UNESCO World Heritage Sites : భారత్‌లో యూనెస్కో గుర్తింపు పొందిన Top 8 సైట్స్ ఇవే

భారత దేశంలో మొత్తం 43 యూనెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ( UNESCO World Heritage Sites ) ఉన్నాయి. అందులో కేవలం 8 లొకేషన్స్ మాత్రం తీసుకొచ్చాను. ఇవి ప్రపంచానికి భారతీయుల శిల్పకళా నైపుణ్యం, నిర్మాణ కౌశలాన్ని పరిచయం చేస్తాయి.

ఆ సైట్స్ ఏంటో చూసేద్దామా…

Sun Temple, Konark : సమస్త జగత్తుకు ప్రాణ శక్తిని ప్రసాదిస్తున్న సూర్యుడికి అంకితం ఈ ఆలయం. ఇక్కడ ఏడు గుర్రాలపై 12 చక్రాలున్న రథంలో సూర్యభగవాణుడు కదిలినట్టు ఉంటుంది ఆలయం. ఈ ఆలయాన్ని 1238 నుంచి 1250 మధ్యలో రాజా నరసింగ దేవ సమయంలో నిర్మించారు.
Khajuraho, Madhya Pradesh : ట్రీడితో బిల్డింగులు కట్టేస్తున్న జనరేషన్ ఇది. ఇలాంటి జనరేషన్ కూడా ఖజరహో అందాలను చూసి పరేషాన్ అవుతోంది. చిన్న చిన్న డీటెయిల్స్‌ కూడా మిస్ అవ్వగుండా రాళ్లతో అద్భుతాలు చేశారు. భారతీయ శిల్పకళకు అత్యున్నత పురస్కారం, అత్యుత్తమ ఉదాహరణే ఇక్కడి నిర్మాణాలు
Ellora Caves, Maharastra : కొండలను తొలచి గుహాలయాలుగా మలచి ప్రపంచానికి అద్భుతమైన రాతి శిల్పకళను పరిచయం చేశారు నాటి శిల్పకారులు. ఈ గుహలు హిందూ, బౌద్ధమతం, జైనిజంల భారత్‌లో ఎలా సమాంతరంగా మనగడ సాగించాయో చాటుతాయి.
Ajanta Caves, Maharastra : అజంతా గుహలుమహరాష్ట్రలోని జాతి రత్నాలు అని చెప్పవచ్చు. ఇందులో గుట్టలను మలిచి మొత్తం 30 వరకు బౌద్ధ గుహలను మలిచారు. వాటిని తొలచిన విధానం నేటికీ ఒక అద్భుతం అని చెప్పవచ్చు.
Taj Mahal, Agra : తాజ్ మహల్ కేవలం యూనెస్కో గుర్తింపు తెచ్చుకున్న పాలరాయి నిర్మాణం మాత్రమే కాదు ఇది ప్రపంచంలో 7 వింతల్లో ఒకటి. భారత దేశానికి వచ్చే ప్రతీ విదేశీయుడు తాజ్ మహల్ తప్పకుండా చూడాలి అనుకుంటాడు.
« of 2 »

ఈ వారసత్వ సంపద కేవలం భారత దేశానికే సొంతం కాదు మొత్తం ప్రపంచం కూడా వీటిని తమ సంపదగా చూసుకోవాలని వీటిని యూనెస్కో ( UNESCO World Heritage Sites) సైట్స్‌గా గుర్తించారు.

Maldives Exit Fee : ఎగ్జిట్ ఫీజును భారీగా పెంచిన మాల్దీవ్స్, 50 శాతం కన్నా ఎక్కువే…

ఈ  కంటెంట్ నచ్చితే, ఎవరికైనా ఉపయోగపడుతుంది. అనుకుంటే షేర్ చేయగలరు. ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. యూట్యూబ్ ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి.

Leave a Comment

error: Content is protected !!