శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి ఆరు పవిత్ర క్షేత్రాలలో మహా మహిమాన్వితమైన దివ్య క్షేత్రం పళని ( Palani Temple ). వామి వారిని దండాయుధపాణి అనే నామంతో కొలుస్తారు.
సుబ్రహ్మణ్య స్వామికి ఎన్నో పేర్లున్నాయి అయితే తమిళులు ఆయన్ను “పళని మురుగా” ( Arulmigu Dhandayuthapani Swamy Temple ) అని పిలుస్తారు. పళని క్షేత్రం చాలా పురాతనమైనది. 3 వేల సంవత్సరాల చరిత్ర ఉన్న క్షేత్రం ఇది. ఇక్కడ కావడి పండుగ అత్యంత వైభవంగా జరుగుతుంది. అందులో పాల్గొన్న వారికి సంతాన ప్రాప్తి కలుగుతుందని భక్తులు నమ్ముతారు. స్వామివారికి అభిషేకం చేసి తరువాత ఇచ్చే పంచామృత ప్రసాదాన్ని అమృతంలా సేవిస్తారు భక్తులు.
ముఖ్యాంశాలు
పళని ఎలా వెళ్లాలి ? | How to Reach Palani Temple
పళని క్షేత్రం తమిళనాడులోని దిండుగల్ జిల్లాలో మదురైకు 120కి లోమీటర్లు దూరంలో ఉంది.తమిళనాడు టూర్లో భాగంగా నేను మదురై నుంచి పళని ఆలయానికి వెళ్లాను.అయితే మీరు డైరక్టుగా పళనికి వెళ్లాలి అనుకుంటే ఈ సమాచారం న్ మీకు చాలా ఉపయోగపడుతుంది.
Read Also : Ravana Lanka : రావణుడి లంక ఎక్కడ ఉంది ? ఎలా వెళ్లాలి ? 5 ఆసక్తికరమైన విషయాలు
వాయుమార్గం| Palani By Air:
హైదరాబాద్ నుండి మదురై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు చేరుకుని అక్కడ నుండి రోడ్డు, రైలు మార్గంలో ఆలయానికి చేరుకోవచ్చు.
రైలు మార్గం | Palani By Train
మీరు ట్రైన్‌లో పళనికి రావాలి ( Hyderabad To Palani ) అనుకుంటే మధురై లేదా చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ రావాల్సి ఉంటుంది. మదురై నుండి కోయబత్తూర్ ట్రైన్లు పొల్లాచి మీదుగా, పళని రైల్వేస్టేషన్ నుంచి వెళ్తాయి. చెన్నై సెంట్రల్-పళని ఎక్స్ ప్రెస్ తిరుచెందూర్ నుంచి మదురై మీదుగా పళని చేరుతుంది.రైల్వే స్టేషన్ నుండి ఆలయం రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. నేను మధురై నుంచి పళనికి బస్సులో వెళ్లాను.
Read Also: Kamakhya Temple : కామాఖ్య దేవీ కథ
బస్సులో రావాలి అనుకుంటే | Palani By Bus
కొత్త ప్రదేశాల్లో వీలైనంత వరకు పబ్లిక్ ట్రాన్స్‌పోర్టే ఫ్రిఫర్ చేస్తాను.ముఖ్యంగా డబ్బు సేవ్ అవుతుంది.దీంతో పాటు సర్కారీ బస్సుల్లో సేఫ్టీ అన్న ఫీలింగ్ కలుగుతుంది.రైల్వే స్టేషన్ నుండి ఆలయం ప్రవేశ ద్వారం వరకు ఆటో లేదా బస్సులో వెళ్లొచ్చు అన్నారు. కానీ నేను మూడో ఆప్షన్ ఎంచుకున్నాను. అదే టాంగా
గుర్రం బండి ( Palani Tanga) చార్జీలు ఎక్కువే. కానీ భవిష్యత్తులో గుర్తుచేసుకోవడానికి జ్ఞాపకాలను కలెక్ట్ చేసుకునే పనిలో ఉన్నాను. అందుకోసం కొంచెం ఇలాంటి థ్రిల్స్ నేను అస్సలు మిస్సవ్వను. మీరు కూడా పళని వస్తే ట్రై చేయండి.
పళనీలో ఎక్కడ ఉండాలి ? | Where To Stay In Palani?
ఇక స్టే విషయానికి వస్తే పళని చాలా పాపులర్ పుణ్యక్షేత్రం కాబట్టి హోటల్స్,లాడ్జిలు అండ్ గెస్ట్ హౌజ్‌లు అందుబాటులో ఉంటాయి. 650 నుంచి 5 వేల వరకు మీ బడ్జెట్‌ను బట్టి ప్లాన్ చేసుకోవచ్చు.
రోప్ ట్రైన్ | Rope Train
పళని ఆలయ ప్రాంగణంలో రోప్ ట్రైన్ దగ్గర జట్కా బండి దిగాక చెప్పులు ఫ్రీగా ఇక్కడ పెట్టేశాను.వెంటనే రోప్ ట్రైన్ టికెట్ కోసం లైన్లోకి ఎంటర్ అయ్యాను.ట్రైన్ టికెట్ 50 రూపాయలు. నాతోపాటు అన్నయ్య, సంతోష్ వచ్చారు కదా వారితో కలిపి మొత్తం 150 అయింది. టికెట్ తీసుకోవడం ఒక ఎత్తు అయితే ట్రైన్ ఎక్కడం ఒక ఎత్తు.దీని కోసం మనం వరుసగా వెయింటింగ్స్ రూమ్స్ నుంచి వెళ్లాలి. జనం ఎక్కువగా ఉంటే మన వంతు వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.
మొత్తం రెండు ట్రైన్లు ఉంటాయి. ఒకటి కిందికి వస్తుంటే మరోటి పైకి వెళ్తుంది. మన వంతు వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే మరి.
దాదాపు 40 నిమిషాల వెయింటింగ్ తరువాత మా ట్రైన్ వచ్చేసింది.ఇందులో లోకోపైలట్ ఉండడు.పళని ఎంత అందంగా ఉంటుందో చూడాలంటే రోప్ ట్రైన్ ఎక్కాల్సిందే. మీరు కూడా రోప్ ట్రైన్ ట్రై చేయండి.
కృత్తివాస శరవణ భవ | Krithivasa Saravana Bhava
ఈ సందర్భంగా మేలో వేలాది మంది భక్తులు పళనికి వస్తుంటారు. కార్తికేయ క్రిత్తివాసాశరవణ భవ వల్లిదేవసేన సహిత కుమార స్వామీ అని కీర్తిస్తూ గిరి ప్రదక్షిణలు చేస్తుంటారు. వర్షాకాలంలో పళనికి వస్తే చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. కానీ మీకో విషయం తెలుసా…ఇక్కడ ఎండా కాలంలో మండే ఎండల్లో తమిళులు అగ్నినక్షత్రం పేరుతో క్రిత్తిక కార్తెను స్వాగతిస్తూ వేడుక చేసుకుంటారు.
తమిళనాడులో అక్కడక్కడా తెలుగు భాష కనిపించడం ఆశ్యర్యంగా అనిపించింది. దీన్ని బట్టి తెలుగు రాష్ట్రాల నుంచి చాలా మంది భక్తులు ఈ ఆలయానికి వస్తుంటారు అని మీకు అర్థం అయ్యే ఉంటుంది.
Read Also: Thanjavur : ఈ ఆలయం నీడ నేలపై పడదు
పళని మురుగన్ ఆలయం టైమింగ్
Palani Murugan Temple Timings : పళని మురుగన్ ఆలయం ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు భక్తుల కోసం తెరిచే ఉంటుంది. కొన్ని ప్రత్యేక రోజుల్లో ఆలయం బ్రహ్మ ముహూర్తంలో తెరుచుకుని రాహుకాలం కన్నా ముందే మూసేస్తారు.దర్శనం ఉచితం. ఆలయ ప్రాంగణంలో ఉన్నప్పుడు ప్రశాంతంగా దేవుడిపై ఫోకస్ చేయండి. ఆలయ నిర్మాణం, చరిత్ర గురించి తెలుసుకునే ప్రయత్నం చేయండి.
పళని స్థలపురాణం | Palani Temple History
పళని క్షేత్రానికి ఒక పురాణ గాథ ఉంది. ఒకసారి నారదుడు ( Narada ) కైలాసాన్ని దర్శించి శివపార్వతులను జ్ఞాన ఫలాన్ని అందిస్తాడు. ఆ జ్ఞాన ఫలాన్ని శివపార్వతులను ఇద్దరు కుమారులలో ఎవరో ఒకరికి అందించమని చెబుతారు. అయితే ఆ జ్ఞాన ఫలాన్ని అందుకునే అర్హత ఎవరికి ఉందో తెలుసుకోవడానికి కుమారులిద్దరు ముల్లోకాలను తిరిగి రమ్మని వారు చెబుతారు.
తక్షణం కుమార స్వామి తన నెమలి వాహనం తీసుకుని ముల్లోకాల ప్రదక్షిణకు వెళ్తాడు. కానీ కార్తికేయనుకు ఎక్కడికి వెళ్లినా అక్కడ ముందుగానే వినాయకుడు దర్శనమిస్తాడు. తిరిగి కైలాసాన్ని చేరుకుని జరిగిన విషయం తెలుసుకుంటాడు.వినాయకుడు తల్లిదండ్రులకు ప్రదక్షిణ చేసి ముల్లోకాల ప్రదక్షిణ పూర్తి చేశాడని తెలుసుకుని, నిరాశగా భూలోకంలోని పళని ప్రదేశానికి చేరుకుంటాడు.
కార్తికేయనుకు చిన్నబుచ్చుకును కైలాసం వదిలి భూలోకం వచ్చి పళనిలోని ఒక కొండ మీద మౌన ముద్రలో ఉంటాడు.
ఈ విషయం తెలుసుకున్న గౌరీశంకరులు అక్కడకు చేరుకుంటారు. పరమశివుడు ప్రేమతో సుబ్రహ్మణ్య డిని ఎత్తుకుని బుజ్జగించాడు. కుమారా.. సకల జ్ఞానాలకు నీవే ఫలానికి అని బుజ్జగిస్తాడు. సకల జ్ఞాన ఫలం అంటే తమిళంలో పళం, నీవు అంటే నీ ఈ రెండు కలిపి పళని అయ్యింది. అంతటితో ప్రసన్నుడైన సుబ్రహ్మణ్యముకు ఎప్పటికీ శాశ్వతంగా ఈ కొండ మీదే కొలువు ఉంటానని తల్లిదండ్రులకు చెబుతారు. అందుకు సరేనన్న శివపార్వతులను కైలాసానికి తిరిగి వెళతారు.
ఆలయ నిర్మాణ విశిష్టత
Palani Temple Specialty : పాండ్య చక్రవర్తుల నిర్మాణ శైలిని ప్రతిబింబించే ఈ ఆలయంలోని విగ్రహం శతాబ్దాల నాటిదిగా చెబుతారు. సుమారు మూడు వేల సంవత్సరాల క్రితం నాటి ఆలయం ఇది అని చెబుతారు.
ఇక్కడ పళని మందిరంలోని గర్భ గుడిలోని స్వామి వారి మూర్తి నవ పాషాణములతో చేయబడినది. ఇటువంటి స్వరూపం ప్రపంచములో మరెక్కడా లేదు. అప్పట్లో బోగర్ అనే సాధువు తొమ్మిది రకాల ఔషధ మొక్కలు ఖనిజాలతో దీన్ని రూపొందించారట.
Read Also: Valley Of Flowers : వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ ఎలా వెళ్లాలి? ఎప్పుడు వెళ్లాలి ?
వీటిని నవపాషాణములు అంటారు.అయితే ప్రతి రోజూ ఆరు అభిషేకాలు చేయడం వల్ల ఇది కాస్త దెబ్బతింది. ఇది మరింత దెబ్బతినకుండా ఉండేందుకు దాన్ని పోలిన కంచు విగ్రహాన్ని తయారు చేయించి గత 65 ఏళ్ల నుంచి దానికే అభిషేకాలు చేస్తున్నారు.
మెట్ల మార్గమే మా రాజ మార్గం అయింది
పళని ఆలయం ఉన్న కొండ పైకి రోప్ ట్రైన్, కేబుల్ కార్ ద్వారా చేరుకోవచ్చు. చాలా మంది రిటర్న్ వెళ్లే సమయంలో కూడా ట్రైన్ లేదా కేబుల్ కార్ యూజ్ చేస్తారు. కానీ అప్పటికే కాస్త అలసిపోవడం, పైగా టికెట్ తీసుకుని వెయిటింగ్ చేసే సమయంలో కిందికి చేరుకోవచ్చు అని అది మేము అది ప్రయత్నించలేదు. వాతావరణం ప్రెజెంట్‌గా ఉండటంతో నేను మొట్లదారినే వెళ్లాలని స్టార్ట్ అయ్యాం.
ట్రైన్లో వెళ్లి ఉంటే ఈ ఎక్స్‌పీరియెన్స్ మిస్ అయ్యే వాళ్లం. మెట్లదారిలో ఎండా వాన నుంచి ప్రొటెక్షన్ కోసం ఇలా మండపాలు కట్టించారు. వాటికి అందంగా రంగులు వేశారు. ఈ మండపాల స్తంభాలు కూడా చక్కగా మలిచారు.
కావడి యాత్ర
తమిళులు సుబ్రహ్మణ్య స్వామి కావిళ్ళు ఎత్తి, సుబ్రహ్మణ్యుడిని తమ దైవంగా చేసుకున్నారు. ఎవ్రీ ఇయర్ ఇక్కడ స్కంద షష్ఠి ఉత్సవాలలో ఏ దంపతులైతే, భక్తితో, పూనికతో స్వామికి నమస్కరించి ఈ కావడి ఉత్సవంలో పాల్గొంటారో వాళ్లకి తప్పకుండా సంతాన ప్రాప్తి కలుగుతుంది అంటారు.
వారి వంశంలో సంతానం కలగక పోవడం అనే దోషం రాబోయే తరాలలో ఉన్నా కూడా సుబ్రహ్మణ్య స్వామి ఆ దోష పరిహరం చేసి అనుగ్రహిస్తాడు అని భక్తులు నమ్ముతారు. దీనినే కావిళ్ళ పండగ అని అంటారు.మధ్య మధ్యలో కొన్ని చోట్ల ఆగుతూ కనిపించిన ఆలయాల్లో దేవుడిని దర్శించుకుని దండం పెడుతూ కిందికి చేరుకున్నాను.
మెట్లు ఎండ్ అయ్యాక సుబ్రహ్మణ్య స్వామి వారిని దర్శనం చేసుకున్నాను. బయట వాతావరణం, లోపల రాతి నిర్మాణం చూస్తుంటే నాకు చాలా ప్లెజెంట్‌గా అనిపించింది. ఇలాగే బయటికి వస్తోంది కుమారస్వామి వాహనం అయిన నెమలి కనిపించింది. వినాయకుడి వాహనం మూషికం అంటే ఎలుక. మరి మహాశివుడు వాహనం, పార్వతీ మాత వాహనం ఏంటో మీకు తెలుసా ? గూగుల్ సెర్చ్ చేయకుండా బాగా ఆలోచించి చెప్పండి చూద్దాం.
స్వామివారు కొలువుదీరిన కొండపేరు గిరివాలం అంటారు. ఈ ఆలయానికి చేరుకోవడానికి నిట్టనిలువునా ఉన్న 697 మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. పళనీ మెట్ల దారిలో మొత్తం 697 ట్లు ఉంటాయి. 3 కీమీ ఎత్తైన ఈ కొండను ఒకేసారి ఎక్కకుండా మధ్య మధ్యలో ఆగి ఎక్కితే సుమారు 3 గంటలు పడుతుంది.
సిత్తనాథన్ విభూతి | Palani Sithanathan Vibhuti
పళని సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకున్నాక ఇక మదురై వెళ్లడానికి ప్లాన్ చేయడం స్టార్ట్ చేశాం.
దానికన్నా ముందు సుబ్రహ్మణ్య స్వామి ప్రసాదం విభూతి తీసుకోవాలి అనుకున్నాం. అంతే ఎదురుగా సిత్తనాథం స్టోర్ కనిపించింది.
తమిళనాడులోనే కాదు మొత్తం ఇండియాలో ఈ షాపు ఫేమస్. విభూతిని ఇలా నైస్‌గా ప్యాక్ చేసి ఇస్తారు.
పంచామృతం | Palani Prasadam
పళనిలోని సుబ్రహ్మణ్య స్వామి ఆలయం పేరు వినగానే అక్కడి ప్రసాదం పంచామృతం ( Panchamritam) గుర్తుకు వస్తుంది . ఇందులో అరటి పండు, తేనె, ఖర్జూరాలు, నెయ్యి, యాలకులు, నాట్టు సక్కరై అనే ఒకరకమైన బెల్లాన్ని, పటిక బెల్లాన్ని ఉపయోగించి పంచామ్రుతంతో తయారు చేస్తారు.
ఈ ప్రసాదాన్ని ప్రిడ్జిలో పెట్టకుండా 3 నెలల పాటు ఉంటుంది. ప్రసాదం కోసం సిత్తనాథన్ స్టోర్ మాత్రమే కాదు ఇంకెన్నో స్టోర్స్ మీకు కనిపిస్తాయి. అక్కడ కూడా మీరు ప్రసాదం, విభూతి తీసుకోవచ్చు. ఆలయ దర్శనం పూర్తి చేసుకుని మీరు పాదభాగంలోకి వస్తే మీరు షాపింగ్ చేయడానికి చాాలా ఆప్షన్స్ కనిపిస్తాయి. షాపింగ్ గొడవలో పడి అక్కడ దొరికే జామపండ్లను మిస్ అవ్వకండి.
- ఇది పళనిపై నేను రాసిన పోస్టు.
- ఇదే పోస్టును నేను వీడియోగా నా ఛానెల్ ప్రయాణికుడు ( Prayanikudu) లో పోస్ట్ చేశాను.
- ఇందులో మీరు పైన కంటెంట్ మొత్తాన్ని వీడియో రూపంలో రూడవచ్చు.
వెంటనే చూడటానికి క్లిక్ చేయండి లేదా ఇక్కడ చూడండి
ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. యూట్యూబ్ ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి