Manali : మనాలి ఎలా ప్లాన్ చేసుకోవాలి ? ఎక్కడ ఉండాలి ఏం చూడాలి ? 10 టిప్స్ !
…డిసెంబర్ నుంచి మార్చి వరకు మీరు ఫుల్ వార్మర్, థర్మల్ వేర్ జాకెట్స్ వులెన్ క్యాప్స్ తీసుకెళ్లండి. మిగితా నెలల్లో జాకెట్స్ సరిపోతాయి.
ఇక్కడ స్నోలో అడ్వెంచర్ చేయాలి అనుకుంటే మాత్రం మీరు స్నో డ్రెస్ తప్పుకుండా తీసుకోండి. మనాలిలో అడుగడుగున వీటిని 250 పర్డే రెంటుకు ఇస్తారు. ఇందులో స్నో షూస్ కూడా ఇంక్లూడెడ్ ఉంటాయి.
6. సోలాంగ్ వ్యాలీ | SOLANG VALLEY
SOLANG VALLEY, Kullu District, Himachal Pradesh: మనాలి నుంచి 13 కిమీ దూరంలో సొలాంగ్ వాలీ ఉంది. ఇక్కడికి వెళ్లే దారులు చాలా బాగుంటాయి. మార్చి నుంచి జులై వరకు ఇక్కడ స్నో ఉంటుంది. చుట్టూ అందమైన కొండలు, సాహసయాత్రికులకు ఎన్నో యాక్టివిటీస్ ఉండటం వల్ల చాలా మంది మనాలి వచ్చేందుకు ఇష్టపడతారు.
ఇక్కడ మీరు ఎన్నో రకాల యాక్టివీటస్ చేయవచ్చు. ప్యారాగ్లైడింగ్, జార్బింగ్, స్కీయింగ్, రోప్ వే, స్నో మొబైలింగ్, క్వాడ్ బైకింగ్ చేయొచ్చు. కావాలంటే జడలబర్రెపై ఎక్కి రైడ్ చేయొచ్చు.రైల్వే క్రాసింగ్ వచ్చినప్పుడు ఇలాంటి లొకేషన్స్‌కి వచ్చినప్పుడు కాస్త ఆగి చూసి వెళ్లండి.
7.అటల్ టన్నెల్ | ATAL TUNNEL
Atal Tunnel, Rohtang , Himachal Pradesh : గ్రేట్ హిమాలయల్లోని పిర్ పంజాల్ శ్రేణిలో ఉన్న అద్భుతమైన సొరంగ మార్గమే అటల్ టన్నెల్. 10 వేల అడుగుల ఎత్తులో ఉన్న ఈ టన్నెల్ మనాలి, లేహ్ లద్దాక్, స్పితీ వ్యాలిని కలుపుతుంది.

అటల్ టన్నెల్‌ను రోహ్తాంగ్ టన్నెల్ అని కూడా అంటారు. రోహ్తాంగ్ అనే పదానికి పార్సీలో గుట్ట అని అర్థం.
10 కిమీ పొడవైన ఈ టన్నెల్ రావడంతో ఇక్కడి వాళ్ల జీవితాలు శాశ్వతంగా మారిపోయాయి. ఎందుకంటే చలి కాలం వస్తే మనాలి నుంచి లేహ్ వెళ్లే దారి 6 నెలల పాటు మూసుకుపోయేది.
కానీ ఆ టన్నెల్ వచ్చాక ఈ దూరం 46 కిమీ తగ్గడంతో పాటు ఏడాది మొత్తం లేహ్ మనాలి మధ్య ప్రయాణాలు సాధ్యం అయ్యింది.
దీనిని నిర్మించే ఆలోచన మొట్టమొదటిసారిగా 1860 లో వచ్చిందట. తరువాత అటల్ బిహారీ వాజ్‌పేయ్ గారు ప్రధాని అయ్యాక 2000 సంవత్సరంలో రోహ్తాంగ్ టన్నెల్ కట్టనున్నాము అని ప్రకటించారు.
Read Also : వంజంగి ఎలా వెళ్లాలి ? ఎలా సిద్ధం అవ్వాలి ? 10 టిప్స్ !
2010 లో రోహ్తాంగ్ టన్నెల్ నిర్మాణం ప్రారంభం కాగా… 2020 లో ప్రధాని మోదీ జాతికి అంకితం చేశారు.
మీకో విషయం తెలుసా…ఈ టన్నెల్ కింద ఇంకో టన్నెల్ ఉంది. అది కేవలం ఎమర్జెన్సీ సమయాల్లో వాడేందుకు మాత్రమే.
ప్రతీ రోజు మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల మధ్యలో మెయింటెనెన్స్ కోసం టన్నెల్‌ను మూసేస్తారు.
8.సిసు | SISSU
SISSU Valley, Lahaul District, Himachal Pradesh : అటల్ టన్నెల్ దాటగానే లాహోల్ జిల్లాలోని సిసు అనే వ్యాలీ వస్తుంది. ఇక్కడ చంద్రా రివర్ పక్కనే స్నోలో కాసేపు ఎంజాయ్ చేయొచ్చు.

ఇక్కడ హోటల్స్, వాష్‌రూమ్స్, ఏటీఎమ్‌లు ఏమీ ఉండవు. సో ఇది గమనించి వెళ్లండి.
సిసు నుంచి మీరు ముందుకు వెళ్తే కాజా ( Kaza) , కీలాంగ్ ( KeyLong Valley ), స్పితీ వ్యాలీ ( Spiti ), జిబి ( Jibi ), లే లధాక్ ( Leh Laddakh) కూడా వెళ్లొచ్చు.
9.మనాలిలో తప్పకుండా చూాడాల్సిన ప్రదేశాలు
హిడింబా ఆలయం | Hidimba Devi Temple temple
ఈ ఆలయాన్ని దుంగారి టెంపుల్ అని కూడా అంటారు . భీముడి సతీమణి హిడింబాకు అంకితం చేసిన మందిరం ఇది.

