Ramayana Trail : శ్రీలంకలో రామాయణం టూరిజం…ఏం చూడొచ్చు? ఎలా వెళ్లాలి ? Top 5 Tips

శ్రీలంలో సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు అన్నీ అందంగా ఉంటాయి. అందుకే భారతీయులు చాలా మంది ఈ ఐల్యాండ్ కంట్రీకి వెళ్తుంటారు. అందుకే శ్రీలంకకు వెళ్లే భారతీయుల సంఖ్య పెరగడంతో శ్రీలంకర్ ఎయిర్‌లైన్స్ రామాయణ ట్రెయిల్స్ ( Ramayana Trails ) అనే ప్రత్యేక ప్యాకేజీని తీసుకొచ్చింది. అసలు ఈ ప్యాకేజీ ఏంటి ? ఇందులో ఏం చూపిస్తారు ? ఎలా బుక్ చేసుకోవాలో మీకు ఈ పోస్టులో వివరిస్తాను. 

భారతీయులకు రామాయణం గురించి ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు. మన దేశంలో శ్రీరాముడు నడిచిన మార్గంలో ఎన్నో దేవాలయాలు ఉన్నాయి. రామాయణంలోని ఎన్నో ఘట్టాలకు సాక్ష్యంగా నిలిచే ప్రదేశాలు, ఆలయాలు, పర్వతాలు భారతదేశంలో చాలా ఉన్నాయి.

శ్రీరాముడు నడిచిన దారిలో..

రామాయణంలో పలు కీలక ఘట్టాలు శ్రీలంకలో కూడా జరిగిన విషయం తెలిసిందే. ఈ ప్రదేశాలను చూడటానికి వెళ్లే భారతీయుల సంఖ్య బాగా పెరిగింది. ఇదే విషయాన్ని గమనించిన శ్రీలంకన్ ఎయిర్‌లైన్స్ రామాయణ ట్రెయిల్స్ అనే టూర్ ప్యాకేజీ తీసుకొచ్చింది. ఈ ప్యాకేజీతో తాము కేవలం ప్రయాణికుల బాగోగులే కాదు వారి ఆధ్మాత్మిక, భక్తి భావాలను కూడా అర్థం చేసుకుంటాం అని చెప్పకనే చెబుతోంది శ్రీలంకన్ ఎయిర్‌లైన్స్

ఒక పవిత్రమైన ప్రయాణం | Ramayana Trails

శ్రీలంకన్ ఎయిర్‌లైన్స్ ( Sri Lankan Airlines )  ప్రకటించిన రామాయణ ట్రెయిల్స్ ప్రయాణికులకు అద్వితీయమైన అనుభవాన్ని కలిగించనుంది. శ్రీలంకలో రామాయణంలోని ప్రధాన గట్టాలు చోటుచేసుకున్న ప్రాంతాలకు తీసుకెళ్లనుంది. ఆ ప్యాకేజీలోని ప్రతీ అడుగు భక్తితో, ఆధ్మాత్మిక చింతనతో ముందుకు సాగేలా ప్లాన్ చేసింది. 

ఇరు దేశాల మధ్య ఉన్న కామన్ కల్చర్ ( సంప్రదాయాలు ) , చరిత్రను  ప్రయాణికుల మనసుకు హత్తుకునేలా ప్రత్యక్షంగా వివరించనుంది

రామాయణ ట్రెయిల్స్ హైలైట్స్

రామాయణ ట్రైయిల్స్‌లో ప్రయాణికులు చూడనున్న ప్రదేశాల్లో సీతా అమ్మన్ టెంపుల్, రుమాస్సలా హిల్ కూడా ఉన్నాయి

సీతా అమ్మన్ ఆలయం | Seetha amman temple , Sri Lanka

 సీతా అమ్మన్ ఆలయం శ్రీలంకలోని నువారా ఎలియా ( Nuwara Eliyah ) ప్రాంతంలో ఉంది. ఈ ఆలయం చుట్టూ ప్రకృతి రమణీయతను వర్ణించడానికి మాటలు సరిపోవు. ఈ ప్రాంతంలోనే రావాణాసురుడు ( Ravana ) సీతమ్మను ఉంచాడంటారు. ఈ ప్రాంతానికి ఉన్న ఆధ్యాత్మిక విశిష్టత గురించి తెలుసుకుని చాలా మంది పర్యటకులు ఇక్కడికి వస్తుంటారు. వచ్చాక ఇక్కడి పచ్చదనాన్ని చూసి మురిసిపోతుంటారు. 

