క్రిస్మస్ సమీపిస్తున్న తరుణంలో గాడ్స్ ఓన్ కంట్రీ అయిన కేరళ ( Kerala ) అందాలు డబుల్ అవుతాయి. విభిన్నమైన ఆచారాలు, సంప్రదాయాలకు వేదిక అయిన కేరళ తన ప్రకృతి అందాలతో అందరినీ తన వైపు లాగేస్తుంది.
ఆధ్మాత్మిక ప్రాధాన్మత, అలాగే దివ్యమైన చరిత్ర కలిగిన ఆలయాలు ఉన్న ఈ నేలలో ఎన్నో చర్చీలు కూడా ఉన్నాయి. అందుకే చాలా మంది క్రిస్మస్ సెలవులకు కేరళ వెళ్లడానికి ఇష్డపడుతుంటారు.
దైవ చింతన మాత్రమే కాకుండా చింతలు లేని ఆనందకరమై జీవితం కోసం కేరళను తమ డిసెంబర్ డెస్టినేష్‌గా మార్చుకుంటారు.
ఇలా చర్చి అండ్ జర్నీ అనే కాన్సెప్టుతో క్రిస్మస్ సెలవుల్లో ట్రావెల్ చేయాలి అనుకుంటే కేరళలోని ఈ 6 లొకేషన్స్ మీకు తప్పకుండా నచ్చుతాయి
- కొచ్చి – అరేబియన్ సముద్రపు రాణి
Places In Kochi | కొచ్చిలో క్రిస్మస్ అత్యంత వేడుకగా చేసుకుంటారు. ఈ నెలలో మొత్తం నగరం అంతా సందడి వాతావరణం కనిపిస్తుంది.
అద్భుతమైన జలసంపద ఉన్న కొచ్చిలో చాలా మంది సరదాగా సమయం గడపడానికి వస్తుంటారు.
ఇక్కడి ప్రజలు సంప్రదాయంగా చేపలు పట్టేందుకు వినియోగించే చైనీస్ నెట్స్‌ను ఎలా వినియోగిస్తారో దగ్గరుండి మరీ చూస్తారు ప్రయాణికులు.
కోకొచ్చిలో మీరు కొచ్చి కోటను చూడవచ్చు. ఇక్కడ బ్రిటిష్ కాలం నాటి నిర్మాణ శైలిని, కేఫ్స్ అండ్ గ్యాలరీలను స్థానిక కల్చర్‌ను చూడవచ్చు.
దీంతో పాటు శాంటా క్రూజ్ బాసిలికాను ( Santa Cruz Basilica ) కూడా దర్శించుకోవచ్చు.
Also Read : Valley Of Flowers : వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ ఎలా వెళ్లాలి? ఎప్పుడు వెళ్లాలి ?
- మున్నార్
Munnar | వెస్ట్రన్ ఘాట్స్‌లో ఉన్న మున్నార్ ఒక అందమైన హిల్ స్టేషన్ మాత్రమే కాదు క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకోవడానికి మంచి ఛాయిస్ కూడా.
చాలా మంది ఇక్కడి టీ గార్డెన్స్, పొగమంచులో అందంగా కనిపించే గిరులను, ప్రకృతి సిరులను చూసేందుకు వస్తుంటారు.
చాలా మంది ఇక్కడ తమలోని కవిని, ప్రేమికుడిని తట్టిలేపుతుంటారు. లే బాబు లే అని ( జస్ట్ కిడ్డింగ్) .
మున్నార్ అందాలను చూసి కొత్త లోకంలో ఉన్నట్టు ఫీల్ అవుతారు ఇక్కడి ప్రయాణికులు. అంతేనా డిసెంబర్‌లో చలిని కొత్తగా వెచ్చగా సెలబ్రేట్ చేస్తుంటారు.
కాఫీ తాగుతూ తాపీగా మున్నార్‌లో తిరగడం ఎలా ఉంటుందో ఒకసారి ఊహించండి..
చాలా మంది ఇక్కడి ఎరవికుళం జాతీయ పార్కును సందర్శించిన నీలగిరి తార్‌ను చూస్తారు. లేదంటే దగ్గర్లోని మట్టుపెట్టె డ్యామ్‌ను సందర్శిస్తారు. ఇక్కడ బోటింగ్‌ను పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు.
Also Read : Indian License : భారతీయ లైసెన్స్ ఈ 15 దేశాల్లో కూడా చెల్లుతుంది
- తిరువనంతపురం
ఇది కేరళ రాజధాని మాత్రమే కాదు వేడుకల రాజధాని కూడా.
Thiruvananthapuram (Trivandrum) : తిరువనంత పురాన్ని త్రివేండ్రం అని కూడా పిలుస్తుంటారు. శ్రీ అనంత పద్మనాభ స్వామివారి పవిత్రమైన ఆలయం కొలువైన ఈ నగరం ఎంత విశిష్టమైనదో ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు.
క్రిస్మస్ సందర్బంగా ఇక్కడి స్థానికులు కలిసి ఎన్నో ఈవెంట్స్ చేస్తుంటారు. మార్కెట్లో క్రిస్మస్ స్టార్స్ సండడి చేస్తాయి.
స్థానికం వస్తువులను అమ్మే చలై మార్కెట్ ( chalai market) విజిట్ చేస్తే మీకు కేరళ ప్రజల జీవన విధానం గురించి ఎన్నో విషయాలు తెలుస్తాయి. ఇక్కడ మీరు రకరకాలు టేస్టీ రెసిపీలు ట్రై చేయవచ్చు.
ఈ నగరంలో సెంట్ జోసెఫ్ క్యాథడ్రిల్ లాంటి ఎన్నో చర్చిలు ఉన్నాయి. క్రిస్మస్ సమయంలో ఇక్కడ సందడి మామూలుగా ఉండదు.
Also Read : Thailand 2024 : థాయ్‌లాండ్ ఎలా వెళ్లాలి ? ఏం చూడాలి ?
- కొల్లాం
Kollam | కోస్టల్ ఏరియాలో ఉండే కొల్లాంలో క్రిస్మస్ కోలాహలం మామూలుగా ఉండదు.
మనసును హత్తుకునే నేచర్, ప్రశాంతతను ఇచ్చే బీచులు ఇవన్నీ కలిసి కొల్లాంను క్రిస్మస్ సూపర్ స్పాట్‌గా మార్చాయి.
కొల్లాంలో మీరు అష్టముడి సరస్సు ( ashtamudi lake ) ను అస్సలు మిస్ అవ్వకండి. భోజన సమయంలో కేరళ స్పెషల్ ఫుడ్‌ను ఆర్డర్ ఇవ్వండి. కొత్త కొత్త రెసెపీలు ట్రై చేయండి. బిల్ ఎక్కువైతే మాత్రం నన్ను ఇన్వాల్వ్ చేయకండి రావుగారు.
Also Read | Manali : మనాలి ఎలా ప్లాన్ చేసుకోవాలి ? ఎక్కడ ఉండాలి ? ఏం చూడాలి?
- వయనాడ్
Wayanad | వయనాడ్ అంటే ప్రకృతి. ప్రకృతి అంటే వయనాడ్. పచ్చదనాన్ని దుప్పటిలా కప్పేసుకున్న కొండలను, ఘాట్ రోడ్లను చూస్తే మీరు మైమరిపోతారు.
ఇది క్రిస్మస్ హాలిడేస్‌కు మంచి ఛాయిస్ అవుతుంది. ప్రకృతికే నోరు ఉంటే వాయ్‌నాడ్ దాని వాయిస్ అవుతుంది. రైమింగ్ బాగుంది కదా. వయనాడ్ వెళ్లడి చూడండి.మీరు కూడా ఇలాంటి లైన్స్ ఎన్నో క్రియేట్ చేయొచ్చు.
కుటుంబం మొత్తం కలిసి వాయ్‌నాడ్ వెళ్లి మంచి మెమోరీస్‌తో తిరిగిరావచ్చు.
మీరు సాహసంతో సావాసం చేసే రకం అయితే చెంబ్రా పీక్ ( Chembra peak) ట్రెక్కింగ్ కోసం బ్యాగును సర్ధుకోవచ్చు.
లేదా మీకు వైల్డ్ లైఫ్ ఇష్టం అయితే వాయ్‌నాడ్ వైల్డ్ శాంక్చురిని విజిట్ చేయొచ్చు. ఇక్కడ మీకు ఏనుగులతో పాటు పలు రకాల పక్షలు, జంతువులు కనిపించే అవకాశం ఉంటుంది.
Also Read : Oymyakon : ప్రపంచంలోనే అతిశీతలమైన గ్రామంలో ప్రజలు ఎలా జీవిస్తున్నారు ?
- అలప్పులా
Alappuzha | అలప్పులాను వెనిస్ ఆఫ్ ది ఈస్ట్ అని కూడా పిలుస్తుంటారు. కేరళ అందాలన్నీ ఇక్కడే చూడొచ్చు. ఇక్కడి బ్యాక్‌వాటర్ మిమ్మల్ని తప్పుకుండా ఇంప్రెస్ చేస్తుంది.
ఈ బ్యాక్ వాటర్‌లో హౌజ్ బోట్ తీసుకుని ప్రయాణిస్తే నెక్ట్స్ పదేళ్లు రోజుకోసారి ఈ జర్నీని గుర్తుకు తెచ్చుకుంటారు.
అతిశయాలు పక్కడన పెడితే అలప్పులా నిజంగా మంచి టూరిస్ట్ స్పాట్. ఇక్కడ స్థానిక మార్కెట్లో మీరు రుచికరమైన స్వీట్ అండ్ హాట్ వెరైటీలను టేస్ట్ చేయవచ్చు.
మొత్తానికి క్రిస్మస్ హాలిడేస్‌ను మీరు బాగా ఎంజాయ్ చేయాలి అనుకుంటే కేరళ మీకు మంచి ఆప్షన్ అవుతుంది. మంచి ప్లానింగ్ , అడ్వాన్స్ బుకింగ్ చేసుకుని ముందుగానే ప్యాకింగ్ చేసుకుంటే ఎన్నో మధురమైన అనుభూతులతో తిరిగి మీ ఇంటికి చేరుకోవచ్చు.
ఎందుకంటే గాడ్స్ ఓన్ కంట్రీ కదా ఇది. ఈ రాష్ట్రం ప్రయాణికులను నిరాశపరచదు.
దేవుడు డిసెంబర్‌లో ఎవరినీ నిరాశపరచడు.
ఒకే టేక్ కేర్ .
హ్యాప్పీ హాలిడేస్.
ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. యూట్యూబ్ ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి.