గోవా, రాజస్థాన్, మనాలి ఇలా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌‌కు టాప్‌ 10 ప్లేసెస్ | New Year Celebration 2025

డిసెంబర్ వచ్చేసింది అంటే చాలు అప్పుడే కొత్త సంవత్సరం వచ్చిందన్న అనుభూతి కలుగుతుంది. కొత్త సంవత్సరం కొత్తగా ఉండాలి అనుకుని వేడుకల కోసం( new year Celebration 2025 ) చాలా ప్లాన్స్ చేస్తుంటారు. ఇంట్లోనే ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేయాలనుకుంటే అది మీ ఇష్టం. అంతకు మించిన స్వర్గం లేదు. అంతకు మంచిన వరం లేదు.

అయితే ఒక వేళ మీరు గడపదాటాలనుకుంటే…రాష్ట్రం దాటాలనుకుంటే మాత్రం ఈ లిస్టు మీకోసమే. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం చాలా మంది వెళ్లే ట్రావెల్ స్పాట్స్‌తో పాటు పర్సనల్‌గా నేను మీకు సెట్ అవుతాయి అనుకున్న డెస్టినేషన్స్ ( Destinations ) కూడా మెన్షన్ చేశాను.

వీలైతే మీరు కూడా ఈ డెస్టినేషన్స్‌కు వెళ్లడానికి ట్రైచేయండి.
1. గోవా | Goa For New Year 2025
Prayanikudu
గోవాకు ప్లానింగ్ అవసరం లేదు …లెట్స్ గో అనడం ఆలస్యం అంతే | Gif By: Tenor

గోవాలో టూరిజం పడిపోయింది అనే వార్తలను కొన్ని రోజులు పక్కన పెట్టండి. చింత చచ్చినా పులుపు చావదు. గోవా ఎప్పుడూ ఆగదు. గోవాకు ఉన్న ( Goa ) క్రేజ్ కూడా అలాంటిది. గోవా అంటే పార్టీ జీవుల స్వర్గం. గోవాకు వెళ్లేవారిది సెపరేటు వర్గం. ఇక న్యూ ఇయర్ వేడుకలు అంటే మనవాళ్లకు గోవా తోవనే గుర్తొస్తుంది. ఇక్కడి వైబ్రెంట్ నైట్‌లైఫ్, స్టన్నింగ్ బీచులు, పార్టీల్లో మునిగిపోయే పార్టీ జీవులు, నీటిలోంచి దూసుకెళ్లే జీపులు.. ఇవన్నీ కలిపి గోవాను ఇప్పటికీ టాప్ 10 న్యూ ఇయర్ పార్టీ డెస్టినేషన్‌ లిస్టులో ( Party ) ఉంచాయి. గోవా ఉన్నంత వరకు గోవా ఉంటుంది.

2.ముంబై

Mumbai New Year Celebrations 2025 : భారత దేశ ఆర్థిక రాజధాని అయిన ముంబై న్యూ ఇయర్ సందర్భంగా పార్టీ రాజధాని అవుతుంది. నిద్రపోని నగరం ( City Never Sleeps ) అని ముంబైని ముద్దుగా పిలుస్తారు. మరి న్యూ ఇయర్సెలబ్రేషన్స్ సమయంలో ఎలా నిద్రపోతుంది చెప్పండి.

Prayanikudu
ముంబై నిద్రపోదు …న్యూ ఇయర్ రోజు ఎవరైనా పడుకుంటే.. | Gif By: Tenor

రాత్రంతా పార్టీలు, ఈవెంట్స్‌తో హోటల్ల్స్, క్లబ్సులు కిటకిటలాడుతాయి. ముంబై వీధుల్లో పార్టీ ప్రీయుల సంబరాలు మామూలుగా ఉండవు. మెరైన్ బీచు ( Marine Beach ) అందాలను కొత్త సంవత్సరం సందర్భంగా జరిగే ఫైర్ వర్క్స్‌ మరింతగా పెంచుతాయి.

3. బెంగుళూరు

New Year Celebrations 2025 In Bengaluru : ఏడాది మొత్తం ఆఫీసు పనుల్లో ఉంటే నమ్మ బెంగుళూరు ( Namma Bengulugu ) ఐటీ ఉద్యోగులు న్యూ ఇయర్ వస్తే చాలు పార్టీల్లో మునిగిపోతారు. ఇక్కడ క్లబ్ కల్చర్ గురించి అందరికీ తెలిసిందే.

