భారత దేశంలోని చివరి గ్రామంల అయిన మానా నుంచి మానా నుంచి పంచపాండవులు స్వర్గాన్ని వెతుక్కుంటూ కోసం ఏదారిలో అయితే వెళ్లారో ఆ దారిలోనే ఉన్న వసుధారా ఫాల్స్(Vasudhara Falls) వైపు బయల్థేరాను. ఈ జలపాతం నీరు పాపులపై పడదు అంటారు. నారాయణుడు తపస్సు చేసిన చోటు కూడా ఈ ట్రెక్‌లో చూశాను.
ముఖ్యాంశాలు
ఉత్తరాఖండ్‌లోన బద్రినాథ్‌లో నారాయణుడి దర్శనం అనంతరం భారత్‌లోని చివరి గ్రామం ( Last Village In Himalayas) మానా చూసేందుకు వెళ్లాను. అది మీరు లాస్ట్ వీడియోలో కూడా చూశారు. తరువాత మానా నుంచి పంచపాండవులు స్వర్గాన్ని వెతుక్కుంటూ కోసం ఏదారిలో అయితే వెళ్లారో ఆ దారిలోనే ఉన్న వసుధారా ఫాల్స్ వైపు బయల్థేరాను. ఈ దారిని సతోపంత్ స్వర్గారోహిని అని కూడా పిలుస్తారు.
మానా నుంచి సుమారు 5 కిమీ ట్రెక్ చేస్తే ఈ జలపాతం వస్తుంది. ఇది మామూలు జలపాతం కాదు. పాపులపై ఈ జలపాతం నీరు అస్సలు పడదని స్థానికులు అంటారు.
పాండవులు వెళ్లిన దారి | In Search Of Heaven

వాసుదేవుడు అయిన శ్రీకృష్ణుడు (Lord Krishna) భూమిపై తన అవతారాన్ని చాలించిన తరువాత పంచపాండవులు, ద్రౌపతి చాలా బాధ పడతారు. ఆ బాధలో హిమాలయల్లోని మంచుకొండల్లో నడుచుకుంటూ స్వర్గం కోసం వెతుకుతారు.
సతోపంత్ | Satopanth Swargarohini

సతోపంత్ అనే సరస్సు వద్ద వారికి స్వర్గానికి దారి కనిపిస్తుంది అంటారు. ఈ దారిని సతోపంత్ స్వర్గరోహిణి అంటారు. ఈ దారి బద్రినాథ్ (Badrinath), మానా నుంచి వెళ్తుంది. ఏ దారిలో అయితే పాండవులు నడక సాగించారో ఏ గ్రామం నుంచి అయితే వాళ్లు వెళ్లారో ఆ గ్రామమే మానా.
- దీనిని ఇండియాలో లాస్ట్ విలేజ్(India’s Last Village) అని కూడా అంటారు.
- ఇప్పుడు దాన్ని ఫస్ట్ విలేజ్ అని కూడా అంటున్నారు.
ఈ గ్రామానికి సంబంధించి ఒక వీడియో కూడా చేశాను. అది మిస్ అయితే చూడండి.
ఎన్నో కథల ధార | Legend Of Vasudhara Falls
ఇంకా పంజాగుట్ట తరువాత అమీర్‌పేట్ వచ్చినట్టు మానా తరువాత వసుధార ఫాల్స్ ఉంటుంది. ఈ జలపాతం గురించి ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. మానా నుంచి 5 కీ దూరంలో ఉండే వసుధారా జలపాతం వెళ్లే సమయంలో మా ఆధ్యాత్మిక మార్గదర్శి మాధవ్ సుబేడి ఈ కథలను చెప్పాడు.
కథ నెం.1 : వాసుకీ అనే నాగు ఇక్కడ తపస్సు చేసింది అంటారు.
కథ నెం.2 : అష్టావసు దేవతలు (Ashta Vasu) ఇక్కడే ధ్యానం చేశారంటారు
కథ నెం.3: పాండవుల్లో ఒకరైన నకులుడు (Nakul) ఇక్కడే ప్రాణాలు వదిలారంటారు.

కథ నెం.4 : ఈ జలపాతం ధార తమపై పడుతుందో లేదో అని పాండవులు, ద్రౌపది (Draupadi) టెస్ట్ చేశారట. అయితే కేవలం ధర్మరాజుపై (Dharmaraj) మాత్రం వసుధార జలపాతం పడిందని అంటారు.
కథ నెం.5: ఈ జలపాతం చేరే సమయంలోనే పాండవులు ఒక్కక్కరుగా మరణించారు అని, కేవలం ధర్మరాజు మాత్రమే సతోపంత్ నుంచి స్వర్గానికి మెట్లు ఎక్కి వెళ్లారని అంటారు.
వసుధారా జలపాతం గురించి ఇలా ఎన్న కథలు ప్రచారంలో ఉన్నాయి. కథలు మారినా కథనాయకుడు మారడు. ఈ కథల్లో ఏది నిజమో అనే విషయం గురించి ఆలోచించడం పక్కన పెట్టి వసుధార జలపాతం మాత్రం అన్నిట్లో కామన్.
కాబట్టి….ఇది చాలా పవర్‌ఫుల్ జలపాతం అని చెప్పవచ్చు. ఇలాంటి జలపాతం గురించి ఒక ఫుల్ వీడియో చేశాను. ఆ వీడియోలో నేను కవర్ చేయలేకపోయిన అంశాలను ఇలా ఈ బ్లాగ్‌లో కవర్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను.
నారాయణ పర్వతం | Narayan Parbat

మానా నుంచి వసుధారా ఫాల్స్ వెళ్లే దారిలో వెళ్తుండగానే స్వర్గారోహిని మార్గంలో వెళ్తుంటే ఇక్కడ మీకు రెండు దారులు కనిపిస్తాయి. రైట్ సైడ్ వెళ్తే వసుధార జలపాతం వైపు వెళ్తాం.
- లెప్ట్ సైడ్ వెళ్తే అలకానంద నదిని (Alaknanda River) దాటి మరోవైపు వెళ్తాం.
- ఇక్కడ ఒక బ్రిడ్జి ఉంటుంది. అది దాటి మరోవైపు నారాయణ పర్వతం వైపు వెళ్లవచ్చు.
కొండ చరియలు | Landslides

మానా నుంచి వసుధార వెళ్లే దారి ఎంత అందమైనదో అంతే ప్రమాదకరమైనది. హిమాలయాల్లో (Himalayas) ముఖ్యంగా ఈ ప్రాంతంలో ల్యాండ్ స్టైడ్ ఎప్పుడు జరుగుతుందో తెలియదు. కొండ పైన ఉండే ఈ చిన్నా పెద్ద రాళ్లు దొర్లకుంటూ ఎప్పుడు వస్తాయో తెలియదు. వరదలు వచ్చినప్పడు భారీ శిలలు నీటితో పాటు కొట్టుకుని వస్తాయి.
రెండు రకాల దారులు | Vasudhara Falls

మానా నుంచి బయల్దేరాక ఒక రెండు కిమీ వరకు దారి బాగానే ఉంటుంది. తరువాత దారంతా ఇలా రాళ్లతో, మట్టితో ఉంటుంది. ఎందుకంటే ఇది ల్యాండ్‌స్లైడ్స్ ఎక్కువగా జరిగే ప్రాంతం. ఎంత మంచి దారి వేసినా పై నుంచి వచ్చే రాళ్లు రోడ్డును పిండిని చేస్తాయి.
కొండ గొర్రెలు | Himalayan Goats and Sheep
దారి మధ్యలో కొన్ని కొండగొర్రెలు ది గ్రేట్ హిమాయలన్ (The Great Himalayas) గడ్డి మైదానంలో మేత మేస్తూ కనిపించాయి. వాటికి దగ్గరికి వెళ్దాం అనుకున్నాను. కానీ వాటికి కాపలాగా ఒక జర్మన్ షెఫర్డ్ ఎక్కడో ఒక చోట ఉండే ఉంటుంది అని తెలిసింది. ఈ కుక్కే వాటిని తీసుకువస్తుంది. తీసుకెళ్తుంది. ఈ గొర్రెల మందని ఒక కుక్కే మెయింటేన్ చేస్తుంది.
పువ్వుల లోయ | Valley Of Flowers
దారి మధ్యలో ఎన్నో అందమైన పువ్వులు (Himalayan Flowers) కూడా కనిపించాయి. ఇక్కడి నుంచి కొన్ని కిమీ దూరంలోనే వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ ఉంటుంది. వర్షాకాలం ప్రారంభం అవ్వగానే ఇందులో కొన్ని పువ్వులు ఎంతో అందంగా లోయ మొత్తం పరుచుకున్నట్టు కనిపిస్తాయి. నేను అక్కడికి కూడా వెళ్లాను. ఒకసారి వీలైతే ఆ వీడియో చూడండి.
బ్రేక్ టైమ్ | Himalayan Villages
ట్రెక్కింగ్‌కు వెళ్లినప్పుడు మధ్య మధ్యలో ఎన్నో చిన్న చిన్న గ్రామాలు కనిపిస్తాయి. ట్రెక్కర్స్ అక్కడ చిన్న బ్రేక్ తీసుకుంటారు.

కానీ మనం ఇండియాలోనే చివరి గ్రామాన్ని దాటి వచ్చాం కాబట్టి ఈ ట్రెక్‌లో ఎలాంటి గ్రామాలు కనిపించవు. మరి బ్రేక్స్ ఎలా ? మానా నుంచి 3 కీమీ తరువాత ఒక చిన్న స్టాల్ వస్తుంది. అక్కడే ట్రెక్కర్స్ బ్రేక్ తీసుకుంటారు. ఇక్కడ మీకు ఛాయ్, మేగి నూడిల్స్, పకోడి లాంటివి లభిస్తాయి.
అటు కాదు…ఇటు | Original Vasudhara Falls

వసుధార ఫాల్స్ వద్దకు వెళ్లడానికి ముందు ఒక ఆలయం కనిపించింది. కాసేపు అక్కడ కూర్చుని దండం పెట్టుకుని బయల్దేరాం. అందమైన వసుధారా జలపాతం వైపు వెళ్తోంటే మాధవ్‌గారు మరో వైపు రమ్మని చెప్పారు. సరే అని వెళ్లి చూస్తే ఒక ఇంట్రెస్టింగ్ విషయం తెలిసింది
ఇక్కడే నారాయణుడు (Lord Badrinath) తపస్సు చేయడానికి కూర్చున్నారు అని…ఈ ధార ఎవరిపైన అయితే పడుతుందో వారికి మంచి జరుగుతుంది అని మాధవ్‌గారు చెప్పారు. ఒకప్పుడు నారాయణుడు కూర్చున్న ప్రాంతం కాబట్టి అక్కడ కాలు పెట్టి అపవిత్రం చేయకూడదు అనుకుని ముందుకు వెళ్లలేదు.