నేను వెళ్లాలి అనుకున్న రోజు అక్కడ ఏదో ప్రత్యేక పూజలు జరుగుతన్నాయి అని టూరిస్టులను వెళ్లనివ్వలేదు.
Read Also: Telugu Women Travel Vloggers : ట్రావెల్ వ్లాగింగ్‌లో వీర వనితలు
వశిష్ట్ ఆలయం | Vashisht Temple and Hot Water Springs
వశిష్ట మహర్షి తపస్సు చేసిన ఈ ప్రాంతంలో నిర్మించిన ఆలయం ఇది. వశిష్ట మహర్షి కోసం లక్ష్మణుడు తన బాణాలతో వేడి నీటి ఊట అంటే Hot Water Springs ఏర్పాటు చేశారట.
జోగినీ ఫాల్స్ | Jogini Falls
అడ్వెంచర్స్ అంటే ఇష్టపడేవారు ఎక్కువగా ఇష్టపడే ప్రదేశం జోగినీ ఫాల్స్. మార్చ్ నుంచి డిసెంబర్ లోపు ఎక్కువ మంది వెళ్తుంటారు.
మనాలీ మాల్ రోడ్ | Manali Mall Road
మనాలి మాల్ రోడ్డులో మీకు నచ్చింది మీరు కొనొచ్చు. నచ్చింది తినొచ్చు. చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకున్న సరుకును ఇక్కడ ఎక్కువగా అమ్ముతుంటారు.
వైష్ణోదేవీ ఆలయం , కులు | Vaishno Devi Temple, Kullu
మనాలి నుంచి కులు వెళ్లే దారిలో వైష్ణో దేవీ అమ్మవారి ఆలయం ఉంటుంది.
ఆలయ ప్రాంగణంలోకి వెళ్లగానే అమ్మవారి కరుణ మనపై కలిగి ఫీలింగ్ కలుగుతుంది. ఆలయం లోపల ఫోటోగ్రఫీకి అనుమతి లేదు.
ఇక్కడి నుంచి చూస్తే బియాస్ నదీ అందం ఏంటో అర్థం అవుతుంది.
వీటితో పాటు మనాలిలో చూడాల్సిన ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా
- .మను ఆలయం ( Manu Temple )
- గౌరీ శంకర్ ఆలయం ( Gauri Shankar Temple),
- బిజ్లీ మహాదేవ్ ఆలయం (Bijli Mahadev Temple)
- అలాగే మాల్ రోడ్లో ఉండే ది గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్క్ ( The Great Himalayan National Park )
- హిమాచల్ కల్చర్ అండ్ ఫోక్ ఆర్ట్ మ్యూజియం ( Himachal Culture and Folk Art )
ఇంకా ఏమైనా మిస్సయి ఉంటే కామెంట్ చేయండి.
10.మనాలికి వచ్చే ముందు గుర్తుంచుకోండి
TIPS For Manali :
- ఇక్కడ టెంపరేచర్ చాలా చల్లాగా ఉంటుంది. సెప్టెంబర్ నుంచి ఫిబ్రవరి మధ్యలో వస్తే గట్టి బందోబస్తుతో రండి. స్వెటర్స్, జాకెట్స్, చలి క్యాప్స్, గ్లవ్స్, బూటట్స్, మఫ్లర్ తప్పకుండా తెచ్చుకోండి. ఏదైనా మిస్ అయితే అక్కడే కొనుక్కోవచ్చు.
- .స్నోలో , లేదా మంచు ఉన్న ప్రాంతాల్లో వెళ్లడానికి ముందు గమ్ బూట్స్ వేసుకోండి. లోకల్‌గా అమ్ముతారు. లేదా రెంటుకు తీసుకోవచ్చ.
- .చలికాలంలో హోటల్ రూమ్స్ ధర ఆకాశాన్ని తాకుతాయి. సో మీరు కొంచెం ఔట్స్స్కర్ట్స్లో హోటల్స్ లేదా హోం స్టేస్‌లో దిగితే బెస్ట్.
- .ఎమర్జెన్సీలో వాడటానికి మీతో మెడికల్ కిట్ క్యారీ చేయండి.యాంటిబయాటిక్స్, జబ్బు, దగ్గు, యాంటిసెప్టిక్స్, జండూబామ్ లాంటివి క్యారీ చేయండి.
- వీలైతే సొంతం డ్రైవింగ్ చేయకుండా ట్యాక్సీలు మాట్లాడుకోండి.రాత్రిపూట ప్రయాణాలు పెట్టుకోకండి.
నేను ఎన్నో హిల్ స్టేషన్స్‌కు వెళ్లాను…కానీ మనాలీ విషయంలో పర్యటకులకు ఉన్న క్రేజ్ చాలా ఎక్కువ అని గమనించాను. చాలా మంది వింటర్లో ఖచ్చితంగా మనాలీ వెళ్లేలా ప్లాన్ చేస్తుంటారు. అందుకే అక్కడ వింటర్లో టూమచ్ ట్రాఫిక్ ఉంటుంది. ఏదో జాతరలా అనిపిస్తుంది నాకు అందుకే పీక్ సీజన్లో వెళ్లే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి.
మనాలీపై ఒక వీడియోను చేశాను. మీరు కూడా చూడండి : మనాలీ కంప్లీట్ ట్రావెల్ గైడ్
ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. యూట్యూబ్ ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి.