నార్త్ ఈస్ట్‌లో అందమైన స్టేట్ మేఘాలయ. ఈ స్టేట్ క్యాపిటల్ షిల్లాంగ్ చాలా సింపుల్ అండ్ జనాలు చాలా మోడ్రన్‌గా ఉంటారు. వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ బ్లాగ్‌లో మీకు నార్త్ ఈస్ట్ టూర్ ఎలా ప్లాన్ చేయాలి ? షిల్లాంగ్‌లో ( shillong ) ఫస్ట్ డే నేను ఏం చూశానో మీకు వివరించబోతున్నాను. దాంతో పాటు ప్రపంచంలోనే ఘాటైన మిర్చీని మీకు పరిచయం చేయబోతున్నాను.
ముఖ్యాంశాలు
నార్త్ ఈస్ట్ స్టేట్స్‌కు ( North East India ) వెళ్లే పర్యటకుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. సెవెన్ సిస్టర్స్ అండ్ వన్ బ్రదర్ స్టేట్స్‌లో ( Seven Sisters and One Brother States ) మీరు ఎక్కడికి వెళ్లినా మీరు సరికొత్త ప్రపంచంలోకి ప్రవేశించిన అనుభూతి కలుగుతుంది.
ఇప్పటికీ చాలా మంది అన్వేషించని ప్రాంతాలు నార్త్ ఈస్ట్‌లో ( North East India Tourism ) చాలా ఉన్నాయి. అయితే కొత్త ప్రదేశాల అన్వేషణ మొదలు పెట్టడానికి ముందు నేను ఇప్పటికే చాలా మంది ఇష్టపడుతున్న షిల్లాంగ్‌కు వెళ్లాను. ఎందుకంటే ఆరంభం అదిరిపోవాలి కదా.
షిల్లాంగ్ ఎక్కడ ఉంది ? | Where Is Shillong
షిల్లాంగ్ అనేది మేఘాలయ రాష్ట్రంలో ఉంది. మేఘాలయ అనేది భారతదేశంలో ఈశాన్యంలో ఉంది. ఈశాన్య రాష్ట్రాలను సెవెన్ సిస్టర్స్ ( Seven Sister ) అని కూడా పిలుస్తుంటారు. మరిన్ని వివరాల కోసం స్క్రోల్ చేయండి.
షిల్లాంగ్ ఎలా వెళ్లాలి ? | How To Plan Shillong Trip
నేను మేఘాలయ క్యాపిటల్ షిల్లాంగ్ వెళ్లడానికన్నా ముందు నేను అరుణాచల్ ప్రదేశ్ ( Arunachal Pradesh ) వెళ్లాను. ఆ ప్రయాణ వివరాలు కూడా మీతో షేర్ చేస్తాను. అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ ( Tawang ) నుంచి ముందు అస్సాంలోని గౌహతీకి బస్సులో వెళ్లాను. గౌహతీ బస్సు దిగి వెంటనే షిల్లాంగ్‌కు ప్రైవేటు బస్సులో బయల్దేరాను.
ఒకవేళ మీరు షిల్లాంగ్ లేదా మేఘాలయలోని ఇతర ట్రావెల్ డెస్టినేషన్స్‌కు వెళ్లాలి అనుకుంటే మీరు ముందు గౌహతికి ( Guwahati ) వెళ్తే బెటర్. అక్కడి నుంచి మీరు ట్యాక్సీ లేదా బస్సులో
మేఘాలయకు చేరుకోవచ్చు. గౌహతి నుంచి ఫ్లైట్స్ కూడా ఉంటాయన్నారు. ఒకసారి చెక్ చేసుకోండి.
ఒక వేళ మీరు హైదరాబాద్ లేదా విజయవాడ నుంచి రావాలి ( Hyderabad To Guwahati ) అనుకుంటే మీరు ట్రైన్ లేదా ఫ్లైట్‌లో ముందు అస్సాం రాజధాని గౌహతీకి రావాల్సి ఉంటుంది. గౌహతీకి డైరక్ట్ రావచ్చు లేదా వెస్ట్ బెంగాల్ క్యాపిటల్ కోల్‌కతా చూసి అక్కడి నుంచి గౌహతీకి ట్రైన్ లేదా ఫ్లైట్‌లో స్టార్ట్ అవ్వొచ్చు.
కానీ నా సలహా ఏంటంటే హైదరాబాద్ నుంచి విమానంలో వస్తేనే బెటర్. చాలా టైమ్ సేవ్ అవుతుంది.
నేను చెప్పిన దాంట్లో ఏదైనా ఇది ఉంటే మీరు అది చేయండి. అంటే ఏదైనా కరెక్షన్ ఉంటే కామెంట్ చేయండి అని అర్థం. లేదా ఇంకేదైనా మంచి ప్లాన్ ఉంటే కైండ్లీ సజెస్ట్. ఒక్కసారి గౌహతీ వచ్చాక అక్కడి నుంచి మీకు నెంబర్ ఆఫ్ బస్సులు ఉంటాయి మేఘాలయకు ( Guwahati To Meghalaya).
Meghalaya Tip : వర్షాలు ఎక్కువగా పడే స్టేట్ కాబట్టి ఇంట్లో రెయిన్ కోర్ట్ ఉంటే ప్యాక్ చేసుకోవడం బెటర్.
Read Also: Thailand 2024 : థాయ్‌లాండ్ ఎలా వెళ్లాలి ? ఏం చూడాలి ?
షిల్లాంగ్‌లో ఎక్కడ ఉండాలి?
Staying In Shillong : షిల్లాంగ్‌లో నేను ఫస్ట్ గమనించిన విషయం అందరూ చాలా ట్రెండీగా స్టైలిష్‌గా ఉంటారు. గాళ్స్ ఆర్ వెరీ బ్యూటిఫుల్. గుండెలో నాలుగు గదులు సరిపోవు. గది విషయం వచ్చింది కాబట్టి చెబుతున్నా ఇక్కడ రూమ్స్ బాగా కాస్ట్‌లీ. మేము ఒక సస్తా ( చవక ) రూమ్‌లో దిగాను.
తరువాత ఒక బ్యాక్ ప్యాకర్స్‌కు షిఫ్ట్ అయ్యాను. షిఫ్ట్ అవ్వడానికి ముందు పోలిస్ బజార్ ( Police Bazar Market ) మార్కెట్ ఏరియా మొత్తం తిరిగి చూశాను. అక్కడి వాళ్ల ఫుడ్ హ్యాబిట్స్ భిన్నంగా ఉన్నాయి.
మన దగ్గర దోశ బండి ఉంటుంది కదా. ఇక్కడ అడుగడుగునా చౌమీన్ అంటే నూడిల్స్ స్టాల్స్ ( Meghalaya Chow Mein ) కనిపిస్తాయి.
ప్లేట్ రూ.50 మాత్రమే కానీ టేస్టీగా ఉంటుంది. ఇందులో షెజ్వాన్ సాస్ కలపడంతో ప్రతీ చోట ఒకటే ఫ్లేవర్ కనిపిస్తుంది.
ఎవరి గోల వారిదే
షిల్లాంగ్‌లో చాలా మంది విజిట్ చేస్తే ప్రాంతం పోలిస్ బజార్. ఇక్కడ అన్ని రకాలు వస్తువులు, దుస్తువులు, యాక్సెసరీస్, ఎలక్ట్రానిక్ పరికరాలు, క్యాప్స్ వంటివి తక్కువ రేటుకే మంచి వెరైటీలు దొరకుతాయి.
లోకల్‌గా పోలిస్ బజార్ మార్కెట్ చాలా ఫేమస్. ఆదివారం రోజు మార్కెట్‌కి వెళ్లడంతో క్రౌడ్ బాగానే ఉంది. వీళ్లలో చాలా మంది టూరిస్టులే. నార్త్ ఈస్ట్‌లో టూరిజం నుంచే వచ్చే ఆదాయమే ప్రధానం. సో టూరిస్టులకు రెస్పెక్ట్ ఇస్తారు.
ఈవినింగ్ వాక్ కోసం మరోసారి మార్కెట్ లోపలికి వెళ్లాను.ఈ రోజే వచ్చాం కాబట్టి వేరే ప్లాన్లేవీ పెట్టుకోలేదు.
చికెన్ అనుకుని
నార్త్ ఈస్ట్‌లో మరీ ముఖ్యంగా మేఘాలయలో పోర్క్ అంటే పంది మాంసం ఎక్కువ తింటారు.
ఇక్కడ చూడండి నా ఫ్రెండ్ చికెన్ అనుకుని ఆర్డర్ ఇచ్చాడు. చూస్తే అది పోర్క్ అని తెలిసింది. రిటన్ ఇచ్చేశాడు.