Read Also: Indian License : భారతీయ లైసెన్స్ ఈ 15 దేశాల్లో కూడా చెల్లుతుంది

seetha amman temple srilanka prayanikudu pixels2
శ్రీలకంలో సీతమ్మవారి ఆలయం | Credit: Pixabay

ఆలయం విధివిధానాలను బట్టి సందర్శకులు ఇక్కడ పూజలు కూడా చేస్తుంటారు. సీతమ్మకు సంబంధించిన కథనాలన వ్యక్తం చేసే శిల్పాలను, డిజైన్లను చూసి ఆశ్యర్యపోతాారు. మనసు పెట్టి గమనిస్తే ఈ ఆలయ ప్రాంగణం మనతో ఎన్నో విషయాలను చెప్పకనే చెబుతుంది. 

రుముస్సలా కొండ | Rumassala Hill  

శ్రీలంకలో రామాయణంతో సంబంధం ఉన్న మరో ప్రదేశం రుముస్సలా కొండ. ఆంజనేయుడు హిమాలయాల నుంచి సంజీవని పర్వతాన్ని తీసుకువస్తున్న సమయంలో ఈ ప్రాంతంలో ఒక చిన్న పర్వత భాగం జారిపడిందట. ఈ పర్వతం చుట్టుపక్కల ప్రాంతాలు అందంగా చూపించడమే కాదు పర్యాటకులకు పౌరాణిక భావనను కల్పిస్తుంది. ఈ కొండ ఇక్కడికి రావడం వెనక ఎంత పెద్ద కథ ఉందో తెలుసుకుని విదేశీ పర్యాటకులు కూడా ఆశ్చర్యపోతుంటారు.

lord hanuman pexels prayanikudu
ప్రతీకాత్మక చిత్రం | Pexels

ఇక్కడికి వచ్చే ముందు మీరు ఏ మూడ్‌లో ఉన్నారో తెలియదు కానీ ఈ పర్వతంపైకి చేరుకున్నాక మీ మూడ్ ఖచ్చితంగా మారుతుంది.  శ్రీలంకలో రామాయణానికి సంబంధించి ఇలా మొత్తం 20 ప్రదేశాలు, ఆలయాలు ఉన్నాయి. అందులో కొన్నింటిని రామాయణ ట్రెయిల్‌లో కవర్ చేయనున్నారు.అయితే రామాయణ ట్రెయిల్‌లో ఏం చూపించనున్నారో ఒక ఐడియా కోసం ఈ కింది వివరాలు చూడండి.

రామాయణ ట్రెయిల్‌లో ఏరోజు ఏం చూపిస్తారు ?

రామాయణం ట్రెయిల్‌లో పలు ప్యాకేజీలను ముందుకు తీసుకువచ్చింది శ్రీలంకన్ ఎయిర‌లైన్స్. ఇందుదో 5 డేస్ 6 నైట్స్ ప్యాకేజీని ప్రామాణికంగా తీసుని ఏరోజు ఏం చూపించనున్నారో వివరిస్తాను.

మొదటి రోజు | Ramayana Trail Day 1

మొదటి రోజు మీ ప్రయాణం ఎయిర్ పోర్టు నుంచి మొదలై చిలా ( chilaw ), డంబుల్లాలో ముగుస్తుంది. ఈ రోజు మీరు రావణుడి లంక ( Ravana Lanka )  ఎలా ఉంటుందో సిగిరియా అనే కొండపైకి ఎక్కి చూడనున్నారు. సిగిరియాకు యూనెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు లభించింది. 

Sigiriaya Lion Rock Prayanakudu Pexels 1
సిగిరియా కొండ | Source : Pexels

సీతమ్మను రావణాసురుడు దారి ఉంచిన ప్రదేశాల్లో ఇది కూడా ఒకటి అని చెబుతుంటారు. సిగిరియా ( Sigiriya )  కోట లేదా రావణుడి లంక గురించి నేను ఇంతకు ముందే ఒక పోస్టు పబ్లిష్ చేశాను. ఈ పోస్టులో మీరు రావణుడి లంక ఎలా ఉంటుందో చూడొచ్చు, చరిత్ర, ఇతర విశేషాలు తెలుసుకోవచ్చు.

Read Also  : Ravana Lanka : రావణుడి లంక ఎక్కడ ఉంది ? ఎలా వెళ్లాలి ? 5 ఆసక్తికరమైన విషయాలు 
2వ రోజు | Ramayana Trail Day 2

రామాయణ ట్రెయిల్లో మీ రెండవ రోజు డంబుల్లా ( Dambulla ) లో  మొదలు అవుతుంది. డంబుల్లాలోనే మీ రోజు ముగుస్తుంది. మధ్యలో ట్రింకోమలీ అనే ప్రాంతానికి వెళ్తారు. ట్రింకోమలీలో ( Trinomalee ) మీరు కన్నియ హాట్ స్ప్రింగ్ వద్దకు వెళ్తారు. రావణుడు తన తల్లి మరణం తరువాత ఈ వేడి నీటి ఊటను క్రియేట్ చేశారంటారు. కన్నియ హాట్ స్ప్రింగ్‌కు ( Kanniya Hot Spring)  నీరు చాలా పవిత్రమైనదని, ఎన్నో రోగాలను ఈ నీరు నయం చేస్తుంది అని స్థానికులు నమ్ముతారు.

 3వ రోజు | Ramayana Trail Day 3

మూడవ రోజు మీ ప్రయాణం డంబుల్లా నుంచి మొదలై నువారా ఎలియాలో ముగుస్తుంది. ఈ రోజు మీరు రంబోడా ( ramboda ) లో ఉన్న శ్రీ భక్త హనుమాన్ ఆలయానికి వెళ్తనున్నారు.

శ్రీ భక్త హనుమాన్ ఆలయం ( Shri Bhakta Hanuman Temple, Sri Lanka )

Lord Hanuman Temple in sri lanka Pixabay Prayanikudu
ప్రతీకాత్మక చిత్రం | source : Pixabay

రంబోడాలోని ఈ ఆలయాన్ని చిన్మయా మిషన్ ( Chinmaya Mission ) నిర్మించింది. అయితే ఇక్కడే ఈ ఆలయాన్ని నిర్మించడానికి గల కారణం ఆంజేయుడు ( Hanuman ) సీతమ్మను ఇక్కడ వెతికారట. అందుకే చాలా మంది ఇక్కడికి వచ్చి అంజన్నను దర్శించుకుంటారు.

4వ రోజు | Ramayana Trail Day 4

రామాయణ ట్రెయిల్‌లో నాలుగవ రోజు మీ ప్రయాణం నువారా ఎలియా నుంచి మొదలవుతుంది. తరువాత ఎల్లా ( Ella ) ను కవర్ చేసి నువారా ఎలియా వద్దే ముగుస్తుంది. ఈ రోజు మీరు వెలిమడా ( welimada ) లో ఉన్న దివురుంపాల ఆలయానికి వెళ్తారు

దివురుంపాల ( Divirumpala ) అనే ప్రాంతంలోనే సీమమ్మ ( Goddess Sita )  వారు అగ్నిప్రవేశం చేశారంటారు. 

తరువాత కాలంలో స్థానికులు ఈ ప్రాంతంలో ప్రమాణాలు చేయడం, నిజాయితీని నిరూపించుకునేదుకు ఇక్కడికి రావడం మొదలు పెట్టారు.

రావణ గుహ | Ravana Cave, Ella, Sri Lanka 

ఈ రోజు మీరు మరో ప్రదేశానికి వెళ్లనున్నారు. అదే రావణ గుహ . దీనిని ఎల్లా అని కూడా అంటారు.ఎల్లా అనే పట్టణానికి సుమారు 2 కిమీ దూరంలో ఉన్న ఈ ప్రదేశంలో రావణాసురుడు సీతమ్మను ఉంచారట. ఇక్కడికి చాలా మంది సాసహికులు హైకింగ్ చేయడానికి వస్తుంటారు.

Ravana cafe in ella srilanka by prayanikudu
రావణ గుహ | Source : Unsplash

Read Also : Palani Temple : పళని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం గైడ్ ! 10 Facts

5 వ రోజు | Ramayana Trail Day 5 Itinerary 

రావణ ట్రెయిల్‌లో 5వ రోజు నువార్ ఎలియా నుంచి శ్రీలంక రాజధాని కోలంబోకు ( colombo ) చేరుకోనున్నారు. ఈ రోజు మీరు కొలంబోలో ఉన్న కెలానియా ( Kelaniya Temple ) ఆలయానికి వెళ్లనున్నారు. శ్రీలంక చరిత్రలో ఈ ప్రాంతానికి చాలా ప్రాధాన్యత ఉంది.

తన సోదరుడు రావణుడిని ఓడించడంలో శ్రీరామ చంద్రుడికి ( Lord Rama ) విభీషణుడు సహయం చేస్తాడు. తరువాత లంకకు రాజుగా పట్టాభిషక్తుడు అవుతాడు. కేలానియా ఆలయంలో విభీషణుడికి  ( Vibhishan ) ఒక గుడి ఉంది. ఇక్కడికి గౌతమ బుద్ధుడు( gautama buddha )  కూడా వచ్చారంటారు. అందుకే చాలా మంది బౌద్ధ మతస్తులు ఇక్కడికి వస్తుంటారు.

6వ రోజు | Ramayana Trail Day 6

రామాయణ ట్రెయిల్‌లో ఆరవ రోజే ఈ టూరు చివరి రోజు. ఈ రోజు మీ ప్రయాణం కోలంబో ఉంటారు. తరువాత  నుంచి ఎయిర్‌పోర్టు వెళ్తారు. మీ ఫ్లైట్ టైమ్ వరకు మీరు కొలంబోలో ఉంటారు. మోడరన్ శ్రీలంకను చూడాలంటే కొలంబోలోనే చూడవచ్చు మీరు. ఇక్కడ మీరు షాపింగ చేయొచ్చ. శ్రీలంక రుచులను ఎంజాయ్ చేయొచ్చు. ఎన్నో బ్యూటిఫుల్ మెమోరీస్‌తో ఎయిర్‌పోర్టు నుంచి మీ ఇంటికి తిరుగుప్రయాణం మొదలుపెట్టొచ్చు.

ఎలా సిద్ధం అవ్వాలి ?

How to prepare for ramayana trail by Sri Lankan airlines : రామాయణ ట్రెయిల్స్‌ కోసం మీరు శ్రీలంక వెళ్లడానికి ముందు కొన్ని విషయాలను ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. అప్పుడే మీరు ఈ టూరును పూర్తిగా ఎంజాయ్ చేయగలరు.

  • రీసెర్చ్ చేయండి :  మనలో చాలా మందికి రామాయణంలోని కీలక ఘట్టాల గురించి తెలిసే ఉంటుంది. అయితే తెలియని వారు లేదా అవగాహన లేనివారు ముందుగా కొంచెం రీసెర్చ్ చేయండి. 
  • మీరు వెళ్లే ప్రాంతాల గురించి మీకు ముందే చెబుతారు. అందుకే ఆ ప్రాంతాల గురించి ముందే కొంచెం తెలుసుకునే ప్రయత్నం చేయండి.
  • ప్రయాణ ఏర్పాట్లు : రామాయణ ట్రెయిల్ ప్రస్తుతం శ్రీలంకన్ ఎయిర్‌లైన్స్ మాత్రమే అందిస్తోంది. అందుకే మీరు ఈ ఎయిర్‌లైన్స్ నుంచి మాత్రమే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.
  • టికెట్ కన్ఫర్మ్ అయిందా లేదా అని ఖచ్చితంగా తెలుసుకుని సిద్ధం అవ్వండి. తరువాత మీరు ఎక్కడ ఉండాలి , ఎలా వెళ్లాలి, మరిన్ని రోజులు ఉండాలనుకుంటే దానికి తగిన విధంగా ప్లాన్ చేసుకోండి.
  •  బుకింగ్‌కు సంబంధించిన డాక్యుమెంట్స్ సిద్ధంగా ఉంచుకోండి.
  • Read Also:  Telugu Women Travel Vloggers : ట్రావెల్ వ్లాగింగ్‌లో వీర వనితలు
colombo beach pixabay prayanikudu
కొలంబో బీచ్ | Source : Pixabay

ఈ విషయాలు గుర్తుంచుకోండి

  • ప్యాకింగ్| Ramayana Trail Packing  మీరు శ్రీలంకకు వెళ్లే సమయానికి అక్కడి వాతావరణం ఎలా ఉంటుందో కనుక్కోండి.దాన్ని బట్టి మీరు బట్టలు ప్యాక్ చేసుకోండి.
  • షూస్, సన్‌స్క్రీన్ లోషన్, ఇంసెక్ట్ రెపెల్లెంట్, టోపీ, కళ్లద్దాలు, రీయూజబుల్ వాటర్ బాటిల్ వంటివి మర్చిపోకండి.
  • కొన్ని ఆలయాల్లో మీరు సంప్రదాయ దుస్తువులు ధరించాల్సిన అవసరం రావచ్చు. ఇది కూడా గమనించాలి.
  • వైద్యుడి సలహా :  ప్రయాణానికి ముందు మీ వైద్యుడిని సంప్రదించాల్సిన అవసరం ఉందో లేదో ఆలోచించండి. అవసరం అయితే సంప్రదించండి. దీంతో పాటు మీకు అవసరం అయిన మందులను తీసుకెళ్లండి.
  • మీ ప్రయాణం గురించి మీ బ్యాంకుకు తెలియజేయండి. దీంతో పాటు కొంచెం లోకల్ కరెన్సీ ( శ్రీలంకా రుపాయలు ) క్యారీ చేయండి. 
  • ఒకవేళ మీవద్ద ఉంటే ట్రావెల్ క్రెడిట్ కార్డు కూడా క్యారీ చేయండి.
  • ఏ దేశానికి వెళ్లినా అక్కడి సంప్రదాయాన్ని బట్టి మనల్ని మనం మలచుకోవాల్సి ఉంటుంది. అందుకే శ్రీలంకకు వెళ్లే ముందు ఆ దేశ ఆచారాల, సామాజిక విధివిధానాల గురించి కొంచెం అవగాహన ఉంటే మంచిదే కదా.
  • చెత్త పడేయండి :  శ్రీలంకలో మీరు ఎక్కడికి వెళ్లినా మీకు డస్ట్‌బిన్‌లు కనిపిస్తాయి. ఏదైనా చెత్త ఉంటే అందులో వేయండి. ఒక వేళ డస్ట్ బిన్ లేకపోతే ఆ చెత్తను క్యారీ చేసి ఎక్కడైతే చెత్త బుట్ట ఉంటుందో అక్కడే వేయండి.
  • Sri Lankan Sim Card : శ్రీలంక వెళ్లగానే మీరు అక్కడి సిమ్ కార్డు కొనే ప్రయత్నం చేయండి. దీనివల్ల మీకు ఇంటర్నెట్ సదుపాయం లభిస్తుంది. మీ ప్రయాణాన్ని ఎప్పటికప్పుడు ట్రాక్ చేసుకోవచ్చు. మీ ఆప్తులతో కూడా కనెక్ట్ అవ్వవచ్చు.

రామాయణ ట్రెయిల్ బుకింగ్: 

Ramayana Trail Tour Booking: శ్రీలంకన్ ఎయిర్‌లైన్స్ ప్రయాణికులు సౌలభ్యం, టైమ్‌ను బట్టి కొన్ని ప్యాకేజీలను డిజైన్ చేసింది. అందులో మీకు ఏది సరిపోతుందో అది ఎంచుకోవచ్చు. దాని కోసం మీరు శ్రీలంకన్ ఎయిర్‌లైన్స్ అధికారిక వెబ్‌సైట్ విజిట్ చేయవచ్చు. లేదంటే రామాయణ ట్రెయిల్ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పోర్టల్‌ కూడా చెక్ చేయవచ్చు.

ఇది ఒక ప్యాకేజీ మాత్రమే కాదు…

రామాయణ ట్రెయిల్స్ అనేది ఒక ట్రావెల్ ప్యాకేజీ మాత్రమే కాదు. ఇది ఒక పవిత్రమైన ఆధ్యాత్మిక ప్రయాణం. భారత్, శ్రీలంకాను ఒక తాటిపైకి తీసుకొచ్చి… వేల ఏళ్ల నుంచి బంధాన్ని కొనసాగించేలా చేస్తున్న రామాయణం తాలుకూ అద్భుతమైన ప్రయాణం ఇది. 

అందుకే ఈ ప్రయాణాన్ని మీ కెమెరాలోనే కాదు..మీ గుండెల్లో కూడా రికార్డు చేసుకోండి. మీ ప్రయాణ విశేషాలు కామెంట్ రూపంలో నాతో షేర్ చేసుకోండి.

Thumbnail Image: Source Srilankan Airlines

Leave a Comment

error: Content is protected !!