థాయ్‌లాండ్ వెళ్లే ప్రయాణికులకు శుభవార్త. 2025 జనవరి 1వ తేదీ నుంచి థాయ్ కింగ్డమ్ ( Thai Kingdom ) అంతర్జాతీయంగా ఈ వీసా సేవలను ప్రారంభించనుంది. దాని కోసం కొత్తగా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించింది. ఈ ప్లాట్‌ఫామ్‌లో ప్రయాణికులు ఈ వీసా ( Thailand e-visa ) అప్లికేషన్‌ను పూర్తి చేయవచ్చు. దీని వల్ల ఈ దేశంలో అడుగు పెట్టడానికి ముందే మీకు ప్రయాణ అనుమతి లభించనుంది.
ముఖ్యాంశాలు
భారతీయ ప్రయాణికులు గమనించాల్సిన విషయాలు
Notice For Indian Traveler’s Going For Thailand : థాయ్‌లాండ్ వెళ్లాలి అనుకునే ప్రయాణికులు వీసా లేకుండా 60 రోజుల వరకు ఆ దేశంలో ఉండవచ్చు. ఈ వీసాతో పాటు ఈ సదుపాయం కూడా అందుబాటులో ఉండనుంది.మరింత మంది విదేశీ పర్యాటకులను ఆకట్టుకుని తమ దేశంలోకి ఆహ్వానించేందుకు థాయ్ విదేశీ మంత్రిత్వ శాఖ ఈ సేవలను ప్రారంభించింది. ఈ వీసా వల్ల ప్రయాణికులు ఆన్‌లైన్లోనే అప్లికేషన్‌ను పూర్తి చేయవచ్చు.దీని వల్ల చాలా టైమ్ సేవ్ అవుతుంది.
ఈ వీసాలో కవర్ అయ్యే అంశాలు | What The e- Visa Covers ?
ఈ వీసా అనేది టూరిస్టులు,వ్యాపారులతో పాటు వైద్యం ( Medical Tourism ) కోసం థాయ్ వెళ్లే వారికి ఉపయోగపడుతుంది.
థాయ్ ఈ వీసా ఎలా అప్లై చేయాలి ? | How To Apply Thailand e- Visa Step By Step
థాయ్ ఈ వీసా అనేది చాలా సింపుల్. ఈ ఆరు స్టెప్స్ పాటిస్తే సరిపోతుంది.

- వెబ్‌సైట్ విజిట్ చేయడం : ముందుగా www.thaievisa.go.th లేదా http://www.thaievisa.go.th విజిట్ చేయండి. ఇది థాయ్ ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్.
- ఎకౌంట్ క్రియేట్ చేయడం : విజిట్ చేసిన తరువాత మీ మెయిల్ ఐడీతో రిజిస్టర్ చేసుకోండి.
- అప్లికేషన్ పూర్తి చేయండి: అప్లికేషన్ ఫిల్ చేయడానికి మీ వివరాలు ఎంటర్ చేయండి.
- అప్లోడ్ : అక్కడ అడిగిన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయండి.
- ఫీజు : థాయ్ ఈ వీసా ఫీజు చెల్లించేందుకు ఒక సురక్షిత పేమెంట్ విధానాన్ని ఎంచుకోండి.
- ఈ వీసా పొందండి : అప్రూవల్ అయిన తరువాత ఈ వీసా మీ ఈమెయిల్‌కు వస్తుంది.
60 రోజుల వీసా.. | Thai to Continue 60 Days Visa Exemption for Indians
వీసా లేకుండా 60 రోజుల వరకు భారతీయులు థాయ్‌లాండ్‌లో ఉండే సదుపాయం కొనసాగుతుంది అని థాయ్ ఎంబసీ ( Thai Embassy India ) తెలిపింది. దీంతో థాయ్‌లాండ్ షార్ట్ ట్రిప్‌లో భారీ వీసా ప్రాసెస్ నుంచి తప్పించుకోవచ్చు.
ఈ వీసా అప్లై చేసే వాళ్లు పాస్‌పోర్టు లేదా ఇతర డాక్యుమెంట్స్‌ను థాయ్ డిప్లమేట్స్‌కు అందించాల్సిన అవసరం లేదు. ఈ వీసా అప్లై చేయడానికి వ్యక్తులు ఈ వీసా అందుబాటులో ఉన్న దేశంలో ఉండాలి. ఈ వీసా అప్లై చేసిన తరువాత మీకు అప్రూవ్ అయితే మీకు మెయిల్ వస్తుంది. దానిని థాయ్‌లాండ్ వెళ్లినప్పుడు ఇమ్మిగ్రేషన్, ఎయిర్‌లైన్స్ అధికారులకు అందించేందుకు మీరు మీతో క్యారీ చేయండి.
థాయ్‌లాండ్ టూరిజం ఆథారిటీ గవర్నర్ ( TAT ) యుతాసక్ సుపాసాన్ ఈ వీసా వల్ల మరింత మంది ట్రావెలర్స్ ( Travel ) తమ దేశానికి వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. కొత్త విధానం వల్ల టూరిజం పరిశ్రమలో కీలక మార్పులు చోటు చేసుకుంటాయి అని ఆశిస్తున్నాం అన్నారు.
ప్యాక్ యువర్ బ్యాగ్స్, మై ఫ్రెండ్
సో, ఇంకా లేటెందుకు థాయ్‌లాండ్ అద్భుతమై బీచులు, కల్చర్, వ్యూస్, అందమైన బ్యాంకాక్ ( Bangkok ) , పట్టాయా ( Pattaya ) వంటి నగరాలను అన్వేషించడానికి మీ బ్యాగులు సిద్ధం చేసుకోండి. దానికి తోడు ఈ వీసా వచ్చేసింది కాబట్టి మరింత సులభంగా మీరు మీ ప్రయాణాన్ని ప్రారంభించవచ్చు. మరిన్ని వివరాల కోసం థాయ్ ఈ వీసా అధికారిక వెబ్‌సైట్ విజిట్ చేయండి.
ఒక వేళ మీరు థాయ్‌లాండ్ వెళ్లాలి ( how to plan Thailand From India ) అనుకుంటే అక్కడ ఏం చూడాలి ? ఏం తినాలి ? వంటి సందేహాలు క్లియర్ చేసుకునేందుకు మా స్టోరీస్ చదవండి.
గమనిక: ఈ వెబ్‌సైట్లో ప్రకటనలు కూడా ఉంటాయి. ముఖ్యంగా గూగుల్ యాడ్స్ ద్వారా ఈ ప్రకటనలు మీకు కనిపిస్తాయి. ఈ ప్రకటనలే మాకు ఆధారం. ఇందులో కొన్ని ప్రకటనలపై మీరు క్లిక్ చేస్తే మాకు ఆదాయం వస్తుంది.
Watch More Vlogs On : Prayanikudu
- Pandharpur: 7 గంటల్లో 7 ఆలయాల దర్శనం
- Hemkund Sahib Trek : హిమాలయాల్లో బ్రహ్మకమలం దర్శనం
- Kamakhya Temple: కామాఖ్య దేవీ కథ
- Tuljapur : శివాజీ నడిచిన దారిలో తుల్జా భవానీ మాత దర్శనం
- Shillong : అందగత్తెల రాజధాని షిల్లాంగ్
ఈ Travel కంటెంట్ నచ్చితే, ఎవరికైనా ఉపయోగపడుతుంది. అనుకుంటే షేర్ చేయగలరు. ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. యూట్యూబ్ ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి.
ప్రపంచ యాత్ర గైడ్
- అంటార్కిటికా : 70 శాతం మంచినీరు ఇక్కడే ఉంది…రాత్రి సూరీడు…పగలు చీకటి
- Vatican City : 800 మంది మాత్రమే ఉండే దేశం |15 నిమిషాల్లో చుట్టేయొచ్చు
- Dangerous Countries : 2025 లో వెళ్లకూడని అత్యంత ప్రమాదకరమైన 10 దేశాలు
- Milaf Cola : ఖర్జూరంతో సాఫ్ట్ డ్రింక్ లాంచ్ చేసిన సౌదీ అరేబియా
- Egypt Travel Guide: ఈజిప్ట్..ఇక్కడ డబ్బు కట్టి సమాధులను చూస్తారు.. 15 Facts
- ప్రపంచ యుద్ధం వస్తే ఈ 10 దేశాలు చాలా సేఫ్
- Thailand 2024 : థాయ్‌లాండ్ ఎలా వెళ్లాలి ? ఏం చూడాలి ?
- Azerbaijan అజర్ బైజాన్ ఎలా వెళ్లాలి ? ఏం చూడాలి ? 10 టిప్స్!
- UAE: యూఏఈలో తప్పకుండా చూాడాల్సిన 10 ప్రదేశాలు
- సౌదీ అరేబియాకి ఎవరైనా వెళ్లవచ్చా ? వెళ్తే ఏం చూడవచ్చు?
- Indian License : భారతీయ లైసెన్స్ ఈ 15 దేశాల్లో కూడా చెల్లుతుంది
- Oymyakon : ప్రపంచంలోనే అత్యంత చల్లని గ్రామం