అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా కడప రైల్వే స్టేషన్‌ను (Kadapa Railway Station) అప్‌గ్రేడ్ చేస్తోంది భారతీయ రైల్వే. ఒక్కసారి ఈ పనుల పూర్తయితే ఈ రైల్వే స్టేషన్ ఇలా కనిపించనుంది…
అమృత్ భారత్ స్టేషన్ (Amrit Bharat Station) పథకంలో భాగంగా భారత దేశంలో ఉన్న రైల్వే స్టేషన్లను అప్‌గ్రేడ్ చేస్తోంది ఇండియన్ రైల్వేస్. ఇందులో భాగంగా దక్షిణ మధ్య రైల్వే నిర్వహించే ఆంధ్రప్రదేశ్‌లోని 53 రైల్వే స్లేషన్లను పునరాభివృధ్ది చేయనుంది.
రూ.2,611 కోట్లతో నిర్వహిస్తున్న ఈ అప్‌గ్రేడింగ్ పనులతో ప్రయాణికులకు (Travelers) అత్యాధునిక సౌకర్యాలు కల్పించనున్నారు. ఇందులో భాగంగానే కడప రైల్వే స్టేషన్ అప్‌గ్రేడింగ్ పనులు మొదలయ్యాయి. ఈ పనుల వివరాలు..పూర్తయితే ఎలా కనిపిస్తుందో చూడండి.
కడప రైల్వే స్టేషన్‌లో ప్రస్తుతం 31 శాతం అప్‌గ్రేడింగ్ పనులు పూర్తయ్యాయి. ఇందులో ప్రయాణికులు కావాల్సిన ప్రాధమిక అవసరాల, ప్లాట్‌ఫామ్ పనులు ఉన్నాయి. ఈ మొత్తం ప్రాజెక్టు వచ్చే 2025 చివరి నాటికి పూర్తి అవనున్నాయి.
📣ఈ Travel కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. YouTube ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp లో జాయిన్ అవ్వడానికి ఇక్కడ క్లిక్ చేయండి.