Pamban Bridge Inauguration : శ్రీరామ నవమి రోజున పంబన్ బ్రిడ్జిని ప్రారంభించనున్న ప్రధాని మోది

షేర్ చేయండి

భారతీయ ఇంజినీరింగ్ ప్రతిభకు నిదర్శనంగా నిలిచే పంబన్ బ్రిడ్జిని (Pamban Bridge Inauguration) ప్రధాన మంత్రి మోడి ప్రారంభించనున్నారు. ప్రస్తుతం శ్రీలంకా (Sri Lanka) పర్యాటనలో ఉన్న ఆయన తరువాత తమిళనాడు వెళ్లనున్నారు. పలు కీలక ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి, తరువాత శ్రీరామ నవవి రోజున అంటే 2025 ఏప్రిల్ 26వ తేదీన పంబన్ బ్రిడ్జిని ప్రారంభించనున్నారు.

దీంతో పాటు రామేశ్వరంలో (Rameswaram) ఉన్న రామనాథ స్వామి ఆలయంలో స్వామి వారిని సందర్శించనున్నారు.

పంబ్ బ్రిడ్జి ప్రారంభోత్సవం | Pamban Bridge Inauguration 

భారత్ ప్రధాని నరేంద్ర మోడి (PM Narendra Modi) తమిళనాడు పర్యటనలో పంబన్ బ్రిడ్జి ప్రారంభోత్సవం కీలకం అని చెప్పవచ్చు.

  • పంబన్ బ్రిడ్జిని ఆధునిక ఇంజినీరింగ్ అద్భుతంగా కీర్తిస్తున్నారు.
  • రామేశ్వరం ద్వీపం (Rameswaram Island) నుంచి భారత భూభాగాన్ని ఈ బ్రిడ్జి కనెక్ట్ చేస్తుంది. 

ఈ విషయాలు మీకు తెలుసా? | Facts About Pamban Bridge

Pamban Bridge To Be Inaugurated By Pm Modi On Sri Ram Navami (3)
ఈ భాగాన్ని 17 మీటర్ల వరకు ఎత్తే అవకాశం ఉంటుంది
  • పంబన్ బ్రిడ్జి అనేది భారత్‌లోనే తొలి వర్టికల్ లిఫ్ట్ సీ బ్రిడ్జి Vertical Sea Bridge).
  • సముద్రంలో ప్రయాణించి నావలు, అలాగే బ్రిడ్జిపై ప్రయాణించే ట్రైనుకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా దీనిని నిర్మించారు. 
  • 2.5 కిమీ పొడవు, 72.5 మీటర్ల ఎత్తు అయిన ఈ వర్టికల్ బ్రిడ్జి నిర్మాణానికి రూ.535 కోట్లు ఖర్చు అయింది. 
  • ఈ బ్రిడ్జిలో ఒక భాగాన్ని 17 మీటర్ల వరకు ఎత్తే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో ట్రైన్ నడవదు. బ్రిడ్జి కింది భాగం నుంచి నావలు వెళ్లే అవకాశం ఉంటుంది. 
Pamban Bridge Inauguration
భారత ఇంజినీరింగ్ ప్రతిభకు నిదర్శనం పంబన్ బ్రిడ్జి

ఈ బ్రిడ్జిని స్టెయిన్‌లెస్ స్టీల్‌తో నిర్మించారు. స్టీలు తుప్పు పట్టకుండా ఉండేందుకు హై గ్రేడ్ ప్రొటెక్టివ్ పెయింట్స్‌ను వినియోగించారు. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా డ్యూయలర్ రైల్వే ట్రాక్స్ ఏర్పాటు చేశారు.

1914 లో బ్రిటిష్ వాళ్లు నిర్మించిన ఐకానిక్ పంబన్ బ్రిడ్జిని ఈ కొత్త బ్రిడ్జి రిప్లేస్ చేస్తుంది. ఈ బ్రడ్జి చాలా పాతది అవడంతో 2022 నుంచి వినియోగించడం మానేశారు.

📣ఈ Travel కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. YouTube ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp లో జాయిన్ అవ్వడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

షేర్ చేయండి

Leave a Comment

error: Content is protected !!