ డబ్బు సంపాదించేందుకు అడ్డదార్లు తొక్కేవారు ఉంటారు. బేరం కుదరకపోయినా, మాట చెడినా, చిరాకు వేసినా జేబులోంచి గన్ను తీసి పాయింట్ బ్లాంక్‌లో కాలుస్తుంటారు.

14. న్యూ ఒర్లియాన్స్, లూజియానా | New Orleans, Louisiana

క్రైమ్ రేట్ : లక్షకు 320.7 క్రైమ్స్

కారణాలు ( Dangerous Cities In USA ) : ఇతర రాష్ట్రాలతో పోల్చితే నేరాల సంఖ్య తక్కువగా అనిపించవచ్చు మీకు. కానీ నేరాలు అనేవి నెంబర్ మాత్రమే కాదు. ఒక్క బుల్లెట్టు ఒక్కరినే కాల్చవచ్చు. కానీ అది వేలాది మందిని భయపెట్టగలదు. ఇక్కడ సామాజిక , ఆర్థిక అసమానతలు, డ్రగ్స్‌కు సంబంధించిన వ్యవహారాల వల్ల నేరాలు చాలా ఎక్కువయ్యాయి.

15. ఫోర్త్ వర్త్, టెక్సాస్ | Fort Worth, Texas 

ఇక్కడ జనసంచారం రోజురోజకూ పెరుగుతోంది. దీంతో పాటు నేరాల సంఖ్య కూడా పెరుగుతోంది.

16. జాక్సన్ విల్లే, ఫ్లోరిడా | Jacksonville, Florida

అమెరికాలో నగరంతో పాటు నేరాలు కూడా పెరుగుతాయి అనడానికి జాక్సన్ విల్లేనే ఉదాహరణ.

17. టాంపా బే ఏరియా |Tampa Bay Area (including St. Petersburg)

దారిదోపిడులు, తుపాకి చూపించి బెదిరించడం, డ్రగ్స్, ఆర్థిక నేరాలు చాలా ఎక్కువ ఇక్కడ.

18. ఒర్లాండలో, ఫ్లోరిడా | Orlando, Florida

18 Dangerous Cities in USA 2025 -2
| Source: Google

డిజ్జీ వరల్డ్ ఉన్న ( Walt Disney World ) ఫ్లోరిడాకు చాలా మంది టూరిస్టులు వస్తుంటారు. మీరీ ముఖ్యంగా ఒర్లాండో కూడా సందర్శిస్తుంటారు.అయితే ఇక్కడ ఆర్థిక నేరాలు, ప్రాపర్టికి సంబంధించిన నేరాలు ఎక్కువగా జరుగుతుంటాయి.

అమెరికాలో సేఫ్‌గా ఉండాలి అంటే..| How to Stay Safe In USA ?

  1. అమెరికాలోని ( Crime In America ) చాలా నగరాల్లో ఆర్థిక అసమానతలు, సమస్యలు ఉన్నాయి. దీంతో నేరాల సంఖ్య కూడా ఎక్కువే.
  2. కొన్ని ప్రాంతాల్లో ప్రదేశాల్లో జేబులోంచి పెన్ను తీసినంత సులభంగా గన్ను తీస్తుంటారు.
  3. నేరాలు ఎక్కువగా జరుగుతున్న ప్రదేశాల్లో కొన్ని కమ్యూనిటీస్ వాటి సంఖ్యను తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నాయి.
  4. ఈ ప్రదేశాలకు వెళ్లే ముందు ( Dangerous Cities In USA ) అక్కడి పరిస్థితుల గురించి తెలుసుకోండి. స్థానిక తెలుగు సంఘాలతో ( Telugu Associations in USA ) మాట్లాడి సలహాలు సూచనలు తీసుకోండి. 
  5. తెలుగు వాళ్లు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఉండేలా ప్లాన్ చేసుకోండి.
  6. తెలుగు వారికి తెగువ ఎక్కువ. కానీ మనం విదేశాల్లో కన్నుతో కాకుండా గన్నుతో చూసే వాళ్ల మధ్యకు వెళ్తున్నప్పుడు తెగువ కాకుండా తెలివి చూపించాాల్సిన అవసరం ఉంది. 
  7. ప్రపంచం మొత్తంలో నేరాలు జరగుతూ ఉంటాయి. మనం కొచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే సైఫ్ లాంటి వారే తమ ఇంట్లో సేఫ్‌గా లేరు. 
  8. చివరిగా ఒక్కటి మాత్రం చెప్పాలి అనుకుంటున్నా నేరాలు ఎక్కువగా జరిగే ప్రదేశాలకు వెళ్లినప్పుడు జరభద్రం బ్రదరు.
  9.  ఈ ఇంఫర్మేషన్ ఎవరికైనా పనికొస్తుంది అనుకుంటే వారికి షేర్ చేయండి. వ్యూస్ కోసం చెప్పడం లేదు. చాలా మందికి ఉపయోగపడుతుంది అని చెబుతున్నాను.
  10. పైన వివరించిన ప్రాంతాలే కాదు అమెరికాలో గన్ కల్చర్ ఉంది కాబట్టి ఎక్కడైనా జాగ్రత్తగా ఉండాలి. అక్కడి జనంతో , పోలీసులతో ఎలా మెలగాలో స్థానికులను అడిగి తెలుసుకోండి. మనం డబ్బు సంపాదించడానికి మాత్రమే అమెరికాకు వెళ్లినప్పుడు నాలుగు రాళ్లు వెనకేసుకోవడమే మన లక్ష్యంగా ఉండాలి. గుర్తుంచుకోండి.
Prayanikudu
| Gif By : Tenor

గణాంకాలు, సమాచారానికి రిఫరెన్స్ | References :

  • https://www.areavibes.com
  • https://realestate.usnews.com
  • https://getsafeandsound.com/
ఈ  Travel కంటెంట్ నచ్చితే, ఎవరికైనా ఉపయోగపడుతుంది. అనుకుంటే షేర్ చేయగలరు. ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. యూట్యూబ్ ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి.
Prayanikudu whatsapp
| ప్రయాణికుడు ఛానెల్‌ను ఫాలో అవ్వడానికి ఇక్కడ క్లిక్ చేయండి

షేర్ చేయండి

Leave a Comment

error: Content is protected !!