TTD Key Updates : జూలై 15, 16 లో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు…ఎందుకో తెలుసా ?
TTD Key Updates : తిరుమలలో కొలువైన శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వెళ్తున్న భక్తులకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్..జూలై 15, 16వ తేదీలలో వీఐపీ దర్శనాలను బ్రేక్ (VIP Break Darshan) దర్శనాలను రద్దు చేసింది తిరుమల తిరుపతి దేవస్థానం.
దేవస్థానం అందించిన సమాచారంలో కీలకాంశాలు
ప్రతీ ఏడాది నిర్వహించే అణివార ఆస్థానం (Anivara Asthanam) కార్యక్రమం కోసం ఈ దర్శనాలను రద్దు చేసినట్టు తెలుస్తుంది. ప్రతీ ఏడాది నిర్వహించే ఈ వార్షిక బడ్జెట్ ఉత్సవం జూలై 16వ తేదీన జరగనుంది.
- ఇక ఈ కార్యక్రమానికి ముందు రోజు అంటే జూలై 15వ తేదీన ఆలయ శుద్ధి కార్యక్రమమైన కోయిల్ ఆల్వార్ తిరుమంజనం జరుగుతుంది.
- ఇది కూడా చదవండి : వాట్సాప్లో టీటీడీ సేవల ఫిర్యాదు…క్యూఆర్ కోడ్ లాంచ్ చేసిన దేవస్థానం | TTD WhatsApp Feedback
ఈ రెండు కార్రక్రామాలు చాలా ముఖ్యమైనవి కావడంతో జూలై 15,16వ తీదీలలో వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తూ దేవస్థానం (TTD) ఒక నిర్ణయం తీసుకుంది. ఈ సమయంలో భక్తుల నుంచి ఎలాంటి రికమండేషన్స్ను టీటీడి అధికారులు స్వీకరించరు.
- ఇక ప్రోటోకాల్ వీఐపీ దర్శనాల (Protocol VIP Darshan) విషయానికి వస్తే జూలై 14, 15 తేదీల్లో భక్తులకు అవకాశం లభిస్తుంది.
- కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామిని (Lord Venkateshwara Swamy) దర్శించుకునేందుకు వచ్చే భక్తులు ఈ విషయాన్ని గమనించిన ప్లాన్ చేసుకోగలరు.
📣 ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.