వైకుంఠ ఏకాదశి రోజు తిరుమలలోని శ్రీ వేంకటేశ్వరుడి దర్శనం కోసం వెళ్లే భక్తుల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం ( TTD Updates ) కీలక సూచనలు చేసింది. 2025 జనవరి 10 నుంచి 19 వరకు టోకెన్లు ఉన్న భక్తులకే వైకుంఠ ద్వార దర్శనం చేసుకునే అవకాశం కల్పించనున్నట్టు తెలిపింది. పూర్తి వివరాలు…
2025లో వైకుంఠ ఏకాదశి ( Vaikunta Ekadashi 2025 ) సందర్భంగా వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవాలనుకునే భక్తులకు కీలక సూచనలు జారీ చేసింది తితిదే. స్వామి వారి ఆలయంలో జనవరి 10 నుంచి 19 వరకు టోకెన్లు ఉన్నవారికి మాత్రమే వైకుంఠ ద్వార దర్శనానికి అనుమతి ఉంటుంది అని తెలిపింది.
Read Also : Ravana Lanka : రావణుడి లంక ఎక్కడ ఉంది ? ఎలా వెళ్లాలి ? 5 ఆసక్తికరమైన విషయాలు
ధనుర్మాసంలో శుక్ల పక్ష ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అని అంటారు.ఈ ఏకాదశిని తెలుగు వారు ముక్కోటి ఏకాదశిగా ( Mukkoti Ekadashi 2025 ) చేసుకుంటారు. ఈ సందర్భంగా శ్రీ మహావిష్ణువు ( Lord Vishnu ) ఆలయాలకు భక్తులు పోటెత్తుతారు. తిరుమలలో ఈ సందర్భంగా భక్తుల రద్దీ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు.
ముందుస్తుగానే | Vaikunta Ekadashi 2025 At Tirumala
ముక్కోటి ఏకాదశి సందర్భంగా భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉంది కాబట్టి ముందస్తుగానే తితిదే ( Tirumala Tirupati Devasthanam ) సిద్ధం అవుతోంది. ఈ సారి పది రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనానికి భక్తులకు అవకాశం కల్పిస్తోంది. సాధారణ భక్తులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ప్రత్యేక దర్శనాలను రద్దు చేసింది తితిదే. దీంతో పాటు టోకెన్లు ఉన్న భక్తులకు మాత్రమే దర్శనానికి అనుమతి ఇవ్వనున్నట్టు తెలిపింది.
ఈ విషయాలు తెలుసుకోండి | TTD Updates
వైకుంఠ ఏకాదశి సమయంలో సాధారణ భక్తులకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ తితిదే పలు నిర్ణయాలు తీసుకుంది.
- టికెట్లు, టోకెన్లు ఉన్న భక్తులకు మాత్రమే దర్శనానికి అనుమతి ఇవ్వనున్నారు.
- పది రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం కల్పించనుంది.
- టోకెన్లు లేని భక్తులు తిరుమలకు రావచ్చు. కానీ దర్శనానికి అనుమతి ఉండదని తెలిపింది తితిదే.
Watch: ప్రయాణికుడు ట్రావెల్ వ్లాగ్స్ కోసం క్లిక్ చేయండి.
- Pandharpur: 7 గంటల్లో 7 ఆలయాల దర్శనం
- Hemkund Sahib Trek : హిమాలయాల్లో బ్రహ్మకమలం దర్శనం
- Kamakhya Temple: కామాఖ్య దేవీ కథ
- Tuljapur : శివాజీ నడిచిన దారిలో తుల్జా భవానీ మాత దర్శనం
- Shillong : అందగత్తెల రాజధాని షిల్లాంగ్
ఈ Travel కంటెంట్ నచ్చితే, ఎవరికైనా ఉపయోగపడుతుంది. అనుకుంటే షేర్ చేయగలరు. ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. యూట్యూబ్ ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి.