Manasa Devi Temple : సంతానం కలగడం లేదా.. వెంటనే విజయనగరంలో వెలిసిన ఈ అమ్మవారిని దర్శించుకోండి
Manasa Devi Temple : సంతాన సమస్యలతో బాధపడుతున్న వారికి శుభవార్త. విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం రామలింగాపురం గ్రామంలోని ఒక ఆలయం అద్భుతమైన మహిమలతో భక్తులను ఆకర్షిస్తోంది. పొలంలో స్వయంగా వెలిసిన శ్రీ శ్రీ నాగ శక్తి మానస దేవి అమ్మవారు, భక్తులకు సంతానాన్ని ప్రసాదించే దేవతగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయానికి ప్రతిరోజూ సంతానం కోసం ప్రత్యేక పూజలు చేయడానికి దంపతులు వస్తున్నారు. మానస దేవి ఆలయం ఎక్కడ ఉంది, ఈ అమ్మవారి మహిమలు ఏంటి? అనే వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
సంతానం కోసం ప్రత్యేక పూజలు
ఈ మహిమాన్వితమైన ఆలయం ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లా, చీపురుపల్లి మండలం, రామలింగాపురం గ్రామంలో ఉంది. ఇక్కడ వెలసిన శ్రీ శ్రీ నాగ శక్తి మానస దేవి అమ్మవారు సంతానాన్ని ఇచ్చే దేవతగా పేరు తెచ్చుకున్నారు. ఆలయ నిర్వాహకులు, పిన్నింటి శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ.. పిల్లలు పుట్టకపోవడానికి కారణం శరీరంలో లోపమా? కర్మ ప్రభావమా? లేదా శాపమా? అనే విషయాన్ని తెలుసుకుని, ఆ సమస్యకు తగిన పరిష్కారాలను, పూజా విధానాన్ని దంపతులకు వివరంగా చెబుతారు. సంతాన భాగ్యం లేని భక్తులు ప్రతిరోజూ ఈ ఆలయానికి వచ్చి ప్రత్యేక పూజలు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి : Vatican City : 800 మంది మాత్రమే ఉండే దేశం |15 నిమిషాల్లో చుట్టేయొచ్చు
15 జంటలకు కవలలు
మానస దేవి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకోవడం ద్వారా చాలా మందికి సంతానం కలిగిందని నిర్వాహకులు తెలిపారు. ఇప్పటివరకు, ఈ ఆలయంలో పూజలు చేసిన 15 మంది దంపతులకు కవలలు జన్మించడం విశేషం. దీంతో ఈ మానస దేవిని సంతాన దేవి అని, అలాగే దోష వ్యవస్థ శక్తి స్వరూపిణి అని కూడా పిలుస్తున్నారు. ఈ ఆలయంలో మొక్కులు చెల్లించుకునే విధానంలో కూడా ఒక ప్రత్యేకత ఉంది. భక్తులే స్వయంగా తమ దంపతుల పేర్లు, గోత్రాలతో నైవేద్యాలు తయారుచేసి, అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకుంటారు. ఇలాంటి ఆచారం ఇతర ఆలయాలలో కనిపించదని నిర్వాహకులు గర్వంగా చెబుతున్నారు.
ఇది కూడా చదవండి : Vanuatu: వనవాటు దేశం ఎక్కడుంది ? ఎలా వెళ్లాలి ? కంప్లీట్ ట్రావెల్ గైడ్
సంతానమే కాదు, ఇతర సమస్యలకు కూడా పరిష్కారం
సంతానం లేకపోవడం మాత్రమే కాదు, ఈ ఆలయంలో ఇతర సమస్యలకు కూడా పరిష్కారం లభిస్తుంది. ఆలస్యమవుతున్న వివాహాలు, వ్యాపారంలో నష్టాలు, ఇతర దోషాలు వంటివన్నీ అమ్మవారి దయతో పరిష్కారమవుతున్నాయి. అంతేకాకుండా, కొందరు మాటలు రానివారు ఆలయాన్ని సందర్శించిన తర్వాత మాట్లాడగలిగిన సంఘటనలు కూడా ఉన్నాయి. అందుకే, పిల్లల కోసం ప్రయత్నిస్తున్న వారు, జీవితంలో ఉన్న దోషాలను తొలగించుకోవాలనుకునేవారు, రామలింగాపురంలో వెలసిన మానస దేవి అమ్మవారిని దర్శించుకుని, దైవ ఆశీస్సులు పొందాలని ఆలయ నిర్వాహకులు కోరుతున్నారు.
ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.