పండగకు తమ సొంతవూరుకు వెళ్లేవారి కోసం సైబరాబాద్ పోలీసులు కొన్ని సూచనలు ( Sankranti Safety Tips ) చేశారు. మీరు ఇంట్లో లేని సమయం మీ ప్రాపర్టీ సేఫ్‌గా ఉండేందుకు పోలిసు శాఖ జారీ చేసిన మార్గదర్శకాలు ఇవే !

Stay Safe This Sankranti : సంవత్సరం మొత్తం ఎక్కడ ఉన్నా కానీ సంక్రాంతికి సొంత ఊరికి వెళుతుంటారు చాలా మంది. మరీ ముఖ్యంగా హైదరాబాద్ నగరం నుంచి చాలా మంది వారం పది రోజుల పాటు ఇంటి నుంచి దూరంగా ఉంటారు. ఇలా తమ సొంత వూరుకు వెళ్లేవారి కోసం సైబరాబాద్ పోలీసులు కొన్ని సూచనలు జారీ చేశారు. మీరు ఇంట్లో లేని సమయం మీ ప్రాపర్టీ సేఫ్‌గా ఉండేందుకు…
పోలిసు శాఖ జారీ చేసిన మార్గదర్శకాలు
1. అధికారులకు సమాచారం ఇవ్వండి : మీరు బయల్దేరే ముందు స్థానిక పోలీసు అధికారులకు మీరు వెళ్లే తేదీ, తిరిగి వచ్చే తేదీలు , మీ వివరాలు అందించండి. దీని వల్ల మీ చుట్టుపక్కల ప్రాంతాలపై పోలిసులు నిఘా పెడతారు. ఏమైనా అవసరం అయితే మీకు సమాచారం అందిస్తారు.
2. మీ తాళాలు అప్డేట్ చేయండి: ఇంటికి సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ ఉన్న తాళాలు ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించండి. దీని వల్ల ఎవరైనా ఇంటి ఆవరణలోకి చొరబడితే మీకు తెలుస్తుంది. దీంతో పాటు ఇంటికి తాళం వేసినట్టు తెలియకుండా డోరు కర్టెన్ వేయండి.
3. సెక్యూరిటీ అలారం సిస్టమ్ : మీ ఇంటికి మోషన్ సెన్సార్స్ ఉన్న అలారం సిస్టమ్‌ను ఏర్పాటు చేసి భద్రతను మరింతగా పెంచుకోవచ్చు. మీ ప్రాపర్టీలో ఏదైనా అనుమానాస్పద మూమెంట్ జరిగితే ఈ సిస్టమ్ పోలిసు అధికారులను అలెర్ట్ చేస్తుంది. మీ ఇంట్లో ఉన్న అల్మారీ తాళాలను ఇంట్లో ఉంచకుండా మీతో పాటు తీసుకెళ్లండి.
4. అలెర్ట్‌గా ఉండండి : అనుమానాస్పద వ్యక్తులు, లేదా ఘటనలు చోటు చేసుకుంటే వెంటనే పోలీసులకు సమాచారం అందించండి. దీని కోసం 100కు కాల్ చేయవచ్చు లేదా మీ లోకల్ పోలిస్ స్టేషన్‌కు కాల్ చేయవచ్చు.
5. మీ వాహనం జాగ్రత్త : మీ టూవీలర్స్ సురక్షితంగా ఉండేందుకు వాటిని ఇంటి ఆవరణలో సురక్షిత ప్రాంతంలో పార్క్ చేయండి. రోడ్డుపై పార్క్ చేయకండి.
6. వాచ్‌మెన్‌ను నియమిచండి : మీరు ఇంటి నుంచి దూరంగా ఉన్నప్పుడు మీ ప్రాపర్టిని సంరక్షించేదుకు మీకు నమ్మదగిన ఒక వాచ్‌మెన్ లేదా సెక్యూరిటీ సిబ్బందిని నియమించుకోవచ్చు.
7. మీరు బయటికి వెళ్లినట్టు తెలియనివ్వకుండా జాగ్రత్త పడండి. మీరు ఇంట్లో లేనప్పుడు పాల ప్యాకెట్లు, న్యూస్ పేపర్లు పేరుకుపోతే మీరు ఇంట్లో లేని విషయం తెలిసిపోతుంది. దాన్ని గమనించి దొంగలు దొంగతనం చేసే అవకాశం ఉంది. అందుకే పనిమనుషులు ఉంటే ప్రతీ రోజు ఇంటి ప్రాంగణాన్ని శుభ్రం చేయమని చెప్పండి.
8. Sankranti Safety Tips : ఇంటికి పఠిష్టమైన తలుపులు, మెయిన్ డోర్‌కు గ్రిల్స్ ఏర్పాటు చేసుకోండి.
9. ఇంట్లో ఉన్న భావన కల్పించండి : మీ ఇంటి లోపల, బయట కొన్ని లైట్లను వెలిగించి వెళ్లండి. దీని వల్ల ఇంట్లో ఎవరో ఉన్నారు అనే భావన కలుగుతుంది. దీని వల్ల దొంగతనం జరిగే అవకాశం తగ్గుతుంది. దీని కోసం మీరు టైమర్‌తో ఉన్న లైట్లను కూడా వినియోగింవచ్చు.

10. సీసీకెమెరాలు : ఇంట్లో లేని సమయంలో కూడా మీ పరిసరాలు గమనించే విధంగా సీసీటీవీ కెమెరాలను అమర్చుకోవాలి. హోం సెక్యూరిటీ సిస్టం ఏర్పాటు చేసుకుంటే మీరు ఎక్కడ ఉన్నా మీ మొబైల్ ఫోన్ నుంచి మీ ఇంటిపై నిఘా పెట్టవచ్చు. సీసీకెమెరాలకు సంబంధించిన డీవీఆర్ కనిపించకుండా ఇంట్లో రహస్య ప్రదేశంలో పెట్టండి.
11. ఇంట్లో నగలు, నగదు ఉంటే వాటిని బ్యాంకు లాకర్లలో దాచండి. మీరు లాంగ్ ట్రిప్ ప్లాన్ చేస్తోంటే మీతో పాటు తీసుకెళ్లండి. ప్రయాణాల్లో మీ బ్యాగు మీకు దగ్గరే ఉంచుకోండి. బస్సు నుంచి కిందికి దిగాల్సి వస్తే బ్యాగును కూడా తీసుకెళ్లండి.
12. నైట్ టైమ్‌లో ఎవరైనా కొత్త వారు వస్తే వారి వివరాలు రిజిస్టర్ చేసుకోవాలని వాచ్‌మెన్‌కు సూచించాలి.
Sankranti Safety Tips : సైబరాబాద్ పోలీసులు జారీ చేసిన ఈ మార్గదర్శకాలను పాటిస్తే మీరు మీ ఇంటికి గురించి ఎక్కువగా ఆలోచించకుండా ఈ సంక్రాంతిని ప్రశాంతంగా ఎంజాయ్ చేయవచ్చు.
ఈ టిప్స్ కూడా చదవండి | Sankranti Safety Tips
1. తాళాలు దాచకండి : మీ ఇంటి ఎక్స్‌ట్రా తాళాలను షూ ర్యాక్‌లో, దిండ్ల కిందో, డోర్‌మ్యాట్ కింద దాచడం లాంటివి చేయకండి. దానికి బదులు మీకు నమ్మకం ఉన్న పక్కింటి వారికి లేదా స్నేహితులకు ఇవ్వండి. విలువైన వస్తువులను వాహనాల్లో పెట్టకండి,
2. మీ ప్రయాణ వివరాలు చెప్పకండి : మీరు ప్రయాణం గురించి అందరితో చెప్పకండి. మీకు నమ్మకం ఉన్నవారికి చెప్పవచ్చు. కానీ వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్ బుక్ లాంటి సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయకండి.
3. మీ పర్సనల్ ఫైనాన్స్ అంటే వ్యక్తిగత ఆర్థిక అంశాలను, ఇంపార్టెంట్ విషయాలను ఎవరితోనూ షేర్ చేయకండి.
4. మీ పొరుగింటి వారికి చెప్పండి : మీ పక్కింటి వారిపై మీకు నమ్మకం ఉంటే మీరు బయటికి వెళ్తున్నట్టు ఒక మాట చెప్పండి. మీరు లేని సమయంలో మీ ఇంటిని గమనిస్తూ ఉండమని కోరండి. మంచి నేబర్ ఉండటం అనేది మీకు ఉపయోగపడే విషయమే.
5. మీ టూవీలర్‌కు వీల్ లాక్ ఏర్పాటు చేసి సెక్యూరిటినీ డబుల్ చేసుకోవచ్చు.
6. ఇంటి లోపలికి చూడకుండా : మీ ఇంటిలోపల ఎవరైనా తొంగి చూస్తే వారికి కనిపించకుండా ఉండేలా డోర్లకు, కిటికీలకు పరదాలు ఏర్పాటు చేసుకోండి. ఇలా చేస్తే మీ ఇంట్లోకి ఎవరైనా చొరబడే అవకాశం తగ్గుతుంది.
అనుమానాస్పదమైన వ్యక్తులు కనిపించినా, ఏదైనా సహాయం కావాల్సి వచ్చినా సంప్రదించాల్సిన నెంబర్లు
- సైబరాబాద్ పోలిస్ నెంబర్ 100
- సైబరాబాద్ పోలిస్ కంట్రోల్ రూమ్ నెంబర్. 9490617100.
- మీరు 949061444 నెంబరుకు వాట్సాప్ కూడా చేయవచ్చు.
మీరు ఊరికి బయల్దేరే ముందు మీ ఇంటిని సురక్షితంగా ఉంచేలా చర్యలు తీసుకోండి. ఏమైనా సందేహాలు ఉంటే ఈ గైడ్‌లైన్స్ మరోసారి చదవండి. ఈ టిప్స్ మీకు తెలిసిన వారికి షేర్ చేయండి.
- వంజంగి ఎలా వెళ్లాలి ? ఎలా సిద్ధం అవ్వాలి ? 10 టిప్స్ !
- Lambasingi : నేషనల్ క్రష్ లంబసింగి ఎలా వెళ్లాలి ? నిజంగా స్నో పడుతుందా ? 5 Tips & Facts
- Palani Temple : పళని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం గైడ్ ! 10 Facts
- అంటార్కిటికా : 70 శాతం మంచినీరు ఇక్కడే ఉంది…రాత్రి సూరీడు…పగలు చీకటి
- Thailand 2024 : థాయ్‌లాండ్ ఎలా వెళ్లాలి ? ఏం చూడాలి ?
- Azerbaijan అజర్ బైజాన్ ఎలా వెళ్లాలి ? ఏం చూడాలి ? 10 టిప్స్