షిల్లాంగ్‌లో మీరు తినబోయే ఫుడ్ విషయంలో జాగ్రత్తగా ఉండండి. మీరు తినబోయే ఫుడ్‌లో మీరు తినని పదార్థాలు మిక్స్ చేస్తారేమో సరిగ్గా చెక్ చేసుకోండి.
ఇక్కడ ఫుట్‌వేర్ నాకు బాగా నచ్చింది. కానీ లగేజ్ ఎక్కువ అవుతుంది అని కొనలేదు.
దాంతో పాటు ఇక్కడ క్యాప్స్ కూడా నాకు బాగా నచ్చాయి. అయితే ఇక్కడ ఎన్నో డిజైన్లలో అందమైన శాలువలు చాలా కనిపించాయి. ఇంట్లో పెద్దవాళ్ల కోసం రెండు కొన్నాను.
Read Also : Azerbaijan అజర్ బైజాన్ ఎలా వెళ్లాలి ? ఏం చూడాలి ? 10 టిప్స్!
పోలిస్ బజార్ తరువాత ఒక ఫ్రెండ్‌ను కలవడానికి ముందుకు వెళ్తుంటే నాకు బిల్డింగ్ కనిపించింది. ఇది మేఘాలయ అసెంబ్లీ ( Meghalaya Assembly ) . దూరం నుంచి చూస్తే ఒక గెస్ట్ హౌజ్‌లా ఉంది.
మేఘాలయలో 75 శాతం మంది క్రైస్తవ మతస్తులు ఉంటారు. ఆదివారం వస్తే ఇక్కడ చౌరస్తాలో చాలా మంది మైకుల్లో ప్రేయర్ కూడా చేస్తుంటారు ఇక్కడ. ఇలాంటి ప్రదేశంలో త్రిశూలం చేబూనిన సాదువులు నాకు కనిపించారు.
షిల్లాంగ్ ఏదైనా ఆలయం ఉంటే వెళ్దాం అనుకున్నాను. కానీ కనిపించలేదు.మీకేమైనా తెలిస్తే కామెంట్ చేయండి.
లోకల్ మార్కెట్ టూర్ | Shillong Local Market
ఏ నగరానికి వెళ్లినా లేదా గ్రామానికి వెళ్లినా మీరు ఖచ్చితంగా అక్కడి లోకల్ వెజిటెబుల్ మార్కెట్ విజిట్ చేయండి. అప్పుడే మీకు వారి అలవాట్లు, రుచులు, జీవన విధానం గురించి అర్థం అవుతుంది. నేను దగ్గర్లోని ఒక మార్కెట్‌కు వెళ్లాను.
షిల్లాంగ్‌లో లోకల్‌గా ఉన్న పెద్ద మార్కెట్ ఇది. లైతుంఖ్రా ( Laitumkhra ) అనే చోట ఈ మార్కెట్ ఉంది. 70 పర్సెంట్ కూరగాయలు మనం రోజూ చూసేవే. మార్కెట్ నుంచి బయటికి వచ్చాకే కొన్ని ఇంట్రెస్టింగ్ ఐటమ్స్ కనిపించాయి.
గుంటూరు మిర్చీకా బాప్ | Ghost Pepper
దీని పేరు భూత్ జలోకియా ( Bhut Jolokia ) అంటే దెయ్యం మిరపకాయ అని అర్థం. మన గుంటూరు కారం ( Guntur Mirchi ) కన్నా 400 రెట్లు ఘాటు ఎక్కువగా ఉంటుంది. చాలా కేర్‌ఫుల్‌గా హ్యాండిల్ చేయాలి.
నార్త్ ఈస్ట్‌లో వీటిని ఎక్కువగా వాడతారు. ప్రపంచంలో అత్యంత ఘాటైన మిరపకాయల్లో ఘోస్ట్ చిల్లీ ( Ghost Pepper ) సెకండ్ ర్యాంక్ అంటే మీరు అర్థం చేసుకోవచ్చు.
ఈ భూత్ జలోకియాను డైరెక్టుగా తింటే స్వెల్లింగ్, వామిటింగ్, తీవ్రమైన కడుపునొప్పితో పాటు తేడా కొడితే వికెట్టు పడిపోయే అవకాశం ఉంది. అక్కడి వాళ్లు గుండెను పదిలంగా ఉంచుకోవడానికి, బరువు తగ్గడానికి దీన్ని ఎక్కువగా వినియోగిస్తారు.
