తెలంగాణలో సందర్శనీయ ప్రాంతాలు, పార్కులు, మెట్రో ట్రైన్ టికెట్లు బుక్ చేసుకునేందుకు ఇకపై మీరు అంతగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇవన్నీ మీరు ” మీ టికెట్ ” ( Mee Ticket App ఒకే యాప్ వినియోగించి బుక్ చేసుకోవచ్చు.
Tables Of Content
మీరు జూ పార్కు ( Hyderabad Zoo Park ) వద్దనో లేక తెలంగాణలోని పలు ఆలయాల్లో క్యూలైన్లో నిలబడి టికెట్లు కొనే అవసరం లేదిక. మీకు కావాల్సిన టికెట్లను బుక్ చేసుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం మీ టికెట్ అనే పేరుతో ఒక యాప్‌ను లాంచ్ చేసింది. ఈ యాప్‌ను మీ సేవ ( Mee Seva ) రూపొందించింది. ఇటీవలే తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఈ యాప్‌ను లాంచ్ చేశారు

| మీ టికెట్ యాప్‌ను లాంచ్ చేసిన తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు, అధికారులు
మీ టికెట్ ప్రత్యేకతలు | Specifications of Mee Ticket App
తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రముఖ దేవాలయాలు, పార్కులు, టూరిస్టు ప్లేసులు, బోటింగ్ కేంద్రాలు, జీహెఎంసి స్పోర్ట్స్ ఫెసిలిటీస్, జీహెచ్ఎంసి కమ్యూనిటీ హాల్స్‌ను మీరు ఈ యాప్ ఉపయోగించి బుక్ చేసుకోవచ్చు. ఇందులో తెలంగాణలోని 15 ఆలయాలు, 129 పార్కులు, 54 బోటింగ్ కేంద్రాలతో పాటు జూ పార్కులు, మెట్రో రైల్ వంటి ఎన్నో సేవలకు సంబంధించిన టికెట్లు మీరు బుక్ చేసుకోవచ్చు.
పౌరసేవలనున మరింతగా విస్తరించే దిశలో తెలంగాణ ప్రభుత్వం ( Telangana Govt ) ఈ యాప్‌ను లాంచ్ చేసింది. ఒకే యాప్‌లో అన్ని పర్యాటక, లీజర్, ఎంటర్టైన్మెంట్, ట్రావెల్ బుకింగ్ సర్వీసులు అందుబాటులో ఉంటాయి. దీని వల్ల ఇకపై ప్రజలు సులభంగా వివిధ సేవలను, ఎంట్రీ టికెట్లు పొందవచ్చు.
ఈ యాప్ ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవాలి ?
How to Download Mee Ticket App : మీ టికెట్ అనే ఈ యాప్‌ను మీరు ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకున్నాక ముందు మీ నెంబర్‌తో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ పూర్తి అయిన తరువాత లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. లాగిన్ అయిన వెంటనే మీకు యాప్‌లో అన్ని ఫీచర్లు కనిపిస్తాయి.
మీ టికెట్లో టికెట్ ఎలా కొనాలి ?

How To Book Hyderabad Metro train ticket in Mee Ticket APp : ముందుగా మీకు మెట్రో ట్రైన్ ఫీచర్ కనిపిస్తుంది. ఇందులో మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లనున్నారో వివరాలు ఎంటర్ చేస్తే వన్‌వే లేదా టూ వే టికెట్ ధరలు కనిపిస్తాయి. తరువాత మీరు బుకింగ్ కోసం పేమెంట్ చేయాల్సి ఉంటుంది. మీ మొబైల్లో అందుబాటులో ఉన్న పేమెంట్ యాప్‌తో పేమెంట్ పూర్తి చేయవచ్చు.
15 దేవాలయాలు ఇవే | 15 Temple of Mee Ticket App
మీ టికెట్ యాప్‌లో తెలంగాణలోని 15 ప్రముఖ దేవాలయాల ( Telangana Temples ) వివిధ సేవలు, దర్శన టికెట్లను భక్తులు కొనుగోలు చేయచ్చు. ఈ యాప్‌లో ఉన్న దేవాలయాలు
- 1. శ్రీ లక్ష్మీ నరసింహా స్వామి వారి దేవస్థానం, యాదగిరిగుట్ట : అన్నదానం, భోగం, బ్రహ్మోత్సవం, దర్శనంతో పాటు మరిన్ని సేవల టికెట్లు బుక్ చేసుకోవచ్చు.
- 2. శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం, కీసరగుట్ట: కల్యాణం, పూజ, అన్నదానం టికెట్లు బుక్ చేసుకోవచ్చు.
