Visit Malaysia 2026 : 2024 లో మలేషియా వెళ్లిన 10 లక్షల మంది భారతీయులు…2026 లో 16 లక్షలే టార్గెట్!
2024లో 10 లక్షల మంది భారతీయులు మలేషియా సందర్శించగా, 2026 కల్లా ఆ సంఖ్యను 16 లక్షలకు ( Visit Malaysia 2026 ) పెంచుకోవాలని అనుకుంటోంది మలేషియా. అందులో భాగంగా విజిట్ మలేషియా అనే మిషన్ ప్రారంభించింది. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిపారు మలేషియా టూరిజం ప్రతినిధులు.
2024లో 10 లక్షల మంది భారతీయులు మలేషియా సందర్శించగా, 2026 కల్లా ఆ సంఖ్యను 16 లక్షలకు ( Visit Malaysia 2026 ) పెంచుకోవాలని అనుకుంటోంది మలేషియా. అందులో భాగంగా విజిట్ మలేషియా అనే మిషన్ ప్రారంభించింది. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిపారు మలేషియా టూరిజం ప్రతినిధులు.
ముఖ్యాంశాలు
దక్షిణాది రాష్ట్రాల నుంచే ఎక్కువ | South Indian Tourists In Malaysia
సౌత్ ఈస్ట్ ఆసియాలో భారతీయులు ఎక్కువగా వెళ్లే దేశాల్లో మలేషియా ఒకటి. ఇక్కడి మెరుగైన మౌలిక సదుపాయాలు, అందుబాటులో ఉండే ప్యాకేజీలు, పోటీలేని వాతావరణం, మెరుగైన సదుపాయాల వల్ల అధిక సంఖ్యలో ఇక్కడి వెళ్లడానికి ఇష్టపడతారు.

ఒక్క 2024 లోనే రికార్డు స్థాయిలో 10 లక్షల మంది భారతీయులు మలేషియా వెళ్లారు. ఈ పదిలక్షల్లో 5 లక్షల మంది అంటే 50 శాతం పర్యాటకులు దక్షిణాది రాష్ట్రాల టూరిస్టులు అవడం విశేషం. ఈ సంఖ్యను 2026 కల్లా 16 లక్షలకు ( Visit Malaysia ) పెంచుకోవాలనుకుంటోంది ఆ మలేషియా.
Read Also : 12 నెలలు 12 దేశాలు..నెలకో దేశం చొప్పున టూరిజం క్యాలెండర్ సహాయంతో ప్లాన్ చేసుకోండి
వారానికి 150కి పైగా విమానాలు | South India To Malaysia Flights
తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి ఎక్కువ మంది భారతీయులు మలేషియా వెళ్తున్నారని మలేషియా టూరిజం ( Tourism Malaysia ) ప్రతినిధులు తెలిపారు. దీనికి కారణం మెరుగైన విమాన కనెక్టివిటీ అని తెలిపారు.
సౌత్ ఇండియా నుంచి మలేషియాకు వారానికి 151 విమానాలు వెళ్తుంటాయి. ఇందులో 26,686 సీట్లు ప్రయాణికుల కోసం అందుబాటులో ఉంటాయి. దీంతో పాటు ఈ మధ్యే ఇండిగో ఎయిర్‌లైన్స్ ( IndiGo) చెన్నై, బెంగుళూరు నుంచి పెనాంగ్ (Penang ), లాంకావిని కనెక్టు చేసేలా కొత్త విమానాలను ప్రారంభించింది. దీంతో హైదరాబాద్, కొచిలో పాటు బెంగుళూరు నుంచి కూాడా మలేషియాకు ఎయిర్ కనెక్టివిటీ పెరిగింది.
భారీ లక్ష్యంతో | Visit Malaysia 2026
మలేషియాకు వచ్చే భారతీయుల సంఖ్యను 10 లక్షల నుంచి 16 లక్షలకు పెంచేందుకు మలేషియా టూరిజం శాఖ రంగంలోకి దిగింది. 2026 నాటికి ఈ టార్గెట్‌ను పూర్తి చేసేందుకు కొత్తగా సేల్స్ మిషన్‌ను ప్రారంభించింది. ఇందులో భాగంగా హైదరాబాద్ , కొచ్చి, బెంగుళూరు నగరాల్లో అతిపెద్ద టూరిజం రోడ్‌షోను ( Tourism Malaysia Roadshow In India ) నిర్వహిస్తోంది.
ఇందులో భాగంగా మలేషియాకు చెందిన 62 మంది సేల్స్ ప్రతినిధులు తమ సేవల గురించి వివరిస్తున్నారు. స్థానిక టూరిజం గురించి, అందించే ప్యాకేజీల గురించి వివరాలు అందిస్తారు.
మైస్ ( MICE) టూరిజం, వివాహ పర్యాటకం
అంతర్జాతీయంగా వివిధ దేశాలను కలిపి ఉంచేదే టూరిజం. ఇందులో మైస్ (MICE -Meetings, Incentives, Conferences, Exhibitions ) , వెడ్డింగ్ టూరిజంపై మలేషియా మరీ ముఖ్యంగా ఫోకస్ చేస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ట్రెండ్ సెట్టర్ అయింది ఈ మైస్ టూరిజం.
మైస్ టూరిజం అంటే ? | What Is MICE Tourism ?
మైస్ టూరిజం అంటే మీటింగ్స్ చేయడం, లేదా టార్గెట్ రీచ్ అయిన సేల్స్ పర్సన్‌ను టూర్లకు పంపించడం, ఎగ్జిబిషన్లు నిర్వహించడం ఇలాంటివి ఇందులో వస్తాయి. ఇలాంటి టూరిజం సర్వీసులో ముందుండేందుకు , టూరిస్టులను ఆకట్టుకునేందుకు ఆధునిక సదుపాయాలతో ఉన్న కాన్ఫరెన్స్‌హాల్స్, లగ్జర్జీ హోటల్లు, వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్ ఉన్న కమర్షియల్ సెంటర్స్ తో కార్పోరేట్ రంగానికి అక్కడి ప్రభుత్వం ప్రోత్సాహకాలను కూడా అందించనుంది ( Visit Malaysia 2026 ) మలేషియా.
వీటితో పాటు వివిధ సంస్థలు తమ సమావేశాలు, ప్రదర్శనలు నిర్విహించేందుకు ఏర్పాట్లలో సహాయం చేయనుంది అక్కడి టూరిజం విభాగం.
వివాహ పర్యాటకం | Wedding Tourism In Malaysia

మనిషి జీవితంలో అత్యంత ప్రాధానమైన ఘట్టాల్లో వివాహం ఒకటి. ఇలాంటి వేడుక జీవితాంతం గుర్తుండేలా కొత్త ప్రదేశాల్లో జరగాలని చాలా మంది భావిస్తారు. అందుకే మైస్ టూరిజం తరువాత ఎక్కువ మంది భారతీయులు వెడ్డింగ్ డెస్టినేషన్‌గా మలేషియాను ఎంచుకుంటున్నారట.
తమ డ్రీమ్ వెడ్డింగ్ కోసం మలేషియాలోనే బీచు హోటల్లను ఎంచుకుంటున్నారు కొత్త జంటలు. ఇక్కడి అత్యాధునిక సదుపాయాలు, ప్రీమియం సర్వీసులను చాలా మంది ఇష్టపడుతున్నారని టూరిజం మలేషియా చెన్నై డైరక్టర్ హిషాముద్దీన్ బిన్ ముస్తఫా తెలిపారు.
దీంతో పాటు విజిట్ మలేషియా 2026 మిషన్‌తో వచ్చే ఏడాది 16 లక్షల మంది భారతీయులను తమ దేశానికి ఆహ్వానించేలా ఏర్పాట్లు చేస్తున్నామని , వరల్డ్ క్లాస్ సదుపాయాలతో ఉన్న వేదికలపై భారతీయులను హోస్ట్ చేయడానికి ఎదురు చూస్తున్నామని ఆయన తెలిపారు.
ఈ Travel కంటెంట్ నచ్చితే, ఎవరికైనా ఉపయోగపడుతుంది. అనుకుంటే షేర్ చేయగలరు. ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. YouTube ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp లో జాయిన్ అవ్వడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