సైనస్, ఫ్లూను కూడా తగ్గిస్తుందట. ఇలాంటి ఎన్నో లాభాలు ఉండటటం వల్ల దీనికి ప్రపంచ వ్యాప్తంగా డిమాంగ్ ఎక్కువగా ఉంది.
Read Also : Ravana Lanka : రావణుడి లంక ఎక్కడ ఉంది ? ఎలా వెళ్లాలి ? 5 ఆసక్తికరమైన విషయాలు
నా ఫ్రెండ్ కోసం నేను కొన్ని ఘోస్ట్ చిల్లీస్ తీసుకున్నాను. కానీ అవి దారి మధ్యలోనే నలిగిపోయాయి. సో మీరు ఘోస్ట్ చిల్లీని తీసుకెళ్లడం కన్నా…దాంతో తయారు చేసిన చట్నీ ( Bhut Jolokia Pickle ) లాంటి ఆహార పదార్థాలు తీసుకెళ్లడం బెటర్.
కానీ చాలా చాలా చాలా తక్కువ మోతాదులో తినాలి. తినేముందు అవసరమా అని ఒకటికి రెండు సార్లు ఆలోచించండి. చూడండి అణుబాంబును అంగట్లో అమ్మినట్టు ఘోస్ట్ చిల్లీని ఎలా బుట్టలో పెట్టి అమ్ముతున్నారో.
ఇక్కడ ఘోస్ట్ చిల్లీ ఒక్క పీసు రూ.5 చొప్పున అమ్ముతారు. మీకు ఒకటి రెండు సరిపోతాయి. ఎందుకంటే వాటి కారం ఘాటు మామూలుగా ఉండదు. ఎక్కవ తీసుకుని ఏం చేయాలో తెలిస్తే మీరు ఎన్నైనా తీసుకొవచ్చు.
ఎన్ని రకాల నూడిల్సో…| Types Of Noodles in Shillong
నేను నార్త్ ఈస్ట్‌లో ఉన్నప్పుడు నూడిల్స్ మీ జీవితంలో భాగం అవుతుంది. ఇక్కడ నూడిల్స్‌ను చౌమీన్ అని కూడా పిలుస్తారు. అయితే చాలా మంది టూరిస్టులు ఇక్కడికి వచ్చినప్పుడు లోకల్ స్టోర్‌లో ఉన్న ఇంస్టాంట్ నూడిల్స్ కలెక్షన్ చూసి ఆశ్చర్యపోతారు.
అయితే రెడీమేడ్ నూడిల్స్ విషయానికి వస్తే నార్త్ ఈస్టులో చూసినన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నూడిల్స్ నేను ఎక్కడా చూడలేదు. ఇక్కడ మయన్మార్, కొరియా, నేపాల్, చైనా, మలేషియా, థాయ్ లాండ్, వియత్నాం ఇలా పలు దేశాల నుంచి దిగుమతి చేసుకున్న నూడిల్స్ కనిపిస్తాయి.
అయితే మనకు నూడిల్స్ గురించి వీళ్లకు తెలిసినంతగా తెలియదు కాబట్టి. ఇందులో ఏది కొనాలి అనుకున్నా ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సి వస్తుంది. మనకు తెలియని దాని గురించి తెలుసుని తినే ప్రయత్నం చేయడం బెటర్.
మేఘాలకు ఆలయం | Meghalaya Overview
ఇక్కడి లైఫ్ స్టైల్‌ను అబ్జర్వ్ చేశాను. ఉన్నదాంట్లో సంతోషంగా ఉంటారు. వర్షంలో తడిచే నేలపై నడవడం తెలిసిన వాడికి జీవితంలో కష్టాలను ఎదుర్కోవడం అంత పెద్ద విషయం కాదు. ఈ విషయం మేఘాలయ ప్రజలకు బాగా వర్తిస్తుంది. ఎందుకంటే ఇక్కడ వర్షం ఎప్పుడు పడుతుందో తెలియదు. అది ఎప్పుడ ఆగుతుందో తెలియదు. అందుకే కదా ఈ రాష్ట్రాన్ని మేఘాలకు ఆలయం మేఘాలయం అని పిలుస్తారు.
ఈ కంటెంట్ నచ్చితే, ఎవరికైనా ఉపయోగపడుతంది అనుకుంటే షేర్ చేయగలరు. ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. యూట్యూబ్ ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి.