Hyderabad : హైదరాబాద్ దగ్గర్లో వీకెండ్ టూర్లకు ప్లాన్ చేస్తున్నారు.. సండే కోసం బెస్ట్ ప్లేసులివే !
Hyderabad : ఆదివారం వచ్చిందంటే చాలా మందికి బయట ఎక్కడికైనా వెళ్లి రిఫ్రెష్ అవ్వాలని అనిపిస్తుంది. హైదరాబాద్ చుట్టూ చరిత్ర, ప్రకృతి, సాహసం, ప్రశాంతమైన వాతావరణాన్ని అందించే చాలా ప్రదేశాలు ఉన్నాయి. ఫ్యామిలీతో, ఫ్రెండ్స్ తో, లేదా ఒక్కరే వెళ్ళడానికి ఎన్నో అద్భుతమైన వన్-డే ట్రిప్ స్పాట్స్ అందుబాటులో ఉన్నాయి.
రామోజీ ఫిలిం సిటీ
రామోజీ ఫిలిం సిటీ ప్రపంచంలోనే అతిపెద్ద ఫిలిం స్టూడియో. ఇక్కడ సినిమా సెట్లు, అందమైన గార్డెన్స్, రకరకాల రైడ్స్, సరదా షోలు ఉంటాయి. గైడెడ్ టూర్‌తో అన్ని యాక్టివిటీలను ఎంజాయ్ చేయవచ్చు. ఇది ఫ్యామిలీ, ఫ్రెండ్స్, కపుల్స్ కు చాలా బాగుంటుంది. హైదరాబాద్ నుంచి కేవలం 1 గంట ప్రయాణ దూరంలో కారులో లేదా బస్సులో వెళ్లవచ్చు.
నాగార్జున సాగర్
నాగార్జున సాగర్ ఒక పెద్ద డ్యామ్, అందమైన జలపాతం చూడాలనుకుంటే ఈ ట్రిప్ సెలక్ట్ చేసుకోవచ్చు. సిటీ నుంచి సుమారు 3 గంటల దూరంలో ఉన్న నాగార్జున సాగర్‌కు సండే వెళ్లొచ్చు. అక్కడ భారీ డ్యామ్‌ను చూసి ఆనందించవచ్చు, బోటింగ్ చేయవచ్చు, బుద్ధుడి మ్యూజియం ఉన్న దీవిని సందర్శించవచ్చు. ఆ తర్వాత, ఫోటోలకు అద్భుతమైన ఎత్తిపోతల జలపాతం దగ్గరికి వెళ్లవచ్చు. ఉదయాన్నే బయలుదేరి, రాత్రికి తిరిగి వచ్చేయవచ్చు. ప్రశాంతమైన రోజు గడపడానికి ఇది చాలా మంచి ఆప్షన్.

ఇది కూడా చదవండి : Azerbaijan అజర్ బైజాన్ ఎలా వెళ్లాలి ? ఏం చూడాలి ? 10 టిప్స్!
భువనగిరి కోట
సాహస ప్రియుల కోసం ఈ కోట చాలా బెస్ట్. భువనగిరి కోట హైదరాబాద్ నుంచి కేవలం 1.5 గంటల దూరంలో, ఒక పెద్ద కొండపైన నిర్మించబడింది. పైకి కొంచెం ఎక్కాల్సి ఉంటుంది.. కానీ పై నుంచి కనిపించే దృశ్యం అద్భుతంగా ఉంటుంది. ఫ్రెండ్స్ తో కలిసి ఉదయాన్నే వెళ్లడానికి చాలా బాగుంటుంది. మంచి ఎక్సర్సైజ్ కూడా అవుతుంది.
బీదర్
బిదర్ కర్ణాటకలో ఉంది. హైదరాబాద్ నుంచి సుమారు 3 గంటల దూరంలో ఉంటుంది. ఇక్కడ బీదర్ కోట, పాత సమాధులు, అందమైన పురాతన భవనాలను చూడవచ్చు. ఈ నగరం చాలా ప్రశాంతంగా ఉంటుంది. గొప్ప చరిత్రను కలిగి ఉంది. బిదర్ బిద్రి క్రాఫ్ట్ కి కూడా ప్రసిద్ధి చెందింది. చరిత్రను, విభిన్న ప్రదేశాలను ఇష్టపడేవారికి బీదర్ ఒక మంచి ఆప్షన్.
ఇది కూడా చదవండి : Peaceful Countries: ప్రపంచంలోని టాప్ 10 శాంతియుత దేశాలు
అనంతగిరి కొండలు
ప్రకృతిని ఆస్వాదించాలనుకుంటున్న వాళ్లు కారాబాద్ దగ్గర ఉన్న అనంతగిరి కొండలకు వెళ్లొచ్చు. ఇది పచ్చగా, చల్లగా ఉంటుంది, ఉదయం పూట ట్రిప్‌కి చాలా బాగుంటుంది. అడవిలో కాసేపు నడవవచ్చు. వ్యూపాయింట్ దగ్గర విశ్రాంతి తీసుకోవచ్చు. తిరిగి వచ్చేటప్పుడు మీరు చిలుకూరు బాలాజీ టెంపుల్‌ను కూడా సందర్శించవచ్చు. జంటలకు లేదా ఒక్కరే వెళ్లే వారికి ఇది చాలా ప్రశాంతమైన ప్రదేశం.
హైదరాబాద్ సిటీ టూర్
మొదటిసారి హైదరాబాద్ వస్తున్నవారు లేదా నగరాన్ని ఇంకా పూర్తిగా చూడనివారు, ఒక రోజులో హైదరాబాద్‌ను చూడాలనుకుంటే ఇది మంచి ప్లాన్. ఉదయం చార్మినార్‌తో మీ ప్రయాణాన్నిప్రారంభించాలి. అక్కడ మంచి మంచి ఫోటోలు తీసుకోవచ్చు. లాడ్ బజార్లో గాజులు, స్ట్రీట్ ఫుడ్ ఎంజాయ్ చేయవచ్చు. తర్వాత నిజాంల రాజభవనం అయిన అందమైన చౌమహల్లా ప్యాలెస్‌ను సందర్శించాలి. లంచ్‌కు, ప్యారడైస్ లేదా షా ఘోస్ లో రుచికరమైన హైదరాబాదీ బిర్యానీని ఆస్వాదించొచ్చు. లంచ్ తర్వాత సాలార్ జంగ్ మ్యూజియానికి వెళ్లొచ్చు. తర్వాత హుస్సేన్ సాగర్ లేక్ చూడొచ్చు. బిర్లా మందిర్ స్వామివారిని దర్శించుకుని ట్రిప్ ముగించొచ్చు.
ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.