Tirumala Anna Prasadam : శ్రీవారి భక్తులకు శుభవార్త…అన్న ప్రసాదంలో కొత్తగా చేరిన మసాలా వడ

Share This Story

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామి సన్నిధిలో అన్నప్రసాదం ( Tirumala Anna Prasadam ) స్వీకరించడం ప్రతీ భక్తుడికి ఆనందం కలిగిస్తుంది. అయితే ఈ ఆనందాన్ని రెట్టింపు చేసే విధంగా మెనులో మసాలా వడను చేర్చారు. 2025 జనవరి 20వ తేదీన ప్రయోగాత్మకంగా 5,000 వడలను అన్నప్రసాదంతో పాటు భక్తులకు వడ్డించారు.

ఇది ట్రయల్ రన్ మాత్రమే | Masala Vada In Tirumala Menu

శ్రీవారి భక్తులకు వడ్డించే అన్న ప్రసాదం విషయంలో తిరుమల తిరుపతి ఆలయ ( TTD ) ధర్మ మండలి ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తోంది. మెనూలోని పదార్థాల క్వాలిటీని పెంచడంతో పాటు మరిన్ని కొత్త పదార్థాలను చేర్చడంపై ఫోకస్ చేస్తోంది. ఇందులో భాగంగా ధర్మకర్తల మండలి నిర్ణయం మేరకు మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రంలో అన్న ప్రసాదం మెనూలో కొత్తగా మసాలా వడను కూడా చేర్చారు.

tirumala anna prasadam
| మసాలా వడ | ప్రతీకాత్మక చిత్రం | Photo: Unsplash

ప్రయోగాత్మకంగా ప్రారంభించి, 5,000 మంది భక్తులకు మసాలా వడను వడ్డించారు. ఇలా కనీసం 7 రోజుల పాటు భక్తులకు వడ్డించి ఫీడ్‌బ్యాక్ తీసుకోవడం, క్వాలిటీ వంటి అంశాలను పరిశీలిస్తారు. అనంతరం పూర్తి స్థాయిలో అమలు చేయనున్నారు.మసాలా వడ తిన్న భక్తులు రుచి బాగుంది అని ప్రశంసలు కురిపిస్తున్నారు.

అన్న పసాద కేంద్రం ప్రత్యేకతలు | TTD Anna Prasada Kendrm Specification

Tarigonda Vengamamba Anna Prasadam : మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రంలో నిత్యం వేలాది సంఖ్యలో శ్రీవారి భక్తులకు అన్నప్రసాదం వడ్డిస్తుంటారు. ఒక పంక్తిలో 1000 మంది భక్తులు భోజనం చేస్తుంటారు. అన్నం,పప్పు, సాంబార్, కూర, పచ్చడి, పులిహోర, మజ్జిగతో పాటు పరమాన్నం ( Tirumala Anna Prasadam ) వడ్డిస్తుంటారు. దీంతో పాటు ఈ మధ్య మసాలా వడను కూడా చేర్చనున్నారు. అన్న ప్రసాదం కాంప్లెక్స్‌లో అత్యాధునిక సదుపాయాలు కల్పించారు. వంట ప్రారంభం నుంచి వడ్డించి శుభ్రం చేసేంత వరకు సుమారు 1000 మంది సిబ్బంది భాగస్వాములు అవుతారు.

అన్నదాన సత్రం సమయం | Tirumala Annadanam Timings

తిరుమల కొండపై అన్న ప్రసాదం ( Tirumala Anna Prasadam ) స్వీకరించాలి అని కోరుకునే భక్తులు ముఖ్యంగా టైమింగ్ తెలుసుకోవాలి.ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 వరకు, సాయంత్రం 5 నుంచి రాత్రి 10 గంటల వరకు నిత్యాన్న ప్రసాద పంపిణి జరుగుతూ ఉంటుంది. బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్‌ను బట్టి మెన్యూ మారుతూ ఉంటుంది. ఆలయం సమీపంలోనే ఉండే అన్న ప్రసాద కేంద్రం శ్రీ వరాహ స్వామి ఆలయం పక్కనే ఉంటుంది. రుచితో పాటు నాణ్యత విషయంలో రాజీ లేకుండా వంటకాలను సిద్ధం చేస్తారు. కుకింగ్ కోసం సోలార్ ఎలక్ట్రిసిటీని వినియోగించడం మరో ప్రత్యేకత.

మసాలా వడ ప్రత్యేకతలు | Specialty Of Tirumala Masala Vada

తిరుమలకు వచ్చే శ్రీవారి భక్తులకు వడ్డించే మసాలా వడను పలు అంశాలు దృష్టిలో ఉంచుకుని సిద్ధం చేస్తారు. ఇందులో ఉండే పదార్థాల ( Ingedients In Tiruamala Masala Vada ) విషయంలో కూడా తితిదే ప్రత్యేక శ్రద్ధ కనబరిచింది. ట్రయల్ రన్‌లో భాగంగా సోమవారం రోజు వడ్డించిన మసాలా వడను ఉల్లిపాయలు, వెల్లుల్లి లేకుండా సిద్ధం చేశారు.

మసాలా వడలు తిన్న భక్తులు అవి రుచికరంగా ఉన్నాయని సంతృప్తి వ్యక్తం చేశారు.అయితే భక్తుల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుని వాటిని దృష్టిలో పెట్టుకుని, లోటుపాట్లను సవరించి భవిష్యత్తులో కూడా మసాలా వడలు వడ్డించడాన్ని నసాగించనున్నారు.

ఈ  Travel కంటెంట్ నచ్చితే, ఎవరికైనా ఉపయోగపడుతుంది. అనుకుంటే షేర్ చేయగలరు. ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. యూట్యూబ్ ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి.
Prayanikudu WhatsApp2
| వాట్సాప్ గ్రూపులో చేరేందుకు ఈ లింకును క్లిక్ చేయండి ( 100 శాతం సేఫ్ )
Share This Story

Leave a Comment

error: Content is protected !!