Naa Anveshana : 4 ఏళ్ల తరువాత తల్లిదండ్రులను కలిసిన నా అన్వేషణ అన్వేష్

ప్రపంచ యాత్రికుడు ( Prapancha Yatrikudu ) అన్వేష్ నాలుగేళ్ల తరువాత తన తల్లిదండ్రులను కలిశాడు. దీనికి సంబంధించిన ఒక వీడియోను తన యూట్యూబ్ ఛానెల్‌లో పోస్టు చేశాడు అన్వేష్. అటు నాలుగేళ్ల తరువాత కొడుకును చూసిన ఆనందంలో తల్లి, తల్లిని చూసిన ఆనందంలో అన్వేష్ ఇద్దరినీ నా అన్వేషణ‌లో ( Naa Anveshana ) చూడవచ్చు.

Prayanikudu WhatsApp2
ప్రతిరోజు వాట్స్ అప్ ద్వారా ట్రావెల్ కంటెంట్ తెలుగులో పొందాలి అనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి | If You Want to Get Travel & Tourism Updates On Your WhatsApp Click Here

నాలుగేళ్ల తరువాత

సుమారు నాలుగేళ్ల క్రితం తన పెళ్లి ఆగిపోవడంతో అన్వేష్ చిన్ని ( Anvesh Chinni ) కుంగుబాటుకు గురయ్యాడట. అయితే అదే సమయంలో నా అన్వేషణ ఛానెల్ ( Naa Anveshana Channel ) మొదలు పెట్టాడు. అంటార్కిటికా నుంచి ఆర్కిటిక్ వరకు ఎన్నో అద్భుతమైన ప్రదేశాలు కవర్ చేశాడు. దాంతో పాటు ఎన్నో పనికి వచ్చే టిప్స్ చెబుతూ తెలుగు ప్రేక్షుకుల మనసు గెలచుకున్నాడు అన్వేష్

naa Anveshana
తల్లిదండ్రును కలిసి తరువాత అన్వేష్… | Photo Source : Naa Anveshana

తనకున్న ట్రావెలింగ్ అనుభవంతో మంచి ట్రావెల్ వ్లాగ్స్ చేసి తెలుగు ట్రావెల్ వ్లాగింగ్‌లో ( Travel Vlogging ) టాప్ స్థాయికి చేరుకున్నాడు. ప్రపంచం మొత్తం చుట్టేసే వరకు భారత దేశానికి వెళ్లను అనుకున్నాడేమో కానీ నాలుగేళ్ల నుంచి ప్రపంచంలోని వివిధ దేశాలను సందర్శించాడు. ఇంకా 120 దేశాలను కూడా చుట్టేస్తానంటున్నాడు.

ఇది కూడా చదవండి:  Telugu Women Travel Vloggers : ట్రావెల్ వ్లాగింగ్‌లో వీర వనితలు

భారత్‌లో కాకుండా థాయ్‌లాండ్ | Naa Anveshana In Thailand

అందుకేనేమో తన తల్లిదండ్రులను థాయ్‌లాండ్ ( Thailand ) కలిశాడు అన్వేష్. అతని తల్లిదండ్రులు వైజాగ్ నుంచి థాయ్‌లాండ్ వచ్చారు. అదే సమయంలో వైజాగ్ నుంచి వచ్చిన ప్రయాణికులు కూడా అన్వేష్‌ను పలకరించారు.

Naa Anveshana Met His Parents In Thailand
తల్లిదండ్రులతో అన్వేష్ | Photo Source : Naa Anveshana

అతని తల్లిదండ్రులకు మీ కొడుకు విజయం సాధించాడు అని ఒక వ్యక్తి చెప్పగా…అవునా అని అమాయకంగా అడిగాడు అన్వేష్ తండ్రి. ఈ వీడియోలో తన తండ్రి ఆరోగ్య పరిస్థితి గురించి కూాడా వివరించాడు అన్వేష్.

తరుణ్ భాస్కర్‌ కలిశాడు | Anvesh Met Tharun Bhascker

అదే సమయంలో ప్రముఖ దర్శకుడు తరుణ్ భాస్కర్ కూడా బ్యాంకాక్‌‌లో ఉండగా అన్వేష్‌‌ను కలిశాడు. తను అన్వేష్‌కు ఫ్యాన్ అన్నాడు తరుణ్ భాస్కర్. ఖతార్ నుంచి వచ్చే సమయంలో కీడా కోలా ( Keedakola ) సినిమా చూశానన్నాడు అన్వేష్.

Naa Anveshana Met Tharun Bhaskcer
తరుణ్ భాస్కర్‌తో నా అన్వేష్ | Photo Source : Naa Anveshana

కొడుకు కోసం 80 కేజీల వంటకాలు | Naa Anveshana

నాలుగేళ్ల తరువాత కొడుకును కలిసి తల్లి మనసు గురించి మీరు అర్థం చేసుకోవచ్చు. కొడుకును చూడాలి, వాడి కడుపు నింపాలి, నచ్చినవి తినిపించాలి అని ఎన్నో ఆలోచనలు. అందుకేనేమో అన్వేష్ కోసం దాదాపు  80 కేజీల పదార్ధాలను తీసుకువచ్చింది ఆమె.

Naa Anveshana Met His Parents In Thailand Airport
అమ్మతో అన్వేష్ | Photo Source : Naa Anveshana

అందులో పచ్చళ్లు, స్నాక్స్ నెయ్యి, లడ్లు వీటితో పాటు వండి పెట్టడానికి మంచి నూనె కూడా తెచ్చారంటే మీరు ఊహించవచ్చు ఒక తల్లి పడే తపన.ఈ పదార్థాలను చూసి ప్రపంచ యాత్ర చేసినా రాని జబ్బులు ఇక తనకు వచ్చేస్తాయేమో అని సరదగా అన్నాడు అన్వేష్ . ఇంకా తన అమ్మ తెచ్చిన సామాన్ల గురించి తన వీడియోలో వర్ణించాడు. .

ట్రావెల్ వ్లాగర్ అవ్వాలి అనుకుంటున్నారా ? | Want to Become Travel Vlogger ?

అన్వేష్‌లా మీరు కూడా ట్రావెల్ వ్లాగర్ అవ్వాలి ( How To Become A Travel Vlogger ) అనుకుంటున్నారా ? ఎలా మొదలు పెట్టాలో అని ఆలోచిస్తున్నారా ? ఏం కొనాలి ? ఎలా మాట్లాడాలి ? ఎలాంటి కంటెంట్ పెట్టాలి ? ఏ మైక్ కొనాలి ? షాపింగ్ ఎక్కడ చేయాలి ? అనే ప్రశ్నలకు సమాధానం కావాలి అంటే ఈ కింది పోస్టు చదవండి.

 Travel Vlogging Tips : ట్రావెల్ వ్లాగర్ అవ్వాలంటే ఏం చేయాలి ? 10 టిప్స్ !

గమనిక: ఈ వెబ్‌సైట్లో ప్రకటనలు కూడా ఉంటాయి. ముఖ్యంగా గూగుల్ యాడ్స్ ద్వారా ఈ ప్రకటనలు మీకు కనిపిస్తాయి. ఈ ప్రకటనలే మాకు ఆధారం. ఇందులో కొన్ని లింక్స్ లేదా ప్రకటనలపై మీరు క్లిక్ చేస్తే మాకు ఆదాయం వస్తుంది.

Watch More Vlogs On : Prayanikudu

ఈ  Travel కంటెంట్ నచ్చితే, ఎవరికైనా ఉపయోగపడుతుంది. అనుకుంటే షేర్ చేయగలరు. ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. యూట్యూబ్ ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి.

Leave a Comment

error: Content is protected !!