Srisailam Brahmostavalu : నేటి నుంచి శ్రీశైల మల్లన్న ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు

షేర్ చేయండి

తెలుగు రాష్ట్రాల్లోనే ప్రముఖ శైవ క్షేత్రం అయిన శ్రీశైలం మల్లన్న సన్నిధిలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు (Srisailam Brahmostavalu) నేడు ప్రారంభం అయ్యాయి. 2025 ఫిబ్రవరి నుంచి మార్చి ఒకటి వరకు ఈ బ్రహ్మోత్సవాలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించనున్నారు.

ఉదయం 9 గంటలకు యాగ శాల ప్రవేశంతో ఉత్సవాలు ప్రారంభం అయ్యాయి. మార్చి 1వ తేదీన రాత్రి పుష్పోత్సవం, శయనోత్సవం జరుగుతుంది. దీంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.
11 రోజుల పాటు వైభవంగా జరిగే ఈ మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఉచితంగా లడ్డూ ప్రసాదాన్ని అందించనున్నారు.
ఫిబ్రవరి 22న తితిదే నుంచి మల్లికార్జున స్వామి,అమ్మవార్లకు పట్టువస్త్రాలను సమర్పించనున్నారు.
ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎం చంద్రబాబు నాయుడు 23వ తేదీన పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు.
23వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు.
శ్రీశైలంలో జరుగుతున్న మహా శివరాత్రి వేడుకలకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉంది అని అధికారులు అంచనా వేస్తున్నారు. కనీసం 20 నుంచి 30 శాతం వరకు భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
అందుకే భక్తుల కోసం తగిన సౌకర్యాలు ఏర్పాటు చేశారు అధికారులు. క్యూల్లైన్లో భక్తులకు మంచి నీటితో పాటు, అల్పాహారం అందించనున్నారు.

అందుకే భక్తుల కోసం తగిన సౌకర్యాలు ఏర్పాటు చేశారు అధికారులు. క్యూల్లైన్లో భక్తులకు మంచి నీటితో పాటు, అల్పాహారం అందించనున్నారు.

Read Also : శ్రీశైలంలో మహహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా భక్తులకు ఉచిత లడ్డూ ప్రసాదం..

📣ఈ Travel కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. YouTube ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp లో జాయిన్ అవ్వడానికి ఇక్కడ క్లిక్ చేయండి. ట్రెండింగ్ వార్తలు కోసం NakkaToka.com విజిట్ చేయండి.

షేర్ చేయండి

Leave a Comment

error: Content is protected !!