హైదరాబాద్ ఎగ్జిబిషన్‌కు సంబంధించిన ఒక రీల్ వైరల్ అవుతోంది. ఫ్యామిలీతో షాపింగ్‌కు వెళ్తే భర్తల పాత్ర ( Men At Numaish ) ఏంటో చెప్పకునే చెబుతోంది అంటూ నెటిజెన్లు కామెంట్ చేస్తున్నారు.
ముఖ్యాంశాలు
నొప్పింపక తానొవ్వక తప్పించుకుని తిరుగువాడు ధన్యుడు సుమతి అని చిన్నప్పుడు చదివాం. హైదరాబాద్ నుమాయిష్‌కు వెళ్తే ఇదే పద్యాన్ని కొంచెం మోడిఫై చేసి నొప్పింపక తానొవ్వక సైలెంట్‌గా బ్యాగులు మోసేవాడు పురుషుడు ( Men At Numaish ) సుమతి అని కూడా చదవొచ్చు .
నాంపల్లి ఎగ్జిబిషన్ | Nampally Exhibition
48వ ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ 2025 జనవరి 3వ తేదీ నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే . దీనిని నుమాయిష్ అని కూడా పిలుస్తారు. హైదరాబాదీ ప్రజలకు ఫేవరిట్ ఈవెంట్ అయిన ఈ ప్రదర్శనకు ఫ్యామిలీతో కలిసి చాలా మంది వెళ్తుంటారు. మహిళలు షాపింగ్ చేయడానికి, యూత్ ఫుడ్ ఎంజాయ్ చేయడం కోసం , పిల్లలు బొమ్మలు కొని, గేమ్స్ ఎంజాయ్ చేయడం కోసం నుమాయిష్ వెళ్తుంటారు. మరి పురుషులు ?
మరి పురుషులు ? | Why Men Goes to Numaish ?
నుమాయిష్ అనేది షాపింగ్ చేసే వాళ్లకు మాత్రమే కాదు సోషల్ మీడియాలో కంటెంట్ క్రియేట్ చేసే వాళ్లకు కూడా అడ్డాగా మారింది. మరీ ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్‌లో నుమాయిష్‌పై రకరకాలు రీల్స్ పబ్లిష్ చేస్తున్నారు. కొంత మంది లైవ్స్ ఇస్తున్నారు. అయితే ఇందులో గత కొన్నేళ్లుగా “మెన్ ఎట్ నుమాయిష్ ” ( Men At Numaish ) అనే హ్యాష్ ట్యాగ్స్‌తో వచ్చే రీల్స్ ట్రెండ్ అవుతున్నాయి. అంటే నుమాయిష్‌లో మగావాళ్లు అని అర్థం వస్తుంది.
మెన్ ఎట్ నుమాయిష్ అంటే | Men At Numaish
నుమాయిష్‌లో పిల్లలు బొమ్మలు కొంటారు, గేమ్స్ ఆడతారు, మహిళలు షాపింగ్ చేస్తారు అని తెలిసిందే…మరి పురుషులు ? బ్యాగులు మోస్తారు, చిన్నపిల్లల్ని ఎత్తుకుంటారు , అందరూ కలిసి ఉండేలా చూసుకుంటారు. సో ప్రతీ ఏడాది ఇలా ఎగ్జిబిషన్‌లో బ్యాగులను, పిల్లలను ఎత్తుకునే వీడియోలు, ఫొటోలను మెన్ ఎట్ నుమాయిష్ అనే ట్యాగ్స్‌తో షేర్ చేస్తుంటారు. ఈ సారి కూడా అలాంటి ఒక వీడియో ఇన్‌స్టాలో రీల్‌గా పోస్ట్ చేయగా…దానికి ఒక్క రోజులోనే 1.5 మిలియన్ వ్యూస్, 74,000 లైక్స్ వచ్చాయి. 2023 లో ఇలాంటి ఒక వీడియోనే బాగా వైరల్ అయింది. ఈసారి కూడా ఈ రీల్ హిట్ అయింది.
ఈ చిన్న రీల్‌లో ఒక పురుషుడు తన కుటుంబంతో బయటికి వస్తే ఎలాంటి బాధ్యతలు నిర్వహిస్తాడో చూపించే ప్రయత్నం చేశారు. చుట్టూ జిగేలుమనే స్టాల్స్, నోరూరించే ఫుడ్ ఉన్నా పురుషుడు మాత్రం బ్యాగులు మోయడం, పిల్లల్ని ఎత్తుకోవడంలో బిజీగా ఉంటాడు అని రీల్ చూపిస్తోంది. మీరు కూడా చూడండి.
నెటిజెన్ల రియాక్షన్
ఏదో సరదాగా షేర్ చేసిన ఈ వీడియోకు నెటిజెన్లు కూడా అంతే సరదాగా కామెంట్ చేస్తున్నారు.దీనిపై ఒక మహిళ ” నేను కూడా త్వరగా పెళ్లి చేసుకుని నా షాపింగ్ బ్యాగును నా భర్తకు ఇచ్చేస్తాను ” అని కామెంట్ చేసింది.
- “బ్యాగులు మోయడమే కాదు బిల్లులు కూడా కడతారు “
- ” అరే ఒకసారి వాళ్లను చూడండి. పురుషులు ఎంత సింపులో “
- ” మెన్ ఇన్ లవ్ అని వీళ్లనే అంటారు “
ఇలా కొంత మంది కామెంట్ చేయగా మరో యూజర్ మాత్రం…పురుషుడు బ్యాగులు కూడా మోయలేడా ఏంటి ? అందులో అంత బాధపెట్టే విషయం ఏముంది అని కామెంట్ చేశాడు.
” కేవలం ఈ ఎగ్జిబిషన్‌లో మాత్రమే కాదు ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా పురుషులు ఇలా సైలెంట్‌గా మోతబరువు మోస్తుంటారు. ఎందుకంటే తాము ఇష్టపడేవారిని ఇబ్బంది పెట్టడం వారికి నచ్చదు ” అని కామెంట్ చేశాడు మరో వ్యక్తి.
ఈ వీడియోను ( Viral Travel Videos ) ఫన్నీ యాంగిల్లో చూస్తే నవ్వొస్తుంది. కానీ కొంచెం లోతుగా ఆలోచిస్తే తమ జీవిత భాగస్వామికి అన్ని విషయాల్లో తోడుగా ఉండేందుకు భర్తలు సైలెంట్‌గా మోసే భారాన్ని గమనించవచ్చు.
ఇంతకి మీరు 2025 లో నుమాయిష్ ( Numaish 2025 ) వెళ్లారా లేదా ? పై వీడియో గురించి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి.