టికెట్ దొరికినా, దొరకకపోయినా కుంభ మేళా వెళ్లాల్సిందే అని కొంత మంది నిర్ణయించుకుంటారు. అలాంటి భక్తులు కొంత మంది ఏసీ ట్రైన్‌లో ప్రయాణిస్తున్న ( Train To Kumbh Mela 2025 ) వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోపై నెటిజెన్లు భిన్నంగా స్పందిస్తున్నారు.

ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న కుంభ మేళాకు ( Maha Kumbh Mela 2025 ) దేశ విదేశాల నుంచి భక్తుల తరలి వెళ్తున్న విషయం తెలిసిందే. కోట్లాది మంది భక్తులు ఫ్లైట్, రైలు, బస్సులు , సొంత వాహనాల్లో కుంభ మేళాకు వెళ్తున్నారు. ఇక రైళ్లు అయితే సాధారణ ప్రయాణికులతో పాటు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. అయితే కోట్లాది మందికి టికెట్లు దొరకడం అనేది ప్రాక్టికల్‌గా సాధ్యం అయ్యే విషయం కాదు.
అయితే టికెట్ దొరికినా దొరకకపోయినా కుంభ మేళా వెళ్లాల్సిందే అని కొంత మంది నిర్ణయించుకున్నారు. అలాంటి భక్తులు కొంత మంది ( Ticketless Train Passengers ) ఏసీ ట్రైన్‌లో ప్రయాణిస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోపై నెటిజెన్లు భిన్నంగా స్పందిస్తున్నారు.
ముఖ్యాంశాలు
వీడియోలో ఏముంది అంటే | Kumbh Mela Train Video
ఈ వైరల్ వీడియోలో థర్డ్ ఏసీ ట్రైన్ కోచ్ నిండా ప్రయాణికులు కనిపిస్తారు. వీళ్లంతా టికెట్ లేకుండా ప్రయాగ్‌రాజ్‌లో ( Prayagraj ) జరిగే కుంభ మేళాకు వెళ్తున్నారు అని ఈ వీడియో తీసిన వ్యక్తి చెబుతున్నాడు. ఈ వీడియోపై ఆన్‌లైన్లో చాలా మంది చర్చలు చేస్తున్నారు. ఈ వీడియో ఎంత ఎక్కువ మందికి రీచ్ అవుతోందే అంత ఎక్కువ మంది రియాక్ట్ అవుతున్నారు.అయితే ఈ వీడియో ఎప్పుడు తీశారు, ఎక్కడ తీశారు అనేది మాత్రం తెలియదు.
అయితే కుంభమేళాకు వెళ్తున్న ట్రైన్ ( Train To Maha Kumbh Mela ) కాబట్టి చాలా మంది నెటిజెన్లు ప్రయాణికులు చేసిన దాన్ని సమర్జిస్తున్నారు. మరికొంత మంది వ్యతిరేకిస్తున్నారు సమర్థించే వారు ఏం అంటున్నారు అంటే ప్రపంచంలో “అతిపెద్ద ఆధ్యాత్మిక మేళా ఇది. టికెట్లు అందరికి సరిపోవు కదా, మరి టికెట్లు దొరక్కపోతే ఆగిపోవాలా ఈ సారిక అడ్జస్ట్ కాలేరా” అని కొంత మంది కామెంట్స్ చేస్తున్నారు.
మిశ్రమ స్పందన |
ఈ వీడియోను రాజా భయ్య అనే ప్రయాణికుడు రైలు ప్రయాణం చేస్తున్న ( Train To Kumbh Mela 2025 ) సమయంలో ఈ వీడియో తీసినట్టు తెలుస్తోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని రోజుల ముందు షేర్ చేయగా దాదాపు 84 వేల మంది లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజెన్లు ఒక్కోరకంగా స్పందిస్తున్నారు. కొంత మంది ఈ వీడియోలో ఉన్న భక్తుల సంఖ్యను చూసి గర్వకారణం అంటుంటే, మరికొంత మంది మాత్రం ఇలాంటి పరిస్థితి రాకుండా సదుపాయాలు మెరుగుపర్చాల్సిన అవసరం ఉంది అని కామెంట్ చేశారు.

” సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది”
ఒక యూజర్ వచ్చేసి ” కుంభమేళాకు ఉచితంగా ప్రయాణించే అవకాశం ఇవ్వాలి ” అని ఒక కామెంట్ చేయగా, మరో యూజర్ సాటి భక్తుడికి మనం సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది అన్నాడు. మరికొంత మంది మరింత సమర్థవంతంగా ఆర్గనైజ్ చేసి ఉండాల్సింది అనగా, ఇది మంచి విషయం కాదు. టికెట్ లేకుండా ప్రయాణించే యాత్రికుల ( Travelers ) వల్ల చాలా ఇబ్బంది కలుగుతంది అని ఒక వ్యక్తి కామెంట్ చేశాడు. మరో యూజర్ స్పందిస్తూ ఈ సమస్య థర్డ్ ఏసికి మాత్రమే పరిమితం కాదు ఇది ఫస్ట్, సెకండ్ ఏసిలో ఉన్న సమస్యగా కామెంట్ చేశాడు.
- ఇది కూడా చదవండి : ఈ రాష్ట్రంలో ఒక్క రైల్వే స్టేషన్ కూడా లేదు..ఏ రాష్ట్రమో తెలుసా?
మొత్తానికి
అరుదుగా వచ్చే మహకుంభ మేళాకు వెళ్లాలనే భక్తుల ఆధ్యాత్మిక సంకల్పం ఒకవైపు, ఇలాంటి అతి పెద్ద మేళాలో ప్రయాణికులకు తగిన విధంగా ఏర్పాట్లు చేయడం కోసం రైల్వే శాఖ ( Indian Railways ) చేసే ప్రయత్నం ఒకవైపు. ఇక్కడ ఎవరినీ తప్పు పట్టగలం చెప్పండి. మీరు ఏం అంటారు ?
ఈ Travel కంటెంట్ నచ్చితే, ఎవరికైనా ఉపయోగపడుతుంది. అనుకుంటే షేర్ చేయగలరు. ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. యూట్యూబ్ ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి.