Viral Video : పాకిస్తాన్ ప్రయాణికుల వింత అవతారం.. దుప్పట్లను శాలువాలా చుట్టుకుని ఎయిర్‌పోర్ట్ వాక్
పాకిస్తాన్‌కు చెందిన ఒక ఫన్నీ వీడియో ఇప్పుడు నెట్టింట సందడి (Viral Video) చేస్తోంది. ఇందులో పాకిస్తాన్ ప్రయాణికులు వింతైన అవతారంలో దర్శనం ఇస్తారు. అయితే ఇందులో వారు వేసుకుంది ఏ డిజైనర్ ఔట్‌ఫిట్ అని అనుకోండి. విమానంలో అందించే ఎయిర్‌లైన్ బ్లాంకెట్స్‌ను కొట్టేసి వాటిని శరీరానికి చుట్టేసి దర్జాగా ఎయిర్‌పోర్టులోంచి బయటికి వెళ్లారు అని అంటున్నారు నెటిజెన్లు.