Flamingo Festival 2025 : సూళ్లూరుపేట ఫ్లెమింగో ఫెస్టివల్ తేదీలు మారాయా ? ..కొత్త తేదీలు ఇవేనా ?

Share This Story

కొత్త తేదీలు | New Dates Of Flamingo Festival 2025

తిరుపతిలోని సూళ్లూరుపేట ( Sullurpet Bird Festival ) వేదికగా ఏటా ఫ్లెమింగో ఫెస్టివల్ నిర్వహించే విషయం తెలిసిందే.  2025 జనవరి 10 నుంచి 3 రోజుల పాటు ఈ ఫెస్టివల్‌ను నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. అదే సమయంలో తేదీలు మారాయి అంటూ ఒక వార్త వచ్చింది.

Prayanikudu WhatsApp2
ప్రతిరోజు వాట్స్ అప్ ద్వారా ట్రావెల్ కంటెంట్ తెలుగులో పొందాలి అనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి | If You Want to Get Travel & Tourism Updates On Your WhatsApp Click Here

వైకుంఠ ఏకాదశి ( Vaikunta Ekadasi 2025 ) , ద్వాదశి ( Dwadashi ) సందర్బంగా ఈ తేదీలను మార్చినట్టు, ఈ పక్షుల పండగను జనవరి 17 నుంచి అంటే సంక్రాంతి ( Sankranti 2025 ) తరువాత నిర్వహించాలని అధికారులు నిర్ణయించారని ఆ వార్త సారాంశం. అయితే తేదీల మార్పుపై ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల కాలేదు. సో ఇప్పటికైతే పాత తేదీలకే పక్షుల పండగ జరుగుతుంది అని భావించవచ్చు. ఏ మైనా అప్డేట్ వస్తే తప్పకుండా మీతో షేర్ చేసుకుంటాము.

Update On Flamingo Festival 2025 : జనవరి 18 నుంచి ప్రారంభం కానున్న ఫ్లెమింగో ఫెస్టివల్ 

ఒకవేళ ఫ్లెమింగో ఫెస్టివల్ ( Flamingos Festival 2025 ) తేదీలు మారినా కార్యక్రమం జరిగే విధానం, షెడ్యూల్‌లో మార్పు ఉండదని తెలుస్తోంది. అదే సమయంలో పక్షుల పండగను వేడుకగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ఫ్లెమింగో ఫెస్టివల్ గురించి | Facts About Flamingo Festival In Andhra Pradesh 

తిరుపతి ( Tirupati ) జిల్లాలోని సూళ్లూరుపేట, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని నేలపట్టు బర్డ్ శాంక్చువరిలో జరిగే ఫ్లెమింగోస్ ఫెస్టివల్‌కు దూర దూరం నుంచి పక్షి ప్రేమికులు వస్తుంటారు. శీతాకాల సమయంలో పులికాట్ సరస్సుకు ( Pulicat Lake ) భారీగా వలస పక్షుల తాకిడి ఉంటుంది. ఈ సరస్సు మొత్తం వివిధ దేశాలకు చెందిన పక్షులతో నిండిపోతుంది. ఇందులో ఫ్లెమింగోలే ఎక్కువగా ఉంటాయి.

ఈ ఫ్లెమింగోలను స్వాగతించేందుకు ఫ్లెమింగో ఫెస్టివల్‌ను నిర్వహిస్తారు. మూడురోజుల పాటు జరిగే పక్షుల ఉత్సవాలలో అందమైన పక్షులను చూసేందుకు పక్షి ప్రేమికులు ఇక్కడికి వస్తుంటారు. 

1976 లో పులికాట్ వైల్డ్ లైఫ్ డిపార్ట్‌మెంట్ ( Pulicat Wildlife Department ) ఇక్కడ ఒక బర్డ్ శాంక్చువరిని ఏర్పాటు చేసింది. అక్టోబర్ నుంచి ఏప్రిల్ సమయంలో ఇక్కడికి 30 రకాల పక్షులు వస్తాయని సమాచారం. సంతానోత్పత్తి తరువాత ఇక్కడి నుంచి వెళ్లిపోతాయి. 

