విమాన ప్రయాణం చాలా థ్రిల్లింగ్‌గా ఉంటుంది. కొత్త ప్రదేశానికి వెళ్తున్నామని, అక్కడ మన కోసం అని వేచి చూస్తున్న సాహసాలు, ఫుడ్ ఇవన్నీ ఎగ్జైట్ చేస్తాయి. అయితే తొలిసారి విమాన ప్రయాణం ( First time Flyers ) చేసే వారికి మాత్రం ఫ్లైట్‌లో కాస్త ఇబ్బందిగా అనిపించవచ్చు. మీ ఇబ్బంది తగ్గించి ప్రశాంతంగా, ఆనందంగా మీ తొలి విమాన ప్రయాణాన్ని సాగేలా ఈ 10 చిట్కాలు ( Air Travel Tips) మీకు బాగా ఉపయోగపడతాయి.
ముఖ్యాంశాలు
1. ముందుగా ప్లాన్ చేసుకోండి | Plan Your Air Travel In Advance
ఏ ప్రయాణానికి అయినా ప్రిపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అందుకే డిపార్చర్‌కి ముందు ఇవి చెక్ చేసుకోండి :
సరైన ఫ్లైట్ ఎంచుకోండి: మీ బడ్జెట్ అండ్ షెడ్యూల్‌కు సెట్ అయ్యే సరైన ఫ్లైట్‌ను ఎంచుకోవడం మీ బాధ్యతే మరి. నాన్ స్టాప్ ఫ్లైట్ ( Non-Stop Flights ) వల్ల మీ సమయం తగ్గుతుంది. ఒత్తిడి కూడా తగ్గుతుంది.
ఎయిర్‌లైన్స్ వెబ్‌సైట్ చెక్ చేయండి : ప్రయాణానికి ముందు ఎయిర్‌లైన్ వెబ్‌సైట్ చెక్ చేసి వాళ్ల పాలసీలు తెలుసుకోండి. ముఖ్యంగా బ్యాగేజి, చెకింగ్ టైమ్, సెక్యూరిటీ ప్రోటోకాల్ సంబంధించిన పాలీసీలు తెలుసుకుంటే బెటర్. దీని వల్ల ఫ్లైట్ ఉన్న రోజు మీకు అక్కడి విషయాలు షాకింగ్‌గా లేదా సర్‌ప్రైజింగ్‌గా, వింతగా అనిపించవు.
ఇది కూడా చదవండి: Telugu Women Travel Vloggers : ట్రావెల్ వ్లాగింగ్‌లో వీర వనితలు
ప్యాకింగ్ లిస్ట్ : మీ ప్రయాణం తేదీ ఫిక్స్ అయిన వెంటనే ఇక మీతో పాటు ఏం తీసుకెళ్లాలి అనుకుంటున్నారో ఒక లిస్టు రాసుకోండి. ఉదాహరణకు ఐడీ కార్డులు, బోర్డింగ్ పాసులు, ట్రావెల్ ఐటెనరీ ( Travel Itinerary ) , వైద్య పరికరాలు , మెడిసిన్స్ లాంటివి లిస్టులో రాసుకోండి. బయల్దేరే ముందు తప్పకుండా వీటిని చెక్ చేసుకుంటే బెటర్.
2. త్వరగా చేరుకోండి | Arrive Early To Airport
విమానాశ్రయంలో పరిస్థితి ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. పైగా పండుగలు, ట్రావెల్ సీజన్లో అయితే మరింతగా రద్దీ ఉంటుంది. వీటన్నింటి నుంచి తప్పించుకుని ప్రశాంతంగా ఉండాలి అనుకుంటే ఎయిర్‌పోర్టుకు త్వరగా చేరుకోండి. ఈ విషయాలు ఒకసారి చదవండి.
డొమెస్టిక్ ఫ్లైట్స్ | Domestic Flights : దేశీయ విమానాలు లేదా డొమెస్టిక్ ఫ్లైట్స్ కోసం మీరు కనీసం 2 గంటల ముందు ఎయిర్‌పోర్ట్ చేరుకోవాల్సి ఉంటుంది.
ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ | International Flights : అంతర్జాతీయ విమానం ఎక్కాల్సి ఉంటే కనీసం 3 గంటల ముందు విమానాశ్రయానికి చేరుకోవాల్సి ఉంటుంది.
కొంచెం ముందు బయల్దేరి వెళ్లడం వల్ల మీరు సెక్యూరిటీ చెకిన్‌ను ( Security Check-in ) త్వరగా పూర్తి చేసుకోగలుగుతారు. దీంతో పాటు ఏదైనా కారణాల వల్ల ఆలస్యం అయితే కవర్ చేసుకునే అవకాశం ఉంటుంది.
3. సెక్యూరిటీ ప్రాసెస్ తెలుసుకోండి | Airport Security Process
ఎయిర్‌పోర్టులో సెక్యూరిటీ ప్రాసెస్ అనేది కొంత మందికి ఇబ్బందిగా అనిపిస్తుంది. దాని కోసం మీరు ముందస్తుగా సిద్ధం అయితే బాగుంటుంది :
ఐడీ , బోర్డింగ్ పాస్ : ఎయిర్‌పోర్టులో అధికారులు కోరినప్పడు వెంటనే వారికి ఇచ్చేలా ఐడీ కార్డు, పాస్ పోర్టు , బోర్డింగ్ పాసును ( Boarding Pass ) సిద్దంగా ఉంచుకోండి.
సెక్యూరిటీ స్క్రీనింగ్ : లగేజీలో మీతోపాటు తీసుకెళ్లే సామాన్లకు అనుమతి ఉందో లేదో ముందే చెక్ చేసుకోండి. లేదంటే కొన్నింటిని మీ లగేజీ నుంచి అధికారులే తీసేస్తారు.
ఓపికగా ఉండండి : సెక్యూరిటీ లైన్లలో మీతో పాటు చాలా మంది ఉంటారు. అందుకే ఇక్కడ ఓపికగా వేచి ఉండాల్సి ఉంటుంది. ఇది మీకు మాత్రమే ఎదురయ్యే సమస్య కాదు కదా.
4. ఫ్లైట్‌లో కంఫర్టుగా ఉండండి | Comfortable During Flight
బోర్డింగ్ పూర్తి అయిన తరువాత మీరు మీ ఫ్లైట్‌ను ఎంజాయ్ చేయడం గురించే ఆలోచిచంచండి. దీని కోసం సూచనలు పాటించండి.
దుస్తువులు | Dressing For Flights : విమానంలో టెంపరేచర్ మారుతూ ఉంటుంది. అందుకే ఒకే డ్రెస్సు కాకుండా లేయర్స్‌గా డ్రెస్సింగ్ చేసుకోండి. ఒక టీషర్టు, దానిపై షర్టు, దానిపై జాకెట్ ఇలా లేయర్స్ ఉండాలి. ఉష్ణోగ్రతను బట్టి, మీ కంఫర్టును బట్టి సులభంగా తీసి వేసుకోవచ్చు.
స్నాక్స్ | Snacks For Flight : చాలా వైమానిక సంస్థలు ప్రయాణికులకు ( travelers ) తినడానికి స్నాక్స్ ప్రొవైడ్ చేస్తుంటాయి. అయితే మీతో పాటు కొన్ని చిరుతిళ్లు ( Snacks ) తీసుకెళ్లడం మంచిది. మీ డైట్ ప్రకారం ప్లాన్ చేసుకోవచ్చు.
వినోదం | Entertainment in Flight : విమాన ప్రయాణాల్లో ఒంటరిగా వెళ్తే ( Solo Traveler ) చాలా బోర్ కొడుతుంది. మీరు ఒంటరిగా ప్రయాణించాల్సి వస్తే మాత్రం మీ ట్యాబ్లెట్, ఫోన్స్‌లో చాలా సినిమాలు ముందే డౌన్‌లోడ్ చేసి పెట్టుకోండి. లేదా మంచి పుస్తకం తీసుకెళ్లండి. హెడ్ ఫోన్‌ను మర్చిపోకండి.
ఇది కూడా చదవండి : Honeymoon : వీసా అవసరం లేకుండా ఈ ఏడు దేశాల్లో హనీమూన్‌కు వెళ్లొచ్చు.
5. తాగుతూ ఉండు నీరు..తిరుగుతూ ఉండు సారు
Hydration During Air Travel : విమాన ప్రయాణంలో స్ట్రెస్ అనేది సాధారణం. ఎక్కువ సమయం వరకు కూర్చోవడం అనేది స్ట్రెస్‌ను మరింతగా పెంచే అవకాశం ఉంది. దాన్ని ఎలా డీల్ చేయాలో చదవండి :
నీళ్లు తాగండి : సెక్యూరిటీ చెక్ పూర్తి అయిన తరువాత ఒక వాటర్ బాటిల్ కొనండి. లేదా ఫ్లైట్ అటెండెంట్‌ని ( Flight Attendant ) ని కూడా మీరు నీరు అడగవచ్చు. రెగ్యులర్‌గా మంచి నీరు తాగండి. దీని వల్ల తలనొప్పి, నిస్సత్తువ తగ్గే అవకాశం ఉంది.
స్ట్రెచింగ్| Stretching In Flights : లాంగ్ ఫ్లైట్ అయితే ఒకే చోట ఎక్కువ సేపు కూర్చోవడం కష్టంగా అనిపిస్తుంది. ఒకవేళ అవకాశం ఉంటే వాష్‌రూమ్ వరకు వెళ్లినట్టు వెళ్లి కాళ్లను స్ట్రెచ్ చేసుకోవచ్చు. మీరు వాష్‌రూమ్ పక్క ఉన్న సీటులో కూర్చుని ఉంటే మాత్రం టైమ్‌ను బట్టి నడుచుకోండి.
6. బీ పాజిటీవ్ | First time Flyers Tips
తొలిసారి ఫ్లైట్‌లో ప్రయాణిస్తున్న సమయంలో మీరు పాజిటీవ్‌గా ఉండటం చాలా ముుఖ్యం. పాజిటివిటీని ఇలా పెంపొందించుకోండి:
గమ్యస్థానం గురించి ఆలోచించండి : మీరు వెళ్లబోతున్న ప్రదేశం గురించి ఆలోచించండి. అక్కడ చూడాలి అనుకుంటున్న ప్రదేశాల గురించి ఆలోచించండి. దీని వల్ల మీ మైండ్‌లో పాజిటివిటీ పెరుగుతుంది.
ఊపిరి తీసుకోండి : ఒక వేళ ఎప్పుడైనా మీకు టెన్షన్ అనిపిస్తే మాత్రం డీప్ బ్రీథింగ్ టెక్నిక్‌ను పాటించండి. ముక్కుతో గాలిని పీల్చి కొన్ని సెకన్లు నిలిపి నోటి ద్వారా మెల్లిగా వదలండి. మీకు అవసరం అనిపిస్తే కొన్ని సార్లు రిటీప్ చేయవచ్చు.
ఫ్లైట్ అటెండెంట్స్‌తో మాట్లాడండి : ఫ్లైట్ గాల్లో ఉన్నప్పుడు మీకు ఏమైనా సమస్యలు ఉన్నా, సందేహాలు ఉన్నా, ఇబ్బందిగా ఉన్నా మీరు ఫ్లైట్ అటెండెంట్‌తో మాట్లాడవచ్చు. మీకు సహాయం చేసేందుకు వారు శిక్షణ తీసుకున్నారు.
Watch : Hemkund Sahib Gurudwara Vlog In Telugu
7. కరెక్ట్ సీటు ఎంచుకోండి | First time Flyers Seat Selection
విమానంలో సీటింగ్ వ్యవస్థ అర్థం చేసుకోవడానికి ఒకసారి జర్నీ చేస్తే సరిపోతుంది. అయితే మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే ఫ్లైట్ అటెండెంట్ మీకు సాయం చేస్తారు
సీటింగ్ వ్యవస్థను అర్థం చేసుకోండి : విమానం లేయౌట్ ( Flight Layout ) గురించి తెలుసుకుని అందులో మీకు ఏ సీటు అయితే కావాలో అలాంటి సీటును ఎంచుకోండి. అంటే విండోనా, ఐసిలా ( విండోకు దూరంగా ఉంటుంది ) , మధ్యలో సీటా అని మీరు నిర్ణయించుకోండి.
అప్‌గ్రేడ్ అవ్వండి : మీకు సీటింగ్ పొజిషన్ కానీ టికెట్ క్లాస్ కాని నచ్చకపోతే డబ్బు చెెల్లించి అప్‌గ్రేడ్ కూడా అవ్వవచ్చు. లాంగ్ ఫ్లైట్స్‌లో కాళ్లు పెట్టుకునే చోటు సరిపోకపోతే, లేదా కంఫ్టర్ట్‌గా లేకపోతే చాలా మంది ఇలాగే చేస్తారు.
ఇది కూడా చదవండి : Travel Vlogging Tips : ట్రావెల్ వ్లాగర్ అవ్వాలంటే ఏం చేయాలి ? 10 టిప్స్ !
8. ఎయిర్‌లైన్స్ గైడ్‌లైన్స్ పాటించండి | Airport Guidelines for First time Flyers
ఒక్కో విమానయాన సంస్థకు ఒక్కో పాలసీ ఉంటుంది. దాన్ని బట్టి అది ఫ్లైట్‌ను నిర్వహిస్తుంటుంది. అందుకే మనం ఈ విషయాలు తెలుసుకుంటే బెటర్
ఫ్లైట్ రూల్స్ | Flight Rules : విమానం ఎక్కే ముందు ఆ సంస్థ నియమాలు, మార్గదర్శకాలు వంటి గురించి తెలుసుకుంటే బెటర్. దీంతో పాటు చెకిన్, బోర్డింగ్ ప్రక్రియ, లగేజ్ పాలసీ గురించి కూడా తెలుసుకోండి.
