Vanjangi Trek : వింటర్లో వంజంగి ఎందుకు వెళ్లాలి ? ఈ 10 కారణాలు చదవండి
తెలుగు రాష్ట్రాల్లో బాగా ట్రెండింగ్‌లో ఉన్న టూరిస్టు డెస్టినేషన్స్‌లో వంజంగి ( Vanjangi ) పేరు ఖచ్చితంగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న వంజంగికి తెెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా సందర్శకులు వస్తూ ఉంటారు. ఇక్కడి మేఘాలను, సూర్యోదయాన్ని చూడటానికి చాలా మంది తెల్లారి 3 నుంచే ట్రెక్కింగ్ మొదలు పెడతారు.
అయితే చాలా మందికి ఇంకా వంజంగి గురించి పూర్తిగా తెలియదు. వంజంగి వెళ్లాలా లేదా వేరే చోటికి వెళ్లాలా అని ఆలోచించిస్తుంటారు. అలా ఈ 10 కారణాలు చదవి తరువాత నిర్ణయించుకోండి.
1. అద్భుతమైన వ్యూ | Vanjangi Hills Morning View

- Vanjangi Hills Trek : తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో పర్యాటక ప్రాంతాలు ఉన్నా అందులో వంజంగికి ఉన్న క్రేజ్ కాస్త స్పెషల్ అని చెప్పవచ్చు. పాలమీగడలాంటి మేఘాలను వాటిపై నుంచి చూడటం అనేది మాటల్లో చెప్పని అనుభూతిని ఇస్తుంది. మేఘాల మధ్యలోంచి కనపించే కొండలు కూడా ఒక అద్భుతం అని చెప్పవచ్చు.
- ఇది కూడా చదవండి : Indian License : భారతీయ లైసెన్స్ ఈ 15 దేశాల్లో కూడా చెల్లుతుంది
2. వంజంగి ఎలా రావాలి ? | How To Reach To Vanjangi

- Where Is Vanjangi :వంజంగి అనేది ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉంది. ఇక్కడికి రావాలి అంటే మీరు వైజాగ్ నుంచి అరకు ( Vizag to Araku ) మార్గంలో రావచ్చు. లేదా పాడేరు నుంచి వైజాగ్‌కు ( Vizag To Paderu ) డైరక్ట్ బస్సులు కూడా ఉంటాయి. అలా కూడా రావచ్చు.
3. వంజంగి ఎందుకంత స్పెషల్ | Why Vanjangi Is Famous ?

- Vanjangi Hills View Point : ట్రెక్కింగ్ అనుభవం లేని వారికి వంజంగి పూర్తి చెయడం అనేది ఒక అద్భుతమైన విజయంగా అనిపిస్తుంది. ఎందుకంటే . ఈ ట్రెక్ అంత ఈజీ కాదు అలాగని అంత కష్టమూ కాదు. కానీ కొండపైకి చేరుకున్న తరువాత కనిపించే అందాలు ప్రపంచాన్ని మరిచేలా చేస్తాయి. మీరు బయటి ప్రపంచాన్ని మర్చిపోతారు.
4. వంజంగి ట్రెక్కింగ్ అనుభవం | Experience of Vanjangi Trek

- Vanjangi Trekking Route : వంజంగి ట్రెక్ హిల్స్‌లో ట్రెక్కర్స్ అందరూ కలిసి ముందుకు వెళ్తుంటారు. ఎవరికైనా ఇబ్బందిగా అనిపించినా , కొండ ఎక్కడంలో సమస్య ఉన్నా హెల్ప్ చేయడానికి సాటి ట్రెక్కర్స్ ముందుంటారు. సాయం తీసుకోవడం, సాయం చేయడం ఈ రెండూ మీరు చేయవచ్చు. ఇది మన మైండ్‌సెట్‌ను మార్చేసే చిన్న ట్రెక్. ఎందుకంటే మనలో చాలా మంది సాయం తీసుకోవడానికి ఆలోచిస్తుంటారు. అవసరం ఉన్నప్పుడు సాయం తీసుకోవాలి. చేయగలిగినప్పుడు సాయం చేయాలి.
- ఇది కూడా చదవండి : Oymyakon : ప్రపంచంలోనే అత్యంత చల్లని గ్రామం
అర్జునుడు శ్రీకృష్ణుడి సాయం తీసుకున్నాడు. శ్రీ కృష్ణుడు ( Lord Krishna ) మహా భారత యుద్ధం కోసం ఆంజనేయుడి సాయం తీసుకున్నాడు. ఆంజనేయుడికి జాంబవంతుడు సాయం చేశాడు. ఇలా దేవుళ్లు కూడా సాయం చేయడంతో పాటు సాయం తీసుకున్నారు . మనం మనుషులమే కదా. నష్ట పోవడం కన్నా సాయంపొంది ముందుకెళ్లి స్ట్రాంగ్ అయ్యాక తిరిగి ఇచ్చేయడం బెస్ట్ కదా. టాపిక్ డైవర్ట్ అయింది. ముందుకెళ్దాం.

5. అదిరిపోయే అందాల కొండ | Beauty Of Vanjangi Hills

- Vanjangi Hills Trekking Distance : వంజంగి బేస్ పాయింట్ నుంచి మీరు 5 కిమీ మేరా ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది. మీరు మధ్యలో బ్రేక్స్ తీసుకుని వెళ్లవచ్చు. ఈ సమయంలో మీలాగే అలసి కూర్చున్న ట్రెక్కర్స్ కనిపిస్తారు. నేచర్ అందాలను ఎంజాయ్ చేయడం కూడా కళ. ఈ కళలో ఆరితేరిన వారు అంటే మీలాంటి చాలా మంది ఉన్నారు అని తెలుసుకోండి.
6. కొత్త స్నేహితులకు స్వాగతం | Vanjangi Trek

- వంజంగి ట్రెక్కింగ్ సమయంలో మీకు చాలా మంది ఫ్రెండ్స్ అవుతారు. కొత్త స్నేహితులతో కలిసి ట్రెక్కింగ్ ( Trekking ) కంటిన్యూ చేయవచ్చు. సైలెన్స్ అనేది క్లాస్ రూమ్స్‌లో , ఆసుపత్రిలో బాగుంటుంది. ట్రెక్కింగ్ టైమ్‌లో సైలెంట్‌గా ఉండటం కన్నా ఒక ఫ్రెండ్ ఉంటే నాలుగు ముచ్చట్లు చెప్పే సరికి 5 కిమీ ట్రెక్ పూర్తి చేయొచ్చు. ఈ బిజీ లైఫ్‌లో ఫ్రెండ్స్‌తో కలిసి వెళ్లే మరో అవకాశం మీకు మీరు కల్పించుకోవచ్చు.
7. వంజంగి ఎందుకు వెళ్లాలి ? | Reasons To Visit Vanjangi Hills

- Why To Trek Vanjangi : ఫోటో క్యాప్ఛన్ గురించి ఎక్కువ ఆలోచించకండి. జస్ట్ కొత్తగా ట్రై చేశాను. ప్రపంచం మొత్తం కొత్తగా కనిపిస్తున్నప్పుడు..కొత్తగా ఆలోచించకపోతే ఎట్ల.. మీరు కూడా కొత్త ఆలోచనల కోసం, కొత్త ఎనర్జీ కోసం, మూడ్ మార్చుకోవడానికి లేదా మైండ్‌సెట్ ఛేంజ్ చేసుకోవడానికి, పగిలిన గుండెకు ప్లాస్టర్ వేసుకోవడానికి, అతికిన గుండెను మళ్లీ బ్రేక్ చేసుకోవడానికి ( haha ) కొత్తగా మీ జీవితంలోకి వచ్చిన వ్యక్తితో కొంత సమయం గడపడానికి… ఇలా మీకు వెయ్యి కారణాలు చెప్పగలను మీరు వంజంగి రావడానికి.
- నేనైతే దేశంలో ఏ రాష్ట్రానికి వెళ్లినా మా దగ్గర లంబసింగి, లక్నవరం, వంజంగి, అరకు, ములుగు జిల్లాలు ఉన్నాయి అని చెబుతాను. బాబు మీ దగ్గర మనాలి ఉంటే మా దగ్గర వంజంగి ఉంది అని నా యూట్యూబ్ ఛానెల్లో నేను చేసిన వ్లాగ్ చూపించే వాడిని. వంజంగి వాళ్లను కూడా పడేసింది అని చెప్పాలి. మనాలితో ( Manali ) కంపేర్ ఊరికే చేశాను. మనాలి అందం మనాలిదే. వంజంగి అందం వంజంగిదే. రెండూ సూపర్ అని నా అభిప్రాయం.
- MANALI Telugu Video : మనాలి ఎలా వెళ్లాలి ? ఎలా వెళ్లాలి ? ఏం చూడాలి ? ఎలా సిద్ధం అవ్వాలి
8. సెకండ్ హ్యాప్పీ డేస్ | Planning Vanjangi

- Vanjangi From Hyderabad : ఒక చేతితో అరటి తొక్క తీయడం ఎంత కష్టమో…ఒంటరిగా ప్రయాణించడం అంతే కష్టం…అందుకే మీతో పాటు ఫ్రెండ్స్‌ను కూడా తీసుకెళ్లండి. హైదరాబాద్ నుంచి సుమారు 650 కిమీ ప్రయాణించి వంజంగికి ( Hyderabad To Vanjangi ) చేరుకోవచ్చు. ఫ్రెండ్స్‌తో జాలీ టైమ్ స్పెండ్ చేయవచ్చు. పాత ఫ్రెండ్స్‌తో కలిసి కొత్త ఫ్రెండ్స్‌ను పరిచయం చేసుకునే అవకాశం ఇది.
9. వంజంగిలో సూర్యోదయం ఎప్పుడు అంటే ? | Vanjangi Sun Rise Timing

