కుంభ మేళాలో పవిత్ర స్నానాల ప్రాధాన్యత ఏంటి ? వాటి తేదీలేంటి ? | What Is Shahi Snan In Maha kumbh Mela 2025
హిందువులు అత్యంత పవిత్రంగా భావించే మహా కుంభమేళ త్వరలో ప్రారంభం కానుంది. యూపీ ప్రభుత్వం ఈ కుంభమేళను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని భావిస్తోంది. సుమారు 40 కోట్ల మంది భక్తులు రానున్న సందర్భంగా అన్ని ఏర్పాట్లు చేస్తోంది అక్కడి యంత్రాంగం. 2025 జనవరి 13 వ తేదీన ఉత్తర ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ప్రారంభం కానున్న మహకుంభ మేళ ( Maha Kumbh Mela 2025 ) ఫిబ్రవరి 26వ తేదీన ముగుస్తుంది. ఈ మేళలో మొత్తం 6 పవిత్ర స్నాన ఘట్టాలు ఉంటాయి.

మహా కుంభమేళ గురించి | Maha kumbh Mela 2025 Overview
మహాకుంభ మేళ అనేది ప్రపంచంలోనే అతిపెద్ద భక్తుల సంగమం. ఇంత మంది ప్రజలు ఒకే చోట చేరే మరో ఆధ్మాత్మిక వేడుక ప్రపంచంలో లేదు. 2025 జనవరి 13వ తేదీన ప్రయాగ్‌రాజ్‌లోని పౌష్ పూర్ణిమ స్నానంతో ( Paush Purnima Snan ) ఈ మేళ ప్రారంభం అవుతుంది. ఇక ఫిబ్రవరి 26న శివరాత్రి రోజులు వైభవంగా ముగుస్తుంది.
కుంభ మేళ విశిష్టత | Importance Of Kumbh Mela
కుంభ మేళ ప్రతీ 12 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. త్రివేణ ఘాట్ వద్ద గంగా, యమున, సరస్వతి నదుల సంగమాన్ని పురస్కరించుకుని ప్రతీ 12 సంవత్సరాలకు ఒకసారి ఈ కార్యక్రమం జరుగుతుంది.ఈ సమయంలో ఇక్కడ నదీ స్నానం ఆచరించడం వల్ల పాపాలు నశించి, ఆత్మకు మోక్షం లభిస్తుంది అని భక్తుల విశ్వాసం.

మహాకుంభ మేళలో ముఖ్యమైన తేదీలు | Important Days In Maha Kumbh Mela 2025
మహాకుంభ మేళకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచే కాకుండా ప్రపంచంలోని అనేేక దేశాల నుంచి భక్తులు తరలి వస్తారు. వీరి సంఖ్య 40 కోట్ల వరకు ఉంటుంది అని అంచనా వేస్తున్నారు. ఇక ముఖ్య తేదీల విషయానికి వద్దాం. ఇందులో మూడు షాహీ స్నానాలు, మరో మూడు విశిష్టమైన స్నానాలు ఉంటాయి.
- 2025 జనవరి 13 : పౌష్ పూర్ణిమ ( మేళా ప్రారంభం )
- 2025 జనవరి 14 : మకర సంక్రాంతి ( తొలి షాహీ స్నానం )
- 2025 జనవరి 29 : మౌని అమవాస్య ( రెండవ షాహీ స్నానం )
- 2025 ఫిబ్రవరి 3 : వసంత పంచమి ( మూడవ షాహీ స్నానం )
- 2025 ఫిబ్రవరి 12 : మాఘ పూర్ణిమ
- 2025 ఫిబ్రవరి 26 : మహా శివరాత్రి ( అంతిమ స్నానం )
- మహాకుంభ మేళాలో తిరుమల ఆలయం నమూనా
పవిత్ర స్నానాల ప్రాధాన్యత | Importance Of Sacred Baths in Maha Kumbh Mela 2025
పవిత్ర స్నానాల సమయంలో హిందూ ఆధ్మాత్మిక నాయకులు, సాధువులు, మత గురువులు కలిసి పవిత్ర నదిలో స్నానం ఆచరిస్తారు. ఇలా చేయడం వల్ల ఈ సంగమం పవిత్రత పెరుగుతుంది అని, ఆధ్మాత్మిక శక్తి కలుగుతుందని భావిస్తారు. వీరు స్నానం ఆచరించన తరువాత భక్తులు స్నానం చేస్తారు.
వేగంగా ఏర్పాట్లు | Preparations for Maha Kumbh Mela 2025
మహాకుంభ మేళాకు సంబంధించిన ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస యంత్రాంగం గట్టి బందోబస్తును ఏర్పాటు చేస్తోంది. రవాణా కోసం ప్రస్తుతం సంగమం వద్ద 1455 బోట్లు అందుబాటులో ఉన్నాయి. కుంభమేళ సందర్భగా ఈ సంఖ్య 4000 బోట్లకు పెరగనుంది. అయితే వీటి ధరలు కూడా 50 శాతానికి పెరగనున్నాయట.
గమనిక: ఈ వెబ్సైట్లో ప్రకటనలు కూడా ఉంటాయి. ముఖ్యంగా గూగుల్ యాడ్స్ ద్వారా ఈ ప్రకటనలు మీకు కనిపిస్తాయి. ఈ ప్రకటనలే మాకు ఆధారం. ఇందులో కొన్ని ప్రకటనలపై మీరు క్లిక్ చేస్తే మాకు ఆదాయం వస్తుంది.
Watch More Vlogs On : Prayanikudu
- Pandharpur: 7 గంటల్లో 7 ఆలయాల దర్శనం
- Hemkund Sahib Trek : హిమాలయాల్లో బ్రహ్మకమలం దర్శనం
- Kamakhya Temple: కామాఖ్య దేవీ కథ
- Tuljapur : శివాజీ నడిచిన దారిలో తుల్జా భవానీ మాత దర్శనం
- Shillong : అందగత్తెల రాజధాని షిల్లాంగ్
ఈ Travel కంటెంట్ నచ్చితే, ఎవరికైనా ఉపయోగపడుతుంది. అనుకుంటే షేర్ చేయగలరు. ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. యూట్యూబ్ ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి.
- Sabarimala Facts : 1902 లో కర్పూరం వల్ల అగ్నికి ఆహూతి అయిన శబరిమల ఆలయం… శమరిమలై ఆలయం గురించి 10 ఆసక్తికరమైన విషయాలు
- ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన గురుద్వార Hemkund Sahib ట్రావెల్ గైడ్ , 10 Tips and Facts
- హిమాలయ పర్వతాల్లో బ్రహ్మకమలం కనిపించింది..మీరు కూడా చూడండి
- Kamakhya Temple : కామాఖ్య దేవీ కథ
- షిరిడీ సమాధి మందిరానికి ముందు అక్కడ ఏముండేది ?
- Thanjavur : ఈ ఆలయం నీడ నేలపై పడదు
- Valley Of Flowers : వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ ఎలా వెళ్లాలి? ఎప్పుడు వెళ్లాలి ?
- Palani Temple : పళని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం గైడ్ ! 10 Facts
- 51 Shakti Peethas List : 51 శక్తి పీఠాలు ఎక్కడ ఉన్నాయి ? ఏ శరీర భాగం ఎక్కడ పడింది ?
- Sabarimala Facts : 1902 లో కర్పూరం వల్ల అగ్నికి ఆహూతి అయిన శబరిమల ఆలయం… శమరిమలై ఆలయం గురించి 10 ఆసక్తికరమైన విషయాలు
ప్రపంచ యాత్ర గైడ్
- అంటార్కిటికా : 70 శాతం మంచినీరు ఇక్కడే ఉంది…రాత్రి సూరీడు…పగలు చీకటి
- Vatican City : 800 మంది మాత్రమే ఉండే దేశం |15 నిమిషాల్లో చుట్టేయొచ్చు
- Dangerous Countries : 2025 లో వెళ్లకూడని అత్యంత ప్రమాదకరమైన 10 దేశాలు
- Milaf Cola : ఖర్జూరంతో సాఫ్ట్ డ్రింక్ లాంచ్ చేసిన సౌదీ అరేబియా
- Egypt Travel Guide: ఈజిప్ట్..ఇక్కడ డబ్బు కట్టి సమాధులను చూస్తారు.. 15 Facts
- ప్రపంచ యుద్ధం వస్తే ఈ 10 దేశాలు చాలా సేఫ్
- Thailand 2024 : థాయ్‌లాండ్ ఎలా వెళ్లాలి ? ఏం చూడాలి ?
- Azerbaijan అజర్ బైజాన్ ఎలా వెళ్లాలి ? ఏం చూడాలి ? 10 టిప్స్!
- UAE: యూఏఈలో తప్పకుండా చూాడాల్సిన 10 ప్రదేశాలు
- సౌదీ అరేబియాకి ఎవరైనా వెళ్లవచ్చా ? వెళ్తే ఏం చూడవచ్చు?
- Indian License : భారతీయ లైసెన్స్ ఈ 15 దేశాల్లో కూడా చెల్లుతుంది
- Oymyakon : ప్రపంచంలోనే అత్యంత చల్లని గ్రామం