ఇంద్ర ధనస్సు (Rainbow in Himalayas) మధ్యలో నిలబడి నారాయణుడికి దండం పెట్టాను అంతే.
పాత కాలంలో ఇటు నుంచి కేథార్‌నాథ్ (Kedarnath) వెళ్లేవారట. కొంత మంది టిబెట్‌కు (Tibet) కూడా ఇటు నుంచే వెళ్లేవారట.
- నారాయణుడు తపస్సు చేసిన ప్రాంతం చూసిన తరువాత ఇప్పుడు వసుధారా ఫాల్స్ అని అందరూ భావించే ఫాల్స్ దగ్గరికి వెళ్లాం.
- సుమారు 200 మీటర్ల ఎత్తులోంచి జారిపడే ఈ జలధార ఎవరిపై అయితే పడుతుందో వారు ఎలాంటి పాపాలు చేయలేదు అని అంటారు. కానీ అక్కడికి వెళ్లి చూస్తే నీరు అందరిపై పడుతోంది.
- ఇది నిజమైన వసుధారా ఫాల్స్ కాదని మాధవ్‌గారు చెప్పారు. దాని పక్కనే ఉన్నది చూడండి. అది అసలైన వసుధారా జలపాతమట. సో మీరు వీడియోలో చూపించినట్టు మీరు అసలైన వసుధార ఏదో తెలుసుకుని అక్కడికి వెళ్లండి.
సతోపంత్ సరస్సు | Satopanth Lake
వసుధారా పాల్స్ తరువాత సహస్త్రధారా (Sahastradhara Falls) అనే ప్రాంతం ఉంటుంది. దాని తరువాత బ్రహ్మ విష్ణు మహేశ్వరులు (Trimurti) తపస్సు చేసిన సతోపంత్ సరస్సు ఉంటుంది. అలాగే సతోపంత్ వద్ద పాండవులు స్వర్గానికి మెట్లదారిని కనుక్కున్నారు.

అక్కడి నుంచే స్వర్గానికి వెళ్లారని అంటారు. ఆ ప్రాంతం కూడా సంతోపంత్ వద్దే ఉంటుంది. ఈ ప్రాంతానికి వెళ్లాలి అంటే 4 రోజుల పాటు ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది (Satopanth Trek).
కొండల్లో వాతావరణం చాలా వేగంగా మారిపోతుంది. మేము బయల్దేరిన 15 నిమిషాల్లోనే మొత్తం ఆకాశంలో మేఘాలు కమ్ముకున్నాయి.

చీకటి పడక ముందే మానాకు వెళ్లాలి…మళ్లీ మానా నుంచి గెస్ట్‌హౌజ్‌కు వెళ్లాలి. ఇక వ్లాగింగ్‌పై (Vlogging) ఫోకస్ తగ్గించి జాగింగ్‌పై పెట్టాలి.
మానా గురించి Prayanikudu.com లో ఒక బ్లాగ్ కూడా రాశాను. అందులో ఈ వీడియోలో కవర్ చేయని విషయాలు, ఇంట్రెస్టింగ్ పాయింట్స్ కూడా ఉంటాయి. ఒకసారి చెక్ చేయగలరు.
ఎప్పుడు బయల్దేరాలి ? | Right Time To Start

