ఇటీవలే ఫోర్బ్స్ అనే ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశాల ( Most Powerful Countries ) జాబితాను విడుదల చేసింది. అంతర్జాతీయ రాజకీయాలు, ఆర్థిక పరిస్థితులు, సైనిక శక్తి వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని ఈ లిస్టులో దేశాలను చేర్చింది ఫోర్బ్స్.
ప్రపంచంలోనే 195 దేశాల్లో 10 దేశాలను ఎంచుకోవడానికి ఆ దేశ శక్తిని , ఆ దేశంలో ఉన్న నాయకత్వం, అంతర్జాతీయంగా వివిధ దేశాలతో ఉన్న సంబంధాలు, వంటి అంశాలను బట్టి ఎంపిక చేసింది.
ముఖ్యాంశాలు
అత్యంత శక్తివంతమైన 10 దేశాలు | Top 10 Most Powerful Countries in 2025
- అమెరికా
జీడిపి : 30.34 ట్రిలియన్ డాలర్లు
జనాభా : 345 మిలియన్లు
- చైనా
జీడిపి : 19.53 ట్రిలియన్ డాలర్లు
జనాభా : 1.419 బిలియన్లు
- రష్యా
జీడిపి : 2.2 ట్రిలియన్ డాలర్లు
జనాభా : 144 మిలియన్లు
- యునైటెడ్ కింగ్డమ్
జీడిపి : 3.73 ట్రిలియన్ డాలర్లు
జనాభా : 69 మిలియన్లు
- జర్మని
జీడిపి : 4.92 ట్రిలియన్ డాలర్లు
జనాభా : 84.5 మిలియన్లు
- దక్షిణ కొరియా
జీడిపి : 1.95 ట్రిలియన్ డాలర్లు
జనాభా : 51.7 మిలియన్లు
- ఫ్రాన్స్
జీడీపి : 3.28 ట్రిలియన్ డాలర్లు
జనాభా : 66.5 మిలియన్లు
- జపాన్
జీడిపి : 4.39 ట్రిలియన్ డాలర్లు
జనాభా : 125 మిలియన్లు
- సౌది అరేబియా
జీడిపి : 1.14 ట్రిలియన్ డాలర్లు
జనాభా : 33.9 మిలియన్లు
- ఇజ్రాయెల్
జీడిపి : 550.91 బిలియన్ డాలర్లు
జనాభా : 9.38 మిలియన్లు
భారత్ ర్యాంకు ఏంటి ? | India’s Rank In Forbes 2025 Most Powerful Countries
ఫోర్బ్స్ తయారు చేసిన టాప్ 10 శక్తివంతమైన దేశాల జాబితాలో భారత దేశం లేకపోవడం చాలా మందిని ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే భారత్ ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. ప్రపంచంలో అత్యంత జనాభా ఉన్న దేశం, 4వ అతిపెద్ద సైనిక శక్తి ఉన్న దేశం. ఈ జాబితాలో 12వ ర్యాంకులో ఉంది భారత్. భారత్ కన్నా ముందు యునైటెడ్ అరబ్ 11వ ర్యాంకులో ఉంది.
ఈ జాబితాలో భారత్ పేరు టాప్ 10 లో లేకపోవడం అనేది చర్చలకు దారి తీస్తోంది. ఎందుకంటే భారత్ ఈ మధ్య అంతర్జాతీయంగా వివిధ దేశాలతో సఖ్యతను మెయింటేన్ చేస్తోంది. ఆర్థిక వ్యవస్థ కూడా బాగానే ఉంది.
ఈ Travel కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. YouTube ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp లో జాయిన్ అవ్వడానికి ఇక్కడ క్లిక్ చేయండి. ట్రెండింగ్ వార్తలు కోసం NakkaToka.com విజిట్ చేయండి.