Vatican City : 15 నిమిషాల్లో ఈ దేశం మొత్తం తిరిగొచ్చు, జనాభా కన్నా పర్యాటకులే ఎక్కువ
వాటికన్ సిటీలో చేయకూడని పనులు
Things not to do In Vatican City: వాటికన్ సిటీ అనేది ఒక సందర్శనీయ స్థలం మాత్రమే కాదు. ఇది ఒక పవిత్ర స్థలం కూడా. క్రైస్తవ మతానికి అత్యంత ప్రధానమైన ప్రాంతాల్లో ఒకటి. అందుకే ఇక్కడికి వచ్చే ముందు మీరు కొన్ని విషయాలు తెలుసుకోవాలి.
- డ్రిస్సింగ్ కోడ్ : మీరు సెయింట్ పీటర్ బాసిలికా, వాటికన్ మ్యూజియం వెళ్లాలి అనుకుంటే హుందాగా ఉండే డ్రెస్ ధరించండి. షార్ట్స్, స్లీవ్‌లెస్ టాప్స్, లేదా షార్ట్ స్కర్ట్స్ వేసుకోరాదు.

- ఫోటోలు వద్దు అంటే వద్దు: వాటికన్ సిటీలో కొన్ని ప్రాంతాల్లో మీరు ఫోటోలు తీయడం నిషేధం. అలాంటి చోట ఫోటోలు తీయకండి.
- గట్టిగా మాట్లాడటం : ఇది ట్రావెల్ స్పాట్ లేదా పిక్నిక్ స్పాట్ కాదు. అందుకే ఇక్కడ బిగ్గరగా మాట్లాడటం చేయరాదు.
- లైన్లు జంప్ చేేయడం : వాటికన్ సిటీకి యూరోప్ నుంచే కాదు అన్ని ఖండాల నుంచి పర్యాటకులు వస్తుంటారు. వారితో సమానంగా మనం కూడా కొన్ని చోట్ల క్యూలో నిలబడాలి. అంతే కానీ లైన్లు జంప్ చేయరాదు. దాంతో పాటు సెక్యూరిటీ చెకింగ్ దగ్గర ప్రశాంతంగా ఉండండి.
కొన్ని పనికొచ్చే వాడుక పదాలు
వాటికన్ సిటీలో ఇటాలియన్ అనేది అధికారిక భాష. కానీ ఇంగ్లిష్ చాలా మంది మాట్లాడుతారు. మీరు అక్కడ ఇబ్బంది పడకుండా ఉండేందుకు కొన్ని బేసిక్ వాడుక పదాలు తీసుకొచ్చాను.
- గ్రాసీ ( Grazie అంటే Thank You )
- పర్ ఫేవరే ( Per favore అంటే ప్లీస్ )
- బోంజోర్నో ( Buongiorno అంటే గుడ్ మార్నింగ్
- బోనసేరా ( Buonasera అంటే గుడ్ ఈవినింగ్ )
- డో సి ట్రోవా ( Dove Si Trova అంటే ఎక్కడ ? )
- పర్లా ఇంగ్లీసే ( Parla Inglese ? అంటే మీకు ఇంగ్లీష్ వచ్చా)
పనికొచ్చే చిట్కాలు | Tips For Vatican City Trip
వాటికన్ సిటీకి వెళ్లడం అనేది లక్షలాది మంది కల. దీని కోసం చాలా పోటీ ఉంటుంది. అందుకే మీరు ముందుగానే సిద్ధం అవ్వాల్సి ఉంటుంది.
ఇది కూడా చదవండి : ఈట్రైనుకు టికెట్ లేదు, టీసీ లేడు: 75 ఏళ్ల నుంచి ఫ్రీ సేవలు | 10 Facts About Bhakra Nangal Train
- వాటికన్ మ్యూజియం, సెయింట్ పీటర్స్ బాసిలికా వెల్లడానికి ముందే మీరు టికెట్లు బుక్ చేసుకోండి. లేదంటే అక్కడికి వెళ్లిన తరువాత మీరే ఇబ్బంది పడతారు.

- వాటికన్ సిటీకి మీరు ఎంత త్వరగా అయితే అంత త్వరగా వెళ్లండి. లేదంటే లేట్ అవుతున్నా కొద్దీ పర్యాటకుల సంఖ్య పెరుగుతుంది. మరీ ముఖ్యంగా వీకెండ్స్‌లో రద్దీ మాములుగా ఉండదు.
- గైడును హైర్ ( Vatican City Guide ) చేసుకోండి . ఎందుకంటే వాటికన్ సిటీ చరిత్ర గురించి వాళ్లు చాలా బాగా వివరిస్తారు. లేదంటే మీరు బిల్డింగులు చూసి వచ్చినట్టే అవుతుంది. అది కాదు కదా మనకు కావాల్సింది. మనం ప్రయాణికులం. నాలెడ్జ్ పెంచుకోవడం కోసమే కదా మనం తిరిగేది.
- వెళ్లిన తరువాత ఫోటోలు, వీడియో కాల్స్ అని పెట్టుకోకుండా ముందు కళ్లతో రికార్డు చేసి గుండెలో సేవ్ చేయండి. ఒక రౌండ్ మొత్తం చూసిన తరువాత మళ్లీ రికార్డు చేయడం , ఫోటోలు తీయడం స్టార్ట్ చేయండి. వ్లాగింగ్ సమయంలో నేను కూడా ఇదే టెక్నిక్ పాటిస్తాను. అయితే టైమ్ లేదు అని అనిపిస్తే మాత్రం మీ అవసరాన్ని బట్టి మీరు ప్రొడీడ్ అవ్వండి.
- కొన్ని ప్రత్యేక దినాల్లో అక్కడ ప్రత్యేక వేడుకలు జరుగుతుంటాయి. వాటి గురించి మీరు తెలుసుకుని దానికి తగిన విధంగా ప్లాన్ చేయండి.
మొత్తానికి…
హైదరాబాద్ నుంచి వాటికన్ సిటీ ( Hyderabad To Vatican City ) ప్రయాణం అనేది లాంగ్…కానీ లాంగ్ అయినా నథింగ్ రాంగ్. మీకు మంచి మెమోరీగా మిగిలిపోతుంద.. ఈ జర్నీలో ( Journey ) మీరు అద్భుతమైన కళను, చరిత్రను, ఆధ్మాత్మిక వైభవాన్ని , కేథలిసిజం మూలాల్ని తెలుసుకుంటారు. రోమ్‌లో ఉన్నప్పుడు రోమన్‌లా ఉండాలి అంటారు. సో మీరు రోమ్‌లో ఉన్న వాటికన్ సిటీకి వెళ్తున్నారు. మీరు కూడా దానికి తగిన విధంగానే మెంటల్లీ, ఫిజికల్లీ రెడీ అవ్వండి. హ్యాప్పీ ట్రావెల్ ( Travel ).
గమనిక: ఈ వెబ్సైట్లో ప్రకటనలు కూడా ఉంటాయి. ముఖ్యంగా గూగుల్ యాడ్స్ ద్వారా ఈ ప్రకటనలు మీకు కనిపిస్తాయి. ఈ ప్రకటనలే మాకు ఆధారం. ఇందులో కొన్ని ప్రకటనలపై మీరు క్లిక్ చేస్తే మాకు ఆదాయం వస్తుంది.
ఈ Travel కంటెంట్ నచ్చితే, ఎవరికైనా ఉపయోగపడుతుంది. అనుకుంటే షేర్ చేయగలరు. ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. యూట్యూబ్ ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి.
ఇది కూడా చదవండి
- Dangerous Countries : 2025 లో వెళ్లకూడని అత్యంత ప్రమాదకరమైన 10 దేశాలు
- Milaf Cola : ఖర్జూరంతో సాఫ్ట్ డ్రింక్ లాంచ్ చేసిన సౌదీ అరేబియా
- Egypt Travel Guide: ఈజిప్ట్..ఇక్కడ డబ్బు కట్టి సమాధులను చూస్తారు.. 15 Facts
- ప్రపంచ యుద్ధం వస్తే ఈ 10 దేశాలు చాలా సేఫ్
- Thailand 2024 : థాయ్‌లాండ్ ఎలా వెళ్లాలి ? ఏం చూడాలి ?
- Azerbaijan అజర్ బైజాన్ ఎలా వెళ్లాలి ? ఏం చూడాలి ? 10 టిప్స్!
- UAE: యూఏఈలో తప్పకుండా చూాడాల్సిన 10 ప్రదేశాలు
- సౌదీ అరేబియాకి ఎవరైనా వెళ్లవచ్చా ? వెళ్తే ఏం చూడవచ్చు?
- Indian License : భారతీయ లైసెన్స్ ఈ 15 దేశాల్లో కూడా చెల్లుతుంది
- Ravana Lanka : రావణుడి లంక ఎక్కడ ఉంది ? ఎలా వెళ్లాలి ? 5 ఆసక్తికరమైన విషయాలు
- Ramayana Trail : శ్రీలంకలో రామాయణం టూరిజం…ఏం చూపిస్తారు? ఎలా వెళ్లాలి ? Top 5 Tips