తిరుమలేషుడిని దర్శించుకునేందుకు తిరుపతి ప్రజలకు ఒక ప్రత్యేక అవకాశం లభించింది . తిరుపతి జిల్లా వాసులకు శ్రీవారి దర్శనం కలిగించాలని తితిదే ( TTD Updates ) ధర్మకర్తల మండలి నిర్ణయం తీసుకుంది . అందుకు తగిన విధంగానే ఈ నెల మొదటి మంగళవారం రోజు శ్రీవారిని దర్శించుకునే అవకాశాన్ని తిరుపతి స్థానికులకు కల్పించింది టీటీడి.
Read Also : Ravana Lanka : రావణుడి లంక ఎక్కడ ఉంది ? ఎలా వెళ్లాలి ? 5 ఆసక్తికరమైన విషయాలు
తితిదే మార్గదర్శకాలు | TTD Guidelines For Locals Darshan
తాజాగా వెలువడిన ఆదేశాల మేరకు 2024 డిసెంబర్ 3వ తేదీ నుంచే స్థానికులు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడిని ( Lord Venkateshwara Of Tirumala ) దర్శించుకోనున్నారు. అయితే ఈ దర్శనం కోసం ఉచిత టికెట్లను భక్తులు తీసుకోవాల్సి వుంటుంది.ఈ మార్గదర్శకాల మేరకు వీటిని డిసెంబర్ 2వ తేదీన తిరుపతిలో ఉన్న మహతి ఆడిటోరియం, తిరుమల బాలాజీ నగర్‌లోని కమ్యూనిటీ హాల్లో ఉచితంగా జారీ చేశారు.
ప్రతీ నెల మొదటి మంగళవారం ఈ దర్శనం చేసుకునేందుకు ఒకరోజు ముందుగానే టికెట్లు తీసుకోవాల్సి ఉంటుంది. దాని కోసం తితిదే ( TTD ) జారీ చేసిన ఈ కింది గైడ్‌లైన్స్ పాటించాల్సి ఉంటుంది.
ఈ టోకన్లను జారీ చేసే విధానం
- ఈ టికెట్లలో క్యూలైన్లో ముందుగా వచ్చిన వారికే ప్రాధాన్యత ఇస్తారు.
- స్థానికులు తమతో పాటు ఓరిజినల్ ఆధార్ కార్డు ( Aadhar Card ) తప్పనిసరిగా క్యారీ చేయాలి.
- టోకెన్లు తీసుకున్న భక్తులు దర్శనం సమయంలో కూడా ఆధార్ కార్డు చూపించాల్సి ఉంటుంది.
- శ్రీవారిని దర్శించుకని వెళ్లే స్థానిక భక్తులకు ఇతర భక్తులలాగే ఒక లడ్డూను ( Tirumala Laddu ) ఉచితంగా ఇస్తారు.
- వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో ( Vaikuntam Queue Complex ) ఉన్న ఫుట్‌పాత్ హాల్ లైన్లో స్థానిక భక్తులకు శ్రీవారి దర్శనానికి అనుమతి ఇస్తారు.
- అయితే ఒక్కసారి స్థానికుల కోటాలో మీరు దర్శనం చేసుకుంటే మూడు నెలల వరకు మళ్లీ దర్శనం చేసుకునే అవకాశం ఉండదు. మూడు నెలల తరువాత మళ్లీ ప్రయత్నించవచ్చు.
- Read Also : Palani Temple : పళని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం గైడ్ ! 10 Facts
ఈ కంటెంట్ నచ్చితే, ఎవరికైనా ఉపయోగపడుతుంది. అనుకుంటే షేర్ చేయగలరు. ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. యూట్యూబ్ ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి.