ప్రపంచ వ్యాప్తంగా అనే దేశాల్లో వివిధ కారణాల వల్ల అశాంతి, అనిశ్చితి పరిస్థితి నెలకొంది అని 2025 అంతర్జాతీయ పీస్ ఇండెక్స్ ( 2025 International Peace Index) చెబుతోంది. అయితే కొన్ని దేశాలు ప్రశాంతతకు (Peaceful Countries) మారుపేరుగా నిలుస్తున్నాయి. ఆ దేశాలు ఇవే..
యుద్దాలు (War), రాజకీయ అనిశ్చితి, అంతర్యుద్ధం వంటి అనేక సమస్యల నడుమ కొన్ని దేశాలు ప్రపంచ శాంతికి ఆశాకిరణంగా మారాయి. ఈ దేశాల్లో ప్రజలు శాంతియుతంగా (Peaceful Countries) తమ జీవితాన్ని గడుపుతున్నారు. దీనిపై సీఈఓ వరల్డ్ (CEO World Peaceful Countries) అనే మేగజైన్ ప్రపంచంలోనే అత్యంత శాంతియుతమైన 10 దేశాల జాబితాను విడుదల చేసంది. ఆ జాబితాలో ఉన్న దేశాలు ఇవే..
ముఖ్యాంశాలు
1. మోనాకో | Monaco (స్కోర్ 97.96)

యూరోప్‌లోని (Europe) ఈ చిన్ని దేశం ప్రపంచంలోనే అంత్యంత శాంతియుతమైన దేశం అనే టైటిల్‌ను సొంతం చేసుకుంది. అనేేక విషయాల్లో స్థిరత్వం పాటించే ఈ దేశం భద్రతా విషయంలో కూడా టాప్‌లో ఉంటుంది.
2. లీచ్టెన్‌స్టెయిన్ | Liechtenstein (స్కోర్97.82 )

యూరోప్‌లోని మరో చిన్న దేశం అయిన లీచ్టెన్‌స్టెయిన్ ఈ జాబితాలో రెండవ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ దేశంలో సామాజిక ఐక్యత ఎక్కువ, నేరాలు తక్కువ. వెరసి ఈ దేశంలో ప్రజలు శాంతియుతంగా జీవిస్తున్నారు.
3. ఆండోర్రా | Andorra (స్కోర్ 97.42)

పైరనీస్ పర్వతశ్రేణుల్లో (Pyrenees Mountains) ఉన్న ఆండోర్రా దేశం చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఈ దేశం అన్ని విషయాల్లో న్యూట్రల్‌గా ఉంటుంది. మిలటరీపై తక్కువ ఖర్చు చేస్తుంది.
4. లగ్జంబర్గ్ | Luxembourg (స్కోర్97.19)

ఆర్థిక స్థిరత్వం, సామాజిక భద్రత వల్ల ఈ దేశం తన ప్రజలకు శాంతియుత (Peaceful Countries) జీవితాన్ని అంతిస్తోంది. అందుకే ఇది సేఫ్ అండ్ పీస్‌ఫుల్ నేషన్ జాబితాలో నిలిచింది.
- ఇది కూడా చదవండి : ప్రపంచ యుద్ధం వస్తే ఈ 10 దేశాలు చాలా సేఫ్
5. ఐస్లాండ్ | Iceland ( స్కోర్ 96.94)

ఐస్లాండ్ దేశం భౌగోళిక స్వరూపం (Iceland Landscape) చూస్తే ఎవరికైనా జీవితంలో ఒక్కసారి అయినా అక్కడికి వెళ్లాలి అనిపిస్తుంది. అయితే చూడ్డానికి అందంగా ఉండటంతో పాటు నివసించడానికి కూడా ఈ దేశం చాలా అనువైనది. ఇక్కడ క్రైమ్ రేటు తక్కువగా ఉండటం వల్ల ప్రజలు నిర్భయంగా (Peaceful Countries) జీవించగలుగుతున్నారు.
6. ఐర్లాండ్ | Ireland (95.97)

గత కొన్నేళ్లుగా శాంతియుత దేశ జాబితాలో తన పేరును నమోదు చేసుకుంటూ వస్తోంది ఐర్లాండ్ .ఎందుకంటే ఇక్కడ రాజకీయ స్థిరత్వం ఉంది. దీంతో పాటు అంతర్జాతీయ అంశాల్లో తలదూర్చదు.
7. ఆస్ట్రియా | Austria (స్కోర్ 95.86)

బలమైన ఆర్థిక వ్యవస్థ, సామాజిక సంక్షేమ విధానాలతో పాటు అంతర్జాతీయ అంశాల్లో జోక్యం చేసుకోకుండా న్యూట్రల్‌గా ఉండటం వల్ల సెంట్రల్ యూరోప్‌లోని ఆస్ట్రియా తమ ప్రజలకు శాంతియుతంగా జీవించే అవకాశాన్ని కల్పిస్తోంది.
Read Also : Ravana Lanka : రావణుడి లంక ఎక్కడ ఉంది ? ఎలా వెళ్లాలి ? 5 ఆసక్తికరమైన విషయాలు
8. న్యూజీలాండ్ | New Zealand (స్కోర్ 95.65)

ఈ ద్వీపదేశం ఎంత అందంగా ఉంటుందో అంతే ప్రశాంతంగా కూడా ఉంటుంది. ఇక్కడ నేచర్ చూస్తే ఎవరైనా ఫిదా అవుతారు. ప్రశాంతమైన ఇక్కడి వాతావరణం, జీవన విధానం శాంతియుతంగా బతికే అవకాశం తమ ప్రజలకు కల్పిస్తోంది ఈ దేశం.
9. సింగాపూర్ | Singapore (స్కోర్ 95.64)

ఈ జాబితాలో చోటు సంపాదించుకున్న ఏకైక ఆసియా దేశం సింగాపూర్. ఈ దేశం మరే దేశం విషయంలో జోక్యం చేసుకోదు. తన పని తాను చేసుకూంటూ వెళ్తుంది. అందుకే ఇక్కడి ప్రజలు ప్రశాంతంగా తమపని తాము చేసుకుంటూ వెళ్తారు.
10. స్విట్జర్లాండ్ | Switzerland (స్కోర్ 94.82)

అంతర్జాతీయ విషయాల్లో న్యూట్రల్‌గా ఉండే దేశం స్విట్జర్లాండ్. ఇక్కడి ప్రజలు చాలా ప్రశాతంగా ఉంటారు. దీనికి కారణం అక్కడ రాజకీయ స్థిరత్వంతో పాటు నిలకడగా ఉన్న ఆర్థిక వ్యవస్థ వంటి అనేక కారణాలు ఉన్నాయి.
అత్యంత శాంతియుత దేశం అవ్వాలి అంటే ..
Peaceful Countries in World : ప్రపంచంలోని అనేక దేశాలు యుద్దంపై, ఆయుధాలపై కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తుంటాయి. అయితే ప్రజలు ప్రశాంతంగా బతికేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో కొన్ని దేశాలు అయినా పైన ఉన్న దేశాల నుంచి నేేర్చుకుంటే బాగుంటుంది. ప్రపంచం మొత్తం ప్రశాంతంగా ఉంటుంది. ఏమంటారు ?
📣ఈ Travel కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. YouTube ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp లో జాయిన్ అవ్వడానికి ఇక్కడ క్లిక్ చేయండి.