Travel Apps : టూర్లకు వెళ్లే వారు మొబైల్లో తప్పకుండా ఉంచుకోవాల్సిన యాప్స్ ఇవే
Travel Apps : రోజువారీ పని, ఒత్తిడితో కూడిన జీవనం నుంచి బయటపడటానికి టూర్లు, ట్రిప్‌లు ఎంతగానో ఉపయోగపడతాయి. అయితే ఈ ప్రయాణాలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాగాలంటే, కొన్ని యాప్స్ మన ఫోన్లో తప్పకుండా ఉండాలి. ఈ డిజిటల్ యుగంలో ప్రయాణాన్ని ఈజీ చేసే, సమయాన్ని ఆదా చేసే అలాంటి కొన్ని ముఖ్యమైన యాప్‌ల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
డిజిలాకర్
ప్రయాణంలో ముఖ్యమైన డాక్యుమెంట్లు వెంట తీసుకెళ్లడం వల్ల వాటిని పోగొట్టుకునే ప్రమాదం ఉంటుంది. ఇలాంటి సమయంలో డిజిలాకర్ యాప్ ఒక డిజిటల్ లాకర్లా పనిచేస్తుంది. ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్, వాహన రిజిస్ట్రేషన్ పత్రాలు వంటి అన్ని ముఖ్యమైన డాక్యుమెంట్లను ఇందులో సురక్షితంగా నిల్వ చేసుకోవచ్చు. విమాన ప్రయాణాలు, హోటల్ రూమ్‌ల బుకింగ్‌లకు ఇది చాలా ఉపయోగపడుతుంది.

డిజి యాత్ర
విమాన ప్రయాణాలు చేసేవారికి డిజి యాత్ర యాప్ ఒక పెద్ద సౌలభ్యం. ఈ యాప్‌తో విమానాశ్రయాల్లోని అన్ని పనులను సులభంగా పూర్తి చేయవచ్చు. మీ ప్రయాణ వివరాలు మరియు బయోమెట్రిక్ సమాచారాన్ని ఈ యాప్‌లో లింక్ చేయడం ద్వారా చెక్-ఇన్ ప్రక్రియ, భద్రతా తనిఖీలు చాలా త్వరగా పూర్తవుతాయి. తరచుగా ప్రయాణాలు చేసే వారికి ఈ యాప్ సమయాన్ని ఆదా చేస్తుంది.
ఇది కూడా చదవండి : Milaf Cola : ఖర్జూరంతో సాఫ్ట్ డ్రింక్ లాంచ్ చేసిన సౌదీ అరేబియా
గూగుల్ మ్యాప్స్
ఎక్కడికి వెళ్లినా దారి తెలియడం చాలా ముఖ్యమైన విషయం. ఈ విషయంలో గూగుల్ మ్యాప్స్ యాప్ చాలా ఉపయోగపడుతుంది. ఇది కేవలం దారి చూపించడమే కాదు, దగ్గర్లో ఉన్న హోటళ్లు, రెస్టారెంట్లు, పెట్రోల్ పంపులు, ఆసుపత్రులు వంటి వివరాలను కూడా అందిస్తుంది. ముఖ్యంగా, నెట్వర్క్ లేని ప్రాంతాల్లో ఉపయోగించుకోవడానికి మ్యాప్స్‌ను ముందుగానే ఆఫ్‌లైన్‌లో డౌన్లోడ్ చేసుకునే అవకాశం కూడా ఈ యాప్‌లో ఉంది.
ఇది కూడా చదవండి : Dangerous Countries : 2025 లో వెళ్లకూడని అత్యంత ప్రమాదకరమైన 10 దేశాలు
గూగుల్ ట్రాన్స్‌లేట్
కొత్త ప్రదేశాలకు వెళ్లినప్పుడు, స్థానిక భాష తెలియకపోవడం వల్ల చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఈ సమస్యను గూగుల్ ట్రాన్స్‌లేట్ యాప్ సులభంగా పరిష్కరిస్తుంది. ఇది భారతీయ, అంతర్జాతీయ భాషలను సులభంగా అనువదిస్తుంది. దీనిలో ఉండే కెమెరా ఫీచర్‌తో, బోర్డులు, మెనూలు వంటి వాటిని మన భాషలోకి మార్చుకోవచ్చు. వాయిస్ ట్రాన్స్లేషన్ ద్వారా స్థానికులతో నేరుగా మాట్లాడవచ్చు.
ఐఆర్సీటీసీ రైల్ కనెక్ట్
రైలులో ప్రయాణించే వారికి ఐఆర్సీటీసీ రైల్ కనెక్ట్ యాప్ ఒక నమ్మకమైన తోడు. ఈ యాప్‌తో సులభంగా రైలు టికెట్లను బుక్ చేసుకోవచ్చు. టికెట్ పీఎన్ఆర్ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. అంతేకాకుండా, మీ రైలు ఎక్కడ ఉందో లైవ్‌గా ట్రాక్ చేయవచ్చు. ప్రయాణంలో మీకు నచ్చిన భోజనాన్ని ముందే ఆర్డర్ చేసుకునే సౌలభ్యం కూడా ఈ యాప్‌లో ఉంది.
ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.