నేలపట్టులో పక్షులు సంతానోత్పత్తి క్రమం | Nelapattu Birds Reproduction Cycle

Flamingo festival 2025 Sullurpeta Andhra Pradesh (1)
ఫ్లెమింగో పక్షుల ప్రతీకాత్మక చిత్రం
  • నేలపట్టు బర్డ్ శాంక్చువరీ విస్తీర్ణం 458.92 హెక్టార్లు.
  • నైజీరియా, బంగ్లాదేశ్, బర్మా. పాకిస్తాన్‌తో పాటు వివిధ దేశాల పక్షులు ఇక్కడికి వస్తాయి.
  • అక్టోబర్ , నవంబర్ నెలలో పక్షులు ఇక్కడికి వస్తాయి. గూళ్లు ఏర్పాటు చేసుకుంటాయి.
  • నవంబర్, డిసెంబర్ నెలలో గుడ్లు పెడతాయి.
  • డిసెంబర్, జనవరి నెలలో గుడ్ల నుంచి పిల్లలు బయటికి వస్తాయి.
  • జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్‌లో పిల్లలను పోషించి ఏప్రిల్ నెలలో నేల పట్టు నుంచి వెళ్లిపోతాయి.  

పక్షుల వలసలు, వేట కొనసాగేది ఇలా | Birds Migration

శీతాకాలంలో ( Winter Andhra Pradesh ) వేలాది సంఖ్యలో విదేశీ పక్షులు వలస వస్తాయి. పులికాట్ సరస్సులో వేటాడి నేలపట్టులో గూళ్లు ఏర్పాటు చేసుకుంటాయి. వివిధ జాతుల పక్షులు బ్రీడింగ్  కోసం పులికాట్ ( Flamingo festival Sullurpet, Andhra Pradesh) చేరుకుంటాయి. ఇందులో కొన్ని పక్షులు పులికాట్‌లో లోతైన నీటిలో వేటను కొనసాగిస్తాయి. బ్రీడింగ్ సీజన్ ముగిసిన వెంటనే తమ తమ ప్రాంతాలకు, దేశాలకు వెళ్లిపోతాయి. ఈ మేరకు నేలపట్టు బర్డ్ శాంక్యువరీ ( Nelapattu Bird Sanctuary ) అధికారులు వలస పక్షుల కోసం తగిన ఏర్పాట్లు చేస్తారు.

నేలపట్టు బర్డ్ శాంక్చువరీకి ఎప్పుడు రావాలి ? | Best Time To Visit Nelapattu

దేశ విదేశాల నుంచి వచ్చే పక్షులను చూసేందుకు పక్షి ప్రేమికులు ( Bird Lovers ) నేలపట్టు వస్తూ ఉంటారు. ఇక బెస్ట్ టైమ్ విషయానికి వస్తే ఈ పక్ష్లులు ఉన్న సమయంలో అంటే అక్టోబర్ నుంచి మార్చి వరకు ఇక్కడికి రావచ్చు. ఇక ఫెస్టివల్ సమయానికి ఇక్కడికి వస్తే ఇంకా బెటర్.

గమనిక: ఈ వెబ్‌సైట్లో ప్రకటనలు కూడా ఉంటాయి. ముఖ్యంగా గూగుల్ యాడ్స్ ద్వారా ఈ ప్రకటనలు మీకు కనిపిస్తాయి. ఈ ప్రకటనలే మాకు ఆధారం. ఇందులో కొన్ని ప్రకటనలపై మీరు క్లిక్ చేస్తే మాకు ఆదాయం వస్తుంది.

Watch More Vlogs On : Prayanikudu

ఈ  Travel కంటెంట్ నచ్చితే, ఎవరికైనా ఉపయోగపడుతుంది. అనుకుంటే షేర్ చేయగలరు. ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. యూట్యూబ్ ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి.

ప్రపంచ యాత్ర గైడ్

భారత దేశ యాత్రా దర్శిని

Share This Story

Leave a Comment

error: Content is protected !!
12 నెలల్లో నెలకొకటి చొప్పున ఆసియాలోని 12 దేశాలను చుట్టేయండి | 12 Destinations in 12 Months in Asia ఈ జెనరేషన్ ప్రయాణికుల వద్ద ఉండాల్సిన 5 గ్యాడ్జెట్స్ Airplane Mode ఎందుకు యాక్టివేట్ చేయాలి ? చేయకుంటే ఏం అవుతుంది ? ప్రపంచంలో టాప్ 10 కైట్ ఫెస్టివల్స్ జరిగే దేశాలు ప్రపంచంలోనే 10 అత్యంత చల్లని దేశాలు – 10 COLDEST COUNTRIES