బెంగుళూరు వెళ్లే తెలుగు ప్రయాణికులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) శుభవార్త చెప్పింది. ఇకపై బెంగుళూరు వెళ్లే ప్రయాణికులకు టికెట్ బుకింగ్‌లో ప్రత్యేక రాయితీ ఇవ్వనున్నట్టు ప్రకటించింది. ఆ వివరాలు ఏంటో తెలుసుకుందామా…
తెలుగు రాష్ట్రాల నుంచి చాలా మంది ఇతర రాష్ట్రాలకు వెళ్తుంటారు. ఉద్యోగాలు, వ్యాపారాలు, ఎగ్జామ్స్ లేదా పర్యాటకానికి చెన్నై (Chennai), బెంగుళూరు, మహారాష్ట్ర వెళ్తుంటారు. హైదరాబాద్ లేదా తెలంగాణలోని ఇతర ప్రాంతాల నుంచి చాలా మంది ప్రయాణికులు ఆర్టీసీ బస్సులో టికెట్ బుక్ చేసుకుని వెళ్తుంటారు.
11 నుంచి 12 గంటల ఈ ప్రయాణం సౌకర్యంగా, సురక్షితంగా ప్రశాంతంగా ఉండేందుకు చాలా మంది ఆర్టీసి బస్సుల్లో ప్రయాణించేందుకు ఇష్టపడుతుంటారు. ఎందుకంటే ఆర్టీసీ ప్రయాణికుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తుంది.
ఇలా ఆర్టీసీ బస్సుల్లో (RTC Busses) బెంగుళూరు వెళ్లె తెలుగు ప్రయాణికులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై బెంగుళూరు వెళ్లే ప్రయాణికులకు టికెట్ బుకింగ్‌లో ప్రత్యేక డిస్కౌంట్ ఇవ్వనున్నట్టు ప్రకటించింది.
ముఖ్యాంశాలు
డిస్కౌంట్ ఎంత అంటే ? | TGSRTC Discounts
బెంగుళూరు రూట్‌లో ప్రయాణించే వారికి 10 శాతం రాయితీ కల్పించనున్నట్టు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణ సంస్థ ( Telangana State Road Transportation Corporation) ఒక ప్రకటనలో తెలిపింది. ఈ డిస్కౌంట్ అనేది తెలంగాణ నుంచి బెంగుళూరుకు నడిచే అన్ని సర్వీసులకు వర్తిస్తుంది అని వివరించింది. లగ్జరీ, సూపర్ లగ్జరీ, ఏసీ స్లీపర్, రాజధాని వంటి అనేక రకాల బస్సుల్లో టికెట్ బుక్ చేసుకుంటే 10 శాతం డిస్కౌంట్ లభించనుంది.
సూపర్ సేవింగ్స్

హైదరాబాద్ నుంచి చాలా మంది కర్ణాటక (Karnataka) రాజధాని బెంగుళూరుకు వెళ్తుంటారు.వీకెండ్‌లో వెళ్లి తమ పనులు చూసుకుని వెంటనే తిరిగి వస్తుంటారు. ఇకపై తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ బస్సులో బెంగూళూరుకు (Hyderabad To Bengaluru) బుకింగ్ చేసుకోవడం వల్ల ప్రయాణికులకు కనీసం రూ.100 నుంచి రూ.160 వరకు డబ్బులు ఆదా అవుతాయి.
టికెట్లు ఎలా బుక్ చేసుకోవాలి ? | How to Book TGSRTC Bus Tickets ?
బెంగుళూరు బస్సు టికెట్లను డిస్కౌంట్‌లో బుక్ చేసుకోవాలి అనుకునే ప్రయాణికులు టికెట్ల రిజర్వేషన్ కోసం తెలంగాణ రాష్ట్ర ఆర్టీసి సంస్థ అధికారిక వెబ్‌సైట్ విజిట్ చేయాల్సి ఉంటుంది.
