11 Epic Traffic Jams: ప్రపంచంలోనే అత్యంత దారుణమైన 11 ట్రాఫిక్ జామ్స్ ఇవే !

షేర్ చేయండి

చరిత్రను తవ్వి తీస్తే బయటికి వచ్చిన టాప్ 11 ట్రాఫిక్ జామ్స్ (11 Epic Traffic Jams)  ఇవే అని తెలిసింది. ప్రపంచంలోనే అతి పెద్ద ట్రాఫిక్ జామ్ మన దేశంలో ఈ పోస్టు పబ్లిష్ చేసే సమయానికి ఇంకా కొనసాగుతోంది. 

ప్రపంచంలోనే అందరిని సమానంగా బాధ పెట్టేవి రెండే రెండు ఒకటి దోమ, రెండోది ట్రాఫిక్ జామ్ (Traffic Jam). మనకు ప్రమేయం లేకుండానే అందులో ఇరుక్కుపోతాం. 5 నిమిషాలు ట్రాఫిక్‌లో ఉంటేనే మనకు చిరాకు వేస్తుంది. కానీ వేలాది మంది కొన్ని రోజుల పాటు ట్రాఫిక్‌జామ్‌లో ఇరుకున్న ఘటనలు చోటుచేసుకున్నాయి. చరిత్రను తవ్వి తీస్తే బయటికి వచ్చిన టాప్ 11 ట్రాఫిక్ జామ్స్ ఇవే అని తెలిసింది.  

గమనిక : ప్రపంచంలోనే అతి పెద్ద ట్రాఫిక్ జామ్ మన దేశంలో (Biggest Traffic Jam In world) ఈ పోస్టు పబ్లిష్ చేసే సమయానికి ఇంకా కొనసాగుతోంది….

1. చైనా : 12 రోజులు | Longest Traffic Jam In China

ప్రపంచంలోనే ఇప్పటి వరకు ఏర్పడిన అతిదారుణమైన ట్రాఫిక్ జామ్ వచ్చేసి చైనాలో 2010 ఆగస్టులో జరిగింది. బీజింగ్ – టిబెట్ ( Tibet) ఎక్స్‌ప్రెస్‌వేలో బీజింగ్ దగ్గరి నుంచి మొదలైన ఈ ట్రాఫిక్ జామ్‌లో 100 కిమీ మేరా ప్రజలు ఇరుక్కున్నారు. ఈ ట్రాఫిక్ జామ్ 12 రోజుల పాటు కొనసాగింది. దీనికి ప్రధాన కారణం వచ్చేసి మంగోలియా (Magnolia) ప్రాంతం నుంచి బీజింగ్ వైపు భారీ నిర్మాణ సామగ్రి, బొగ్గు ముడిపదార్ధంతో వెళ్లే భారీ వాహనాలు. అదే సమయంలో ఎక్స్‌ప్రెస్‌వేలో నిర్మాణం జరుగుతోంది. దీంతో ఒకవైపు దారి మూసుకోవడంతో ఒకేదారిలో రాకపోకలు జరిగేవి.

2. ఫ్రాన్స్ :1980 ( France Traffic Jam )

11 Epic Traffic Jams
Biggest Traffic Jams In World

చైనీస్ ట్రాఫిక్ జామ్ వచ్చేసి అత్యధిక కాలం కొనసాగగా ఇప్పుడు మీరు చదవబోయే ట్రాఫిక్ జామ్ వచ్చేసి అత్యంత పొడవైన ట్రాఫిగ్ జామ్‌గా పేరు తెచ్చుకుంది. 1980 ఫిబ్రవరి 16వ తేదీన ఫ్రాన్స్‌లో ఒక భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఫ్రాన్స్‌లోని లియాన్ నుంచి పారిస్ (Paris) వరకు సుమారు 176 కిమీ మేరా వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.ఫ్రెంచ్ ఆటో రూట్‌లో జరిగిన ట్రాఫిక్‌కు కారణం ఏంటంటే వింటర్ వెకేషన్ పూర్తి చేసుకుని చాలా మంది ప్యారిస్‌కు తిరిగి రావడం మొదలుపెట్టడం. దీంతో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. 

3. హూస్టన్, అమెరికా | 2005

ప్రకృతి విపత్తుల వల్ల కూడా కొన్ని సార్లు ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది. 2005 సెప్టెంబర్‌లో టెక్సాస్‌లోని హూస్టన్‌లో (Houston, Texas) ఒక భారీ సుడిగాలి చెలరేగింది. దీంతో అధికారులు అందరినీ సురక్షితమైన ప్రదేశాలకు వెళ్లమని సూచించారు. దీంతో ఒక్కసారిగా 25 లక్షల మంది ప్రజలు తమ నివాసాల నుంచి ఒక్కసారిగా బయటికి వచ్చారు. దీంతో 160 కిమీ మేరా భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ ట్రాఫిక్ వచ్చేసి 48 గంటల పాటు కొనసాగింది.

4. బీథల్, న్యూయార్క్ | 10 Epic Traffic Jams

Biggest Traffic Jams In World
ప్రతీకాత్మక చిత్రం

అమెరికాలోని న్యూయార్కులో 1969 ఆగస్టు 15 నుంచి 18 వరకు మూడు రోజుల పాటు భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. స్థానికంగా జరుగుతున్న వుడ్ స్టక్ మ్యూజిక్ అండ్ ఆర్ట్స్ ఫెస్టివల్ కోసం 5,00,000 మంది ఒక్కసారిగా తరలి రావడం వల్లే ఇలా జరిగింది. దీంతో న్యూయార్కులో (New York Traffic) 20 కిమీ మేరా ట్రాఫిక్ జామ్ అయింది. దీనికి తోడు భారీ వర్షాలు, బురద ఇవన్ని కలిపి దీన్ని చిరాకైన ట్రాఫిక్ జామ్‌గా మార్చాయి. చివరికి ఈ కేచేరీలో పెర్ఫార్మర్లను హెలికాప్టర్ల ద్వారా తరలించాల్సి వచ్చింది.

5. షికాగో, ఇల్లినాయ్ |11 Epic Traffic Jams

షికాగాలో (Chicago) ఎప్పుడూ లేని విధంగా మంచు కురవడంతో 2011 ఫిబ్రవరి 1న సాయంత్రం భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. 20.2 ఇంచుల హిమపాతం వల్ల దారి కనిపించక అనేక వాహనాలు ఒకదానితో ఒకటి ఢీన్నాయి. కొన్ని వాహనాలు మంచుతో సగానికి పైగా కవర్ అయ్యాయి. వాహానాలు ముందుకు వెళ్లలేకపోయాయి. వెనక ఉన్న వాహనలు నిలిచిపోయాయి. ఇలా మంచులో 12 గంటల పాటు ఇరుక్కుపోయారు వాహనదారులు.

6. ఈస్ట్ వెస్ట్ జర్మని | West Germany

బెర్లిన్ వాల్ (Berlin Wall) పడిపోయిన తరువాత ఈస్టర్ హాలిడే సమయంలో తమ పాత స్నేహితులను, కుటుంబ సభ్యులను కలవడానికి జర్మనీ ప్రజలు పోటెత్తారు. దీంతో 1990 ఏప్రిల్ 12వ తేదీన 18 మిలియన్ల కార్లతో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సాధారణంగా 5 లక్షల కార్లు కూడా ఉండని రోడ్లపై అక్షరాలా 18 మిలియన్ల కార్లు ఒక్కసారిగా చీమలు పుట్టలోంచి బయటికి వచ్చినట్టు బయటికి వచ్చాయి.

7. మాస్కో, రష్యా | Russia 

Biggest Traffic Jams In World
మాస్కోలో ట్రాఫిక్ పరిస్థితి ( ప్రతీకాత్మక చిత్రం)

రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్ నుంచి మాస్కో (Moscow) వెళ్లే ఎమ్ -10 రహాదారి హిమపాతం వల్ల పూర్తిగా మూసుకుపోయింది. ఫలితంగా 2012 నబంబర్ 30వ తేదీన ఏర్పడిన ట్రాఫిక్ జామ్ మూడు రోజుల పాటు కొనసాగింది. దీంతో అధికారులు రహాదార్ల పక్కన టెంట్లను కూడా ఏర్పాటు చేయాల్సి వచ్చింది. వాహనదారులకు నిత్యావసరాలు అందించడంతో పాటు మానసికంగా కూడా అధికారులు అండగా నిలిచారు. చాలా మంది వొడ్కా (Vodka) తాగి రిలాక్స్ అయ్యారేమో.

8. న్యూయార్క్ సిటీ

2001 సెప్టెంబర్ 11వ తేదీన అక్కడి వరల్డ్ ట్రేడ్ సెంటర్లు (World Trade Center) వైమానిక దాడిలో కుప్పకూలిన తరువాత నగరంలో ప్రజలు షాక్ అయ్యారు. అధికారులు న్యూయార్క్ నగరాన్ని పూర్తిగా మూసివేశారు. బ్రిడ్జిలు, టన్నెల్స్ క్లోజ్ చేశారు. అత్యవసరమైన వాహనాలు, పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు వ్యవస్థ కూడా ఆగిపోయింది. నగరం ఎక్కడికి అక్కడే నిలిచిపోయింది.

9. సో పౌలో, బ్రెజిల్ | 11 Epic Traffic Jams

2009 జూన్ 10వ తేదీన బ్రెజిల్‌లోని సో పౌలో (Sao Paulo) వద్ద 182 మీటర్ల భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. నిజానికి బ్రెజీల్‌లో (Brazil) సగటున ప్రతీ పౌరుడు 4 గంటలు ట్రాఫిక్ జామ్‌లోనే ఉంటాడట. దీనికి కారణం అక్కడి ఇరుకు వీధులు అని అంటుంటారు.

10. టోక్యో, జపాన్ | Japan Biggest Traffic Jam

1990 ఆగస్టు 12వ తేదీన 15,000 పైగా కార్లు అక్కడి హ్యోగో , షిగా హైవేలో ఇరుక్కుపోవడం వల్ల 84 మైళ్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఒకవైపు హాలిడే నుంచి తిరిగి వస్తున్న పర్యాటకులు, మరోవైపు తుపాను హెచ్చరికల వల్ల నగరం నుంచి బయటికి వెళ్లాలని ప్రయత్నిస్తున్న ప్రజలు…ముందు టైరు ముందుకు వెనకటైరు వెనక్కి వెళ్లినట్టుగా మారింది పరిస్థితి. 

11. ప్రయాగ్‌రాజ్, ఉత్తర ప్రదేశ్ | Biggest Traffic Jam In World

Prayagraj Traffic Jam
| ప్రయాగ్‌రా‌జ్‌లో ట్రాఫిక్ పరిస్థితి

మహా కుంభ మేళా (Maha Kumbh Mela 2025) సందర్భంగా 2025 జనవరి నుంచి భారీ సంఖ్యలో భక్తులు కుంభమేళాకు తరలి వెళుతున్న విషయం తెలిసిందే. అయితే వీకెండ్ సందర్భంగా జనవరి 31వ తేదీ నుంచి అధిక సంఖ్యలో కుంభమేళా జరిగే ప్రాంతానికి (prayagraj) తరలి వచ్చారు. దీంతో ఏకంగా 350 కిమీ మేరా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

5 కిమీ ప్రయాణం చేయడానికి 5 గంటల సమయం పడుతోంది అని చాలా మంది సోషల్ మీడియాలో తెలిపారు. దీనిని ప్రపంచంలోనే అతిపెద్ద ట్రాఫిక్ జామ్ అని అంటున్నారు. ఈ స్టోరీ పబ్లిష్ అయ్యే సమయానికి కూడా ఈ ట్రాఫిక్ కొనసాగుతోంది. 

📣ఈ Travel కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. YouTube ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp లో జాయిన్ అవ్వడానికి ఇక్కడ క్లిక్ చేయండి. ట్రెండింగ్ వార్తలు కోసం NakkaToka.com విజిట్ చేయండి.

షేర్ చేయండి

Leave a Comment

error: Content is protected !!