సేఫ్టీ ప్రోటోకాల్స్ | Flight Safety Protocols: ప్రతీ విమానయాన సంస్థకు కొన్ని సేఫ్టీ ప్రోటోకాల్స్ ఉంటాయి. దీంతో పాటు హెల్త్ గైడ్‌లైన్స్ వంటి ఎన్నో ప్రోటోకాల్స్ ఉంటాయి. వాటి గురించి తెలుసుకోండి.
9..అప్డేట్‌లో ఉండండి
మీ ఫ్లైట్ గురించి మీకు ఎప్పటికప్పుడు సమాచారం తెలిస్తే దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోగలరు. ఈ సూచనలు పాటించగలరు:
ఫ్లైట్ అప్డేట్ | Flight Updates : మీ ఫ్లైట్ స్టేటస్ గురించి తరచూ చెక్ చేయండి. దీని కోసం ఎయిర్‌లైన్స్ వెబ్‌సైట్ చెక్ చేస్తూ ఉండండి. దీని వల్ల విమానం ఆలస్యం అయినా, టైమింగ్ మారినా మీకు వేగంగా సమాచారం అందుతుంది.
ఎయిర్‌పోర్ట్ మ్యాప్ | Airport Maps : ఎయిర్‌పోర్టులో గేట్స్, షాప్స్, ఈటరీలు ఎక్కడున్నాయో తెలుసుకునేందుకు అక్కడి మ్యాప్స్ చెక్ చేయండి. డౌట్ ఉంటే అక్కడి సిబ్బందిని అడగండి.
ఇవి కూడా చదవండి
- Telugu Women Travel Vloggers : ట్రావెల్ వ్లాగింగ్‌లో వీర వనితలు
- Travel Vlogging Tips : ట్రావెల్ వ్లాగర్ అవ్వాలంటే ఏం చేయాలి ? 10 టిప్స్ !
- Honeymoon : వీసా అవసరం లేకుండా ఈ ఏడు దేశాల్లో హనీమూన్‌కు వెళ్లొచ్చు.
- First time Flyers : ఫస్ట్ టైమ్ విమానం ఎక్కుతున్నారా ? ఈ 10 టిప్స్ మీ కోసమే
10. ప్రయాణాన్ని ఎంజాయ్ చేయండి
ఫస్ట్ ఫ్లైట్ ( First Flight ) అనే ఆలోచనను మెదడులోంచి బయటికి తీసేసి ఎంజాయ్ చేయడం ప్రారంభించండి.
వ్యూస్ చూడండి : మీ ఫస్ట్ ఫ్లైట్‌లో విండో సీట్ ( Best Flight Seat ) బుక్ చేసుకుంటే బెటర్. ఎందుకంటే ఫస్ట్ ఇంప్రెషన్ అనేది బెస్ట్ ఇంప్రెషన్. కిటికీలోంచి ఆకాశం చూస్తే, కింద ఉన్న నేచర్ అండ్ కొండలను చూస్తే కలిగే కిక్కు మామూలుగా ఉండదు. ఎంజాయ్ చేస్తారు మీరు.
పక్కవారితో మాట్లాడండి : తోటి ప్రయాణికులతో, ఫ్టైట్ అటెండెంట్స్‌తో మాటలు కలపండి. మీరు చక్కగా మాట్లాడితే ఎవరైనా వింటారని గుర్తుంచుకోండి.
ఇది కూడా చదవండి: Visa Free Countries: భారత్‌కు దగ్గరగా ఉన్న ఈ 8 దేశాలకు వీసా లేకుండానే వెళ్లొచ్చు
మొత్తానికి..
మొదటి సారి విమాన ప్రయాణం చేయడం అనేది కొంత మందిలో స్ట్రెస్‌కు ( Stress During Flight ) కారణం అవుతుంది. అయితే ముందస్తుగా సిద్ధం అవడం, ఆలోచనా విధానాన్ని ట్యూన్ చేయడం వల్ల ఫస్ట్ ఫ్లైట్ బెస్ట్ ఫ్లైట్ అవుతుంది. ఈ 10 చిట్కాలు పాటించి మీ తొలి విమానయాత్రను విజయవంతంగా పూర్తి చేస్తారని ఆశిస్తున్నాను.
గమనిక: ఈ వెబ్‌సైట్లో ప్రకటనలు కూడా ఉంటాయి. ముఖ్యంగా గూగుల్ యాడ్స్ ద్వారా ఈ ప్రకటనలు మీకు కనిపిస్తాయి. ఈ ప్రకటనలే మాకు ఆధారం. ఇందులో కొన్ని ప్రకటనలపై మీరు క్లిక్ చేస్తే మాకు ఆదాయం వస్తుంది.
ఈ Travel కంటెంట్ నచ్చితే, ఎవరికైనా ఉపయోగపడుతుంది. అనుకుంటే షేర్ చేయగలరు. ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. యూట్యూబ్ ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి.