VANISHING TEMPLES : ఇలా కనిపించి అలా మాయం అయ్యే 5 ఆలయాలు, నిర్మాణాలు
VANISHING TEMPLES : భారత దేశం అద్భుతాలకు నెలవు. ఎన్నో అద్భుతమైన దేవాలయాలు ఉన్న ఈ సనాతన భూమిపై కొన్ని దేవాలయాల నిర్మాణం చూసి ప్రపంచం మొత్తం విస్తుపోతుంది.
మన దేశంలో కొన్ని దేవాలయాలు ఏడాదిలో ఎక్కువ శాతం నీటిలోనే ఉంటాయి. కొన్ని ఆలా కనిపించింది అలా మాయమైతే…మరికొన్ని నీటితో నిండి ఉంటాాయి…లాంటి 5 ఆలయాలు ఇవే…
1. స్థంభేశ్వర్ మహాదేవ్ ఆలయం | Stambheshwar Mahadev Temple
ఈ ఆలయాన్ని దర్శించుకోవాలంటే అదృష్టం కూడా ఉండాలి. అదే గుజరాత్లో బారుచ్ జిల్లాలో ఉన్న స్థంభేశ్వర్ మహాదేవ్ ఆలయం. ఈ ఆలయం సముద్ర తీరంలో ఉంటుంది. అందుకే రోజుకు రెండు సార్లు సముద్రపు అలలు ఆలయంలో కొంత భాగాన్ని నీటితో కప్పేస్తాయి.
- భక్తులు దర్శనం చేసుకోవాలంటే అలలు వెనక్కి వెళ్లే వరకు వెయిట్ చేయాల్సిందే.
- ఈ ఆలయాన్ని డిసప్పియరింగ్ టెంపుల్ (Disappearing Temple) అని కూడా అంటారు.
- శ్రావణ మాసం, మహా శివరాత్రి సమయంలో భక్తులతో ఈ ఆలయం కిటకిటలాడుతుంది.
- ఇది కూడా చదవండి : కర్ణాటకలో ఉన్న 6 అందమైన జలపాతాలు | Waterfalls of Karnataka
Traveling to Gujarat to see this temple . Stambeshwar Mahadev is also known as the disappearing Shiva Temple. GREATNESS OF STAMBESHWARA MAHADEV
— DEEP (@dgaurr148) August 18, 2018
🙏🙏🌹🌹Har Har Mahadev🌹🌹🙏🙏 pic.twitter.com/w2cRvDlRXg
2. పాతాల్ భుశనేశ్వర్ గుహాలయం | Patal Bhuvaneshwar Cave Temple
మన దేశంలో ఉన్న గుహాలయాల్లో పాతాల్ భుశనేశ్వర్ ఆలయం కూడా ఒకటి. దేవ్ భూమి ఉత్తరాఖండ్‌లోని (Uttarakhand) పిథోరాగఢ్ జిల్లాలో ఉన్న ఈ నాచురల్ ఆలయం భూగర్భంలో ఉంటుంది. వర్షాకాలంలో ఈ ఆలయంలో నీటి ప్రవాహం పెరిగిపోతుంది. అయినా కూడా భక్తులు దర్శనం చేసుకునే అవకాశం ఉంటుందంటారు. దీని కోసం భక్తులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.
ఇది కూడా చూడండిమేఘాలయ ఎంత అందంగా ఉంటుందో 10 ఫోటోల్లో మీరు చూసేయవచ్చు
3. మహాబలిపురం తీరాలయాలు | Mahabalipuram Shore Temples
భారత దేశంలో ఉన్న అద్భుతమైన ఆలయాల్లో మహాబలిపురం ఆలయం కూడా ఒకటి. అయితే తమిళనాడులోని ఈ ప్రాంతంలో మొత్తం ఏడు తీర ఆలయాలు ఉండేవని కొంత మంది భక్తుల విశ్వాసం. వీటిని సెవన్ పగోడాస్ (Seven Pagodas) అని కూడా పిలిచేవారు.
- కాలక్రమేణ ఆరు ఆలయాలు నీటిలో మునిగిపోయాయంటారు. అందుకే కేవలం ఒక ఆలయాన్ని మాత్రమే నేడు మనం దర్శించుకోగలగుతున్నాము.
- అయితే మునిగిపోయిన ఆలయాల్లో కొన్నింటిని తాము చూశామని కొంత మంది మత్స్యకారులు అంటుంటారు.
- కాగా 2004 సునామీ వచ్చిన తరువాత కొన్ని ఆలయ అవశేషాలు బయటపడటంతో భక్తుల విశ్వాసానికి చారిత్రాత్మక ఆధారాలు లభించినట్టు అయింది.
- ఇది కూడా చదవండిTravel Smarter : 2025 లో ట్రావెలర్స్ వద్ద ఉండాల్సిన 5 గ్యాడ్జెట్స్
4. శ్రీ కేదారేశ్వర్ గుహాలయం | Sri Kedareshwar Cave Temple
మహారాష్ట్రలోని హరిశ్చంద్రగఢ్ కోటలో (Harishchandra gad Fort) కేదారేవ్వర గుహాలయం ఉంది. ఈ ఆలయంలో ఉన్న 5 అడుగుల మహా లింగం చుట్టూ ఏడాది పొడవునా నీరు ఉంటుంది. గుహకు సపోర్టుగా ఉన్న నాలుగు స్తంభాల్లో మూడు మాత్రమే ఇప్పుడు మీరు చూడగలరు.

- ఈ మూడు స్థంభాలు కూడా కిందపడిపోతే ఇక ప్రపంచం అంతం అయిపోతుంది అని కథలు ప్రచారంలో ఉన్నాయి.
- ఈ కోట వద్దకు చేరుకోవాలంటే ట్రెక్కింగ్ చేయాల్సిందే.
Watch This In Short : ఈ పోస్టును షార్ట్‌లో చూడండి
5.జల్ మహల్, జైపూర్ | Jal Mahal | Vanishing Temples
Note: ఇది ఆలయం కాదు. కానీ ఎందుకో మెన్షన్ చేయాలనిపించింది చేస్తున్నాను.

రాజస్థాన్ (Rajasthan) అంటేనే రాజసం గుర్తొస్తుంది. నాటి రాజుల రాజసానికి ప్రతీకగా నిలిచే ఎన్నో అద్భుతమైన కోటలు, రాజభవనాలు, రాజమందిరాలు కనిపిస్తాయి. అలాంటి ఒక మహలే జల్ మహల్.
- ఇది జైపూర్‌లో ఉన్న జల్ మహల్ ప్యాలెస్ మన్సాగర్ అనే సరస్సు (Mansagar Lake) నీటిలో ఉంటుంది.
- మొత్తం 5 ఫ్లోర్లు ఉన్న ఈ ప్యాలెస్‌లో ఒక ఫ్లోర్ మాత్రమే బయటి ప్రపంచానికి కనిపిస్తుంది.
- ఎందుకంటే మిగితా నాలుగు ఎప్పుడూ నీటిలోనే మునిగి ఉంటాయి.
- వర్షాకాలం వస్తే ఆ ఒక్క ఫ్లోర్ కూడా మాయం అవుతుందంటారు.
📣 ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.