తిరుపరంకుండ్రమ్ ఆలయం: కుమార స్వామి వివాహం జరిగిన దివ్య క్షేత్రం | Thiruparankundram Complete Travel Guide
Thiruparankundram Complete Travel Guide : తమిళనాడులో మహాశివుడు, శ్రీహర ఆలయాల తరువాత ఎక్కువగా కనిపించేవి సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలే. అందులోనూ మరీ ముఖ్యంగా కుమార స్వామికి సంబంధించిన ఆరు ఆలయాలు చాలా ఇంపార్టెంట్. వీటిని ఆరుపడైవీడు అని పిలుస్తారు.
కుమార స్వామి (Kumaraswamy) జీవితానికి ఈ ఆలయాలకు సంబంధం ఉన్నాయి కాబట్టి ఇవి చాలా ప్రత్యేకాలయాలు. అందులో తిరుపరం కుండ్రమ్ అనే ఆలయం చాలా ప్రత్యేకం. ఇక్కడ స్వామివారు కూర్చుని దర్శనం ఇస్తారు. ఈ ఆలయానికి సంబంధించిన మరిన్ని విశేషాలు ట్రావెల్ గైడ్..మీ కోసం
ముఖ్యాంశాలు
ఈ ఆలయం ప్రత్యేకతలు…
- తిరుపరంకుండ్రం అనేది తొలి ఆరుపడైవీడు ఆలయం
- ఈ ఆలయంలో స్వామి వారు కూర్చున్న భంగిమలో భక్తులకు దర్శనం ఇస్తారు.
- ఇది ఒక ప్రాచీన రాతిని చెక్కి నిర్మించిన ఆలయం
ఈ ఆలయానికి నేను వెళ్లాను దానికి సంబంధించిన ఒక వీడియో కూడా ప్రయాణికుడు (Prayanikudu youtube channel) లో పోస్ట్ చేశాను. వీడియోను చూసి సబ్‌స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి. నా పేరు కిషోర్ మీ ప్రయాణికుడు. వీడియోలో కవర్ కాని విషయాలు ఇక్కడ అందిస్తున్నాను.
ఆ వీడియో ఇది….
ఈ పోస్టులో మీరు తిరుపరంకుండ్రం ఆలయం గురించి ఈ విషయాలు తెలుసుకుంటారు. అవి…
- ఆలయ చరిత్ర
- ఆలయ ఆధ్యాత్మిక విశిష్టత
- దర్శన విధానం
- కంప్లీట్ అండ్ ప్రాక్టికల్ ట్రావెల్ గైడ్
- అంతే కాకుండా ఆరుపడైవీడు పూర్తి వివరాలు తెలుసుకోబోతున్నారు.
- ముందుగా ఎలా చేరుకోవాలో చూద్దాం
- ఇది కూడా చదవండి : Srirangam : ప్రపంచంలోనే అతిపెద్ద యాక్టివ్ టెంపుల్..ట్రావెల్ గైడ్
తిరుపరం కుండ్రమ్ ఎలా చేరుకోవాలి ? | How to Reach Thiruparankundram ?
జగన్మాత మీనాక్షి అమ్మవారు కొలువైన మధురై నగరం (Madurai Meenakshi Amman Temple) నుంచి సుమారు 8-9 కిమీ దూరంలో ఉంటుంది తిరుపరాన్ కుండ్రం.
- మదురై నుంచి మీరు 30 నిమిషాల్లో ఈ ఆలయానికి చేరుకోవచ్చు.
- మదురై నుంచి తిరునెల్వెలీ వెళ్లే ట్రైన్ తిరుపరం కుండ్రం రైల్వే స్టేషన్లో ఆగుతుంది. అక్కడి నుంచి ఆలయానికి చేరుకోవచ్చు.
- దగ్గర్లో మదురై అంతర్జాతీయ విమానాశ్రయం ఉంటుంది.
- తమిళనాడులోని వివిధ ప్రాంతాల నుంచి బస్సులో కూడా ఇక్కడికి చేరుకోవచ్చు మీరు.
