Tirumala, Tirupati, Andhra Pradesh : 2025 జనవరిలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఏర్పాట్లు, టికెట్లు, దర్శనాలపై తితిదే కీలక నిర్ణయాలు తీసుకుంది. పది రోజులు పాటు భక్తులు తిరుమలలో శ్రీవారిని దర్శంచుకుని వైకుంఠ ద్వార దర్శనం ( Tirumala Vaikunta Ekadashi 2025) కూడా చేస్తారు. సంక్రాంతి సీజన్ కూడా ఉండటంతో తిరుమలలో భక్తుల రద్దీ అనేది సాధారణంగా కన్నా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈ సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తోంది తితిదే.
ముఖ్యాంశాలు
టీటీడి నిర్ణయాలు | TTD Decisions on Vaikunta Ekadasi 2025
తిరుమలేషుడి ( Lord Venkateshwara ) సన్నిధిలో 2025 జనవరి 10 నుంచి 19 తేదీ వరకు వైకుంఠ ఏకాదశిని నిర్వహించనున్నారు. పది రోజుల పాటు భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. అందుకోసం చేయాల్సిన ప్రత్యేక ఏర్పాట్లపై అన్నమయ్య భవనంలో ( Annamayya Bhavanam ) టీటీడి ఈవో జే శ్యామల రావు ఇతర విభాగ అధికారులు కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. పలు నిర్ణయాలు కూడా తీసుకున్నారు.
Read Also : Ravana Lanka : రావణుడి లంక ఎక్కడ ఉంది ? ఎలా వెళ్లాలి ? 5 ఆసక్తికరమైన విషయాలు
శ్రీవాణీ టికెట్లు | Srivani Tickets Tirumala
వైకుంఠ ద్వార దర్శన సమయంలో రద్దీని దృష్టిలో ఉంచుకుని, వైకుంఠ ఏకాదశికి సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం ( Tirumala Tirupati Devasthanam ) కీలక నిర్ణయాలు తీసుకుంది. వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించిన 10 రోజుల శ్రీవాణి టికెట్లను 2024 డిసెంబర్ 23వ తేదీ ఉదయం 11 గంటలకు ఆన్‌లైన్లో విడుదల చేయనున్నారు.
ఎస్ఎస్‌డీ టోకెన్లు | Vaikunta Ekadasi SSD Tokens
వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి 2024 డిసెంబర్ 24వ తేదీన ఉదయం 11 గంటలకు ఎస్‌ఈడీ టోకెన్లను ఆన్‌లైన్లో విడుదల చేయనున్నారు. 2025 జనవరి 10 నుంచి 19 వరకు భక్తులు వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవచ్చు. భక్తుల కోసం తిరుపతిలో 10 కేంద్రాలు, తిరుమలలో ఒక కేంద్రంలో ఎస్‌ఎస్‌డీ టోకెన్లు కేటాయింపు చేశారు.
ఈ టోకెన్లు లభించే ప్రదేశాలు | SSD Token Centers in Tirupati
తిరుపతి ( Tirupati) : – జీవకోన, రామానాయుడు స్కూల్, ఇందిరా మైదానం, ఎంఆర్‌పల్లి , శ్రీనివాసం, విష్ణు నివాసం, రామచంద్ర పుష్కరిణి, భూదేవి కాంప్లెక్స్ మీరు టోకెన్లు తీసుకోవచ్చ. ఇక తిరుమలలో కౌస్తుభం విశ్రాంతి భవనంలో టోకెన్లు లభిస్తాయి
ముఖ్సమైన విషయాలు | Tirumala Vaikunta Ekadashi 2025
- వైకుంఠ ద్వార దర్శనం కోసం టోకెన్లు తీసుకోవడానికి భారీ ఎత్తున భక్తులు ఈ సెంటర్లకు తరలి వచ్చే అవకాశం ఉంది. అందుకే టోకెన్ ఇష్యూ చేసే సెంటర్స్ వద్ద భక్తులకు తగిన ఏర్పాట్లు చేయనున్నారు అధికారులు
- వైకుంఠ ఏకాదశి ( Vaikunta Ekadasi ) సందర్భంగా కేవలం టోకెన్లు, టికెట్లు ఉన్న భక్తులకు మాత్రమే దర్శనానికి అనుమతి ఇస్తారు. అయితే టోకెన్ లేని భక్తులు తిరుమలకు చేరుకోవచ్చు. కానీ వారిని క్యూలైన్లోకి ప్రవేశించనివ్వరు.
- ఇది కూడా చదవండి : Kamakhya Temple : కామాఖ్య దేవీ కథ
వైకుంఠ ఏకాదశి రోజు షెడ్యూల్ | Vaikunta Ekadasi Schedule Of Tirumala Temple
- వైకుంఠ ఏకాదశి రోజు ( Tirumala Vaikunta Ekadashi 2025 ) ప్రోటోకాల్ దర్శనాలు ఉదయం 4.45 నిమిషాలకు ప్రారంభం అవుతాయి.
- ఉదయం 5.30 నిమిషాల నుంచి 6.30 నిమిషాల వరకు శ్రీవారి పుష్కరిణిలో చక్రస్నానం ఉంటుంది.
- ఉదయం 6 నుంచి రాత్రి 12 వరకు నిరంతరాయ అన్న ప్రసాదాల పంపిణి ఉంటుంది.
- ఈ రోజు ఉదయం 9 గం. నుంచి 11 గం. వరకు స్వర్ణ రథం ఊరేగింపు ఉంటుంది. దీంతో పాటు భక్తులకు టీ, కాఫీ, పాలు, ఉప్మా, చక్కెర పొంగలి, పొంగలిని అందిస్తారు.
- ఈ సందర్భంగా వేదాశీర్వచనం రద్దు చేయనున్నారు. గోవిందమాల భక్తులకు ప్రత్యేక దర్శనం అవకాశం ఉండదు.
- తిరుమలలో ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించడానికి తితిదే సెక్యూరిటీ సిబ్బంది, ట్రాఫిక్ పోలీసులు సమన్వయంతో చేయనున్నారు.
- తిరుమల సాధారణం అందుబాటులో ఉండే 3,50,000 లల్డూలతో పాటు సేఫ్‌సైడ్‌గా మరో 3,50,000 లడ్డూలను స్టాక్‌గా ఉంచనున్నారు.
ఈ Travel కంటెంట్ నచ్చితే, ఎవరికైనా ఉపయోగపడుతుంది. అనుకుంటే షేర్ చేయగలరు. ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. యూట్యూబ్ ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి.
తిరుమల అప్డేట్స్