మీరు వసుధారా ఫాల్స్‌కు ఎప్పుడైనా వస్తే పొద్దున్నే వీలైనంత త్వరగా స్టార్ట్ అయ్యి…మధ్యాహ్నం 2-3 గంటలకు తిరిగి బయల్దేరేలా ప్లాన్ చేయండి. ఎందుకంటే ఇక్కడ స్ట్రీట్‌లైట్స్ లాంటివి ఉండవు. దారి తప్పితే చెప్పేందుకు కూడా ఎవరూ ఉండరు.
ఇలా సిద్ధం అవ్వండి | How To Prepare
వసుధారా ఫాల్స్ ట్రెక్కింగ్ కోసం కనీసం 4 గంటలు పడుతుంది. మొత్తం ఆరు గంటల వరకు సమయం పట్టే అవకాశం ఉంది. అందుకే కొంచెం ప్రిపేర్ అవ్వండి.
- బయల్దేరే ముందు మీతో పాటు ఒక నీటి బాటిల్ తీసుకెళ్లండి. దారిలో చిన్న జలధార కనిపిస్తుంది. అక్కడ రీఫిల్ చేసుకోవచ్చు.
- వర్షాకాలంలో ట్రెక్కింగ్ (Trekking In Monsoon) చేయాలని ప్లాన్ చేస్తుంటే గొడుగు లేదా రెయిన్ కోట్ లాంటివి తీసుకెళ్లండి.
- వర్షం లేనప్పుడు క్యాప్, మంచి సన్‌గ్లాసెస్ మర్చిపోకండి.
- దారి మధ్యలో చిన్న ఆకలికి స్నాక్స్ కూడా తీసుకెళ్లవచ్చు. ఎనర్జీ బార్, టాఫీ, చిప్స్ ప్యాకెట్స్ లాంటివి తీసుకెళ్లవచ్చు. మీరు వాడిన వస్తువులను పర్వతాల్లో పడేయకుండా మీతో పాటు క్యారీ చేసి డస్ట్ బిస్ కనిపిస్తే అందులో వేయండి.
- ఈ ట్రెక్ అంత ( Vasudhara Falls Trek) కష్టంగా ఉండదు. కాబట్టి ట్రెక్కింగ్ పోల్ లేదా ఊత కర్ర తీసుకెళ్లడం తప్పనిసరి కాదు. అయితే కొంచెం ఎలివేషన్ ఉంటుంది కాబట్టి మీకు ఇబ్బందిగా అనిపించే అవకాశం ఉంటే తీసుకెళ్లండి.
ఏదైనా ట్రెక్కింగ్ చేసే ముందు ఎప్పుడు వెళ్లాలి…ఎప్పుడు రిటన్ అవ్వాలి అనేది సరిగ్గా కనుక్కోవాల్సి ఉంటుంది. లేదా దీపంలో జీని ఇరుక్కున్నట్టు కొండపై మీరు ఇరుక్కుంటారు.
సాధారణ ప్రశ్నలు -సమాధానాలు
మానా ఎక్కడుంది ? | Where is Location
ఉత్తరాఖండ్‌లోని ఛమోలి (Chamoli) జిల్లాలో బద్రినాథ్ నుంచి 3 కమీ దూరంలో, మానా గ్రామం దాటక వసుధారా జలపాతం ఉంటుంది.
ఎంత ఎత్తు ఉంటుంది ? | Vasudhara Falls Height and Elevation
ఈ జలపాతం ఎత్తు సుమారు 400 అడుగులు అంటారు. కొంత మంది 200 మీటర్లు అంటారు. సముద్ర మట్టానికి 12,000 అడుగుల ఎత్తులో ఉంటుంది.

ఎప్పుడు వెళ్లాలి ? | Best Time To Visit
నేను ఈ జలపాతానికి సెప్టెంబర్ నెలలో వెళ్లాను. ఇక బెస్ట్ టైమ్ విషయానికి వస్తే మే నెల నుంచి నవంబర్ వరకు చాలా మంది ఈ జలపాతం చూసేందుకు వెళ్తుంటారు. ఇదే సమయంలో బద్రినాథ్ ఆలయం ద్వారాలు తెరచుకుంటాయి.
అద్బుతమైన పర్వతాలు
వసుధారా ట్రెక్కింగ్ చేసే సమయంలో మీరు అందమైన, పచ్చదనం నిండిన ఒక పెద్ద లోయ నుంచి గుండా వెళ్తుంటారు. మరీ ముఖ్యంగా అలకనందా నదికి వ్యతిరేకంగా అది పుట్టిన ప్రాంతం దగ్గర్లో వెళ్తుంటారు. దీంతో పాటు చౌఖంబా (Chaukhamba), నీల్‌కంఠ్ (Nilkantha), బలాకూన్ (Balakun) వంటి గొప్ప పర్వతాలు చూసే అవకాశం ఉంటుంది.
📣ఈ Travel కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. YouTube ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp లో జాయిన్ అవ్వడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
-end-