- ఇది కూడా చదవండి : కోరిన కోరికలు తీర్చే మరకతవల్లి…మదురై మీనాక్షి అమ్మవారి ఆలయం విశేషాలు
ప్రధాన నగరాల నుంచి దూరం:
- హైదరాబాద్ → తిరుపరంకుండ్రమ్: సుమారు 1000 కి.మీ
- విజయవాడ → తిరుపరంకుండ్రమ్: సుమారు 906 కి.మీ
ఎక్కడ ఉండాలి ? వసతి బెస్ట్ సీజన్ | Stay Near Thiruparankundram
Thiruparankundram Complete Travel Guide : తిరుపరంకుండ్రమ్ మదురైకు దగ్గరగా ఉండటం వల్ల మదురైలో స్టే చేయడమే బెస్ట్. నేను కూడా మదురైను బేేస్ చేసుకుని తమిళనాడులోని అనేక ఆలయాలు సందర్శించాను. వాటిని ప్రయాణికుడు యూట్యూబ్ ఛానెల్లో పబ్లిష్ చేశాను.

మదురైలో:
- బడ్జెట్ హోటల్స్ (Budget Hotels in Madurai)
- మిడ్ రేంజ్ హోటల్స్
- ప్రీమియం హోటల్స్ అందుబాటులో ఉంటాయి.
- ఇక బెస్ట్ టైమ్ విషయానికి వస్తే: అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు వాతావరణం ప్రయాణానికి అనుకూలంగా ఉంటుంది.
- ఇది కూడా చదవండి : ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన గురుద్వార Hemkund Sahib ట్రావెల్ గైడ్
- ఇది కూడా చదవండి : : హిమాలయ పర్వతాల్లో బ్రహ్మకమలం కనిపించింది..మీరు కూడా చూడండి
తిరుపరంకుండ్రమ్ ఆలయ కథ | Story Of Thiruparankundram
దేవేండ్రుడి కుమార్తెతో వివాహం
హిందూ సంప్రదాయం, పురాణ విశ్వాసం ప్రకారం,సూరపద్ముడు (Surapadman) అనే రాక్షసుడు దేవతలను, ఋషులను ఇబ్బంది పెడుతున్నాడు అని తెలుసుకున్న కుమార స్వామి వీరోచితంగా యుద్ధం చేసి అతన్ని సంహరించారు.
యుద్ధం అనంతరం స్వామి ఈ తిరుపరంకుండ్రమ్ ప్రాంతానికి వచ్చారు.
స్వామి శక్తికి గౌరవంగా ఇంద్రుడు తన కుమార్తె దేవసేనను (devasena) స్వామికి ఇచ్చి వివాహం చేసి ఇచ్చాడు. ఈ పవిత్రమైన వివాహం తిరుపరంకుండ్రమ్లో జరిగిందని భక్తుల విశ్వాసం.
అందుకే ఈ ఆలయంలో:
- సుబ్రహ్మణ్య స్వామి – దేవసేనతో కలిసి కూర్చున్న భంగిమలో దర్శనం ఇస్తారు.
- దీనిని కుమార స్వామి వివాహ క్షేత్రం అంటారు
- ఇది తొలి ఆరుపడైవీడుగా ప్రసిద్ధి చెందింది.
- ఇది కూడా చదవండి : Hinduism Abroad : హిందూ మతం ఆచారాలు పాటిస్తున్న 8 దేశాలు ఇవే
గమనిక: ఇది పురాణ విశ్వాసం ఆధారంగా ఉన్న ఆధ్యాత్మిక ఘటన, చారిత్రక ఆధారాలతో నిర్ధారించబడిన సంఘటన కాదు.
తిరుపరంకుండ్రం ఆలయ విశిష్టత | Thiruparankundram Significance?
తిరుపరంకుండ్రం సుబ్రహ్మణ్య స్వామి ఆలయం వద్దకు వెళ్లగానే ముందుగా మనకు ఒక భారీ గుట్ట (కొండ) కనిపిస్తుంది. సాధారణంగా ఇతర గుట్టలలో చిన్న చిన్న రాళ్లు కలసి ఏర్పడినట్లుగా కనిపిస్తాయి. కానీ ఈ తిరుపరంకుండ్రం గుట్ట మొత్తం ఒకే భారీ రాతి (Single Rock Hill / Monolithic Hill) లా గుండ్రంగా కనిపిస్తుంది. అందుకే ఈ ఆలయం పూర్తిగా ఒకే కొండ రాతిని చెక్కి మలిచిన అరుదైన శిల్ప కళగా ప్రసిద్ధి చెందింది.
ప్రాచీన హిందూ దేవాలయాలలో ప్రపంచంలో ఎక్కడా కనిపించని అరుదైన విశేషం ఈ ఆలయంలో ఉంది. అదేంటంటే ఈ గుడిలో శివుడు, శ్రీహరి (విష్ణువు) విగ్రహాలు ఒకే గర్భగుడిలో ఎదురెదురుగా దర్శనం ఇస్తాయి — ఇది భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోనే చాలా కొద్దిమంది ఆలయాల్లో మాత్రమే కనిపించే అపూర్వ దర్శనం.
ప్రపంచంలో కుమారస్వామి (సుబ్రహ్మణ్య స్వామి)కి అనేక ఆలయాలు ఉన్నా, చాలా చోట్ల ఆయన నిలబడిన భంగిమలో దర్శనం ఇస్తారు. కానీ తిరుపరంకుండ్రంలో మాత్రం సుబ్రహ్మణ్య స్వామి కూర్చుని (ఆసీన మూర్తి రూపంలో) దర్శనం ఇస్తారు — ఇది ఈ ఆలయానికి ఉన్న మరో ప్రత్యేకత.
అలాగే స్వామివారికి ఒకవైపు దేవసేన, మరోవైపు నారద మహర్షి దర్శనం ఇస్తారు. ఈ ఆలయం మురుగన్ స్వామి యొక్క ఆరు ప్రధాన పవిత్ర క్షేత్రాలైన అరుపడై వీధుల్లో (Arupadai Veedu) మొదటి క్షేత్రంగా ఎంతో మహిమాన్వితంగా నిలిచింది.
- ఇది కూడా చదవండి : Valley Of Flowers : వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ ఎలా వెళ్లాలి? ఎప్పుడు వెళ్లాలి ?
- ఇది కూడా చదవండి : 51 Shakti Peethas List : 51 శక్తి పీఠాలు ఎక్క ఉన్నాయి ? అమ్మవారి శరీరంలో ఏ భాగం ఎక్కడ పడింది?
ఆలయంలో ఆర్జిత సేవలు
ఈ ఆలయంలో స్వామికి అభిషేకం చేయరు. స్వామివారు యుద్ధంలో ఉపయోగించిన వేలాయుధానికి మాత్రమే అభిషేకం చేస్తారు.
- ఆలయం లోపల కెమెరా తీసుకెళ్లనివ్వలేదు.
- అందుకే డైవర్షన్స్ లేకుండా దేవీ దేవతల విగ్రహలను చూస్తూ దర్శనం చేసుకుని మనసును ప్రశాంతంగా మాార్చుకోవచ్చు.
- ఇది కూడా చదవండి : Pandharpur: 7 గంటల్లో 7 ఆలయాల దర్శనం
భక్తులు స్వామికి పాలు, తేనె, పంచామృతం సమర్పించవచ్చు. వాటితో కూడా స్వామి వారి శక్తి ఆయుధానికి అభిషేకం చేస్తారు.
ఆరుపడైవీడు – కుమార స్వామి 6 పవిత్ర క్షేత్రాలు
- తిరుపరంకుండ్రమ్ – దేవసేనతో వివాహం
- తిరుచెందూర్ – సూరపద్మ సంహారం
- పళని – దండపాణి స్వరూపం
- స్వామిమలై – శివుడికి ‘ఓం’ ఉపదేశం
- తిరుత్తణి – వల్లితో వివాహం
- పళముదిర్ చోలై – ప్రకృతి మధ్య ఉన్న పవిత్ర ఆలయం
తిరుపరాన్ కుండ్రమ్లో సుబ్రహ్మణ్యస్వామి దర్శనం అనంతరం నేను పళని ప్లాన్ చేశాను. కుమార స్వామికి సంబంధించిన ఆరు పవిత్ర క్షేత్రాల్లో ఇదీ ఒకటి. ఈ ఆలయం గురించి ఒక ప్రత్యేక వీడియో షేర్ చేశాను.
1. తిరుపరంకుండ్రమ్ – దేవసేనతో వివాహం (Thiruparankundram – Marriage with Devasena)
ఇది సుబ్రహ్మణ్య స్వామి యొక్క మొదటి అరుపడై వీడు క్షేత్రం. ఇక్కడే స్వామివారు ఇంద్రుడి కుమార్తె దేవసేనను వివాహం చేసుకున్నట్లు పురాణ కథనం.
- అలాగే ఇది ఒకే కొండ రాతిని చెక్కి నిర్మించిన అరుదైన ఏక శిలా ఆలయం ప్రసిద్ధి చెందింది.
- ఇది కూడా చదవండి : Ramappa Temple : రామప్ప ఆలయం గురించి తెలుగువారిగా తెలుసుకోవాల్సిన విషయాలు
2.తిరుచెందూర్ – సూరపద్మ సంహారం (Tiruchendur – Surapadman Samharam)
ఇది సముద్ర తీరానికి అతి సమీపంలో ఉన్న ఏకైక మురుగన్ ఆలయం. ఇక్కడే సుబ్రహ్మణ్య స్వామి సూరపద్ముడు అనే మహా రాక్షసుడిని సంహరించి ధర్మ విజయం సాధించారు.
- ఇది అరుపడై వీడుల్లో రెండవ పవిత్ర క్షేత్రం.
- ఇది కూడా చదవండి : Kamakhya Temple : కామాఖ్య దేవీ కథ
3. పళని – దండపాణి స్వరూపం (Palani – Dhandayuthapani Temple)
పళనిలో స్వామి దండపాణి (చేతిలో దండతో ఉన్న తపస్వి రూపం) గా దర్శనం ఇస్తారు.
- తన తండ్రి పరమశివునితో జరిగిన “జ్ఞానం గొప్పదా? భక్తి గొప్పదా?” అనే తత్త్వ వివాదం తర్వాత స్వామి తపస్సు చేసిన స్థలం ఇది.
- ఇది మూడవ అరుపడై వీడు.
- ఇది కూడా చదవండి :Palani Temple : పళని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం గైడ్ ! 10 Facts
4. స్వామిమలై – శివుడికి ‘ఓం’ ఉపదేశం (Swamimalai – Upadesa to Lord Shiva)
ఇది తంజావూరు జిల్లాలో ఉన్న ప్రసిద్ధ క్షేత్రం. ఇక్కడే సుబ్రహ్మణ్య స్వామి తన తండ్రి పరమశివునికే ‘ఓం’ ప్రణవ మంత్రార్థాన్ని ఉపదేశించారని పురాణ కథనం.
- అందుకే ఇక్కడ స్వామిని స్వామినాథ స్వామి (Teacher of Shiva) అంటారు. ఇది నాలుగవ అరుపడైవీడు.
5 తిరుత్తణి – వల్లితో వివాహం (Tiruttani – Marriage with Valli)
తిరుపతికి సమీపంలో ఉన్న ఈ ఆలయంలో సుబ్రహ్మణ్య స్వామి గిరిజన కన్య అయిన వల్లిని ప్రేమించి వివాహం చేసుకున్నారని పురాణ కథ.
- ఇది శాంతి, మానసిక ప్రశాంతతకు ప్రసిద్ధి చెందిన క్షేత్రంగా పేరుగాంచింది.
- ఇది ఐదవ అరుపడైవీడు.
- ఇది కూడా చదవండి : షిరిడీ సమాధి మందిరానికి ముందు అక్కడ ఏముండేది ?
6. పళముదిర్ చోలై – ప్రకృతి మధ్య ఉన్న పవిత్ర ఆలయం (Pazhamudircholai – Murugan Temple in Dense Forests)
మదురైకు సుమారు 25 కిలోమీటర్ల దూరంలో, దట్టమైన అడవులు, ప్రకృతి మధ్యలో ఉన్న అద్భుతమైన క్షేత్రం పళముదిర్ చోలై.
- ఇక్కడ స్వామి పూర్ణ కృపా స్వరూపంగా భక్తులకు దర్శనం ఇస్తారని నమ్మకం.
- ఇది ఆరవ మరియు చివరి అరుపడై వీడు క్షేత్రం.
- ఇది కూడా చదవండి : 5 Shakti Peethas : మహిళలు జీవితంలో ఒక్కసారైన దర్శించుకోవాల్సిన 5 శక్తి పీఠాలు
ఆలయ దర్శన వేళలు | Thiruparankundram Temple Timings
🕔 ఉదయం: 5:30 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట (1 PM) వరకు
🕓 సాయంత్రం: 4:00 నుంచి రాత్రి 9 వరకు
రోజువారీ పూజల టైమింగ్స్ | Thiruparankundram Temple Pooja Schedule
- 5:30 – 6:00 AM – తిరువనదల్ పూజ
- 7:00 – 7:30 AM – విలాపూజ
- 8:00 – 8:30 AM – కళసంధి పూజ
- 10:30 – 11:00 AM – తిరుకళసంధి
- 12:30 – 1:00 PM – ఉచికాల పూజ
- 5:30 – 6:00 PM – సాయరక్ష పూజ
- 8:30 – 9:00 PM – అర్ధజామ పూజ
దగ్గర్లో ఉన్న ఆలయాలు | Temples Near By Thiruparankundram
- మీనాక్షి అమ్మవారి ఆలయం – 9 కి.మీ
- కూదల్ అళగర్ ఆలయం – 7 కి.మీ
- కల్లాళగర్ ఆలయం – 44 కి.మీ
- పళని మురుగన్ ఆలయం – 110 కి.మీ
- పళముదిర్ చోలై – 25 కి.మీ
- తిరుచెందూర్ – 75 కి.మీ
- దిండిగుల్ – 69 కి.మీ
తిరుపరంకుండ్రమ్ దర్శనం తర్వాత ఫుడ్ గైడ్ | Food To Try Near Thirparankundam
తిరుపరంకుండ్రమ్ ఆలయం మదురైకి చాలా దగ్గరగా ఉండటం వల్ల, దర్శనం తరువాత మదురైలోని ఫేమస్ ఫుడ్‌ను ఎంజాయ్ చేయవచ్చు.
ఇక అలయం దగ్గర కూడా చిన్న వెజ్ టిఫిన్ సెంటర్లు, మీల్స్ అన్నీ లభిస్తాయి. పెద్ద రెస్టారెంట్స్ కోసం మదురై నగరంలోకి వెళ్లడం బెస్ట్.
తప్పకుండా ట్రై చేయాల్సిన స్పెషల్ ఫుడ్స్:
- ఇడ్లీ – చట్నీ – సాంబార్ (తమిళనాడు సాంబార్‌కు తిరుగేలేదు)
- పొంగల్ – వడ
- పేపర్ దోసె / మసాలా దోసె
- మదురై చికెన్ కరి
- మట్టన్ సుక్కా
- జిగర్తండా (మదురై ఫేమస్ డ్రింక్)
మరింత సమాచారం కోసం ఆలయ అధికార వెబ్సైట్ విజిట్ చేయండి |Thirparankundram Temple Official Site
గమనిక : ఈ పోస్టును కథ హిందూ ఆలయ సంప్రదాయాలు, పురాణ గాథల ఆధారంగా భక్తి భావంతో రాయబడింది. ఇందులోని విషయాలు హిందూ ఆలయాల విశ్వాసాలు, ఆచారాలు, చరిత్రలకు గౌరవంతో , శ్రద్ధతో అందించబడినవి.
📣 ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.
