Sarva Pindi : నోట్లో వేసుకోగానే కరకరలాడే అద్భుతం.. తపాలా చెక్కకు ఫిదా అవుతున్న జనం..హైదరాబాద్ లో దొరికే ప్లేసెస్ ఇవే

షేర్ చేయండి

Sarva Pindi : తెలంగాణ వంటలు అనగానే అందరికీ ఠక్కున గుర్తుకు వచ్చేంది సర్వపిండి అప్పలే. నోట్లో వేసుకోగానే కరకరలాడుతూ, లోపల మెత్తగా ఉండి, కాస్త కారం, పచ్చిమిర్చి, కరివేపాకు, పప్పు దినుసుల రుచితో అదిరిపోతాయి. తింటుంటే అదో అనుభూతి కలుగుతుంది. ప్రతి ముద్దలోనూ తెలియని రుచి మనల్ని పలకరిస్తుంటుంది. వేడి వేడి సర్వపిండిని కొంచెం నెయ్యితో గానీ, చట్నీతో గానీ తింటే… అబ్బబ్బా! స్వర్గంలో తేలుతున్నట్లు ఉంటుంది.

సర్వపిండి పుట్టుక, చరిత్ర
సర్వపిండి అనేది మన తెలంగాణలోని పాతకాలపు వంటింట్లో పుట్టింది. “సర్వ” అంటే లోతైన గిన్నె లేదా పెనం.. సర్వపిండి అంటే లోతైన పెనంలో వండిన పిండి అని అర్థం. వరంగల్‌లో దీన్ని తపాలా చెక్క అని, బోలపల్లి గ్రామంలో గిన్నప్ప అని కూడా పిలుస్తారు. వర్షాకాలంలో అనసూయమ్మ అనే ఆవిడ, ఇంట్లో ఉన్న తక్కువ సామాగ్రితో దీన్ని తయారు చేసిందట. గిన్నె + పిండి కలిపి గిన్నెప్పగా, ఆ తర్వాత సర్వపిండిగా మారిందని అంటారు. అలా పుట్టిన ఈ వంటకం తక్కువ సమయంలోనే రాష్ట్రమంతా పాపులర్ అయింది.

Prayanikudu

సర్వపిండిలో గ్లూటెన్ ఉండదు. పైగా, పప్పు దినుసులు, నువ్వులు, పల్లీలు, కరివేపాకు లాంటివి వాడతాం కాబట్టి, ఇందులో ప్రోటీన్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. దీన్ని రెండు రకాలుగా చేసుకోవచ్చు: తక్కువ నూనెతో చేసుకుంటే హెల్తీ స్నాక్ అవుతుంది, లేదా నూనెలో డీప్ ఫ్రై చేసుకుంటే మరింత క్రిస్పీగా ఉంటుంది. మొత్తానికి, రుచితో పాటు ఆరోగ్యానికి కూడా సర్వపిండి చాలా మంచిది.

ఇది కూడా చదవండి : ప్రపంచ యుద్ధం వస్తే ఈ 10 దేశాలు చాలా సేఫ్ 

సర్వపిండి తెలంగాణకు ప్రత్యేకమైన వంటకమే అయినా, సౌత్ ఇండియాలోని వేరే రాష్ట్రాల్లో కూడా దీనికి దగ్గర పోలికలు ఉన్న వంటకాలు ఉన్నాయి. వాటిని వేరే పేర్లతో పిలుస్తారు. ఆంధ్రప్రదేశ్ లో గారెలు పిండి అట్టు, కర్ణాటకలో అక్కీ రొట్టి, మహారాష్ట్రలో థాలీపీఠ్, తమిళనాడులో అరిసి రోటీ అని పిలుస్తారు. ప్రతి చోటా దీనికి చిన్నపాటి మార్పులుంటాయి. కానీ మన తెలంగాణ సర్వపిండి తన స్పైసీ రుచితో, కరకరలాడే తీరుతో ప్రత్యేకంగా నిలుస్తుంది.