  • ఈ క్లబ్సులు మొత్తం 31 డిసెంబర్ రోజు కిటకిటలాడుతాయి.
  • ఎన్నో బ్రోవరీస్ ( breweries ) పార్టిలు , పబ్బుల్లో స్పెషల్ ఈవెంట్స్ ఏర్పాటు చేస్తుంటారు.
  • వినేవారు ఒళ్లు మర్చిపోయి డ్యాన్సులు చేసేలా లైవ్ మ్యూజిక్ ప్లే చేస్తుంటారు.
  • ఇది కూడా చదవండి: Thailand 2024 : థాయ్‌లాండ్ ఎలా వెళ్లాలి ? ఏం చూడాలి ?
4. రిషికేష్

New Year At Rishikesh 2025 : పార్టీ చేసుకునే యూత్ గోవాకు వెళ్తే ప్రశాంతంగా కొత్త సంవత్సరాన్ని ఎంజాయ్ చేయాలి అనుకునే వాళ్లు రిషికేష్ వెళ్తారు. నేను ఇప్పటికి 5-6 సార్లు వెళ్లాను రిషికేష్. అయితే కొత్త సంవత్సరం మాత్రం ఇక్కడ చాలా స్పెషల్ అని చెప్పవచ్చు. గంగా నదీ తీరంలో ఎలాంటి మందు మసాలేవీ లేకుండా ఆధ్మాత్మిక, ప్రశాంతమైన వాతావరణంలో కొత్త సంవత్సరాన్ని ఎంజాయ్ చేయవచ్చు.

Prayanikudu
పార్టీలు, పబ్బులకు దూరంగా రిషికేష్‌లో …| Gif By: Tenor

ఒక వేళ మీరు రిషికేష్ వెళ్లే ( Travel ) ప్లాన్ చస్తే సాయంత్రం 5 గంటల కల్లా మీరు త్రివేణీ ఘాట్ ( Triveni Ghat ) చేరుకోండి. అక్కడ గంగా హరతి వైభవం.. ఆ సమయంలో నదిపై ఒదిగే మంచు ఇవన్నీ మీరు అస్సలు ఊహించని అనుభవాన్ని కలిగిస్తాయి.

త్రివేణి ఘాట్‌లో గంగా నది ఎంత అందంగా ఉంటుందో…నేను ఎంత థ్రిల్ అయ్యానో ప్రయాణికుడు ఛానెల్‌లో వ్లాగ్ చేశాను. వీలు ఉంటేనే చూడండి. మరో విషయం లక్ష్మన్ ఝూలా ( Lakshman Jhula ) ఇప్పుడు అందుబాటులో లేకపోవడం వల్ల రామ్ ఝూలాపై చాలా క్రౌడ్ ఉండే అవకాశం ఉంది. ఇది గమనించి ప్లాన్ చేసుకోండి.

Watch : రిషికేష్‌లో 7 గంటల్లో ఏంఏం చూశానంటే

5. ఢిల్లీ | New Year Celebration In Delhi 2025

దేశానికి రాజధాని అయిన ఢిల్లీ కొత్త సంవత్సరం సందర్బంగా పార్టీ రాజధానిగా మారిపోతుంది. ఇక్కడ పంజాబ్, హరియాణాతో పాటు ఢిల్లీ కుర్రాళ్లు కలిసి చేసే గోళ అంతా ఇంతా కాదు.

Prayanikudu
ఇంటింటా సంబరాలు…గల్లీ గల్లీల డీజే టిల్లూలు | Gif By: Tenor

ప్రభుత్వం ఇంటింటా పార్టీలు అనే స్కీమ్ ఏమైనా లాంచ్ చేసిందా అన్నట్టు ఉంటాయి వీధులు. పబ్బుల్లో కాన్సెర్టులు అన్నీ కోలాహలంగా ఉంటాయి. కన్నాట్ ప్లేస్, హౌజ్ కాస్ గ్రామం‌లో (Hauz Khas Village) అయితే యూత్ సెంట్రిక్‌గా జరిగే వేడుకలు సూపర్‌‌‌గా ఉంటాయి.

6. కలకత్తా

Kolkata New Year 2025: కలకత్తాను చాలా మంది కల్చరల్ క్యాపిటల్ అంటారు. ప్రముఖ కవులు, నటులు, సాహిత్యకారులు జన్మించిన ఈ నేల కొత్త సంవత్సరం సందర్భంగా కలర్‌ఫుల్‌‌గా ఉంటుంది. ఇక్కడ పార్క్ స్ట్రీ‌ట్‌లో ప్రజలు గుమిగూడి వేడుకల్లో మునిగిపోతారు.

Prayanikudu
కలకత్తాలో కూడా ఈ పాట వినిపిస్తుంది | Gif By: Tenor

7. పాండిచ్చెరీ

Pondicherry New Year Celebrations 2025 : పాండీ బీచ్‌ అందం గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. బ్లూ కలర్ నీటితో అందరినీ ఆకట్టుకుంటుంది పాండిచ్చెరి. కొత్త సంవత్సరం సందర్భంగా బీచ్ ఫ్రంట్‌‌‌‌లో పెద్ద పెద్ద పార్టీలు జరుగుతుంటాయి. వీటిని చూస్తేనే కడుపు నిండిపోతుంది. మరి ఆ పార్టీలో మెంబర్ అయితే ఆ మజానే వేరు.