వెబ్‌సైట్ లింక్ : https://www.tgsrtcbus.in/
ఈ లింకుపై క్లిక్ చేస్తే మీకు తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ అఫిషియల్ సైట్ ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లాలి అనుకుంటున్నారు, తేదీలు, తిరుగు ప్రయాణం వంటి వివరాలు ఎంటర్ చేయాలి. మీ ముందు ధరల పట్టి వస్తుంది. ఇందులో ఏదో ఒకటి ఎంచుకున్న తరువాత సీట్లను కన్ఫర్మ్ చేసుకోవాలి.
తరువాత ప్రయాణికుల వివరాలు, టికెట్ల సంఖ్య వంటి డీటెయిల్స్ ఎంటర్ చేసి పేమెంట్ చేయాల్సి ఉంటుంది. పేమెంట్ ప్రక్రియ పూర్తి అయితే వెంటనే మీకు కన్ఫర్మేషన్ వస్తుంది. అంటే మీ టికెట్లు బుక్ అయినట్టే.
బెంగుళూరు తరచూ వెళ్లే ప్రయాణికులకు ఈ డిస్కౌంట్ ఆఫర్ వల్ల ఆర్థికంగా లాభం కలుగుతుంది. టికెట్లో కనీసం రూ.100 నుంచి మ్యాగ్జిమం రూ.160 వరకు రాయితీ లభించనుంది.
ఏఏ బస్సులు అంటే..| TGSRTC Bengaluru Bus Discounts Details
ఏసీ స్లీపర్ (బర్త్) : ప్రస్తుతం టికెట్ ధర వచ్చేసి రూ.1569 కాగా డిస్కౌంట్ తరువాత ఇది (AC Sleeper Bus To Bengaluru TGSRTC) రూ.1412 కు అందుబాటులోకి రానుంది.
- AC SLP-STR ( సీటర్ ) : ఈ బస్సు టికెట్ ధర ప్రస్తుతం రూ.1203గా ఉంది. డిస్కౌంట్ తరువాత ఇది రూ.1083కే లభిస్తుంది (AC SLP-STR Bus To Bengaluru TGSRTC).
- రాజధాని : తెలంగాణ ఆర్టీసి రాజధాని ( Rajdhani Bus To BengaluruTGSRTC) బస్సు టికెట్ ధర ప్రస్తుతం రూ.1203గా ఉంది. డిస్కౌంట్ తరువాత మీరు రూ.1083 చెల్లించాల్సి ఉంటుంది.
- ఎన్‌ఏసీ స్లీపర్ (బర్త్) : ప్రస్తుం దీని (NAC Sleeper Bus To Bengaluru TGSRTC) టికెట్ ధర వచ్చేసి రూ.1160 గా ఉంది. డిస్కౌంట్ పోనూ మీకు ఈ టికెట్ వచ్చేసి రూ.1044కు లభిస్తుంది.
- ఎన్‌ఏసీ సీటర్ : ఈ బస్సు టికెట్ ధర వచ్చేసి ప్రస్తుతం (NAC Seater Bus To Bengaluru TGSRTC) రూ.951 గా ఉంది. రాయితీ తరువాత ఇది మీకు రూ.856 కి లభిస్తుంది.
సూపర్ లగ్జరీ : సూపర్ లగ్జరీ బస్సులో బెంగుళూరుకు వెళ్లాలంటే ప్రయాణికులు రూ.946 చెల్సించాల్సి వచ్చేది. కానీ డిస్కౌంట్ తరువాత ఇది (Super Luxury Bus To Bengaluru TGSRTC) మీకు రూ.851 కే లభిస్తుంది.
📣ఈ Travel కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. YouTube ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp లో జాయిన్ అవ్వడానికి ఇక్కడ క్లిక్ చేయండి. ట్రెండింగ్ వార్తలు కోసం NakkaToka.com విజిట్ చేయండి.