ఇంట్లో తయారు చేసుకోవడం ఎలా?
కావాల్సినవి:
బియ్యప్పిండి: 1 కప్పు
శనగపప్పు (నానబెట్టినవి): 2 టేబుల్ స్పూన్లు
దంచిన పల్లీలు: 2 టేబుల్ స్పూన్లు
నువ్వులు: 2 టీ స్పూన్లు
పచ్చిమిర్చి (ముక్కలుగా): 2
అల్లం (తురిమినది): 1 అంగుళం ముక్క
కరివేపాకు (ముక్కలుగా): కొద్దిగా
ఉప్పు: రుచికి సరిపడా
నీళ్ళు: తగినన్ని
నూనె: 1-2 టీ స్పూన్లు (వండడానికి)

చేసే విధానం:
ఒక గిన్నెలో పైన చెప్పినవన్నీ వేసి, నీళ్లు పోస్తూ మెత్తటి ముద్దలా కలుపుకోవాలి. ఒక ఫ్లాట్ పెనం లేదా కడాయికి నూనె రాసి, తడి చేతులతో ఈ పిండి ముద్దను పల్చగా, రౌండ్‌గా ఒత్తుకోవాలి. పిండి మధ్యలో కొన్ని రంధ్రాలు పెట్టాలి. ఇలా చేస్తే పిండి బాగా ఉడుకుతుంది. ఈ రంధ్రాల్లో కొద్దిగా నూనె వేయాలి. మూత పెట్టి, చిన్న మంటపై గోల్డెన్ బ్రౌన్ రంగు వచ్చేవరకు ఉడికించాలి. ఒకవేళ అవసరమైతే, తిప్పి, ఇంకొన్ని నిమిషాలు ఉడికించాలి. వేడి వేడి సర్వపిండిని చట్నీతో లేదా నెయ్యితో సర్వ్ చేసుకోవాలి. బాగా క్రిస్పీగా కావాలంటే, పిండిని పల్చగా రౌండ్‌లుగా చేసి, నూనెలో డీప్ ఫ్రై చేసుకోవచ్చు.

ఇది కూడా చదవండి : Vatican City : 800 మంది మాత్రమే ఉండే దేశం |15 నిమిషాల్లో చుట్టేయొచ్చు

హైదరాబాద్‌లో సర్వపిండి ఎక్కడ దొరుకుతాయంటే
తెలంగాణ స్పైస్ కిచెన్ – జూబ్లీ హిల్స్
చట్నీస్ – బంజారా హిల్స్
పచ్చి పులుసు ఫుడ్ ట్రక్ – మాదాపూర్
కాకతీయ మెస్ – అమీర్‌పేట
ఈట్ ఇండియా కంపెనీ – గచ్చిబౌలి
శ్రీవల్లి హోమ్ ఫుడ్స్ – ఏ.ఎస్. రావు నగర్.
టేస్టీ వెరైటీ స్నాక్స్ సెంటర్ – శివగంగ థియేటర్ రోడ్, సరూర్‌నగర్.
శ్రీ రామ స్వామి టిఫిన్ సెంటర్ – నిజామాబాద్.
ఇవి కాకుండా, సిటీలో చాలా చిన్న చిన్న ఫుడ్ జాయింట్స్‌లో కూడా సర్వపిండి దొరుకుతుంది. ధరలు సాధారణంగా రూ.25 నుంచి రూ.150 మధ్య ఉంటాయి.

సర్వపిండి తపాలా చెక్క అనేది ఓ పిండి వంట మాత్రమే కాదు తెలంగాణ చరిత్రలో ఒక భాగం. బయట కరకరలాడుతూ, లోపల మెత్తగా ఉండే సర్వపిండి బ్రేక్‌ఫాస్ట్‌గా గానీ, సాయంత్రం స్నాక్‌గా గానీ చాలా బాగుంటుంది.

ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.

షేర్ చేయండి

Leave a Comment

error: Content is protected !!