పతంగుల పండగ అత్యంత వైభవంగా జరిగే 5 సిటీలు | Kite Festivals 2025

షేర్ చేయండి

పంట చేతికి వచ్చిన సందర్భంగా దేశంలో చాలా మంది సంక్రాంతి, పొంగల్, లోహ్రీ సెలబ్రేట్ చేస్తుంటారు. దీంతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల్లో పతంగుల ప్రేమికులు కలిసి కైట్ ఫెస్టివల్ ( Kite Festivals 2025 ) చేసుకుంటారు. అలాంటి కొన్ని నగరాలు ఇవే..

దేశంలో కైట్ ఫెస్టివల్స్ జరిగే ప్రాంతాలు | Kite Festivals 2025

భారతీయులకు పతంగులు ( గాలి పటాలు ) ఎగరేయడం కేవలం సరదా మాత్రమే కాదు, అది జీవితంలో ఒక భాగం కూడా. మరీ ముఖ్యంగా తెలుగువారికి సంక్రాంతి సమయంలో పతంగులు ఎగరేయడం ఒక కల్చర్‌గా మారింది. సంక్రాంతి సమయంలో హైదరాబాద్‌లో ఆకాశం కైట్స్‌తో నిండిపోతుంది.

1.హైదరాబాద్ ( మకర సంక్రాంతి ) | Kite Festivals In Hyderabad

హైదరాబాద్‌లో సంక్రాంతిని పతంగుల పండగగా కూడా సెలబ్రేట్ చేస్తుంటారు. ముఖ్యంగా ఓల్డ్ సిటీలో సందడి ( Hyderabad Old City ) ఉంటుంది. కుటుంబ సభ్యులు ఇంట్లో వంటలు, డెకరేషన్‌లో బిజీగా ఉంటే కైట్ లవర్స్ ఆకాశంలో కైట్స్‌తో కుస్తీ చేయించడంలో బిజీగా ఉంటారు.

గత ఏడాది హైదరాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్‌లో కైట్ ఫెస్టివల్ ( Kite Festival Parade Ground ) వైభవంగా జరిగింది. ఇక ఈ సంవత్సరం కైట్ ఫెస్టివల్ గురించి తెలిస్తే మీకు అప్డేట్ చేస్తాము. అయితే హైదరాబాద్‌లో ఉన్న సైబరాబాద్ గుజరాతి అసోసియేషన్ జనవరి 14వ తేదీన ఒక కైట్ ఫెస్టివల్ నిర్వహిస్తోంది. ఇది ప్రైవేట్‌గా నిర్వహించే ఫెస్టివల్. ఉత్తరాయన సందర్భంగా లింగం పల్లిలోని పీజేఆర్ స్టేడియంలో పతంగుల పండగ నిర్వహించనుంది. దీనికి ఎంట్రీ ఫీజు పెద్దలకు రూ.249 కాగా పిల్లలకు రూ.199గా నిర్ణయించారు.

2. అహ్మదాబాద్ , గుజరాత్ | Ahmedabad Kite Festival

గుజరాత్‌‌లో అతిపెద్ద నగరం అయిన అహ్మదాబాద్‌లో ప్రతీ ఏటా కైట్ ఫెస్టివల్ జరుగుతుంది. ఉత్తరాయాన సందర్భంగా సెలబ్రేట్ చేసే ఈ పండగ దేశంలోనే బాగా గుర్తింపు తెచ్చుకుంది. కైట్ ఫెస్టివల్ సందర్భంగా అహ్మదాబాద్‌లోని ఆకాశం వేలాది రంగు రంగుల పతంగులతో నిండిపోతుంది.

Prayanikudu
| వాట్స్ అప్‌లో ఆసక్తికరమైన ట్రావెల్ కంటెంట్ పొందడానికి ఇక్కడ క్లిక్ చేసి గ్రూపులో చేరగలరు

కైట్ లవర్స్ మేడలపైకి చేరి పతంగులతో ఆకాశ యుద్ధాలు జరుపుతారు. అఫ్‌కోర్స్ మన దగ్గర కూడా ఇదే జరుగుతుంది . గుజరాత్‌లో కూడా మనలాగే పతంగుల పండగ సమయంలో కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతాయి. ఇక్కడ కొన్ని చోట్ల ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేస్తారు. డాబేలి, చిక్కీ, గేవర్ లాంటి స్వీట్స్‌ను ఆరగిస్తారు.

3.జైపూర్ (మకర సంక్రాంతి ) | Kite Festival Jaipur

Kite Festivals In india 2025
| దేశంలో వివిధ ప్రాంతాల్లో గాలిపటాలను ఎగురవేస్తారు. ప్రాంతాన్ని బట్టి ఒక్కో రకంగా సెలబ్రేట్ చేస్తుంటారు.

జనవరి 14న మకర సంక్రాంతి సందర్భంగా పింక్ సిటీ జైపూర్‌లో గాలిపటాలు సందడి చేస్తాయి. లోకల్ మ్యూజిక్‌ను ఎంజాయ్ చేస్తూ పతంగులను ఎగరేస్తుంటారు. ఈ సందర్భంగా గేవర్ ( Ghevar ), నువ్వుల లడ్డు వంటి ఎన్నో వంటకాలను ప్రత్యేకంగా తయారు చేసి ఆరగిస్తారు. ఇవి మనకు హైదరాబాద్‌లోని పలు స్వీట్ షాపుల్లో కూడా లభిస్తాయి.

4. ఢిల్లీ ( మకర సంక్రాంతి ) | Kite Festival Delhi


దేశ రాజధాని ఢిల్లీ మకర సంక్రాంతి సందర్భంగా కైట్ లవర్స్ తమ కుటుంబ సభ్యులతో కలిసి పతంగులు ఎగురవేస్తారు. పార్కుల్లో, మేడలపై వీరి హడావిడి కనిపిస్తుంది. ఆకాశంలో జరిగే పతంగుల యుద్దానికి చియర్స్ చెబుతూ స్థానికులు ఎంజాయ్ చేస్తారు. సంక్రాంతి సందర్భంగా నువ్వుల లడ్డు, ఇతర స్వీట్స్ ఆరగిస్తారు. కొన్ని కమ్యూనిటీల్లో సంగీత కచేరీలు, డ్యాన్స్ పోటీలు కూడా జరుగుతుంటాయి.

5. వడోదర ( గుజరాత్ ) | Vadodara Kite Festival

గుజరాత్‌లోని వడోదరలో జనవరి 14వ తేదీన ప్రతీ ఇంట్లో గాలిపటాల వేడుక ( Kite Festivals 2025 ) జరుగుతుంది. ఉత్తరాయన సందర్బంగా ఇక్కడి ప్రజలు కొత్త, పాత రకంతో పాటు మరెన్నె వెరైటీల గాలిపటాలను ఎగురవేస్తారు. దీంతో పాటు స్థానిక ప్రభుత్వం కూడా కొన్ని సార్లు అధికారికంగా సబర్మతి నదీ తీరంలో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తుంది.

ఇక్కడ వివరించిన 5 నగరాల్లోనే కాదు దేశ వ్యాప్తంగా అనే ప్రాంతాల్లో, పట్టణాల్లో, గ్రామాల్లో పతంగుల పండగ జరుగుతుంది. ఎవరి ఆచారాలు, ఆర్థిక స్థోమత, ఆస్తిని బట్టి వారు పతుంగుల పండగ సెలబ్రేట్ చేస్తుంటారు. గాలిపటం ఎగరేయడం కోసం పతంగులు, చరక్ ( దారం చుట్టేది ), మాంజా ఉంటే సరిపోతుంది.

కానీ మన గాలిపటం గాలిలో రాజ్యం చేయాలి అంటే మాత్రం దానికి స్కిల్స్ కావాలి. ఇలాంటి స్కిల్స్‌‌ను మీరు ఈ ఫెస్టివల్స్‌‌లో చూడవచ్చు. దీంతో పాటు చాలా మంది కైట్ లవర్స్‌ను ఇక్కడ మనం చూడవచ్చు. ఇంతకి మీరు ఎక్కడ సెలబ్రేట్ చేస్తున్నారు ?

రిక్వెస్ట్ : దయచేసి చైనీస్ మాంజా వినియోగించకండి. పతంగుల పండగ సందడి ముగిసే వరకు బైక్, సైకిల్‌ను నెమ్మదిగా నడపండి.

గమనిక : ఈ వెబ్‌సైట్‌లో కొన్ని ప్రకటనలు కనిపిస్తాయి. వీటిని గూగుల్ యాడ్ అనే సంస్థ అందిస్తుంది. ఈ ప్రకటనలపై మీరు క్లిక్ చేయడం వల్ల మాకు ఆదాయం వస్తుంది. 

Trending Video On : Prayanikudu Youtube Channel

షేర్ చేయండి

Leave a Comment

error: Content is protected !!