- Vanjangi Sunrisen Time : సీజన్‌ను బట్టి వంజంగిలో సూర్యోదయం సమయం మారుతూ ఉంటుంది. అయితే మీరు 5 గంటల నుంచి 6 గంటల మధ్యలో వంజంగిలో సన్‌రైజ్ ( Vanjangi Sun Rise View Timing ) చూడొచ్చు. ప్రతీ రోజూ సూర్యుడిని చూస్తుంటాం. కానీ వంజంగి నుంచి చూస్తే సూర్యుడు కొత్తగా కనిపిస్తాడు. జీవితం కూడా అలాంటిదే కొంచెం చూసే విధానం మార్చితే అందంగా కనిపిస్తుంది.
10. అరకు అంటే కాఫీ కూడా | Araku Coffee in Vanjangi

- Araku Coffee Plantation Near Vanjangi : అరకులో కాఫీ తోటలు, కాఫీ చాలా ఫేమస్. మీకు కాఫీ రుచి నచ్చితే ట్రై చేయండి. దీంతో పాటు కాఫీ తోటలు కూడా విజిట్ చేయండి. అరకులో కాఫీ మ్యూజియం కూడా ఉంది. మీరు అక్కడికి కూడా వెళ్లవచ్చు. నేను కాఫీ లవర్ కాదు. అలాగని టీ లవర్ కూడా కాదు. ఛాయ్ అలవాటు ఉంది. కాఫీ లేదు అంతే. అరకు వచ్చి కాఫీ తాగలేదంటే చాలా మంది ఏదో తప్పు చేసినట్టు చూస్తారు. మీరు ఆ తప్పు చేయకండి. ఒక కప్ఫు కాఫీ తాగండి. లేదా ఇలా ఫోటో తీసి కాఫీ తాగాను అని పోస్ట్ చేయండి. ( ఆ కప్పు మీ ఫ్రెండ్‌ది అయినా సరే ha ha)
మొత్తానికి , వంజంగి వచ్చినప్పుడు ఒక టూరిస్టుగా ( Tourist ) కాకుండా ఒక నేచర్ లవర్‌లా ఉండండి. అంటే ప్రకృతిని ఎంజాయ్ చేయండి. దాంతో పాటు అక్కడ చెత్త వేయకుండా ప్రకృతిని కాపాడండి. టూరిస్టులు వస్తున్నారు అని ఆనందపడాలి కానీ…వామ్మో టూరిస్టులు వస్తున్నారు అని భయపడకూడదు స్థానికులు. జస్ట్ ఏదో చెప్పాలి అనిపించింది చెప్పాను. తరువాత మీ ఇష్టం.

- Vanjangi Trekking Guide : వంజంగికి వెళ్లే ముందు ఎళా వెళ్లాలి ? ఏం చూడాలి ? ఎక్కడ ఉండాలి అని తెలుసుకోండి. ఏమైనా డౌట్ ఉంటే అక్కడి లోకల్స్ సాయం కూడా తీసుకోవచ్చు. వంజంగి కంప్లీట్ ట్రావెల్ ప్లాన్ గురించి Prayanikudu youtube Channel లో ఒక వీడియో చేశాను మీరు అది చూడొచ్చు.
Vanjangi Video : వంజంగి ఎక్కడ ఉంది ఎలా వెళ్లాలి ? బెస్ట్ టైమ్ ఏంటి ? ఎందుకు వెళ్లాలి ?
- వంజంగితో పాటు మీరు లంబసింగి ( Lambasingi ) కూడా ప్లాన్ చేసుకోవచ్చు. లంబసింగిని ఆంధ్రా కాశ్మీరం అని పిలుస్తారు. ఎందుకు అలా పిలుస్తారో ఈ పోస్టులో చదవండి.
చదవండి : లంబసింగిలో నిజంగా మంచు కురుస్తుందా ? ఎందుకు ఇంత ఫేమస్ అయింది ?
- Lambasingi : నేషనల్ క్రష్ లంబసింగి ఎలా వెళ్లాలి ? నిజంగా స్నో పడుతుందా ? 5 Tips & Facts
- Palani Temple : పళని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం గైడ్ ! 10 Facts
- అంటార్కిటికా : 70 శాతం మంచినీరు ఇక్కడే ఉంది…రాత్రి సూరీడు…పగలు చీకటి
- Thailand 2024 : థాయ్‌లాండ్ ఎలా వెళ్లాలి ? ఏం చూడాలి ?
- Azerbaijan అజర్ బైజాన్ ఎలా వెళ్లాలి ? ఏం చూడాలి ? 10 టిప్స్!