Earthquakes: మయన్మార్, థాయ్‌లాండ్‌లో భారీ భూకంపం …పేకమేడల్లా కూలిన భవంతులు

షేర్ చేయండి

భారీ భూకంపాలతో మయన్మార్, థాయ్‌లాండ్‌ దేశాలు (Earthquakes) కంపించిపోయాయి. మయన్మార్‌లో వరుసగా రిక్టార్‌స్కేలుపై 7.2 అండ్ 7.0 తీవ్రతతలో వచ్చిన భూకంపాలకు ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరిగెత్తారు.

భూకంప తీవ్రత ఎంతలా ఉంది అంటే మయన్మార్‌కు సమీపంలో ఉన్న దేశాల్లో ముఖ్యంగా థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్‌లో కూడా భవనాలు పేకముక్కలా పడిపోయాయి.

కంపించిన థాయ్‌లాండ్ | Earthquake In Thailand

బ్యాంకాక్ నుంచి 1200 కిమీ దూరంలో మయన్మార్‌లోని మండేలే ప్రాంతంలో భూకంపకేంద్రం ఉన్నట్టు గుర్తించారు. 1200 దూరంలో సెంటర్ పాయింట్ ఉన్నా కానీ బ్యాంకాక్ వణికిపోయింది అంటే తీవ్రత ఎలాంటిదో మీరే అర్థం చేసుకోవచ్చు.

Earthquake In Myanmar
భూకంప కేంద్రం నుంచి బ్యాంకాక్‌కు మధ్య దూరం

కొట్టుకుపోయిన పాదచారులు

భూకంపం ధాటికి బ్యాంకాక్‌లో భారీ భవనంపై ఉన్న స్మిమ్మింగ్ పూల్ నుంచి నీరు రోడ్డుపై ఉన్న పాదచారులపై పడింది. మహాకుంభవృష్టిని మించిన నీరు పైన పడటంతో క్షణాల్లో కొట్టుకుపోయిన ప్రజలు

ఊగిపోయిన భవనాలు

భూకంప తీవ్రత ఎంతలా ఉంది అంటే బ్యాంకాక్‌లోని రెండు భవనాలు ఇలా కొబ్బరి చెట్టులా ఊగిపోయాయి.ఒకవేళ అందులో ఎవరైనా ఉంటే వారి పరిస్థితి ఎలా ఉంటుందో మీరే ఊహించండి!

షేక్ అయిన మెట్రో రైలు

మెట్రో రైలులో ప్రయాణించాలి అని భావించిన బ్యాంకాక్ వాసులు…తమ కళ్ల ముందు రైలు ఊగిపోవడం చూసి ఖంగుతిన్నారు

ఊహించని విపత్తు

మయన్మార్‌లోని ఒక భారీ స్కైస్క్రాపర్ పై నుంచి నేలపైకి జారిపడుతున్న స్విమ్మింగ్ పూల్ నీరు

భూకంప కేంద్రంలో …

భూకంప కేంద్రం చెబుతున్న మయన్మార్‌లోని మండేలే (Mandalay Myanmar) లో ఒక కారు నుంచి తీసిన వీడియో. రోడ్డుపై ఉన్న వాహనాలు ఎలా కంపిస్తున్నాయో చూడండి…

షేర్ చేయండి

Leave a Comment

error: Content is protected !!