- 3.శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయం, కాళేశ్వరం: అర్చన, పూజ, అన్నదానం, హోమం, అభిషేకం, వ్రతంతో పాటు మరికొన్ని సేవల టికెట్లు బుక్ చేసుకోవచ్చు.
- 4.శ్రీ రాజ రాజేశ్వర స్వామి వారి దేవస్థానం, వేములవాడ : దర్శనం, సేవలు, అన్నదానం, ప్రసాదం టికెట్లు బుక్ చేసుకోవచ్చు.
- 5. శ్రీ ఉజ్జయిని మహాంకాళి దేవస్థానం, సికింద్రాబాద్
- 6.శ్రీ ఙ్ఞానసరస్వతి దేవస్థానం, బాసర
- 7. శ్రీ భద్రకాళి దేవస్థానం, వరంగల్
- 8.శ్రీ గణేష్ ఆలయం, సికింద్రాబాద్
- 9.శ్రీ పెద్దమ్మ తల్లి దేవస్థానం, హైదరాబాద్
- 10. శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం, కొండగట్టు
- 11. శ్రీ లక్ష్మీ నరసింహా స్వామి దేవస్థానం, ధర్మపురి
- 12. శ్రీ కర్మాన్‌ఘాట్ హునుమాన్ దేవస్థానం, హైదరాబాద్
- 13.శ్రీ మళ్లికార్జున స్వామి వారి దేవస్థానం, కొమురవెల్లి
- 14.శ్రీ సీతా రామచంద్ర స్వామి వారి దేవస్థానం, భద్రాచలం
- 15. శ్రీ ఎల్లమ్మ పోచమ్మ దేవస్థానం, బల్కంపేట, హైదరాబాద్
పైన వివరించిన 15 ఆలయాలకు సంబంధించిన సేవా టికెట్లు, దర్శన, అన్నదాన, హోమం, అభిషేకాలు, కల్యాణం, పూజ, ఒడి బియ్యం వంటి టికెట్లను మీరు సెలక్ట్ చేసుకుని పేమెంట్ చేసి బుక్ చేసుకోవచ్చు.
పార్కులు | Parks in Mee Ticket App
మీ టికెట్ యాప్‌లో మీరు 129 పార్కుల ఎంట్రీ టికెట్లను బుక్ చేసుకోవచ్చు. ఇందులో కేబీఆర్ పార్కు, లక్నవరం ఫెస్ట్ క్యాంప్ ( Laknavaram Fest Camp ), బొటానికల్ గార్డెన్, పోచారం వైల్డ్ లైఫ్ శాంక్చువరి, ముక్తివనం పార్క్, సోమశిల అర్బరన్ పార్క్ , లుంబిని పార్క్ ,ఎన్టీఆర్ గార్డెన్ వంటి పార్కుల టికెట్లను మీరు బుక్ చేసుకోవచ్చు.
బోటింగ్ | Boating Points in Mee Ticket App
బోటింగ్ విషయానికి వస్తే మొత్తం 54 బోటింగ్ కేంద్రాల టికెట్స్ మీరు ఈ యాప్‌లో బుక్ చేసుకోవచ్చు. ఇందులో కోమటి చెరువు , నక్లెస్ రోడ్డు బోటింగ్, దుర్గం చెరువు, పొచ్చర జలపాతం, హుస్సెయిన్ సాగర్, వంటి అనేక బోటింగ్ ప్రదేశాలు ఇందులో అందుబాటులో ఉన్నాయి.
Mee Ticket యాప్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఈ లింకుపై క్లిక్ చేయండి.
ఈ యాప్‌లో మీరు కావాల్సిన సర్వీసునె సెర్చ్ చేసే వెసులుబాటు కూడా ఉంటుంది. తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన ఈ యాప్ ఎలా ఉందో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చెప్పండి.
- వంజంగి ఎలా వెళ్లాలి ? ఎలా సిద్ధం అవ్వాలి ? 10 టిప్స్ !
- Azerbaijan అజర్ బైజాన్ ఎలా వెళ్లాలి ? ఏం చూడాలి ? 10 టిప్స్!
- Trending Video On : Prayanikudu Youtube Channel
- Lambasingi : నేషనల్ క్రష్ లంబసింగి ఎలా వెళ్లాలి ? నిజంగా స్నో పడుతుందా ? 5 Tips & Facts
- Palani Temple : పళని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం గైడ్ ! 10 Facts
- అంటార్కిటికా : 70 శాతం మంచినీరు ఇక్కడే ఉంది…రాత్రి సూరీడు…పగలు చీకటి
- Thailand 2024 : థాయ్‌లాండ్ ఎలా వెళ్లాలి ? ఏం చూడాలి ?