TGSRTC Special Busses : సంక్రాంతికి తెలంగాణ ఆర్టీసి ప్రత్యేక బస్సులు .. టికెట్ ధరలో సవరింపు
తెలుగు రాష్ట్రాల్లో వైభవంగా చేసుకునే పండగల్లో సంక్రాంతి ఒకటి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో సంక్రాంతి సంబరాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏడాది మొత్తం ఎక్కడ ఉన్నా తమ సొంత ఊళ్లకు వెళ్లాలని తెలుగు రాష్ట్రాల ప్రజలు కోరుకుంటారు. దీని కోసం ప్రజారవాణా వ్యవస్థను అత్యధికంగా వినియోగిస్తుంటారు. సంక్రాంతి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ( TGSRTC Special Busses ) యాజమాన్యం 6432 ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించింది.
Table Of Content
సంక్రాంతి పండగ ( Sankranti 2025 ) నేపథ్యంలో తమ ఊరికి వెళ్లాలని భావించే ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేరుకోవడానికి ప్రత్యేక బస్సులను నడపాలని టీజీఎస్ఆర్టీటీసి యాజమాన్యం నిర్ణయించింది. మరి కొన్ని రోజుల్లో ప్రయాణికుల రద్దీ పెరిగే అవకాశం ఉంది. మీరు ముఖ్యంగా జనవరి 10, 11, 12 వ తేదీల్లో చాలా మంది తమ సొంత ఊళ్లకు ప్రయాణాలు మొదలు పెడతారు. ఈ రద్దీని గమనించి ప్రత్యేక బస్సుల సంఖ్యను పెంచారు. అలాగే 19, 20 తేదీల్లో తిరుగు ప్రయాణం చేసే ప్రయాణికుల కోసం కూడా ప్రత్యేక బస్సులు నడపనుంది ఆర్టీసి.
- ఇది కూడా చదవండి : Indian License : భారతీయ లైసెన్స్ ఈ 15 దేశాల్లో కూడా చెల్లుతుంది
ప్రత్యేక బస్సులు వివరాలు | TGSRTC Sankranti Special Bus Key Feature
సంక్రాంతి సందర్భంగా ప్రయాణికుల సంఖ్య, రద్దీ పెరిగే అవకాశం ఉంది. ఈ మేరకు హైదరాబాద్‌లో రద్దీ అధికంగా ఉన్న పలు ప్రాంతాల నుంచి స్పెషల్ బస్సులు నడపనుంది తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ. ఇందులో ఎంజీబిఎస్ ( Mahatma Gandhi Bus Station ), జేబీఎస్ ( జూబ్లీ బస్ స్టేషన్ ) , ఉప్పల్ క్రాస్ రోడ్డు, ఆరాంఘర్, ఎల్బీ నగర్ క్రాస్ రోడ్డు, కేపీహెచ్పీ, బోయిన్పల్లి, గచ్చిబౌలి వంటి ప్రాంతాలు ఉన్నాయి.

- ప్రయాణికుల సౌకర్యార్థం టీజీఎస్ఆర్టీటీసి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది.
- ప్రయాణికులు కూర్చోవడానికి పండాల్స్, షామియానాలు ఏర్పాటు చేయనుంది.
- సౌకర్యంగా కూర్చునేందుకు కుర్చీలు ఏర్పాటు చేయనున్నారు.
- ఎప్పటికప్పుడు తాజా సమాచారం తెలపే పబ్లిక అడ్రెస్ సిస్టమ్ ఏర్పాటు.
- ప్రయాణికులకు తాగునీటి సదుపాయం కల్పించనున్నారు.
- వివిధ స్టాపులలో మొబైల్ టాయిలెట్స్ సదుపాయం కూడా కల్పించనున్నట్టు టీజీఎస్ఆర్టీటీసి తెలిపింది.
ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలగుకుండా ఉండేలా ఈప్రత్యేక సౌకర్యాలు కల్పించేందుకు ఏర్పాట్లు చేయనున్నారు.
టికెట్ ధరల సవరింపు | TGSRTC Special Busses 2025 Ticket Fare
ప్రభుత్వ సూచనల మేరకు సంక్రాంతి సందర్బంగా నడిపే ప్రత్యేక బస్సుల టికెట్ ధరలను సవరిస్తోంది టీజీఎస్ఆర్టీటీసి .ఈ మేరకు ప్రతీ టికెట్‌పై రూ.1 రూపాయి 50 పైసలు పెరుగుతాయి. అయితే ఈ టికెట్ ఛార్జీలు తెలంగాణతో ( Telangana ) పాటు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఇతర రాష్ట్రాల్లో నడిపే స్పెషల్ బస్సులకు మాత్రమే వర్తిస్తాయి. ఈ టికెట్ ధరలు సంక్రాంతి రష్ ఉండే 2025 జనవరి 10,11,12 వ తేదీలతో పాటు తిరుగు ప్రయాణ రష్ అధికంగా ఉండే 19,20 తేదీలకు మాత్రమే వర్తిస్తుంది. ఈ ఛార్జీలు కేవలం స్సెషల్ బస్సులకు మాత్రమే వర్తిస్తాయి. రెగ్యుల్ సర్వీసు బస్సుల ధరల్లో ఎలాంటి మార్పు ఉండదు అని ఆర్టీసి అధికారులు తెలిపారు. మీ సౌకర్యాన్ని బట్టి, ఆర్థిక పరిస్థితిని బట్టి మీరు ఏ బస్సులో ప్రయాణించాలో నిర్ణయించవచ్చు.
మరి ఉచిత బస్సు ప్రయాణం | Free Busses on TSRTC Sankranti 2025
సంక్రాంతి ( Sankranti In Andhra Pradesh ) సందర్భంగా, తెలంగాణ ప్రభుత్వ మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలు ఉచిత బస్సు ప్రయాణాన్ని కొనసాగింవచ్చు. పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో పండగ సమయంలో ప్రయాణించవచ్చు.
టికెట్ ధర పెంచడానికి కారణం..
ప్రయాణికుల భద్రత కోసం టీజీఎస్ఆర్టీటీసి కట్టుబడి ఉంటుంది అని ఆర్టీసి అధికారులు తెలిపారు. మరీ ముఖ్యంగా ప్రత్యేక పండగలు, ఇతర ప్రధాన సందర్భాల్లో ప్రయాణికులు తమ గమ్యస్థానానికి చేరుకోవడానికి ఆర్టీసి సంస్థ ప్రత్యేకంగా బస్సులను నడుపుతూ ఉంటుంది. ఆర్టీసి ప్రయాణం ఆర్థికంగానే కాదు సేఫ్ కూడా. కొన్ని సందర్భాల్లో బస్సులో రద్దీ లేకపోయినా, బాగా రష్ ఉన్న రూట్లలో ఉన్న బస్సులను సైతం టికెట్ బుక్ చేసుకున్న ప్రయాణికుల కోసం వెనక్కి రప్పించి కమిట్మెంట్ పూర్తి చేస్తారు.

ఒక రూట్లో ప్రయాణికుల సంఖ్య ఎక్కువ, మరో రూట్లో దాదాపు ఖాళీ బస్సులు తిప్పాల్సి వస్తుంది. ఇది మనం చాలాసార్లు గమనించే ఉంటాం. అయితే డిజీల్ ఖర్చులు, బస్సు మెయింటెనెన్స్ మాత్రం తప్పవు కదా. కాబట్టి స్పెషల్ బస్సులు నడిపే సమయంలో టికెట్ ధరను రివైజ్ చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం 2003 లో జీవో నెం.16ను జారీ చేసింది. కేవలం స్పెషల్ డేస్‌లో మాత్రమే టికెట్ ధరలను ఒక్క రూపాయి 50 పైసలను పెంచేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. సో గవర్నమెంట్ ఆర్డర్ ప్రకారం 2025 జనవరి 10, 11, 12 తేదీలతో పాటు 19,20 వ తేదీల్లో ఆర్టీసి బస్సుల చార్జీలు స్వల్పంగా పెరగనున్నాయి.
తెలంగాణ ఆర్టీసి బస్సు బుకింగ్ విధానం | How To Book TGSRTC Bus Online
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ( Telangana State Road Transport Corpration ) నడిపే బస్సులను మీరు ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు. దీని కోసం మీరు సంస్థ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాల్సి ఉంటుంది.
- తెలంగాణ రాష్ట్ర ఆర్టిసి బస్సు వెబ్సైట్ : [www.tgsrtcbus.in]- (http://www.tgsrtcbus.in)
- సంక్రాంతి స్పెషల్ బస్సుల గురించి మరింత సమాచారం కోసం సంప్రదించాల్సిన నెంబర్లు : 040-69440000 లేదా 040-23450033
- దీంతో పాటు హైదరాబాద్‌లోని మహత్మాగాంధి బస్టాండ్, జూబ్లీ బస్టాండ్‌లో కూడా మీరు ఎన్క్వైరి చేయవచ్చు.
Trending Video On : Prayanikudu Youtube Channel
- వంజంగి ఎలా వెళ్లాలి ? ఎలా సిద్ధం అవ్వాలి ? 10 టిప్స్ !
- Lambasingi : నేషనల్ క్రష్ లంబసింగి ఎలా వెళ్లాలి ? నిజంగా స్నో పడుతుందా ? 5 Tips & Facts
- Palani Temple : పళని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం గైడ్ ! 10 Facts
- అంటార్కిటికా : 70 శాతం మంచినీరు ఇక్కడే ఉంది…రాత్రి సూరీడు…పగలు చీకటి
- Thailand 2024 : థాయ్‌లాండ్ ఎలా వెళ్లాలి ? ఏం చూడాలి ?
- Azerbaijan అజర్ బైజాన్ ఎలా వెళ్లాలి ? ఏం చూడాలి ? 10 టిప్స్!