ఇది కూడా చదవండి : Lambasingi : నేషనల్ క్రష్ లంబసింగి ఎలా వెళ్లాలి ? నిజంగా స్నో పడుతుందా ? 5 Tips & Facts

8. జైపూర్

New Year At Jaipur 2025 : చాలా మంది కొత్త సంవత్సరం రాయల్‌‌గా అందంగా సెలబ్రేట్ చేసుకోవడానికి పింక్ సిటీ ( Pink City ) జైపూర్‌ చేరుకుంటారు. సాధారణ సమయంలోనే ఇక్కడి ఆతిథ్యం అదిరిపోయేలా ఉంటుంది. ఇక కొత్త సంవత్సరం సందర్భంగా సిటీ మొత్తం చాలా అందంగా ముస్తాబవుతుంది.

9. మనాలి
prayanikudu at manali
మనాలి అంటే కొంచెం ఇష్టం కొంచెం కష్టం

New Year Celebrations at Manali 2025 : నిజానికి మనాలిని నేను ఈ లిస్టులో చేర్చకూడదు అనుకున్నాను. వృత్తి ధర్మంగా మెన్షన్ చేస్తున్నాను. దానికి కారణం మనాలీలో న్యూ ఇయర్ బాగా జరగదు అని కాదు. చాలా బాగా జరుగుతుంది. దేశ వ్యాప్తంగా చలి కాలం, స్నో టైమ్, దాంతో పాటు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం చాలా మంది మనాలికి వస్తుంటారు. రిసార్టులు హోటల్లు అన్నీ ఫుల్ అవుతాయి. అసలైన సమస్య కూడా ఇదే.

Prayanikudu
మామా మనాలి వెళ్దాం అని ఫ్రెండ్ అన్నప్పుడు… | Gif By: Tenor

హిల్ స్టేషన్ అనగానే అందరికి మనాలియే గుర్తుకు వస్తుంది. హిస్టీరిక్ అయిపోతారు అందరు మనాలి పేరు వినగానే. మరి దాని అందం అలాంటిది. కానీ మనాలి పేరు ఎంత పాపులర్ అయింది అంటే వింటర్లో ఇక్కడ కి.మీ కొద్ది కార్ల క్యూ ( Manali over tourism ) ఉంటుంది. హోటల్స్ దొరకవు. దొరికినా చాలా కాస్ట్‌లీ. ఎక్కడ చూసినా మనుషులే మనుషులు కనిపిస్తారు.

Prayanikudu
రెండోసారి మనాలి పేరు విన్నప్పుడు… | Gif By: Tenor

అందుకే వీలైతే మనాలిని ఈ సీజన్లో ఎవాయిడ్ చేసే వాళ్ల సంఖ్య కూడా పెరుగుతోంది. మరి ఈ లిస్టులో ఎందుకు చేర్చాను అంటారా…మనాలి నిజంగా ఈ సీజన్లో స్వర్గంలా ఉంటుంది. ప్లస్సు, మైనస్సు రెండూ చెప్పాను. ఇంతకు మించి ఆలోచిస్తే నాక్కూడా మనాలి వెళ్లాలి అనిపిస్తుంది. అందుకే మీ ఇష్టానికి వదిలేస్తున్నా.

Watch : మనాలి ఎలా వెళ్లాలి ? ఏం చూడాలి ? ఎలా సిద్ధం అవ్వాలి ?

10. ఉదయ్‌పూర్

New Year At Udaipur 2025: పైన చెప్పిన వాటిలో పార్టీ కోసం కొన్ని స్పాట్స్ ఉన్నాయి. ఎలాంటి హడావిడి లేకుండా సెలబ్రేట్ చేసుకునే డెస్టినేషన్ గురించి చెప్పాను. ఇప్పుడు కొత్త జంటలు లేదా రొమాంటిక్‌ జంటలకు సెట్ అయ్యే ఉదయ్ పూర్ గురించి చెప్పకపోతే బాగుండదు కదా. ఉదయ్‌‌పూర్‌ను సరస్సుల నగరం అంటారు. వింటర్లో ఇది సరసాల నగరంగా మారుతుంది.

Prayanikudu
ఉదయ్‌పూర్‌ను తక్కువ అంచనా వేయకండి | Gif By: Tenor

చాలా మంది ఇక్కడ రొమాంటిక్ హాలిడే కోసం వస్తారు. కొద్దిగా హడావిడిగా ఉన్నా మూడ్ మాత్రం మారకుండా చూసుకుంటుంది ఈ నగరం. చలికాలం సాయంత్రం చుట్టుపక్కల ప్రాంతాల అందాలు చూసి తాగండి టీ గరం గరం.

నేను చెప్పిన దాంట్లో ఏమైనా అతిశయం ఉంటే ఇగ్నోర్ చేయండి. కానీ నేను చెప్పిన ఈ లిస్టులో అద్భుతమైన స్పాట్స్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి. ఈ లిస్టులో మీ కోసం అన్ని రకాల డెస్టినేషన్స్ సెలక్ట్ చేయడానికి ప్రయత్నించాను. ఏమైనా మిస్ అయితే కూడా చెప్పండి.

ఈ  Travel కంటెంట్ నచ్చితే, ఎవరికైనా ఉపయోగపడుతుంది. అనుకుంటే షేర్ చేయగలరు. ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. యూట్యూబ్ ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి.

Leave a Comment

error: Content is protected !!