సాయి బాబా చివరిగా "నన్ను ఆ రాతిమేడలోకి తీసుకెళ్లండి " అన్నారు
సాయి బాబాను ఎవరైనా మీ తల్లిదండ్రులు ఎవరంటే ఆయన చెప్పిన సమాధానం ఏంటో తెలుసా…బ్రహ్మ నా తండ్రి…మాయ నా తల్లి, ఈ చరాచర విశ్వమంతా నా ఇల్లు.
సాయి బాబా విగ్రహం, ఆలయం ప్రత్యేకతలు

1918 అక్టోబర్ 15 న ఐహిక జీవితాన్ని చాలించారు సాయి బాబా. ఆయన దేహాన్ని సమాధి చేసిన చోటే సమాధిమందిరం. ఇదే సాయి బాబా ఆలయం. షిరిడీ ఉన్న ప్రదేశాలలో సమాధి మందిరానికే అత్యంత విశిష్ట స్థానం ఉంటుంది .
ఇది చూడండి | WATCH : షిరిడీ సాయి సమాధి మందిరం మిస్టరీ |
1914 లో ఇప్పుడు సమాధి మందిరం ఉన్న ప్రదేశంలో ఒక పూలతోట ఉండేది. ఈ తోట సాయి బాబా స్వయం కృషి ఫలితం. అక్కడ నేల చదును చేసి పూల మొక్కలు నాటి రోజూ శ్రద్దగా నీరుపోసేవారు. నాగపూర్ కు చెందిన కోటీశ్వరుడు గోపాలరావు బూటీని ఈ మందిరం నిర్మిచమని సాయి బాబా ఆదేశించారు.
1918 కల్లా ఆ మందిరం తయారైంది. అక్కడ మురళీధరుని ప్రతిష్టించాలని బూటీని ఆశించాడు సాయి బాబా. ద్వారకామాయిలో అంతిమశ్వాస విడుస్తూ ‘నన్ను ఆ రాతిమేడలోకి తీసుకెళ్ళండి’ అన్నారు. అందుకే వారి సమాధి అక్కడ అవతరించింది. ఇది చదివారా ? : కామాఖ్య దేవీ కథ
సమాధి మందిరంలో సాయి బాబా విగ్రహాన్ని 1954లో ప్రతిష్టించారు. శిల్పి శ్రీ తాలిమ్ విగ్రహం చెక్కే సమయంలో అడుగడుగునా సాయి బాబా ఆదేశాలిస్తూ, సూచనలు చేసేవారట. సాయి బాబా విగ్రహానికి అభిషేకం చేస్తుండగా తలమీద నుంచి జాలువారుతున్న పాలను చూస్తుంటే సాయి బాబా కనురెప్పలు కదలాడుతున్నట్లు అనుభూతి కలుగుతుంది. సాయి బాబా ఫాలోవర్స్ అందరికీ ఈ విగ్రహం ఒక గొప్ప కానుకగా చెబుతుంటారు భక్తులు.
ఈ స్టోరిని ప్రయాణికుడు యూట్యూబ్‌లో చూడండి
ఈ స్టోరీ ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. నన్ను ప్రోత్సాహించడం అస్సలు మర్చిపోకండి